మరణిస్తున్నాను ... మన్నించు నేస్తం......
-జన్మంతా నీ చెంతే బతకాలనుకున్నా,
దైవేచ్చకు తల వంచి నే మరణిస్తున్నా. . . .
కలకాలం నీ వెంటే ఉండాలని ఉన్నా,
విదికి ఎదురు తిరగలేక నే కనుమూస్తున్నా. . . .
-నిను కానని నా మనసు ఉరకలు వేస్తుంది,
కనిపించే ప్రతి వారిని ఆరా తీస్తుంది,
ఏమైనా ఈ క్షనమే కలవాలంటుంది,
నీ నేస్తం ఇక లేడని చెప్పాలంటుంది. . . .
-అడగకనే నీ ఆశలు తీర్చాలనుకున్నా,
చెప్పకనే నా శ్వాసను వదిలేస్తూ ఉన్నా. . . .
నీ కల్లల్లో కన్నీటిని తుడవాలనుకున్నా,
నీ ముందుండీ కదలలేక శిలనై పొతున్నా. . . .
-నను విడిచిన నా ఆత్మ దిక్కులు చూస్తుంది,
ఏ దిక్కున నీవున్నా తప్పక రమ్మంది,
చివరిసారి నీ నవ్వును చూడాలంటుంది,
నవ్వలేని నిన్ను చూసి ఏడ్చాలంటుంది. . . .
ఏ దిక్కున నీవున్నా తప్పక రమ్మంది,
చివరిసారి నీ నవ్వును చూడాలంటుంది,
నవ్వలేని నిన్ను చూసి ఏడ్చాలంటుంది. . . .
-వాడిపోని పువ్వునై ఉండాలనుకున్నా,
రాలిపోయి నేలపైన శిలనై పడి ఉన్నా. . . .
వీడిపోని నీడనై నడవాలనుకున్నా,
కదలలేని కాయమై ,ఓ కలనై పోతున్నా. . . .
రాలిపోయి నేలపైన శిలనై పడి ఉన్నా. . . .
వీడిపోని నీడనై నడవాలనుకున్నా,
కదలలేని కాయమై ,ఓ కలనై పోతున్నా. . . .
-గతియించిన నా దేహం
నీ ముందే ఉంది,
నీ స్పర్శకు నోచుకోక కన్నీరౌతుంది,
ముందుకొచ్చి ముద్దిచ్చి సాగనంపు నేస్తం,
మనసారా కౌగిలించి కలత తీర్చు బందం. . . .
నీ స్పర్శకు నోచుకోక కన్నీరౌతుంది,
ముందుకొచ్చి ముద్దిచ్చి సాగనంపు నేస్తం,
మనసారా కౌగిలించి కలత తీర్చు బందం. . . .
-అందరాని తీరాలకు నే అడుగులు వేస్తున్నా,
నీ అందమైన స్నేహాన్ని ఆస్వాదిస్తున్నా. . . .
నీ అందమైన స్నేహాన్ని ఆస్వాదిస్తున్నా. . . .
Labels: dedicated to ram.paddu


1 Comments:
-గతియించిన నా దేహం నీ ముందే ఉంది,
నీ స్పర్శకు నోచుకోక కన్నీరౌతుంది,
ముందుకొచ్చి ముద్దిచ్చి సాగనంపు నేస్తం,
మనసారా కౌగిలించి కలత తీర్చు బందం. . . .manasu kadilincharu...machi meaning undi..ChinnaGaru
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home