ప్రతీదీ నాకు ఆదర్శమే
ఎప్పుడూ విడిపోయిన ఇద్దర్ని కలపడానికి తాపత్రయ పడే సూది నాకు ఆదర్శం...
తన మూలంగా లోకం ఆగిపోకూడదని రోజంతా వెలుగునిచ్చే సూర్యుడు నాకు ఆదర్శం...
తను కరిగిపోయినా పక్కవాల్లకు వెలుగునివ్వాలనుకునే కొవ్వొత్తి నాకు ఆదర్శం...
పడకొట్టినవాడిపైన పగపట్టకుండా, ఈక ఈక పోగేసుకుని మరో గూడు కట్టుకునే పక్షి నాకు ఆదర్శం...
తీరాన్ని సంద్రంగా మార్చాలని అనుక్షణం ప్రయత్నించే అలలు నాకు ఆదర్శం...
దూరం ఎంతైనా క్రంమం తప్పకుండా నడిచే చీమలు నాకు ఆదర్శం...
మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకుని వచ్చే మొక్క నాకు ఆదర్శం...
ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్షం వైపే దూసుకెల్లే బాణం నాకు ఆదర్శం...
ఒక సారి అన్నం పెడితే చాలు ,జన్మంతా విశ్వాసంతో ఉండే సునకం నాకు ఆదర్శం...
జీవించేది కొంతకాలమే అయినా అనుక్షణం ఆనందంగా ఉండే సీతాకోకచిలుక నాకు ఆదర్శం...
తానెంత చిన్నదైనా ,తన వంతు భూదాహాన్ని తీర్చే చినుకు నాకు ఆదర్శం...
చుట్టూ చీకటే ఉన్నా,వెన్నెలను పంచే చందమామ నాకు ఆదర్శం...
అసాద్యమని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే గాలిపటం నాకు ఆదర్శం...
ప్రత్యర్థి పెద్దదైనా సరే, ప్రయత్నించి కాసేపైనా సూర్యున్ని కప్పి ఉంచే మేఘం నాకు ఆదర్శం...
తానున్న పరిసరాల చుట్టూ పరిమలాలు నింపే పువ్వు నాకు ఆదర్శం...
వేడినంతా తానే తీసుకుని, మనకు మాత్రం చల్లని నీడనిచ్చే చెట్టు నాకు ఆదర్శం...
ప్రతిదానిలోనూ మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమమంలో పాలని మాత్రమే తాగే హంస నాకు ఆదర్శం...
ఇలాంటి ఆదర్శ లక్షణాలు ఎన్నో ఉన్న మా అమ్మ నాకు ఆదర్శం...
తన బిడ్డలకోసం తనజీవితాన్నే దారబోస్తున్న ప్రతి అమ్మకీ నా ఈ కవిత అంకితం....

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home