ఏదో ఒక రాగం....(SONG)
పల్లవి: ఏదో ఒక రాగం పిలిచిందీవేల..
ఎదలో నిదురించే గతమంతా కదిలేలా... "2"
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా,
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా,
ఙ్నాపకాలె మైమరపు,ఙ్నాపకాలె మేల్కొలుపు...
ఙ్నాపకాలె నిట్టూర్పు,ఙ్నాపకాలె ఓదార్పు... "ఏదో "
చరణం: కూసే కోయిలలో నీ పలుకులు ఙ్నాపకమే
సాగే దారులలో ఆ మలుపులు ఙ్నాపకమే
నా కస్టం తీర్చిన ఆ సమయం,నీ సాయం ఙ్నాపకమే...
చిన్ని పాపలో..నీ నవ్వు ఙ్నాపకం,
చందమామలా నీ నడక ఙ్నాపకం..
చరణం: వేసే దుస్తులలో ఆ రంగులు ఙ్నాపకమే,
కురిసే చినుకులలో నీ చిందులు ఙ్నాపకమే,
తప్పక తిట్టిన ఆ తరుణం,నీ కోపం ఙ్నాపకమే...
నాన్న ముందరా..నీ నటన ఙ్నాపకం,
అమ్మ తిట్టినా..ఆ ఘటన ఙ్నాపకం..
ఏదో ఒక రాగం పిలిచిందీవేల..
ఎదలో నిదురించే గతమంతా కదిలేలా.
నా తీరని బాదలలో ఓ తియ్యని బందం లా,
నీ తరగని నవ్వులతో ఓ తడిసిన ముత్యంలా..
నీ పరిచయాన ప్రతిదినము,
పూటకొక్క పరిమలము....
నీ చంతనున్న ప్రతిక్షణము,
నను చేరుకున్న ఓ వరము..
చరణం: చెప్పే అని అంటూ నిదురించిన ఙ్నాపకమే,
చాలు అని అన్నా నడిపించిన ఙ్నాపకమే,
పున్నమినాడు చంద్రునిలా నీ రూపం ఙ్నాపకమే...
మాట కలిపినా..ఆ చోటు ఙ్నాపకం,
పూట గడిపినా..ఆ నోటు ఙ్నాపకం...
ఏదో ఒక రాగం పిలిచిందీవేల..
ఎదలో నిదురించే గతమంతా కదిలేలా.
వెన్నెల వెలుగులలో నను తాకిన చినుకులలా,
చల్లని గాలులలో నను చేరిన పుస్పం లా...
నీ ఊహ చాలు నాలోన,
చిరునవ్వుతోన సిరివాన....
నీ పిలుపు చాలు మదిలోన,
మదు పరిమలాలు విరిసేనా....

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home