Thursday, August 4, 2011

Paisa (vs) poverty


 -కాగితం పై కవిత కాదిది,
 నిజములేనని తెలుసుకో..
 ఓ మనిషి రాసిన రాతలా ఇవి,
 ఈ నాటి బతుకని తెలుసుకో..
-మనిషి బతుకులు మారుతున్నా,
 మనసు మమతను వీడుతున్నా,
 నేను మాత్రం మారనంటూ,
 జాలి కరుణా ఎందుకంటూ,
 దేశ బవితను మార్చి వేస్తూ,
 దిక్కరించే అర్థమా......(ధనము)

-ఆకలుండీ తిండి లేక,
 పస్తులుండీ పనులకొచ్చి
 ఇల్లు మరచి ఒల్లు ఒంచి
 తనను తానే అప్పగించి
 మనసులోన ఆశ చంపి
 తనువు మొత్తం చెమట నింపి,
 కస్టమంటే తెలియ చూపే 
 మా పేదలేనా నీ సత్రువు......

-ఆస్తులుండీ మనసు లేక,
 ఎదుగుతుంటే చూడలేక,
 నీచబుద్దిని అంటిపట్టి
 సిగ్గులన్ని వదిలి పెట్టి
 రాచ బుద్దిని చూపునట్టి
 ఆ పెద్దలేనా నీ మిత్రులు......
 పస్తులంటే తెలుసునా.

-ఓ కస్టపెట్టే కాలమా....
 ఆకలంటే తెలుసునా,
 ఓ ఆశ చూపే అర్థమా....

-నాట్లొకరికి,తూట్లొకరికి,
 నోట్లు మాత్రమింకొకరికి....
 కాట్లొకరికి,పాట్లొకరికి,
 కోట్లు మాత్రమింకొకరికి....

-పేదలంటే బతకరాదా ,
 మాది మాత్రం బతుకు కాదా....

-పగలు మాదే ,రాత్రి మాదే,
 పస్తులుండే ప్రతి పూట మాదే,
 నేడు మాదే ,రేపు మాదే,
 కస్టముండే ప్రతి దినము మాదే....

-కోట్లకొలదీ మిత్రులున్నా,
 ఓ మనసు లేని మూల్యమా.....
 ఒక్కసారి మమ్ము చేరు ,
 మా బాదలేంటో అడిగి చూడు...
              

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home