Wednesday, June 27, 2012

ధైర్యం..


మది తెలిసిన మనిషొకరుంటే,
మనిషి మన వెంటే ఉంటే,
ప్రతి తప్పును సవరిస్తుంటే,
సన్మార్గం చూపిస్తుంటే,
అడుగడుగున తోడొస్తుంటే,
వెంటుండి నడిపిస్తుంటే,        
కలతెందుకు కంటికి,
బాదెందుకు మనసుకి...
పైరంతా పచ్చగ ఉంటే,
భూమాతే కరుణిస్తుంటే,
గంగమ్మే వరమిస్తుంటే,
పైరగాలి వీస్తూ ఉంటే,
సిరులెన్నో తెస్తూ ఉంటే,
తనచేతికి అందిస్తుంటే,
భయమెందుకు రైతుకి...
బాదెందుకు మనసుకి...
గౌరవాన్ని నిలబెట్టే కొడుకే ఒకడుంటే,
నీతి అనే బాటలోన పయనిస్తూ ఉంటే,
నిజాయితి అను మాటకే అర్థాన్నిస్తుంటే,
"తమ బిడ్డా" అని ప్రతివారు గొప్పగ చూస్తుంటే,
తమముందే తమ కొడుకును పొగిడేస్తూ ఉంటే,
వాన్ని కన్న మీ జన్మ దన్యం అంటుంటే,
భయమెందుఉ తండ్రికి...
బాదెందుకు తల్లికి...
ప్రతి కష్టాల్లో వెంటొచ్చే తోడే మనకుంటే,
ఎదుర్కొనే శక్తి అచట రెట్టింపవుతుంటే,
బాదైనా నవ్వేగా బతుకు అనే ఆటలో,
ముల్లైనా పువ్వేగా నీవు నడుచు బాటలో... 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home