I LOVE MY INDIA
పున్నమి చంద్రుని వెన్నెల ఉంది,
వేసవి సూర్యుడి వేడీ ఉంది.
రంగులు చూపే పగలూ ఉంది,
చీకటి నిండిన రాత్రీ ఉంది.
సర్వం జలమగు సముద్రముంది,
జలమే ఉండని ఎడారి ఉంది.
ఎంతో చల్లని గాలీ ఉంది,
నిత్యం వదలని ధూలీ ఉంది.
అందరాని ఆకాశం ఉంది,
అందుబాటులో భూమీ ఉంది.
మనిషి మనసులో మంచీ ఉంది,
అదే మనిషిలో మోసం ఉంది.
కులాలు వేరను భేదం ఉంది,
అంతా ఒకటను భావం ఉంది.
మనసులు మురిసే ప్రేమా ఉంది,
మనుషులు బెదిరే పగనూ ఉంది.
ఊహకందని దనమూ ఉంది,
ఊపిరాడని దారిద్ర్యం ఉంది.
దనికులదేమో పెద్దరికం,
సామాన్యులదేమో పేదరికం.
అంతా నేనను ఆదిపత్యము,
నేనే లేనను బానిసత్వము…
అందమైన నా భారతదేశం,
అన్నీ కలిగిన నా ఈ దేశం,
ఆత్మగౌరవం కలిగిన దేశం,
ఆకలి బాదలు తెలిసిన దేశం….
నే జీవించే నా ఈ దేశం లో,
నేనొక పరమాణువునే అయినా,
నాలో ఉండే ప్రతి ఒక అణువు,
దేశభక్తితో నిండినవేలే………
వేసవి సూర్యుడి వేడీ ఉంది.
రంగులు చూపే పగలూ ఉంది,
చీకటి నిండిన రాత్రీ ఉంది.
సర్వం జలమగు సముద్రముంది,
జలమే ఉండని ఎడారి ఉంది.
ఎంతో చల్లని గాలీ ఉంది,
నిత్యం వదలని ధూలీ ఉంది.
అందరాని ఆకాశం ఉంది,
అందుబాటులో భూమీ ఉంది.
మనిషి మనసులో మంచీ ఉంది,
అదే మనిషిలో మోసం ఉంది.
కులాలు వేరను భేదం ఉంది,
అంతా ఒకటను భావం ఉంది.
మనసులు మురిసే ప్రేమా ఉంది,
మనుషులు బెదిరే పగనూ ఉంది.
ఊహకందని దనమూ ఉంది,
ఊపిరాడని దారిద్ర్యం ఉంది.
దనికులదేమో పెద్దరికం,
సామాన్యులదేమో పేదరికం.
అంతా నేనను ఆదిపత్యము,
నేనే లేనను బానిసత్వము…
అందమైన నా భారతదేశం,
అన్నీ కలిగిన నా ఈ దేశం,
ఆత్మగౌరవం కలిగిన దేశం,
ఆకలి బాదలు తెలిసిన దేశం….
నే జీవించే నా ఈ దేశం లో,
నేనొక పరమాణువునే అయినా,
నాలో ఉండే ప్రతి ఒక అణువు,
దేశభక్తితో నిండినవేలే………

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home