Friday, March 27, 2020

ఇంటినుంచే అరికట్టాలి


దేవుడికే చావుంటే, చేయి కలిపితేనె చావంటే,
ప్రత్యక్ష్యం కాడేమో, ఎన్ని ప్రార్థనలే చేసినా...
అంటువ్యాధి అంటున్నా, అంటుకుంటుందని తెలిసినా, 
వైద్యుడు వెనకడుగే వేయడే, వేల మరణాలను చూస్తున్నా...

ఓ సైనికుడా చూశావా, వైద్యుడు నీకు సాటి వీరుడు..
సూక్ష్మజీవి శత్రువుతో, పోరాడుతున్న యోధుడు...

బాధ్యతతో ప్రభుత్వాలు, ఆంక్షలెన్నొ పెడుతున్నా.. 
బయటకు రావద్దంటూ మొక్కి మరీ చెబుతున్నా...
ఇంగితమే లేకుండా, ఇల్లు దాటాలని కొందరు...
చట్టాలకు కళ్ళుకప్పి, ఊరు దాటాలను ఇంకొందరు...

కరోనాకు పట్టదు, నీ కారణాలు వేలున్నా...
నిను తగులుకోక మానదు, ఎన్ని తొడుక్కుని తిరిగినా…

చైనాలో పుట్టింది, దాని పయనాన్ని మొదలు పెట్టింది... 
పది పక్షాలు కూడ పట్టలేదు, ప్రపంచాన్ని చుట్టింది...
ప్రతి దేశంలో తాండవించి, చావుదెబ్బ కొట్టింది..
పది సంవత్సరాల అభివృద్దిని, వెనకకు నెట్టేసింది..

అగ్ర రాజ్యాలే ఆపలేక, అలసటపడుతున్నాయి...
ఆర్థికంగానూ కూలిపోయి, ఆకాశం చూస్తున్నాయి...
మనదేశపు ముందుచూపు, భూలోకానికె ఆదర్షము..
కొందరి మతిపోయిన ప్రవర్థనే, మన దేశానికి బారము...

మనవైపు మండుటెండలని, అది బతకడమే కష్టమని...
మన మండలంలో లేదని, మన పొలిమేర చేరలేదని...
అపోహలో ఉండకండ, కాస్త ప్రపంచాన్ని చూడండి…
చేతనైతే బాధ్యతతో, పదిమందికి చెప్పండి..

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home