Saturday, March 24, 2012

ఒంటరినైపోయా



అమ్మ కడుపులో నిదురిస్తుంటే,
తమ్ముడేడని నువు అడుగుతు ఉంటే,
ఒంటరిగా నువు తింటూ ఉంటే,
ఒక్కదానివే నడుస్తు ఉంటే….
అన్నిట్లోనూ నీ తోడుండాలని,
నా బుజ్జి అక్కని నవ్వించాలని,
అమ్మను సైతం అడగకుండా,
అక్క కోసమే బయటకు వచ్చా….
ఏమీ తెలియని బుజ్జి బాబు ను,
అక్క చేతిలో చెయ్యేశాను…
నా చిన్నతప్పుకు, నీ చేతి దెబ్బలు…
నాకున్న ఆకలికి, నె చేతి ముద్దలు…
నా చేదు అలకకి, నీ తీపి ముద్దులు…
మనమాడు ఆటలో, నీ చిలిపి ఆజ్నలు….
ఈ అన్నిట్లోను తోడుగ నిలిచి,
అడుగడుగు నా వెంటే నడిచి…….
పెల్లి అనబడు బందం తోటి,
మల్లీ రానను అర్థము చూపి,
ఒంటరిగా నను వదిలెల్తుంటే……
నవ్వలేక ఏడుస్తూ,
ఏడ్చలేక నవ్విస్తూ…
అడుగు పడక నిలుచున్నా,
కానరాని మూలలోన….
అప్పగింతలంటున్నా,
నిను అప్పగించలేకున్నా….
ఒంటరివై నువ్వుంటే చూడలేక వచ్చాను,
ఒంటరిగా నన్నొదిలి వెల్తుంటే ఏడ్చాను…
నీ కన్నీటిని కానలేక,
నా ఏడుపునాపుకుంటు…..
నీ కల్లలోకి చూడలేక,
నా కనురెప్పలనార్పుకుంటు….
నా తలను దించుకున్నాను,
నవ్వు ముసుగు తొడిగాను…..
భాద్యతంత తీరిందో, భాద అంత పెరిగింది…
దూరమెంత పెరిగిందో, ఆనందమంత తరిగింది…
నా సర్వస్వం అయిన నిన్ను,
నా బావకప్పగించాను…..
పుట్టినిల్లు మరవకుండ,
మెట్టినింట మంచిగా…
నీ తమ్ముని మరవకుండ,
నా బావతోన సబబుగా…
అమ్మ,నాన్న పేరుని, అత్త మామ పరువుని…
రక్శిస్తూ మెలగాలని ,
ఆశిస్తూ నీ తమ్ముడు….

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home