లక్ష్యం లక్షణం
అందదుగా ఆకాశం ఎగసిపడే ఏ అలకు,
అవి ఆవిరిగా మారిపోయి గాలిన కలిసేవరకు..
ఆవిరైన అలలేగా ఆ మేఘమందు చేరింది..
దారైతే మారింది, కడలి కల మాత్రం తీరింది..
అలలజడై పొంగినపుడు అందని ఆ ఆకాశం,
ఆవిరిగా మారినపుడు అందిందని తెలుసుగా...
ప్రయత్నాన ప్రత్యామ్నాయం, ఈ ప్రకృతికే అవసరం,
ఒక ఓటమికే వెనుతిగుట, మనకు ఏమాత్రం సమంజసం?
అసలుసిసలు విజయానికి ఓటమెపుడు సగభాగం,
ఓటమంటె నిజానికి విజయానికి మరో పదం…


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home