ఓటమి పాఠం
కన్న కలలు కన్నీల్లై కాలంలో కలుస్తుంటే,
కనని కలలు కళ్ళముందు వరముగా కురుస్తుంటే...
కన్నీల్ల కొలను ఒడ్డున నే చింతిస్తూ కూర్చోనా..
వరాల వానలోన తడుస్తూ నవ్వుకుంటు నడిచేనా..
నువు అంతం అయ్యేదాకా అర్థమవ్వని నీ జీవితం,
నువు పంథం పడితే మాత్రం నీ మాటే వింటుందా..
సుఖదుఃఖపు వలయంలో చిక్కుకున్న నీ ప్రాణం,
దుఃఖం ఒడి చేరకుండ నీ నడక సాగనిస్తుందా..
వేడీ, వెన్నెల మధ్య గడువు కొద్ది గడియలే..
సుఖమూ, దుఃఖము మధ్య గడువు కూడ అంతేలే..
వెన్నెల కావాలంటే నువ్వు వేడి అనుభవించాలి..
విజయం అందాలంటే ఓటమి రుచినైనా ఆశ్వాదించాలి..
పరిస్తుతులె ప్రతిసారీ ఫలితాన్ని నిర్ణయించలేవు..
అలసట ఆశ్రయాన చేరకుండ కదిలి చూడు ఒకసారి..
మంచి నీటి కొలనైనా, కష్టాల మురికి కాలువైన...
సంకల్పం గొప్పదైతే ప్రతి కలువా వికసిస్తుంది..
కురిసే వర్షంలోనూ సూర్యుడి వేడి సాయముంటుంది..
పొందే ప్రతి విజయంలోనూ ఓటమి పాత్ర ఉంటుంది..
తప్పటడుగు నడకలేగ నీ పరుగు వెనుక పునాదులు..
నేటి ఓటములే అవ్వగలవు రేపటి విజయాలకి వారధులు..


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home