నాలో మంచితనం నిదిరిస్తున్న వేల..
ఆశలలో
పరుగులేసి నా దారి మారిన
నాడు,
నా అడుగు అడగలేదు, నీ
అడుగులు ఎటువైపని..
ఊహలలో
ఊగిపోయి నే దారి మరిచిన
నాడు,
నా చూపు చూపలేదు, సన్మార్గం
అటువైపని..
నా ప్రతి అడుగు తప్పువైపు
అడుగులేసిననాడు,
నా నోరు మెదపలేదు, నను
మందలించలేదు..
నాలోని
చెడురూపం నను ఆవహించిననాడు,
నా చెయ్యి లేవలేదు, ఒక పీకు పీకలేదు..
నా మదిలోని అలోచన నిదురించే సమయాన,
నాలోని
మూర్ఖత్వం మేలుకున్న సమయాన,
నేనివ్వని
నా అనుమతితో,
నావి
కాని గడియలలో,
తప్పుటడుగు
వేశాను,
తప్పటడుగు
అనబోను...
నేడనుకొని
ఫలమేమిటి, నా తప్పు తిరిగి
రానపుడు,
కన్నీరు
రాల్చి ఫలితమేంటి, నా మనసు కుదుట
పడనపుడు...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home