Room అంటే ఇదేరా... Roommets అంటే మేమేరా..
తాండ్రపాడులో ఉండి ఉండి
boar కొట్టి, ఎలాగోలా ఇంట్లో వాల్లను కాకా పట్టి నేను, సురేష్ Room
search అనే పేరు తో కుర్నూల్ కి వచ్చాం. పేరుకు room search అయినా వెల్లింది
మాత్రం సినిమాకి. ముందు uncle ని కలిసి room అడిగాము. Bathroom లేదు
ఇంకా 2 or 3 months అవుతుంది అన్నాడు. అనుకుని, నేను సురేష్, జయదీప్, మౌర్య ఇన్
దెగ్గర ఒక room ఉంది అంటే వెల్లాము. బాగుంది . but చాలా దూరం . అందుకే బాగా
disappoint అయ్యి, uncle కి ok చెప్పి, Kurnool కి టాటా చెప్పి
allagadda bus ఎక్కాం. మరీ ఒక 2 days కి uncle room ok అన్నాడు. So
full happy మాకు room conform అని.
July-06-2009 morning
around 10’ o clock కి నేను, సురేష్ వచ్చాం room కి. పొంగిచ్చాలంటే పాలు లేవని try
చేయలేదు. ఇంకా ఎవరో శివతేజ అంట,mechanical అంట, సురేష్ కి బాగా తెలుసు అంట. నన్ను
pick up చేసుకోమని చెప్పి సురేష్ allagadda కి వెల్లిపోయాడు. ఓ పెద్ద hero ని
pickup చేసుకోవడానికి వెల్లినట్లు శివ ని pickup చేసుకోవడానికి నేను
rajvihar కి వెల్లాను. ఎంతో సేపు wait చేసాక మన వాడు ఓ కట్టెల ,ఓ college
bag వేసుకొని ఈఈఈ అని నవ్వుకుంటూ bus దిగాడు. చూసి shok . వామ్మో వీడా.. ఓ సారి
bus లో "పక్కన కూర్చుంటా,కాస్త జరుగుతారా plz" అంటే
vilan face పెట్టి కోపంగా ”seat కావాలంటే ముందే వచ్చి వేసుకోవాలి” అనింది వీడేకదా..
రేయ్ భరత్ గా… కాస్త జగ్రత్తగా ఉండు రోయ్... అని అనుకుని నేను కూడా ఈఈ అని నవ్వి
room కు పిలుచుకొచ్చా. సర్దుకుంటున్నప్పుడు మాట మద్యలో casual గా "మీ class లో
girls ఎంత మంది శివ" అన్నా...ఇంక అంతే…నాకు సినిమా చూపించాడు, చేతిలో ఉన్న
చెప్పుని పక్కకు విసిరేసి ,అప్పుడు పెట్టిన విలన్ face మల్లీ పెట్టి " చూడు
భరత్ నా ద్రుష్టిలో అమ్మాయిలకు zero marks అన్నాడు". వామ్మో వీడింకా మారలేదా
అనుకున్నా...అయినా ముదుర్లందరూ ముందు ఇలానే ఉంటారులే అని మనసులో అనుకుంటూ ok
sorry శివ అన్నా...
సురేష్ వచ్చిన
evening ఓ పెద్ద అవగాహనా సదస్సు పెట్టాం. బొంతలు పరచి చుట్టూ కూర్చున్నాం. ఇంక
మూడు కోతుల ముచ్చట్లు మొదలయ్యాయ్.
ఓ పంచవర్ష ప్రణాలిక పెట్టుకున్నాం...
Conditions:
1. ఏదేమైనా room మాత్రం neat గా
ఉంచుకోవాలి.
2. Friends not allowed.
3. Rent every month starting
ఇచ్చేయాలి.
4. Late night coming లు ఆపేయాలి.
5. వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకోవాలి.
ఇంక ప్రణాలిక సిద్దం. వీటి
ప్రకారం నడుచుకున్నాం ఓ నెల వరకు. తర్వాత శ్రీను వచ్చాడు. ముందు పరిచయం అయితే
ఉంది కానీ అంత కాదు. "అయినా ఎవరైతే ఏముందిలే adjust అవడానికి, పైగా మన ఊరు
వాడు..బాగుంటుందిలే అనుకున్నా...
1. రొజులెన్నొ గడిచాయి, మర్పులెన్నొ
తెచ్చాయి అని భరత్ గారు ఓ కవితలో అన్నట్లుగా.. రోజులు గడిచేకొద్దీ బద్దకం పెరింగింది.
Neatness తగ్గింది. So condition no:1 ని ప్రణాలికలోంచి తీసేశాం..
2. First రమణ , next జయదీప్,
next అనిల్ అలా just లు పెరిగిపోయారు, ఏమైనా మన friends కదా అని
condition no:2 ని ప్రణాలికలోంచి తీసేశాం...
3. Ha ha ha current bill ఇచ్చేకే
money ఉండటం లేదు. ఇంక rent కూడానా.. అందుకే మనసులో uncle కి sorry చెప్పుకుని
condition no:3 ని ప్రణాలికలోంచి తీసేశాం..
4. Room లో చేరాక
second show లు అలవాటు అవడానికి ఎక్కువ time పట్టలేదు. soo condition
no:4 ని ప్రణాలిక లోంచి తీశేసాం...
5. Condition no:5 ని బానే పాటించాం..but
condition no:1 లో ఉన్న బద్దకం వల్ల రాను రాను వంట చేయడానికి బరువైంది..అందుకే
condition no:5 ని కూడాతీశేసాం...
అందుకే… మా పంచవర్ష ప్రణాలిక
రెండు నెలలకే fut అనింది. అయినా ప్రభుత్వ ప్రణాలికలే పారడం లేదు,
మాదో లెక్కా....అనుకున్నాం...
But కనిపించని condition
no:6 ఒకటుంది. అది మాత్రం life long పాటిస్తాం. అది “ uncle & family పైన
ఉన్న గౌరవం” మాత్రం ఎప్పటికీ తగ్గించలేదు.
College లో survey batch
met ఇక్కడే room పక్కనే ఉన్నాడు. కలిసి cricket ఆడటం మొదలు పెట్టాం. వచ్చీ
రాని batting , వచ్చీ రాని bowling లతో start చేశాం. అప్పటికి మా
ద్రుస్టిలో శివతేజ ఒక brett lee, ఒక mech grath .. ఎందుకంటే
bowling వచ్చేది వాడొక్కడికే.. చందాలు వేసి bat కొన్నాం.కొన్న రోజే fut అనింది.
ఇంక cricket అపేశాం.
తర్వాత కొన్ని రోజులకి
శివ cell కొన్నాడు. అందులో mp3, vedio అన్నీ ఉన్నాయి. ఇంక అప్పటికి అది మాకు
ఓ mini laptop . శివ మాత్రం ఓ time table వేసి అందరికి time fix చేశాడు.
ఆ time లోనే వాడాలి. ఒక్క నిమిషం late అయినా ఉండనివ్వడు. బలే నవ్వొస్తుంది
తలుచుకుంటుంటే...ha ha ha…. ఎవరో హర్ష అంట, మా school అబ్బాయి అంట. మా
college లోనే civil వచ్చిందంట. ఎలాగోలా last కి ఈ ఇంద్రభవనంలోకే వచ్చేశాడు.
First కొంచెం బాదేసింది. Uncle feel అవుతాడేమో అని. కానీ ఈ అబ్బాయి బాగా తెలుసు,
మంచివాడేగా అని ok అన్నాం.
ఇంకా కొన్ని రోజులకి
anil కూడా మా room లోనే చేరిపోయాడు.
ఇప్పుడు మా roommates
completed ..
భరత్, సురేష్, శివ, శ్రీను,
హర్ష, అనిల్…
ఒక happy ఏంటంటే,,, మాలో ఎవరికీ
bad habbits లేవ్.. Friend bat ఇప్పించుకొని మల్లీ cricket start చేశాం.."
వామ్మో హర్ష వేస్తుంటే ball కనపడటం లేదు.. ఎలాగబ్బా కొట్టేది" అనుకునేంత
speed వేస్తున్నాడు. కొన్ని రోజులు నవ్వుకున్నాం ..”మేము ఆడలేములే” అని. తర్వాత
కసి పెరిగింది. బాగా try చేసి హర్షలో సగం అయినా నేర్చుకున్నాం. ఒకటి మాత్రం
నిజం. మా లో ఎవరికి bowling వచ్చినా అది హర్షని చూసి నేర్చుకున్నదే...నా
bowling coach మాత్రం హర్షనే...నేను కూడా challenging గా ఉండాలని నేర్చుకున్నా....
చూస్తుండగానే మా ఈ life లో ఒక చేదు అనుభవం ఎదురైంది. 1st oct 2009. గురువారం
కదా అని నేను, సురేష్ బాబా గుడికి వెల్లాం. తుంగభద్రలో full water. Almost గుడిలోకి
enter అయ్యాయి. గుడి నుంచి వచ్చేటపుడు హంద్రి bridge పైన నడుస్తూ అనుకున్నా
" గుడిలో లాగా ఇక్కడ కూడా చేయి పెడితే చేతికి అందేలాగా water వస్తే బాగుంటుంది”
అని. అలా అనుకోవడమే తప్పేమో..."చేయి పెట్టు, రా...వచ్చి తాకు ..తాకి చూడు"
అన్నట్లు గంగమ్మతల్లి మమ్మల్ని వదలలేదు. Sep 29th శ్రీను, oct 1st ఉదయం హర్ష
, allagadda కి వెల్లిపోయారు. Evening around 6.00 అయింది. నేను, జయదీప్ రేపు
exam Xerox కోసం రాజ్ విహార్ కి వెల్లాం. అనిల్ చేశాడు. "తొందరగా రా చాయ్"
అన్నాడు. Uncle pack up అన్నాడంట. ఇంక జయదీప్ వాల్ల room కి , నేను మా
room కి వెల్లిపోయాం. వచ్చి చూశా,, దూరం నుంచి water చూసి రావులే అనుకొని,
ఆకలిగా ఉంది ముందు తినాలి అని బయటకు వెల్లాం..దొరికింది తిని వచ్చాం. వచ్చి చూసేసరికి
oh my god ఇంకేముంది.. water room లోకి వచ్చేశాయ్..ఇంక అంతే tension, భయం, బాద… అన్నీ
వేశాయ్ మాకు. అన్నీ పోతున్నాయ్ , water చాలా fast గా పెరుగుతున్నాయ్. Fast గా చేతికి
దొరికిన వస్తువులన్నీ పైకి చేర్చాము. ఏం మునిగిపోయాయో తెలీదు. అప్పుడు జయదీప్ గాడు
చేసి "రేయ్ రేపు bmbc exam రా..note book ఉందా.. జగ్రత్త రా" అన్నాడు.
నవ్వాలో ఏడ్చాలో అర్థం కాలేదు. ఏదైతే అది అయిందని room lock చేసి పైకి
వెల్లాం. కింద uncle వి chemicals ఉంటే పైకి transfer చేశాం. అలా transfer చేస్తుంటే
మద్యలో ఓ ఎర్రగా ఉండే జెర్రి నా మెడ పైన ఉంది, సురేష్ చెప్తే చూసి విదిలించి వదిలించుకున్నా..
చూస్తుండగానే అంతా మునిగిపోయింది. మాకు అప్పటికి కూడా భయం విలువ తెలీలేదు. Uncle వాల్లు
పిలిచి అన్నం పెట్టారు. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. తర్వాత అందరం కలసి
మిద్దె ఎక్కాం. ఎవరితో cell లేదు , నాతో ఉంది extra battery also . call చేసి
కొందరు బాదపడుతున్నారు, కొందరు భయపెడుతున్నారు, మరికొందరు దైర్యం చెప్తున్నారు. అక్కడ
uncle వాల్ల గురించి నాకు తెలీదుగానీ ఇక్కడ నేను, అనిల్ మాత్రం చాలా దైర్యంగా ఉన్నాం.
వరదనీటిలో కొట్టుకొచ్చే కుర్చీలను, బల్లలను collect చేసుకుందాం అని కక్రుత్తితో
ఇద్దరు boys వచ్చారు. కాసేపటికి వాల్ల లారీ మునిగిపోయింది. ఒకరికి ఈత రాదు, మునిగిపోతున్నాడు,
వాల్లు safety కి కట్టుకున్న తాడు కూడా తెగిపోయింది. నేను, అనిల్
pillar ని గట్టిగా పట్టుకుని tension గా చూస్తున్నాం... వెల్దాం అంటే మాకు చాలా
దూరంలో ఉన్నాడు. Almost మునిగిపోతున్నప్పుడు వాల్ల friend దిగి కాపాడాడు.
అతని అరుపులు విని మొదలైంది మా భయం...మా కల్ల ముందే ఎన్నో పందులు, కుక్కలు,ఎలుకలు చనిపోయాయ్....బాద+భయం
రెండూ ఎక్కువయ్యాయ్... ఇంక నేను, అనిల్ కలసి అనుకున్నాం " మన ఇద్దరికి ఈత వచ్చు,
ఏమన్నా problem అయితే atleast ఇద్దర్ని అయినా కాపాడి చనిపోవాలి
అని".. దూకేటపుడు నా cell height గా ఉన్నఓ piller పైన పెట్టి దూకుదాం
అనుకున్నాం... " అదే మన parents కి Signal అని. ఇంకొంచెం safe అని
నిచ్చెన సాయంతో పక్కన ఉన్న 3 floors building కి transfer అయ్యాం. నేను
కవిత రాస్కుంటూ కూర్చున్నా…uncle బొరుగులు , biscuit లు ఇచ్చాడు. తినుకుంటూ నేను, అనిల్
మగదీర diloge లు చెప్పుకుంటూ happy గ నవ్వుకుంటూ ఉన్నాం. మాకు అక్కడా ఆనందం దక్కలేదు.
ఇద్దరు uncles ఎవరో వచ్చి
9 TMC inflow 7 TMC outflow… అదీ ఇదీ అని భయపెట్టాడు.. వెంటనే శివతేజ వాల్ల అమ్మ ఫోన్
చేసి ఏడ్చింది.ఇంకో ముసలాయన మాత్రం "ఇదంతా బ్రహ్మంగారు ముందే చెప్పారు" అన్నాడు...
ఇంకో ఆయన ఏకంగా A.P map లో కర్నూల్ ఉండదు అన్నాడు.. ఇవన్నీ చూసి, విని భయమేసి సురేష్,
శివ ఎక్కడున్నారో చూద్దాం అని కిందకెళ్ళాం...కనపడలేదు...చాలా సేపు చూస్తే steps కింద
full గా, happy గా నిద్రపోతున్నారు.. లేపి భయపెట్టడం ఎందుకులే అని వదిలేశాం.... నేను,
అనీల్ మాత్రం ready to take chance to do risk. నేను ఇంక ఒంటరిగా కూర్చుని నేను చనిపోతే
నా గురించి ఎంతమంది ఏడుస్తారో లెక్కపెట్టుకుంటున్నా...time 4.00 అయింది.. కింద చూస్తే
pole కి 3.5 feet దాకానే ఉన్నాయ్.. అనీల్ వెల్లి చూశాడు... ok safe అని అందరం దిగాం...
శివని నేను, సురేష్ ని అనీల్ పట్టుకున్నాం... మమ్మల్ని చూసి అందరూ వచ్చేశారు... బయటకు
వెళ్ళాం... మళ్ళీ uncle phone చేశాడని return వెళ్ళాం... అక్కడ ఎవరో ఒక ముసలి అవ్వ
నేను రాను , నేను పోతా అని అంటుంటే అలాగే పట్టుకుని లాక్కుని వచ్చా...మరీ ఎవరో ఒక అమ్మాయి
వచ్చి అన్నా మా అవ్వని పిలుచుకురాన్నా please… అని ఏడ్చింది ఎందుకో నాకు suddenగా మా
అబ్బ, జేజి గుర్తొచ్చారు..వెంటనే వెళ్ళి చూస్తే లోపల ఉంది... పిలుచుకొచ్చాను... ఆ అమ్మాయి
అడిగిన విదానం తలుచుకుంటే ఇప్పటికి కూడా ఏడుపొస్తుంది…..
మరీ మేము ఇంటికెళ్ళి 2 days తర్వాత వచ్చాం...వచ్చాక uncle 1000
money ఇచ్చాడు మాకు తీస్కోబుద్దికాలేదు... అందుకే వద్దన్నాం... ఇంకా govt 3500 ఇస్తే అదికూదా uncle కే ఇద్దాం అనుకున్నాం... పాపం అని.. but waste govt మాటలు మాత్రమే చెప్పారు...రమణ better T.shirt లు, pant లు ఇప్పించాడు.
వరదల తర్వాత మల్లీ కొత్త జీవితం మొదలు పెట్టాం... things may not be
easy ….మళ్ళీ అవడానికి చాలానే time పట్టింది.... ఈ వరదల పుణ్యమా అని అన్నీ నష్టాలే.. tiffen, curries అన్నీ rate లుపెంచేశారు...బయటకెల్లినా, లోపలికెల్లినా ఒకటే వరద వాసన.. వరదలు వచ్చి ఒకరోజు భయపెడితే , ఈ వరద వాసనవచ్చి ఓ నెల రోజులు బాదపెట్టింది... ఇవన్నీ మమ్మల్ని వదిలిపెట్టి వెల్లడానికికి, మేము వాటి జ్ఞాపకాలను వదిలివెల్లడానికి ఓ నెల కంటే ఎక్కువ పట్టలేదు... మల్లీ roteen life start అయింది...
తర్వాత ప్రతాప్ అని ఇంకో అబ్బాయ్ మా life లోకి వచ్చాడు. మా రూం పక్కనే వాల్ల రూం .. రోజులు గడిచే కొద్దీrelations పెరిగాయి.. అలోచనలో తేడా, నడవడికలో తేడా...అన్నింట్లో quality వచ్చేసింది...even మా cricket play లో కూడా quality వచ్చింది... ఇంక వేరే వాల్లతో match లు ఆడటం మొదలు పెట్టాం...
Jan-1-2011 match ఆడి గెలిచి bet money వాల్లకే return ఇచ్చిన సంగతి ఎప్పటికీ మర్చిపోలేము..jan 1రోజు match గెలిచిన ఆనందమే చాలు అనుకున్నాం.. medical college
ground మాకు ఓ international ground కన్నా ఎక్కువే... మొదట్లో కాల భైరవ అని ఓ half ticket మమ్మల్ని తిట్టేవాడు... వరదలు వచ్చి వెళ్ళాక ground పాడైపోయింది... ఇంక పట్టించుకోలేదు...dec 31 night
police లు ఎవర్నో వెంబడిస్తుంటే మమ్మల్నిఅనుకుని మేము చెల్లాచెదురుగా పరిగెత్తిన సంగతి ఎప్పటికీ మర్చిపోలేము... కోతి చేతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు ఊరువెల్తూ వెల్తూ uncle house
key మాకిచ్చి వెల్లారు... నేను రాజ్ విహార్ కి వెల్లి రూం కి వచ్చా... రూం అంతా ఒకటేమాడు వాసన... కింద అన్నం పెట్టి పైన టివి పెట్టారు ఘనులు..తెల్ల అన్నం నల్లగా మారి బొగ్గు అయిపోయింది... ఒకటారెండా.. మేము చేసిన తిక్క పనులను, కోతి చేష్టలను రాసుకుంటూ పోతే పేజీలు సరిపోవు.. పుస్తకాలు కావాలి...
Intrest ఉంటే మా అంత చలాకీ కుర్రాల్లు ఉండరు, intrest లేకుంటే మా అంత బద్దకస్తులు ఉండరు ...
" రికార్డు రాయాలన్నా మేమే... దాన్ని తిరగరాయాలన్నా మేమే."
"మాకు మేమే పోటీ, మాతో మాకే పోటీ .." ఈ సినిమా డైలాగులన్నీ మాకు కూడా సరిపోతాయ్...
Internship అని ఒక projectwork రావడంతో b.tech అయ్యాక విడిపోవాల్సిన మేము మద్యలోనే విడిపోవాల్సివచ్చింది... నేను, అనీల్, సురేష్ ముగ్గురం మూడు చోట్లకి వెళ్ళిపోయాం... ఇంక కల్లు మూసి తెరిచేలోగాinternship, project, lab,
farewell party లు అన్నీ అయిపోయాయ్.. total b.tech అయిపోయింది...
అయిపోయిన 4 నెలల్లోనే అందరూ ఓ దారిలో పడ్డారు... నేను, జయదీప్ NCC లో job, అనీల్, సురేష్, ప్రతాప్Bangalore లో job , శివ M.Tech, శ్రీను M.B.A, హర్ష final year అని అందరూ ఒక్కో దాంట్లో setఅయిపోయారు....ఇంక ఎప్పుడన్నా get to gether పెట్టుకుని కలవాలి, కలసి uncle దెగ్గరికెళ్ళి sorry,
thanks రెండు కలిపి చెప్పి రావాలి...
· మేము ఎన్ని తప్పులు చేసినా మంచి మనసుతో క్షమించిన uncle and uncle
family,
· మేము ఎంత ఘోరంగా చూసుకున్నా, మమ్మల్ని మాత్రం బాగా చూసుకున్న మా room,
· పండగలకి, వేడుకలకి ఆంటీ పంపించే వంటకాలు,
· పుట్టినరోజుకి భవ్య ఇచ్చే sweet లు,
· దీపావళికి uncle వచ్చి ఇచ్చే పటాకాయలు,
· నెలకోసారి మార్చే tiffin center లు,
· రోజుకోసారి చేసొచ్చే shoping లు,
· మాకు cricket నేర్పించిన medical
college ground,
· మాకు cricket చూపించిన spects shop తాత,
· నోరూరించే ప్రసన్నmess వంటకాలు,
· ఈరోజుల్లో కూడా 10/- కే సినిమా చూపించే మా mini I-MAX.
అన్నీ మధుర జ్ఞాపకాలే... ఎప్పుడన్నా అందరం కలసి వెళ్ళి రావాలి...
చివరగా....
ఎన్ని కష్టాలు పెట్టినా ఇన్ని సౌకర్యాలను అందించిన రూం కి, ఎన్ని నష్టాలు చేసినా పెద్ద మనసుతో క్షమించిన అంకుల్కి... దన్యవాదాలతో పాటు మరొక్కసారి క్షమించమని కోరుతూ....
భరత్, శ్రీను, అనీల్, సురేష్, శివ, హర్ష...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home