Thursday, September 6, 2012

మానవుని అనుమానం – స్వప్నం అంతరంగం


మానవుడు:
కల్లముందు నిజమల్లే కదిలే ఓ స్వప్నమా….
కల్లుతెరుచు సమయమందు జారిపోవు స్వప్నమా….
రేయి రేయికో రూపం, రూపు రూపుకో రంగు….
ప్రతి రంగుకు హంగు చేర్చి, ఆ హంగులనే జతగ కూర్చి,
నిదురించే రెప్ప వెనుక నాటకాన్ని నడిపేవు……
ఒకసారి అలరిస్తావు, మరుసారి అల్లరి చేస్తావు…
ఒకసారి బాధిస్తావు, మరుసారి భయపడేలా చేస్తావు…
అసత్యాన్ని సత్యంగా, అపద్దాన్ని నిజముగా,
ఈ ఇలన జరుగు కథను మార్చి,
మా నయనాలను ఏమార్చి,
నాలోకం వేరంటూ, నే మీలోకం కాదంటూ..
ఓ అపద్దాల ప్రపంచాన అందంగా నడిచేవు…
నిజము వైపు రావెందుకు …ఈ నిజమంటే భయమా….
వెలుగులోన పడవెందుకు ఈ వెలుగంటే హడలా….

స్వప్నం:
నువ్వే నను స్రుస్టించి , నీ కనుల చాటు దాచుంచి,
మళ్ళీ నను నిందించే ఓ వింత మనసు మానవా….

నీ ఊహకు నే ప్రతిరూపం,
నీ అలోచనకు నే ఆకారం….
పేరుకు నే కలనైనా నీ మనసుకు నే బానిసను…
రూపుకు నే కల్పననైనా, నే నువు చేసిన బొమ్మను…

నిదుర లేయు వెంటనే గాలించకు నా జాడను..
నీ కనుల వెనుక కదిలినా నే నీ మనసుకు నీడను….

నీ అలోచనలకు ఊహా రూపం స్వప్నమనే నా లోకం…
నీ ఆచరణలకు నిజరూపం సత్యమనే మీ లోకం…

నిజమంటే భయమెందుకు, నే ఆ నిజములోని బాగాన్నే…
వెలుగంటే హడలెందుకు, ఆ వెలుగుకు నే నీడనే…

నే అలరించిన అందాలను నిజము చేసి చూపు…
నా అల్లరిలో ఆనందం నీ మదినంతా నినుపు…
నే బాదించిన విషయాలను విశములుగా తలుచు,
నే భీతించిన ప్రదేశాన నువు జాగురతగ నడుచు….

నీ అలోచనలో పొంది ఉన్న అందాలను గుర్తించి,
ఆ అందాలకు హంగు చేర్చి నీ కంటికి చూపించి,
ఆచరణ వైపు నీ ద్రుష్టిని వెనువెంటనె మల్లించి,
నీ చరణాలకు చేరువగా నీ కోరికనే రప్పించి,
నీ ఆశలనే ఆశయంగ మార్చేదే నా భాష,
ఓ సత్యమైన స్వప్నంగా మిగలాలని నా ఆశ….

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home