Thursday, April 12, 2012

అందమైన ఓ పర్వం అంత్యదశన దుఃఖాంతం


          

                         22-10-2010, Time evening 5.30. college silver jubilee function జరుగుతుంది...మా senior Michel jaksan  పాటకి డాన్స్ చేస్తున్నాడు. అడుచుకుంటూ, పక్కన చిన్నపాపతో ఆడుకుంటూ, "తు..నీయబ్బ,ఇలా ను ఎప్పుడు డాన్స్ చేస్తావ్ రా" అని పక్కన జయదీప్ గాడిని తిట్టుకుంటూ బాగా enjoy చేస్తున్నా.. అంతలో వెనుక నుంచి ఒక పిలుపు..."అన్నా , అక్కడ అక్క పిలుస్తుంది" అని...వెల్లి చూస్తే అర్చన, తన పక్కన ఎవరో ఒక అమ్మాయి decent గా నిలుచుని చూస్తుంది..."ఈమె మా friend అలి" చిన్న అని పరిచయం చేసింది.తర్వాత అలి తమ్ముడు మహేష్ ని  పరిచయం చేసి company ఇవ్వవా please అనింది...సరే దాందేముందిలే come మహేష్ అని పక్కనే కూర్చోపెట్టుకుని company ఇచ్చా...అయిపోయాక వెల్లేటపుడు "thank you so much" అనింది....
అదే తను నాతో మాట్లాడిన మొదటి మాట.
అలా ఆరోజు అలిని చూసింది మొదలు, ఈరోజు అమ్మ ఒడిలో పడుకుని ఆపకుండా ఏడ్చిన సమయం దాకా అన్నీ ఆనందాలే....విడిపోవాల్సివస్తుంది అనే బాద తప్ప...
చూసిన ప్రతి క్షణం, మట్లాడిన ప్రతి నిమిషం ఎప్పుడూ ఆనందమే..
అందరూ అంటుంటారు B.Tech లో మంచి friends దొరుకుతారురా అని..మరి నాకేంటో next  జన్మలో కాబోయే నా చెల్లి దొరికింది...ఎలా అయ్యిందంటే, ఆశ అక్క,జ్యోతి అక్క లకి equal అనేలాగా..
పేరుకైతే ఆరోజు చూశాగానీ, తర్వాత ప్రత్యేకంగా చూసిందిగానీ, పనికట్టుకుని వెల్లి మాట్లాడిందిగానీ ఎప్పుడూ లేదు..అప్పుడప్పుడు కనిపిస్తుండటం వల్ల కాస్త face గుర్తు పెట్టేవాన్ని...
తర్వాత date సరిగా గుర్తు లేదుకానీ, మేము మా juniors  కి freshers party ఇస్తున్నాం. తన పరిచయంలో నా నిజమైన ప్రయాణం మొదలైంది అక్కడే...
రోజులు గడిచేకొద్ది పరిచయం పెరిగింది..రాఖీ పండుగరోజు అందరిముందు నోట్లో sweet పెట్టిమరీ రాఖి కట్టడం, అనంతపూర్ లో కలసి seminar ఇవ్వటం, ఏదైనా problem వస్తే money ఇవ్వటం, చెపాతి తెస్తే box నాకిచ్చి తను పస్తులుండటం, ఏదైనా బాదేస్తే చెప్పుకుంటూ కన్నీల్లు పెట్టుకోవటం,వీటిలో ఏది గుర్తువచ్చినా ఆనందం, బాద రెండూ కలసి నా కల్లలో కన్నీరుగా మారతాయి.
అదేంటో B.Tech అయిన తర్వాత అలోచించేటప్పుడు, కలసి నవ్వుకున్న క్షణాలు గుర్తొస్తే ఏడుపొస్తుంది, కలసి ఏడ్చిన క్షణాలు గుర్తొస్తే నవ్వొస్తుంది...
ఎందుకో మరి  దేవుడు ఇంత మంచి బందాలను కలిపి ఆనందపడేలోగా అమాంతరంగా విడదీస్తాడు....
ఓసారి దేవున్ని కూడా B.Tech చదవించి ఇలాగే స్నేహితులని దూరం చేస్తే అప్పుడు తెలుస్తుంది మా బాదేంటో....
అమ్ములు కి దూరం అవ్వాలి అని తెలుసుగానీ మరీ ఇంత తొందరగా దూరం అవుతా అని ఎప్పుడూ అనుకోలేదు..
Nov 30 2011 Internship
కి select అయినవాల్ల పేర్లు notice board లో పెట్టారు,
అలి పేరు లేదు...HOD ని అడిగితే మంచి company కాదు, కుదరదు అన్నాడు..
ఎంత బతిమాలినా, ఎన్ని విదాలుగా try చసినా కుదరదనే అన్నాడు...
బాదేసింది.. college నుంచి room కెల్లి అలాగే పడుకున్నా..
ఇంకా ఒకరోజు time ఉంది, Hyd కెల్లి ఏదన్న company లో try చేస్తే బావుంటుందేమో అనే అలోచనతో సాయంత్రం 6 కి నిద్రలేచా...ఏదో చెప్పి అమ్ములుతో ID card, 2 ఫోటోలు ఇప్పించుకుని room కి వచ్చా..
night 2
కి అలా ఎక్కితే అక్కడ ఉదయం దిగచ్చని మల్లీ పడుకున్నా...
1.30
కి లేచా..ఇంక వెల్లాలి..money 400 ఉంది అంతే...అడుగు బయట పెట్టా..
అమ్మకి చెప్పకుండా వెల్తున్నా...అడుగు కదలకుంది, ఏదో తప్పు చేస్తున్నా అనిపిస్తుంది...
అమ్ములు కోసంలేమ్మా అంటే అర్థం చేసుకుంటుందిలే అనే ధైర్యంతో వెల్లా...
ఒక తెలిసిన sir సాయంతో మొత్తం 5 companies తిరిగా...
రెండు company లలో లు watchmen బయటకు పొమ్మంటే, మరో రెండు companyల్లో లోపలి వాల్లు బయటకు పొమ్మన్నారు..
ఒక company లో మాత్రం training ఇస్తాం అన్నారు, కానీ అమ్మాయిలకు safety ఉండదు బాబు అన్నారు..అరక్షణం కూడా అలోచించకుండా  Thanks and No రెండూ కలిపి చెప్పి నేనే బయటకు వచ్చేశా...
అమ్ములు నాతో ఉండటం కన్నా, అమ్ములు ఆనందంగా ఉండటమే నాకు కావాలి...అందుకే వద్దన్నా...
వాల్లు పొమ్మంటే ఏం, నేను వచ్చేస్తే ఏం...మొత్తానికి నేను బయటకొచ్చా...ఇంక ఇక్కడ ఉండి చేసేదేముంది అని help చేసిన sir కి thanks చెప్పి మల్లీ return bus ఎక్కా...
కిటికి పక్కన కూర్చుని అస్తమించే సుర్యున్ని, నల్లబడుతున్న మొబ్బుల్ని చూసుకుంటూ అదే అలోచిస్తున్నా.....
Morning Hyd
కి వచ్చేటపుడు bus లోంచి ఉదయించే సూర్యుడిని చూస్తుంటే అమ్ములు నాకు దెగ్గరౌతుందిలే అన్న ఆనందం, ఇప్పుడు నేను తిరిగి వెల్తుంటే అదే సూర్యుడు అస్తమిస్తుంటే చూసి అమ్ములు నాకు దూరం అయిపోయింది అన్న ఆందోలన...
ఎంత బదేసినా నా కల్లలోంచి కన్నీరు మాత్రం ఎప్పుడూ రాలేదు....
ఎప్పుడు నన్ను తాకని నా కన్నీరు, నన్ను అడగకుండా నా చెంపలపైన పడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు...పక్కన aunty ఏమైంది బాబు అని అడిగితే కడుపునప్పిగా ఉంది అని చెప్పి aunty ని silent చేయగలిగా కానీ, Handkerchief  మొత్తం తడిచిపోయినా కూడా నా కన్నీరు ఆపుకోలేకపోయా....
మల్లీ రెండురోజుల తర్వాత ఇంటికెల్లా..అక్క ఒల్లో పడుకుని hyd వెల్లిన విషయం చెప్పా..."ఏం కాదులేరా..మన అమ్ములు కోసమేగా"అని అక్క దైర్యం చెప్పింది...మల్లీ అక్కని గట్టిగా పట్టుకుని "అమ్ములు కావాలి" అని అడుచుకుంటూ ఏడ్చా...అమ్మ భయపడి వచ్చి ఏమైందిరా అని, మల్లీ కాసేపు సర్ది చెప్పింది...
"
నిన్ను 21 సంవత్సరాలుగా చూస్తున్నారా...ఇప్పటిదాకా ఇంత బాదగా చూడలేదు...కొత్త భరత్ ని చూపించావ్ కదరా నాకు" అనింది....
"
ఏంకాదులే, ను కాకపోయినా మేము మాట్లాడుతుంటామ్ లే అమ్ములుతో"..అని వాల్లు అంటుంటే వింటు వింటూ అలాగే నిద్రపోయా...
ఎంతో ప్రేమతో అన్నయ్యా అని తను పిలుస్తుంటే అలాగే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది...
తను నవ్వుతుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది...
నేనొక కవిత రాసి చూపించి, ఎలా ఉందే అని అడగకముందే, "Super రా అన్నయ్యా" అనేది...
నా అన్నయ్య ఏం రాసినా Super గా రాస్తాడు అనేది..
దూరమైపోయా..
అమ్ములు కి, అన్నయ్యా అన్న పిలుపుకి...
తన నవ్వుకి, నా ఆనందానికి...
అన్నిటికీ దూరమైపోయా...
ఇప్పుడు నాతో లేకున్న ఇన్నిరోజులు నన్ను,నా చెల్లిని కలిపినందుకు కొందరికి Thanks చెప్పాలి..
నాకు ఇంత మంచి చెల్లిని ఇచ్చినందుకు దేవుడికి,
నా చెల్లితో మాట్లాడటానికి సమయం ఇచ్చిన Year 2011 కి,
మా అనుబందానికి వేదికైన మా పుల్లరెడ్డి college కి,
ఇంకా అమ్ములుని నేను చూడటానికి, తనతో మట్లాడటానికిప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం అయిన ప్రతి వారికి, ప్రతి చోటుకి నా తరపున పెద్ద thanks...
                                            

ఇప్పుడు నా చెల్లికి నేను దూరం అయ్యా కానీ.... భవిస్యత్తులో తను ఎప్పుడన్నా గుర్తొస్తే........
"
గుర్తొస్తే.. ఏంటి"..ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం గుర్తొస్తుంది....
గుర్తొచ్చినపుడు మాత్రం...
జీవితంలో ఏదో సాదించినంత ఆనందం,
ఇంకేదో కోల్పోయానే అనే బాధ,
అందరికి కనిపించేలా నాలో చిరునవ్వు,
ఎవ్వరికి కనిపించని నా కన్నీల్లు,
ఇప్పుడు కూడా తనతో ఉండాలనే ఆశ,
కుదరదని తెల్సినవెంటనే నిరాశ,
నన్ను ఆనందపరచిన తన ప్రతి ఊసు,
ఇప్పుడు తనేంచేస్తుంటుందో అనే చిన్న ఊహ,
అన్నగా చలా చేయాలి అనే భాద్యత,
అవేవీ చేయలేకపోతున్నానే అన్న బాధ,
ఇవన్నీ నన్ను చేరి, సమాదానం చెప్పమని, అమ్ములుని ఇవ్వమని అడిగితాయి అనేది నిజం...
సమాదానం చెప్పలేక నేను తల దించుకోవాలి అన్నదికూడా నిజం...
అయినా రెండు కన్నీటి చుక్కలు ఇమ్మంటే ఇస్తాగానీ, సమాదానం అంటే ఎక్కడినుంచి తెస్తా...
అన్నగా తనకు ఏమీ చేయలేని నేను,ఒకటి మత్రం దేవుడిని కోరుకోగలను....
తనకి మంచి Husbend రావాలి,
నాకున్నంత ప్రేమ, వచ్చే మా బావ కి ఉండాలి,
నా చెల్లిని ఎప్పుడూ ఆనందం గా ఉండేలా చూసుకోవాలి,
నేను లేననే బాద తప్ప వేరే ఏదీ నా చెల్లి దెగ్గరికి రాకూడదు....
ఇట్లు మాటకి దూరంగా ఉన్నా, మనసుకు దెగ్గరగా ఉండి ఎప్పుడూ నీ మంచికోరే
నీ అన్నయ్య....
chinna....

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home