THIS IS FOR MY TEACHERS
ఎన్నెన్నో భయాలతో మొదలైనది ప్రయాణం,
ఏవేవో ఊహలతో సాగే మా ప్రయాణం...
మొదటినుంచి చివరిదాక ఎన్నెన్నో మార్పులు,
ఈ అందమైన జీవితాన ఏవేవో చేర్పులు...
ఎవరికెవరు ఎవరుగా నడక మొదలు పెట్టాము,
ఒకరికొకరు ఒకటిగా చెలిమి గూడు చేరాము...
విడిపోయే గడియలే కల్లముందు చేరగా,
వీడిపోకు నేస్తమా అని ప్రతి మనసు కోరగా,
సమయమేమొ పొమ్మంటే,
స్నేహమేమొ వద్దంటే,
వీడిపోను అడుగురాక,
వెల్లొస్తా అనలేక,
కనులు మూసుకున్నాము,
కన్నీరై పోయాము....
ఈ గూటిలోకి రాకముందు,
మా మనసంతా భయముంది..
ఆ భయము నేడు భాదైంది,
మా మదిని దాటి పోనంది...
నోట మాట కరువైంది,
కనుల నీరు వరమైంది..
మా అందరి చూపులు చిన్నబోవు క్షణాలివి,
మా అందరి అడుగులు నడవలేని గడియలివి...
ఈ మరపు రాని క్షణాలలో,
గడవలేని గడియలలో...
మా మనసులోని మౌనాలను మాటలుగా మార్చాలి,
మీ ముందుకు చేర్చాలి....
మీ పిల్లలుగా భావిస్తూ,
మా తప్పులు మన్నిస్తూ...
అడుగడుగున తోడొస్తూ,
దారి చూపి నడిపిస్తూ...
అలసటలో నవ్విస్తూ,
మితి మీరినపుడు దండిస్తూ...
సందేహాలను తీరుస్తూ,
సంశయాల తీర్పిస్తూ...
మా విజయాలను అందిస్తూ,
మీ విజయంగా భావిస్తూ...
మనసారా దీవిస్తూ,
మా మదిలోనే జీవిస్తూ...
మా జీవితాన పనికొచ్చే పాఠాలను బొదిస్తూ,
ప్రపంచాన్ని నిర్మించే నిర్మాతల నిర్మిస్తూ,
అత్యున్నత పదవిలోన ఆనందంగా పయనిస్తూ,
మా అందరి జీవితాలనందంగా తీర్చేస్తూ,
మా గుండెలోన నిలిచి ఉన్న గురుమూర్తుల అందరికి,
శిరసు వంచి వినయంతో,
మనసునిండ భక్తితో,
చివరి గడియ తలుపు తెరిచి,
ముందరున్న క్షణము తలచి,
విడిపోయే వేదికపై,
పలుకులైన మనసులతో,
చేస్తున్నం వందనం....
WE MISS U ALL SIR….

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home