Friday, August 5, 2011

CUTE KIDS

స్వార్థమెక్కడ,శోకమెక్కడ వెతికి చూపా నవ్వులో...
భాదలెక్కడ,వ్యదలు ఎక్కడ వెతికి చూపా నడకలో...
ఆశలెక్కడ,ఆంక్షలెక్కడ వెతికి చూపా చూపులో...
కోపమెక్కడ,క్రోధమెక్కడ వెతికి చూపా ముఖములో...
ఆటలాడే ఈ చిట్టి మనసుకు మోసమంటే తెలియదు,
నవ్వుతుండే ఈ చిన్ని మనసుకి ద్వేశమసలే తెలియదు..
తప్పటడుగులు వేసినా,ఏ తప్పుటడుగులు నేర్చదు,
ఆకలే తనకేసినా ఏ డబ్బు మాత్రం కోరదు..
భాష తెలియదు,భావమెరుగదు ,భాదలసలే చేరవు,
మంచి తెలియదు మలినమెరుగదు మాటలసలే మార్చదు.
    

      

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home