Thursday, August 4, 2011

Dont laugh at beggers

 
 
 
 
అయినోల్లందరు ఆదరించక,
ఉన్న దేవుడు పక్కకు పోగా,
చేతులు చాచి నీ ముందుంటే,
చూడనట్టుగా నిలుచున్నావేం...
చెయ్యందిస్తే చనిపోతావా,
సాయం చేస్తే సగమౌతావా....
కన్న కొడుకులే కరుణ చూపక,
కస్ట కాలమే కాటు వేయగా,
అయ్యా అంటూ అర్థిస్తుంటే,
తెలియనట్టుగా అటు తిరిగావేం,
మాట కలిపితే మురికౌతుందా,
తోచిందిస్తే తల తీస్తారా...
నిలబడేందుకు ఓపిక లేక,
నడవడానికి శక్తి చాలక,
పడుతూ లేస్తూ అడుగులు వేస్తూ,
భార జీవితం సాగిస్తుంటే,
తొచిన సాయాం  చెయ్యకపోగా,
నవ్వడానికి మనసొచ్చిందా....
ఏదేమైనా ఈ స్థితి  మీకు ,
ఎన్నడు రాదని దైర్యంతోనా...
ఎపుడూ పోమని దర్జా తోనా....
చేతనయితే చెయివ్వండి,
చూసి మాత్రం  నవ్వకండి,
మనసులోన మమతే ఉంటే,
మనిషిగా నువు ఆదరించు,
మాట లోన కరుణే ఉంటే
చేరదీసి చిగురువవ్వు.....
 
 
 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home