Saturday, April 7, 2018


ఎన్నాల్లైనా నిన్నల్లోనే, నీ ఊహల్లోనే ఉన్నాను...
ఎన్నేల్లైనా నా కన్నుళ్ళోన, నీజతగానే  ఉన్నాను...
కాలమనే మాయాజాలం, నా నవ్వులనే నట్టేట ముంచినా,
కావ్యమనే పదసంచారం, మన జ్ఞాపకాలలో విహరించనివ్వనీ...

నా మౌనంలోనూ నీ ధ్యానం, ప్రతి గానంలోనూ నీ స్మరణం..
నా ప్రతి వేకువలోనూ నీ స్వప్నం, ఏవైపు  చూసినా నీ రూపం..
గడిచిన గతమే నడిచొచ్చేలా, నా అణువణువూ నీ జ్ఞాపకమేలే..
మిగిలిన స్మృతులే పవనం లాగా, క్షణక్షణమూ నా మేను తాకెలే...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home