My won B.Tech life
B.Tech life.........
- పిచ్చి పిచ్చి చూపులతో
పెద్ద పెద్ద దుస్తులతో
మొఖముకేమొ చెమటలు,
కాలికేమొ ఒనుకులు.
కొండంతటి భక్తి తో,
కూసింతటి భయము తో,
మొదటి ఆడుగు వేసాను,
ఆట స్థలముకొచ్చాను.
నటనలసలు తెలియదు.
- ఆట నేడె మొదలైంది,
రణరంగమేగ ముందుంది.
అణువణువు లోన భయముంది,
నన్ను వీడి పోకుంది.
రోజులెన్నొ గడిచాయి,
పరిచయాలు పెరిగాయి.
నవ్వులెన్నొ విరిసాయి,
నాతోనె నడిచాయి.
హేలనలతొ స్వాగతాలు,
హాస్యాస్పద సంఘటనలు,
మద్యాహ్నం భోజనాలు,
మిత్రులతో అల్లరులు.
- ఆట ఎంత బాగుంది,
ఆత్మీయుల కలిపింది,
బతుకు తీరు మార్చింది,
ఆనందము నిలిపింది.
రోజులెన్నొ గడిచాయి,
మార్పులెన్నొ తెచ్చాయి,
మాట తీరు మార్చాయి,
హద్దులన్ని చెరిపాయి.
సొంతపేరు మరిచాము,
ప్రతి పిలుపుకి పలికాము.
కల్మశాలు విడిచాము,
ఒక తాటి వెంట నడిచాము.
- ఆట ఇంక సగమైంది,
అసలు ఆట మొదలైంది,
కాలమెంతొ గడిచింది,
చదువు విలువ తెలిసింది.
నిద్రలెన్నొ మరిచాము,
కల్లు తెరిచి చదివాము,
నటనలెన్నొ నేర్చాము,
చదువు నదిని దాటాము.
చిరు చినుకుల వానైనా,
ఎడతెరిపి లేని హోరైనా,
మండుతున్న ఎండైనా,
ఎదురుగుంది ఏదైనా,
కలసి అడుగు వేశాము,
కలల కడలి చేరాము.
- ఆట ఇంక ఏముంది,
ఆఖరేగ మిగిలింది,
ప్రతి గుండెలోన బాదుంది,
మది తలుపు దాటి రానంది.
ఎన్నెన్నో బందాలు,
ఏవేవో అందాలు,
వీడాల్సిన సమయమిది,
వదిలి వెల్లాల్సిన తరుణమిది.
నోట మాట కరువైంది,
కనుల నీరు వరమైంది,
మనసు మాట వినకుంది,
చేయి వదల లేనంది.
అలసిపోక మునుపే ఈ,
ఆటవిడుపు దేనికో,
ఆత్మీయుల ఒడిలో ఈ,
గుండెకోతలెందుకో...
- ఆట ఇంక ముగిసింది,
ఓటమేగ గెలిచింది,
దూరమేగ నిలిచింది,
గురుతుకేగ మిగిలింది..
అందమైన బందాలు,
అంతులేని అందాలు,
అంతరాయమేగాని ఇది,
అంతమేమి కాదు.
నేడు వీడి పోతున్నా,
నేనసలు వదిలి పోను,
నేనసలు వదులుకోను. . . .
.
- పిచ్చి పిచ్చి చూపులతో
పెద్ద పెద్ద దుస్తులతో
మొఖముకేమొ చెమటలు,
కాలికేమొ ఒనుకులు.
కొండంతటి భక్తి తో,
కూసింతటి భయము తో,
మొదటి ఆడుగు వేసాను,
ఆట స్థలముకొచ్చాను.
ఆంగ్ల భాష ఎరుగను,
నటనలసలు తెలియదు.
- ఆట నేడె మొదలైంది,
రణరంగమేగ ముందుంది.
అణువణువు లోన భయముంది,
నన్ను వీడి పోకుంది.
రోజులెన్నొ గడిచాయి,
పరిచయాలు పెరిగాయి.
నవ్వులెన్నొ విరిసాయి,
నాతోనె నడిచాయి.
హేలనలతొ స్వాగతాలు,
హాస్యాస్పద సంఘటనలు,
మద్యాహ్నం భోజనాలు,
మిత్రులతో అల్లరులు.
- ఆట ఎంత బాగుంది,
ఆత్మీయుల కలిపింది,
బతుకు తీరు మార్చింది,
ఆనందము నిలిపింది.
రోజులెన్నొ గడిచాయి,
మార్పులెన్నొ తెచ్చాయి,
మాట తీరు మార్చాయి,
హద్దులన్ని చెరిపాయి.
సొంతపేరు మరిచాము,
ప్రతి పిలుపుకి పలికాము.
కల్మశాలు విడిచాము,
ఒక తాటి వెంట నడిచాము.
- ఆట ఇంక సగమైంది,
అసలు ఆట మొదలైంది,
కాలమెంతొ గడిచింది,
చదువు విలువ తెలిసింది.
నిద్రలెన్నొ మరిచాము,
కల్లు తెరిచి చదివాము,
నటనలెన్నొ నేర్చాము,
చదువు నదిని దాటాము.
చిరు చినుకుల వానైనా,
ఎడతెరిపి లేని హోరైనా,
మండుతున్న ఎండైనా,
ఎదురుగుంది ఏదైనా,
కలసి అడుగు వేశాము,
కలల కడలి చేరాము.
- ఆట ఇంక ఏముంది,
ఆఖరేగ మిగిలింది,
ప్రతి గుండెలోన బాదుంది,
మది తలుపు దాటి రానంది.
ఎన్నెన్నో బందాలు,
ఏవేవో అందాలు,
వీడాల్సిన సమయమిది,
వదిలి వెల్లాల్సిన తరుణమిది.
నోట మాట కరువైంది,
కనుల నీరు వరమైంది,
మనసు మాట వినకుంది,
చేయి వదల లేనంది.
అలసిపోక మునుపే ఈ,
ఆటవిడుపు దేనికో,
ఆత్మీయుల ఒడిలో ఈ,
గుండెకోతలెందుకో...
- ఆట ఇంక ముగిసింది,
ఓటమేగ గెలిచింది,
దూరమేగ నిలిచింది,
గురుతుకేగ మిగిలింది..
అందమైన బందాలు,
అంతులేని అందాలు,
అంతరాయమేగాని ఇది,
అంతమేమి కాదు.
నేడు వీడి పోతున్నా,
నేనసలు వదిలి పోను,
నేనసలు వదులుకోను. . . .
.
Labels: dedicated to all my b.tech fnds



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home