Saturday, September 1, 2012

జగ్రత్తరా రేయ్...


రేయ్ భరత్ గా... నేన్రా... నీ పరువు నిలబెట్టగలిగేవాన్ని...అదేరా... నీకుండే మంచి, చెడు అనే రెండు రూపాల్లో ఒకదాన్నైన నీ మంచిరూపాన్ని...ఏంటి..ఇప్పుడొచ్చాను అనుకుంటున్నావా...నా స్వార్థం కోసమే అనుకో.. నా విజయం కోసం నువు సహాయపడతావని నీ దెగ్గరికొచ్చాను... ఎందుకంటే నేను రోజూ అనుక్షణం నీలోని చెడు రూపంతో యుద్దం చేస్తుంటా కదా... ప్రస్తుతానికి నా విజయానికి అడ్డంకు లేదు.... కానీ భవిష్యత్తులో కూడా గెలవాలంటే నీ సాయం తప్పకుండా కావాలి...ఎందుకంటే you have entered in to the open market. నువు ప్రపంచంలో, డబ్బు వేటలో పడిపోయావ్.. చెడుతో చేరడానికి, చెడుగా మారడానికి, చెడువై పోవడానికి, మా చేయి దాటిపోవడానికి అవకాశాలు వచ్చేది ఇప్పటినుంచేరా.. జాగ్రత్తగా ఉండి నాకు సాయపడి నన్ను గెలిపించరా...
చెడు దాగి ఉన్నదంతా డబ్బులోనే...అలాగని డబ్బు చెడ్డది కాదు...కానీ మనిషిని చెడుగా మార్చగలిగే శక్తి ఉన్నవాటిలో ఇది ముఖ్యమైనది.. "ఎంత సంపాదించినా వెంటపెట్టుకుని పోతామా" అని “money is a good servant but a bad master” అని నీతో పాటు ఎన్నో లక్షల మంది చెప్తుంటారు.. కానీ దాన్ని అర్థం చేస్కొని, దాని ప్రకారం నడుచుకునే వాల్లు చాలా తక్కువ మంది ఉంటారు.. నువు కూడా తక్కువ మందిలో చేరిపోయి నన్ను గెలిపించరా.. చేరిపోరా... చెడిపోకురా...
నీలో ఉండే చెడు రూపానికి స్వార్థం ఎక్కువ...
నీలో ఉండే మంచి రూపానికి(నాకు) సాయపడే గుణం ఎక్కువ....
రెండూ డబ్బుతోనే ముడి పడి, ముచ్చటిస్తూ, నీకు ముచ్చమటలు  పట్టించడానికి సిద్దంగా ఉన్నాయ్...అందుకే నువు నాకు సాయపడు...నువు నన్ను గెలిపించు, సమాజంలో నిన్ను ఓ మంచి వ్యక్తిగా నేను నిలబెడతా...
అందుకే....
v  నీది కాని సొమ్ముపైన ఆశపడకు...ఆశపడితే అక్కడే నీ పతనం మొదలౌతుందని గుర్తుపెట్టుకో ....
v  డబ్బే జీవితం అని కలలో కూడా ఎప్పుడూ అనుకోకు...ప్రేమే జీవితం అని నమ్ముకో...బాగుపడతావ్...
v  ప్రపంచంలో ఉన్న అన్ని బండ బూతులన్నీ కలిపి గంటసేపు ఆపకుండా తిట్టినా ఒకటే, "నువ్వు డబ్బు మనిషివి" అని మూడు పదాలతో మాట అన్నా ఒకటే ...అన్ని తిట్లూ మూడు పదాల్లోనే వచ్చేస్తాయ్... విషయం గుర్తుపెట్టుకో.."వాడు డబ్బు మనిషి" అని ఎవరితోనైనా నువు అనిపించుకుంటే ఆరోజే నువు నీ జీవితంలో ఓడిపోయినట్లు లెక్క.. ఓడిపోకురా...ఓడిపోయి ఒంటరివవకురా...
v  బాద్యత అనే పేరుతో బంట్రోతులా నీకు చాకిరీ చేస్తూ తన పూర్తి జీవితాన్ని నీకోసమే దారబోస్తూ నీ మీద ఇష్టంతో అన్ని కష్టాలను భరించి ఇప్పుడు నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి తను మాత్రం నీ వెనకే నిలుచుంది... నీ భవిష్యత్తునే తన భవిష్యత్తు అనుకుని తన గతాన్నంతా దారబోసి నీ ప్రేమ మీద ఆశతో ఉంది...ఎంత గొప్పవాడిపైనా , ఎంత ఎత్తుకెదిగినా అమ్మను మాత్రం మర్చిపోకురా తనకెట్టి పరిస్తితుల్లో అన్యాయం చేయకురా.. దైవం దారి చూపిస్తుంది అన్న మాత నిజమై ఉండచ్చు.. కానీ దారంతా అండగా ఉండేధి అమ్మేరా... నీ ప్రాణం పోయినా... నువ్వే తన ప్రాణం అనుకుంటున్న మీ అమ్మను నిర్లక్ష్యం చేయకు..
v  నీ ఇంటి మహాలక్ష్మి మీ అక్క, ఇప్పుడు ఇంటికి ఆడపడచులా మారిపోయిన మీ అక్క……ఎలాంటి మంచి లక్షణాలు ఉన్న బావ కావాలనుకున్నావో అంతకన్నా మంచివాడైన నీ బావ........ వీల్లని ఎట్టి పరిస్తుతుల్లో నిర్లక్ష్యం చేయకు...అసలు మీ అక్క తమ్ముల మద్య చెత్త డబ్బు ఎప్పుడూ అడ్డం రానీకుండా చూస్కో ... ఇంకో విషయం గుర్తుపెట్టుకో... నువు నీ ఇంటి ఆడపడుచుని ఎంత బాగా చూస్కుంటావో అంతకు రెట్టింపు అదృష్టం  నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది... 
v  వీల్లిద్దరే కాదు... నీ వాల్లని, నిన్ను నమ్ముకున్న వాల్లని, నీకు సాయం చేసిన వాల్లని, నీ కుటుంబానికి సేవ చేసిన వాల్లని, ఎవర్నైనా సరే "డబ్బు" అనే విషయంలో మాత్రం దూరం చేస్కోకు...అలా దూరం చేస్కుంటే నువు కాస్త డబ్బు సంపాదించచ్చు. కానీ అంత విలువైన సంబందాన్ని ఎప్పటికీ సంపాదించలేవ్...
ధన సంపాదనలో ధుఖం,
ధన రక్షణలో ధుఖం,
ధనం కర్చు పెట్టాలంటే ధుఖం....
అని చదువుకున్నది గుర్తుపెత్తుకుంటే సరిపోదు... దాన్ని పాటిస్తేనే నువు నిజంగా నీ జీవితంలో గెలిచినట్లు...
ధనం అంటేనే ధుఖం అని తెలిసినా అందరి పాట్లు దానికోసమే...నువ్వు మాత్రం ధనవ్యసనానికి లోను కాకురా.. ధనం సంపాదించు ..కానీ దాన్ని వ్యసనంలా మార్చుకోకు...అది అలవాతైతే మాటతీరు మార్పు, నడకతీరు మార్పు, బతుకు తీరు మార్పు, ఒల్లంతా గర్వం, మనసంతా కుల్లు... అంతే తప్ప వేరే ఉపయోగం లేదు...
ఇలాంటివి ఎన్ని చెప్పినా అన్నీ ఒకే సంగతి లాగానే ఉంటాయ్... ఎందుకంటే అంతా డబ్బు గురించే కాబట్టి...
చివరగా ఒక మాట...
డబ్బుంటే అహంకారం ఎవడికైనా వస్తుంది.... కానీ....
డబ్బున్నా అనుకువగా ఉండటం వచ్చిన వాడే విజేత...
నువ్వు విజేతవై నాకు విజయాన్ని అందించరా...
ఇట్లు...నేను విన్నవించిందంతా నీవు వినే ఉంటావని, ఇవన్నీ పాటిస్తావని, నన్ను గెలిపిస్తావని నిన్ను నమ్ముతూ.... ఇవన్నీ పాటిస్తే నిన్ను నేను గెలిపించి, సమాజంలో గొప్పగా నిలబెడతానని మాట ఇస్తూ....
నీలోని మంచి రూపం...


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home