ఆకాశమా….. అంత నిర్మలమా
లక్షల
చుక్కలు దాడి చేసినా,
నల్లని
మొబ్బులు ముంచుకొచ్చినా,
ఎర్రగ
మండే సూర్యుడొచ్చినా,
చల్లగ
ఉండే చంద్రుడొచ్చినా,
ప్రాణం
తీసే ప్ర ళయమొచ్చినా,
కాంతివేగముతొ
గాలులొచ్చినా,
నీ
గుండెలు చీల్చే మెరుపులొచ్చినా,
మా
గుండెలు పేలే ఉరుములొచ్చినా,
చదరవు
సరికద కదలవు ఎందుకు,
కదిలిన
క్షణమున కలియుగాంతమనా…
వేసిన
అడుగును కదపవు ఎందుకు,
అడుగేసేందుకు
చోటు లేదనా…
మా
మనుషులు మంచిని గాలికొదిలినా,
ఆ
చెడుగాలులు నీ గూడు
చేరినా,
కోప్పడవెందుకు
రోదసిదలమా….
ఈ
మూర్కుల చూచి నవ్వు
వచ్చెనా…
అందమైన
నీ నీలిరంగునే,
అంచలంచలుగ
నలుపు చేసినా…
కోప్పడవెందుకు
మేఘద్వారమా…
మా
మనుషులపైనే జాలి కలిగెనా….
కనిపించని
చిరు కలుషుతాలతో,
నీ
ఓజోన్ పొరకే బిలములేసినా,
కోప్పడవెందుకె
తారాపథమా…
ఈ
నరలోకముపై ఎలమివేసెనా……
అవాంతరాలే
నిను కోరిచేరినా,
కోపమునెరుగని
అంతరిక్షమా…
ఈ
కలియుగమందు మంచిలేదురా…
కల్మషమై
అది మన చేయి
దాటెరా…
నీ
మనసున మంచిని పెంచుతు
ఉన్నా,
శత్రువులుండని
శాంతినిలయమా…
సరదాకైనా
చిరాకు పడవా….
పిసరంతైనా
చెడును చంపవా….

1 Comments:
Its simple awesome....................
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home