జ్ఞాపకాలు
ఆనందాలు, భాదలు, జ్ఞాపకాలు.... వీటిలో ఏవి ఎక్కువగా ఉన్నా, వాల్లకి కన్నీల్లు కూడా ఎక్కువగానేఉంటాయ్. వచ్చిపోయే ఈ భాదలు, ఆనందాలను పక్కన పెడితే... ఒకసారి వస్తే మల్లీ వీడిపోని,మనసు దాటిపోని జ్ఞాపకాలు అందరికీ ఉంటాయ్. అందరిలాగే నేను కూడా నా జ్ఞాపకాలనుతలచుకుని, కన్నీల్లు రాల్చి మల్లీ మామూలు అవుతుంటా. కానీ ఈరోజెందుకో వాటన్నిటినీ ఒక paper పైన పెట్టాలనిపించింది. అందుకే ఇది మొదలు పెట్టా. చదివేటపుడు కొంతమందికి silly గాఅనిపించచ్చు, ఇంకొంతమందికి serious గా అనిపించచ్చు.
But these all are my memories…and these all are
statements…..not comments or questions….
ఇందులో ఒక point కి ఇంకో point కి సంబందం ఉండదు.
Continuity ఉండదు. అయినాcontinuity
, comidy ఉండేకి ఇవి త్రివిక్రం రాసిన సినిమా డైలాగులు కావు. నా జ్ఞాపకాలు, ఒక్కోసందర్బంలో ఒక్కో జ్ఞాపకం. జరిగినవే రాయాలి... ఊహించి, స్రుష్టించి, చర్చించి, రచించి రాయడానికిలేదు…..
నేను చదివిన ప్రతిచోటా తలుచుకోవాల్సిన, చెప్పుకోవాల్సిన జ్ఞాపకాలు ఎన్నోఉన్నాయి..
కానీ .....
B.Tech ...... రోజుకో జ్ఞాపకం, అడుగుకో జ్ఞాపకం, చోటుకో జ్ఞాపకం...అనుకుంటే ప్రతిదీ జ్ఞాపకమే..చదివిన ఈ నాలుగేల్లు నా పేరుకింద చెదిరిపోని ఓ డిగ్రీనిస్తే పక్కనున్న వాల్లు మనసులో
చదిరిపోనిజ్ఞాపకాలను ఎన్నో మిగిల్చారు. డిగ్రీలేకుంటే వాల్లకి, వాల్లు లేకుంటే డిగ్రీకి విలువ ఉండదు....
v Sep 29th – 2008- Monday
morning 9’O clock…college joining date and time ఇది. Meeting జరుగుతుంది. ఈరోజు నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోయిన ప్రతివారూ ఆరోజు నాచుట్టుపక్కలే ఓ తెలీని వాల్లుగా కూర్చుని ఉన్నారు. నా పక్కనే కూడా కూర్చుని ఉండచ్చు.తెలీదుగా.. అందుకే గుర్తులేదు...అదంతా ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది...
v జీన్స్ ప్యాంట్ అంటేనే తెలీని నేను first year అంతా formal dress in
shirt, shoos, side bag లో ఓ mini Mr.perfect లాగా college కి వెల్లేవాన్ని. ఆ రోజుల్లో నా get up ని గుర్తు చేస్కుంటుంటే నేనేనా అనిపిస్తుంది. అరగంటకోసారి inshirt check చేసుకోవడం, బాలేకుంటేగంటకోసారి
bathroom కెల్లి సరిచేసుకోవడం.. హా హా హా ఎంత మంది ఎగతాలి చేసినా “నేనింతే”అనేవాన్ని...
v చెడు అయినా సరే , మంచి అయినా సరే.. చుట్టుపక్కల ఉన్న మనుషులు సగం మారిస్తే, మిగిలినసగం వాడికి వాడే మారి మొత్తానికి పూర్తిగా మారిపోయి, కాలం మార్చేసింది అని ఆ కలంకాన్నికాలానికే వదిలేయడం నాకు నచ్చదు.
second year లో జయదీప్, శరత్ సలహాలతో జీన్స్,టి-షర్ట్ అలవాటు చేస్కున్నా.....
second year first semester second internals తోపాటు “దమ్ముంటే ఇప్పుడు చదవండ్రా” అని సవాల్ వేస్తూ రాజమౌళి మగదీర సినిమాని రిలీజ్చేసాడు..
మామూలుగా సినిమాకి ఎవడైనా వెల్తాడు,
exam bunk కొట్టి వెల్తేనేగా మజా అని కొందరు దైర్యంచేసినట్లు మేము దైర్యం చేయలేకపోయాం....basic గా మేము good boys కదా...అందుకే
exam ముందు
రోజు వెల్లాం.... హా హా హా...
పరద్యానంలో తప్పటడుగేస్తే అది పొరపాటు,
తెలిసి తప్పటడుగేస్తే అది తప్పు,
తెలిసి , తప్పక తప్పటడుగేస్తే అదే మేము ఆరోజు చేసింది....
రెండు tickets
black లో అమ్మాం. అమ్మేటపుడు ఆ guilty feeling, అమ్మాక మాముందుమేమే తలదించుకోవడం,
covering కోసం నవ్వుకోవడం ఆరోజు రుచి చూశాం.. తలుచుకుంటే ఇప్పటికీ guilty గానే ఉంది ఆ feeling...
v Surveying is the
mother of civil engineering.
Surveying lab is the base point of my friendship with
alekhya……..
Survey batch భరత్, అనీల్, దిలిప్, చక్రి, అలేఖ్య, అర్చన... అందరు good friends.
But అలేఖ్య కొంచెం
close.
Theodalite తో తింగరి వేషాలు,
Ranging rod తో విలన్
get upలు అన్నీ నవ్వులే….
కోర్టులో జెడ్జి పక్కన కట్టె పట్టుకుని నిలుచున్న బిల్లబంట్రోతు లాగా అనీల్ గాడు staff పట్టుకునినిలబడితే...నేను మాత్రం ఆ theodalite లోంచి రోడ్డుపైన వెల్లే బస్సుల్ని, కనిపిస్తే బస్సులోమిస్సుల్ని చూసేవాన్ని. అది వాడికి తెలిసి staff ముడిచి కొడుతుంటే తప్పించుకు తిరిగేవాన్ని.... ఆ అల్లరి, ఆ సందడి...అదో లోకం….
నేను కాస్త bend అయి, అనీల్ గాడు కాస్త కాల్లు ఎత్తి రీడింగులు చూస్తే అలేఖ్య, అర్చన ఆరీడింగులను field book లో రాస్తే, మల్లీ మేమే తీస్కొని caliculation చేసి sir తో sign చేపిస్తే...
“నువ్వు దేవునివి రా” అని వ్యంగంగా ఓ మాట అని దిలీప్ గాడు వాడి field book పట్టుకెల్లేవాడు.
హా హా హా…ఆ సందడి అంతా
వేరేగా ఉండేది... తలుచుకుంటే ఇప్పటికి కూడా కల్లముందరే కదుల్తుంది..
v Classలో
lesson వినకుండా sir cheating చేసి friends తో chatting, boar కొట్టి కవితమొదలుపెడితే అది చూసి అనీల్ గాడి coating, జయదీప్ గాడి pinching.
Transportation madam class లో madam తిట్టి బయటకు పంపిస్తే వెల్లి bathroom లో face washing, break లో batting, experiment చేయమంటే
extra acting, అదితెలిసిsir
scolding……అన్నీ కోతి వేశాలే.... కానీ ఒకటి మాత్రం పక్కాగా చెప్పగలను...మా
class లో ఉన్న అన్ని కోతులకంటే మేము కొంచెం మంచి కోతులం..హా హా హా …
v తలుచుకోవడానికి నాకు తీపితో పాటు చేదు జ్ఞాపకాలు కూడా చాలానే ఉన్నాయి.. కానీ చేదువాటినితలుచుకోవడం నాకిష్టముండదు, అలాంటిది ఇప్పుడు అదే పనిగా తలుచుకుని రాయటం ఇష్టంలేదు.
But నాకో వింత జ్ఞాపకం ఉంది...మా అమ్మ వాల్లకి చేదు జ్ఞాపకం అవుతుంది అనుకున్న ఓజ్ఞాపకం నాకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది...అదే కర్నూల్ వరదలు...
నామీద నాకుగాని, మా parents కి గానీ ఆశలు ఆవిరైపోయిన రోజులవి...నీల్లలో నిద్రలేనిరాత్రులవి...
కల్లముందరే కడతేరిన మూగజీవాలు, సామాన్లకోసం కకృత్తి పడి చావు తలుపు తట్టి వెనక్కు వచ్చినఓ ఈతరాని ఎర్రోడు..
కడసారిది వీడ్కోలు అని నా సెల్ రింగ్ టోన్,
Books జాగ్రత్త అని జయదీప్ గాడు చేసిన phone call,
నేను, అనీల్ గాడు కలసి చెప్పుకున్న సినిమా డైలాగులు,
బనియన్, shirt లతో కర్నూల్ నుంచి ఇంటికొచ్చిన జర్నీ,
రెండురోజులు నష్టపెట్టిన వరదనీల్లు,
రెండు నెలలు కష్టపెట్టిన వరద వాసన,
అన్నీ నవ్వు తెప్పించే జ్ఞాపకాలే...
మాparents కి ఏడుపును మిగులుస్తుంది అనుకున్నా...మాకే నవ్వుల్ని మిగిల్చింది.. హా హా హా funny flood.
v Orcut…. ప్రపంచంలో ఎంతమంది
friends ని కలిపిందో, ఎంత మంది friends ని friends గానే ఉంచిందో, ఎంతమందిని lovers
గా మలచిందో, ఎంతమంది దారి మార్చిందో, ఎంతమంది భవిష్యత్తుని ముంచిందో నాకు
తెలీదుకానీ, నన్ను మాత్రం మోసం చేయలేదు… మంచి friend ని పరిచయం చేసి strong
గా నిలిపింది. రోజా…. Second year లో పరిచయం అయింది.
Same college mechanical branch.
Branch లు, భావాలు వేరే అయినా బానే మాట్లాడేది...
నాకు చెపాతి ఇష్టమని తను చెపాతీ తెచ్చుకున్నప్పుడల్లా
call చేసి మరీ ఇచ్చేది.
Unknown to known person,
known person to just friend,
Just friend to one of best friends అయింది. ఎన్నో
జ్ఞాపకాలు మిగిల్చింది...
v మనకు ఇష్టమైన వాల్లకి,
ఏదైనా వాల్లకు ఇష్టమైనదాన్ని ఇస్తే అదో ఆనందం...ఆవిషయంలో అలేఖ్య top 5 లో ఉంటుంది.
నాకు చెపాతి అంటే ఇష్టం & తను హాస్టల్. అందుకే నాకు తీస్కురాలేదు...కానీ
ఇంటికెల్లినపుడు ప్రతి సారీ ఓసారి చెపాతి, ఇంకోసారి ఉప్మా, ఇంకోసారి రసగుల్లా
తెచ్చిచ్చింది. అవి ఇచ్చిన అలేఖ్యని, వాటి టేస్ట్ లను ఎప్పటికీ మర్చిపోలేను...
v మనకిష్టమైన వాల్లు
ఏదైనా చోటుకు వెల్తుంటే మనం ఇచ్చిన ఓ రూపయి అయినా తీస్కుని ఖర్చు పెట్టుకుంటే మనకు
ఓ 100 సంపాదించినంత ఆనందం.
ఓరోజు నేను hyd కి వెల్లాలని railway station కి ఆటోలో
వెల్తున్నా...రోజా రమ్మందని ఆటో దిగి మల్లీ stationary దెగ్గరికి వెల్లా.. ఓ dairy
milk chocolate & నాకు కనపడకుండా దాని కింద ఓ నోటు పెట్టి ఇచ్చింది. ఎందుకు
అంటే "hyd వెల్తున్నావ్ గా ఖర్చులకు ఉంచుకో నాతో ఉందిలే అనింది..
may be తను ఇచ్చింది 100 లే కావచ్చు...but ఆ మనసు మాత్రం చాలా గొప్పది”.
v ఇల్లు ఎంత అందంగా
కట్టుకున్నా, అందులో మనుషులు ఉన్నంతవరకే దాని అందం చెప్పుకోవడానికైనా,
చూసుకోవడానికైనా.... అదే మనుషులు లేకుంటే దానికి విలువ ఉండదు. కాలేజ్ కూడా అంతే.
స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, కాళీగా ఉన్నపుడు అంత బోసిపోయి
ఉండేది....అలా ఎవరూలేని కాలేజ్ కి వెల్లి అక్కడ మేము కలిసిన చోటును చూసుకుంటూ,
మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ, కాలాన్ని మరిచిపోయి అలాగే
ఉండేవాన్ని...అలా ఒంటరిగా జ్ఞాపకాల మద్యలో కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టం...
v మన ప్రతిబింబాన్ని
సరిగ్గా చూపించే అద్దం ముందే మనం నిలబడతాం... same way మనం ఎంత ఇష్టపడుతున్నామో,
మనల్ని కూడా అంతే ఇష్టపడే వారితోనే మనం ఉండాలనుకుంటాం....సరైన అద్దం ముందు నిలబడటం
తప్పు కాకపోయినపుడు, మనకిష్టమైన వాల్లతో ఉండటం కూడా తప్పు కాదు... అలా నన్ను
నన్నుగా చూపించగలిగే అద్దం నా అపురూపమైన చెల్లి అమ్ములు... third year లో పరిచయం
అయింది. అంతకముందు 2 years ఎదురుగా ఉన్నా ఎవరో తెలీకుండా అలాగే ఉన్నాం అంటే
నమ్మలేకున్నా అసలు...అలా పక్కనున్నా పరిచయంలేని ఓ అమ్మాయి నా చెల్లిగా మారి నా
అంతట నేను నా purse లో అమ్మ,అక్క ఫోటల పక్కన తన ఫోటోని ఉంచేలా చేసిందంటే ఇంక తను
ఎవరో, ఎంత important నో మీరే అర్థం చేస్కోండి....
v ఇష్టమైన వాల్లకి
shocking gift లు, surprising party లు ఇచ్చి, ఆతర్వాత వాల్ల కల్లలో ఆనందాన్ని
చూసి మురిసిపోయే friends కొందరుంటారు...వాల్లను వరుసలో నిలుచోపెడితే అలేఖ్య ని
ముందు నిలిచోబెట్టాలి...
May-5-2011......అలేఖ్య, అర్చన, అమ్ములు, జయదీప్,
ప్రతాప్ అందరూ కలసి UCON plaza లో చేసిన నా birthday party ఆ party లో మేము చేసిన
అల్లరి అస్సలు మర్చిపోలేను...కష్టపడింది జయదీప్, ప్రతాప్ అయినా ప్లాన్ చేసింది
అలేఖ్య...
v ఒకర్ని మనం
ఇష్టపడుతుంటే, ఆ మనిషి మనల్ని అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతుంటే, ఆవిషయం మాటల ద్వారానో
చేతలద్వారానో మనకు తెలిస్తే ఆ ఆనందం ఎంత బాగుంటుందో కదా... అదే నాకారోజు
ఎదురైంది...
Dec 28 -2010 అమ్ములు birth day...... తను పరిచయం అయిన కొత్తలు....
Administrative block కి రమ్మని పిలిచి, వచ్చాక sudden
గా ఓ cake ముక్క నోటినిండా పెట్టి కుక్కేసింది...అందకపోతే కాల్లు ఎత్తిమరీ
అందుకుని కుక్కేసింది...ఆ cake పెట్టిన shock 5% అయితే, అమ్ములు నన్ను ఇంత బాగా
నమ్మిందా...ఇంత ఇష్టపడుతుందా అని 95% shock. Total 100% ఆనందం...హా హా హా
Happy birthday చెల్లెమ్మా....
v ఇష్టమైనవాల్లకి gift
ఇస్తే ఆనందం..అదే ఆ gift సొంతంగా సంపాదించిన డబ్బుతో కొనిస్తే ఆ ఆనందానికి అంతే
ఉండదు..అలాంటిదే ఇది...
నాకు సెల్ లేదని తెలిసి రెండునెలలుగా beauty parlour
చేసి సంపాదించిన డబ్బుతో ఓ సెల్ కొనిచ్చింది అలేఖ్య... కానీ ఇచ్చినంత కాదు
తీస్కోవడం. ఏదోలా అనిపించింది... తప్పక తీస్కున్నా..తప్పకుండా జాగ్రత్తాగా
చూస్కుంటా..
ఆ సెల్ ఇచ్చినపుడు అలేఖ్య కల్లలో ఆనందం మాత్రం ఎప్పటికీ
మర్చిపోలేను...
v మనం నవ్వుతున్న సమయంలో
మన ముందెన్ని కష్టాలున్నా అవి కష్టాలుగా అనిపించవు...కష్టం గురించి అలోచించే
సమయంలో నవ్వడానికి ఎన్ని కారణాలున్నా అవి కారణాలుగా కనిపించవు..
Same way college లో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలున్నా
నవ్వుతో జయించచ్చులే అని దైర్యంగా ఉండేవాన్ని....మల్లీ రూమ్ లో ఎప్పుడన్నా కష్టాల
గురించి గుర్తొచ్చినప్పుడు ఈ కష్టాలే నన్ను జయించాయే అనిపించేది...
అనుకుంటే నవ్వులూ, కష్టాలు రెండూ అవసరమే... అలోచిస్తే ఈ
జీవితంలో మనం అనుకున్నప్పుడే కష్టాలు, అనుకున్నప్పుడే నవ్వులు వస్తాయనుకోవడం మన
భ్రమే...
v మన ఇష్టమైన వాల్లు
వాడి పడేసిన ఒక waste వస్తువు కూడా మన దగ్గరికి చేరితే అది ఓ మదుర జ్ఞాపకం...
ఇష్టమైన వాల్లతో కలిసి నడిచింది ఎండలో అయినా అదో
ఆనందం...అనుకోవడానికో జ్ఞాపకం...
తిని పడేసిన చాక్లెట్ పేపర్లు, పగిలిపోయిన చేతి గాజులు,
చెల్లని నాణాలు, కాలీ వాటర్ బాటిల్లు...అలాంటివి ఎన్నో... ఇప్పటికి కూడా అన్నీ
భద్రంగా దాచుకున్నా...
వింత ఏంటంటే... వాటి అవసరం తీరిపోయాకనే వాటి విలువ
పెరిగిపోతుంది...ఎంత అంటే అమ్మాలనే అలోచనే రాలేనంత, ఎవరూ కొనలేనంత...
v కష్టాల్లో ఉన్నపుడు
మనం అంటే ఇష్టం ఉన్నవాల్లు మనకి సాయం చేయటానికి ఎంత ఇష్టపడతారో, ఆ సాయం
తీస్కోవాలంటే మనం అంత ఇబ్బంది పడతాం...పైగా అవి పరిచయం అయిన కొత్తలు...
ఓసారి నాతో money అయిపోయాయి... food కి కూడా లేవు,
ఇంటినుంచి పంపించేకి ఇంకో రెండు రోజులు పడుతుంది... అలాంటప్పుడు అమ్ములు నాకు 400
ఇచ్చింది... నా అంతట నేను అడగలేదు, ఎవరితోనూ అడిగించలేదు...ఎందుకు
ఇవ్వాలనిపించిందో మరి...ఎన్నిసార్లు వద్దు అన్నా వినకుండా చేతిలో పెట్టి, ఒట్టు
అనేసింది...ఇంకేం చేసేది లేక తీస్కున్నా...తీస్కోవడమైతే తీస్కున్నాగానీ ఈ రోజు
వరకు కూడా కర్చుపెట్టలేకపోతున్నా...హా హా హా వాటిని అలాగే దాచుకున్నా....
v పరిచయం పెరగాలన్నా,
ప్రేమ తెలియాలన్నా ఏదో ఒక సన్నివేశం జరగాల్సిందే....నేను అమ్ములు ఇంత క్లోజ్
కావడానికైనా, తను నన్ను ఇంత బాగా నమ్మడానికైనా కారణం ఇదే...ఓసారి ATP JNTU లో PPT
లు పడ్డాయి... అర్చన వాల్లు చేశారు...2 ppts అయ్యాయి. నన్ను రమ్మందని నేను
అమ్ములు వెళ్ళాం...ఆ జర్నీ, అక్కడ జ్యోతి అక్కని అమ్ములు కి పరిచయం చేయటం, అమ్ములు
అన్నం తినలేక అన్నీ నా ప్లేట్ లో పెట్టడం, ఒక సెకను అన్నయ్యా అని ప్రేమగా పిలవడం,
ఇంకో సెకను ఒరేయ్ అని ఇంకా ప్రేమతో పిలవడం,కాల్లు నస్తున్నాయ్ ఎత్తుకోరా అని
అడగటం... white and white matching వేస్కోవడం... హా హా హా ఆరోజునుంచి మేము
నిజంగానే అన్నా చెళ్ళెళ్ళం అయిపోయాం...
v మన మనసులో ఎప్పటినుంచో
ఉన్న ఒక కోరిక అడగకుండా, అనుకోకుండా జరిగిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది కదా...అదే నాకు
ఆరోజు ఎదురైంది...హా హా హా అదో అనూహ్యమైన జర్నీ...
గోభి తిందామని అమ్ములు కాల్ చేసి పిలిస్తే c.camp కి
వెల్లా...అక్కడ మహేష్, అమ్ములు ఇద్దరు బైక్ లో వచ్చారు... వెల్లేటప్పుడు నేను,
అమ్ములు, మహేష్ ముగ్గురం బైక్ లో వెల్లాం...first time అమ్ములు, నేను ఒకే బైక్
లో..హా హా హా అదో great feeling ..మా ఇద్దరి కోరిక..నేను అడగకుండా, తను
చెప్పకుండా...మొత్తానికి అనుకోకుండా జరిగిపోయింది....అక్కడ తిన్న గోభి కన్నా ఎన్నో
రెట్లు బాగుంది ఆ feeling....
v మనం కిందపడి మనకో
పెద్ద దెబ్బ తగిలినా పెద్దగా అనిపించదుకానీ, మనకిష్టమైన వాల్లు, మనతో ఒక
చోటుకొచ్చి అక్కడ మనవల్ల కిందపడి నప్పి వేస్తే ఆ బాద వాల్లకన్నా మనకే ఎక్కువగా
ఉంటుంది.. కాకపోతే వాల్ల బాద శరీరానికి, మన బాద
మనసుకి...అదే నాకారోజు ఎదురైంది... may-5-2011 నా birthday కి నేను, రోజా iceberg
కి వెళ్ళాం.. వచ్చేటపుడు road cross చేస్తుంటే ఓ aunty bike లో వచ్చి
గుద్దేసింది..పాపం కిందపడిపోయింది రోజా...ఓ గాజు పగిలి చేతికి రక్తం కూడా
వచ్చింది..ఎంత బాదేసిందో అసలు... అమ్మకి చెప్పా, జాగ్రత్తరా అనింది..ఆ సన్నివేశం
చాలా రోజులు నా కల్లముందే కదిలింది.....
v మన ప్రాణం అయిన
వాల్లకోసం కష్టమైన పని, ఫలితం రాదని తెలిసిన పని చేయాలన్నా ఎంత ఆనందంగా ఉత్సాహంగా
చేయచ్చు కదా..అదే నేనారోజు చేసింది... నాకు, జయదీప్ కు, శరత్ కి internship ok
అయింది. కానీ అమ్ములు వాల్లకి ఇంకా కాలేదు..అందుకే బాదేసింది.కష్టం అని తెలిసినా,
కుదరదని తెలిసినా అమ్మకి, అక్కకి, అమ్ములు కి ఎవరికి చెప్పకుండా Hyd కి
బయలుదేరా...ఎంత ప్రయత్నించినా వల్లకాలేదు. బాద రెట్టింపు చేస్కొని తిరిగి వచ్చా...
B.Tech అయ్యాక విడిపోవాల్సి వస్తుందని తెలుసు... కానీ internship పేరుతో ఇప్పుడే
విడిపోవాల్సివస్తుంది... అని అమ్మ ఒల్లో, అక్క ఒల్లో పడుకుని ఎంత ఏడ్చానో
అసలు...బస్సులో అందరూ ఉన్నారని కూడా చూస్కోకుండా ఏడ్చా...ఆపుకోలేకపోయా...పక్కన ఆంటీ
ఏమైంది బాబు అంటే కడుపునప్పి అని ఆంటీ నోరు మూయించగలిగా కానీ.. నా hand kerchief
మొత్తం తడిచిపోయినా నా కన్నీటిని ఆపుకోలేకపోయా...బస్సులో, bed room లో ఆంటీ
పక్కన, అమ్మ ఒల్లో నేను అలా ఏడ్చడం చూసి అమ్మనే shock అయింది....
v Internship ... best
friends తో కలసి ఓ 3 months tour వేస్తే ఎలాఉంటుంది... అలాంటిదే ఇది... పేరుకు
మాత్రమే ఇది internship ... అంతా enjoy నే.. అమ్ములు లేదని బాద తప్ప ఇంకే బాద
దరికి రాకుండా ఉన్నా. జయదీప్ గాడిపైన setair లు, అక్కడ S.E సురేష్ సర్ talent ,
NCC food, అక్కడ sumo driver బాబుఅన్న, HCU university, గోల్కొండ fort మహదీపట్నం hostel
ఏవీ.....ఏమీ మర్చిపోలేను ఎప్పటికీ..... అనుకుంటూ పోతే internship లో ప్రతీరోజు ఒక
మదుర జ్ఞాపకమే...
v దెగ్గరగా ఉంటే ప్రేమ
తగ్గుతుందో లేదో తెలీదు గానీ దూరంగా ఉంటే మాత్రం తప్పకుండా పెరుగుతుంది... మా మద్య
దూరం పెరిగిపోయిందని, మా మనసుల మద్య కూడా దూరం పెరిగిపోతుందని చాలా
భయపడ్డా...బాదపడ్డా... కానీ internship వల్ల ఉన్న కాస్త దూరం కూడా తగ్గి ఒకే
ఇంటి అన్నా చెళ్ళెళ్ళం అయిపోయాం, ప్రతి రోజూ mail లో మాట్లాడుకునేవాల్లం.... కాలేజ్
కబుర్లు తను, internship కబుర్లు నేను ఇద్దరం చెప్పుకుంటూ
నవ్వుకునేవాల్లం...హా హా హా...అప్పుడప్పుడు కర్నూల్ కెల్లి కలిసినపుడు ఎంత
బాగుండేదో అసలు... చాలా రోజుల తర్వాత మన రక్త సంబందీకులని కలిసినంత
ఆనందమేసేది...అయినా రక్త సంబందం అనే మాట పక్కన పెడితే ఇంక అన్ని విషయాల్లో అమ్ములు
నా సొంత చెల్లెమ్మే...
v అప్పుడప్పుడు నేను ,
అమ్ములు అనుకునేవాల్లం.... ఖాళీ రోడ్డు లో, వెన్నెలలో, మనమిద్దరం బైక్ పైన, చందమామ
మన పైన, మనం ఎంత స్లోగా వెల్తుంటే, చందమామ కూడా అంతే స్లోగా... ముగ్గురం కలసి
వెల్తుంటే, గాలి “వద్దు, ఇక్కడే ఆగండి” అని
ఎదురుగా వచ్చి ఆపేస్తుంటే, ఆగి దాన్ని పలకరించి మళ్ళీ ముగ్గురం కలసి అలా అలా
వెల్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదరా అని ….
హా హా హా అమ్ములు, నేను కలసి బైక్ లో..... అదీ ఖాళీ రోడ్
లో.....అది కూడా వెన్నెలలో అంటే సాయంత్రం 7.00 తర్వాత....impossible అనుకున్నాం
ఇద్దరం....
కానీ impossible లోనే i am possible అని ఉందిగా...
అందుకే ఇది కూడా possible అయింది.. అది కూడా నా బుజ్జి చెల్లెమ్మ sary లో
ఉన్నప్పుడు....
11- april-2012 బుదవారం. మా fare well party అదీ జగన్నధ
గట్టు దెగ్గర మయూరి రిసార్ట్స్ లో.... అమ్ములు శారీలో క్యూట్ గా వచ్చింది.... నైట్
8.40 అయింది... పార్టీ ఇంకా అయిపోకుంది...మళ్ళీ నాన్న తిడతాడని నేను శరత్ గాడి
బైక్ తీస్కొచ్చా ..ఇద్దరం కలసి ఆ బైక్ ఎక్కాం..... మయూరి రిసార్ట్స్ నుంచి
బయల్దేరి మళ్ళీ కాలేజ్ ముందు కాసేపాగి మళ్ళీ బయలుదేరి వెళ్ళాం...హా హా హా బలే ఉన్నిందిలే
వెన్నెల్లో ఆ జర్నీ...ఎన్ని సంవత్సరాలు గడిచినా మాకు అది fresh జ్ఞాపకమే....
v అమ్ములు ఇంట్లో, ఓ
ఇంటి మనిషిలా కలసిపోయిన రోజులు కూడా ఓ రెండు ఉన్నాయి నాకు...అక్క పెళ్ళి కార్డ్
ఇవ్వడానికి ఓరోజు ఇంటికెల్లా....అమ్మ చాలా బాగా మాట్లాడింది...పెళ్ళికి కశ్చితంగా
పంపిస్తా అనింది...అది నిజమౌతుందని, అమ్ములు పెళ్ళికొస్తుందని ఎంత సంబరపడ్డానో
అసలు...
మళ్ళీ ఇంకోసారి farewell party అయిపోయాక last time అని
నాన్నకి పరిచయం చేద్దాం అని ఇంటికి రమ్మంది.. నేను late గా వెల్లడం వల్ల uncle ని
కలవలేకపోయాను...కానీ ఇంట్లో ఓ రెండు గంటలు అమ్మతో, అమ్ములుతో మాట్లాడి... అమ్ములు
... జాగ్రత్త అని tata చెప్పి వచ్చేశా...ఇంక నా B.Tech జీవితానికి అమ్ములుతో కలవడం
అదే చివరి రోజు...
v మన ఇంట్లో జరిగే ఒక
వేడుకకి మన ఆత్మీయులందరూ వచ్చి పాల్గొంటే, ప్రతిదానిలో చెయ్యందిస్తుంటే ఎంత
బాగుంటుంది కదా... march 8,9,10,11 -2012 ఈ 4 days అక్క marriage day celebrations
... friends అందరూ వచ్చి అన్ని పనులు చేశారు, అందరితో కలసిపోయారు, అన్నిట్లో
తోడుగా ఉన్నారు.... జయదీప్,
అనీల్, సురేష్, ప్రతాప్, శివతేజ, శ్రీను, హర్ష, వాసు, చైతన్య, నాగార్జున్, వంశి,
మోయిన్, జావెద్, సుదర్శన్, హేమంత్, కొండల్....అందరూ వచ్చారు...ఎంతమందిని పిలిచినా
అమ్మాయిలు మాత్రం ఒక్కరు కూడా రాలేదు...అది మాత్రం బాగా hurt చేసింది...అయినా
వాల్ల వాల్ల reasons వాల్లకుంటాయ్ లే...అందుకే పెద్దగా ఎవర్నీ ఏమీ
అడగలేదు..."అంత మందితో మాట్లాడతావు, చెల్లి చెల్లి అంటావ్ ... అమ్మాయిలు
ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు కదరా...అందరూ hand ఇచ్చారు కదరా.." అని మోయిన్
భషా గాడు జోక్ గా అంటుంటే... గట్టిగా నవ్వి "కలికాలం రా" అని వెల్లిపోయా...
ఆ answer వాడికీ అర్థం కాలేదు , నాకూ అర్థం కాలేదు...
any way... things apart....నా B.Tech లోనే అక్క
marriage అవ్వడం వల్ల నాకు మిగిలిన ఓ sweet memory ఇంకా అందంగా తయారైపోయింది..
అందరిమద్య చాలా బాగా జరిగింది పెళ్ళి... thanku very much my dear all friends...
ఇంట్లో అమ్మ ఇష్టం, నాన్న ఇష్టం, అక్క, చెల్లి, తమ్ముడు,
అన్నయ్య, నాన్నమ్మ, తాతయ్య...అందరూ ఇష్టం... కాబట్టి అంతమంది ప్రేమానురాగాలకు
వేదికైన మన ఇల్లు అంటే మనకెంత ఇష్టముండాలి.... మాకు అలాంటి ఓ పెద్ద ఇల్లు కర్నూల్
, అందులో ఒక బాగం మా రంగుల ప్రపంచం పుల్లారెడ్డి కాలేజ్...
ü Room లో చిల్లర
వేషాలు, కాలేజ్ లో కోతి వేషాలు...
ü బుద్వార్ పేట్ center
లో tiffen center , library ముందు అన్ని branch ల అమ్మాయిలు కనిపించే college
canteen center ...
ü క్లాస్ వినకుండా రాసే కవితలు,
అదే క్లాస్ లో అప్పుడప్పుడు అనీల్ గాడి గుర్రపు కూతలు...
ü Busstop to college
auto journey, ప్రతి auto driver తో మా మాటల journey....
ü కుదిరితే
పడుకోవడానికి, కుదరకపోతే రాస్కోవడానికి పనికొచ్చే క్లాస్ లో bench, అందరి box లు
కొట్టేసి తినేసే lunch...
ü ఆత్మీయులతో కలసి
మాట్లాడించిన notice board, జ్ఞాపకాలను తలుచుకుంటూ నడిచిన empty road....
ü కలసి తీయుంచుకున్న
ఫోటోలు, కలసి పయణించిన ఆటోలు...
ü Stadium లో అందరికి
కనిపించేలా ఆడుకునే ఆటలు, పక్కోడికి కూడా వినిపించకుండా నొట్లోనే పాడుకునే పాటలు..
ü హారన్ అవసరం లేకుండా
మా అరుపులతోనే వెల్లే కాలేజ్ బస్సులు, ఆ అరుపులు వాల్లకోసమని తెగ feel అయిపోయి
మురిసిపోయే బస్సులో మిస్సులు...
ü అప్పుడప్పుడు మిస్
అయిన class లు, ఎప్పటికప్పుడు తెలిసిపోతుండే కాలేజ్ లో clash లు....
ü కాలేజ్ లో మా
ప్రిన్సిపాల్ మీసం కట్టు, క్లాస్ boar లు కొడితే friends తో కలసి వెల్లే జగన్నాథ
గట్టు....
ü అపద్దపు love affair
లు, అది తెలిసి అమ్మాయిల fire లు...
ఇలా పదాలు, ప్రాసలు పేర్చుకుంటూ పోతే గుర్తొచ్చే
జ్ఞాపకాలు చాలా చాలా ఉన్నాయ్...ఎన్ని రాసినా రాయాల్సినవి ఇంకా మిగిలే ఉంటాయ్...
నాలాగే అందరికీ జ్ఞాపకాలుంటాయ్... చదువేదైనా, చోటేదైనా, తీపైనా, చేదైనా జ్ఞాపకాలు
మాత్రం అందరికీ ఉంటాయ్..ఆ జ్ఞాపకాలన్నిటినీ నాలాగా ఓ పేపర్ పైన పెట్టండి...
రాసేటపుడు అందంగా రాయండి... తర్వాత చదివేటపుడు, చదివించేటపుడు, వినిపించేటపుడు ఎంత
ఆనందంగా ఉంటుందో మీరే చూడండి...ఎందుకంటే మనకున్న ఆస్తుల్లో జ్ఞాపకాలు కూడా ఒక
విలువైన ఆస్తే...
చివరగా....
నాకు ఇన్ని మధుర జ్ఞాపకాలను మిగిల్చి , నా మాట తీరును,
అలోచనాతీరును అందంగా మార్చేసి, నాకు ఎంతో ఆనందాన్ని అందించిన ప్రతి వారికి,
వస్తువుకి పేరు పేరునా నా ప్రతేక దన్యవాదాలు...
Thank you all my dear friends..
Be happy always....
Yours
CHINNA

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home