Thursday, August 4, 2011

My dear rainbow.stay there

కనపడేదపుడపుడైనా
దరి చేరు చూపులు యెన్నో....
వల్లంత రంగుల తోటి
రప్పించు హంగులు ఎన్నో......
నువ్వలా కనిపిస్తావు...
మువ్వలా మురిపిస్తావు...
కలువలా కవ్విస్తావు...
కనులలో కొలువుంటావు....
కను తెరచి మూసే లోపే....
నీ మోము చాటేస్తావు...
ఆకశానికి అతిథివి నీవు...
మా లోకానికి మురిపెం నీవు....
ముచ్చటేసినా భూమికి రాకు....
ముక్కలు చేసి పంచేస్తారు...
మా లోకం లో మంచే లేదు ...
మారని మారణ ఖాండలు తప్ప.....
కాంతిని పంచే రవి తో చెప్పు...
మంచిని కూడా పంచివ్వాలని....

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home