ప్రేమ త్యాగం
నా మనసును అద్దంలా చూపించగలుగు నీవు,
నీ మమతను రెట్టింపు చేసి ఇవ్వగలుగు నేను….
నన్ను ఒదిలి ఒక్క క్షణం ఉండలేని నీవు,
నిన్ను మరిచి ఓ గడియ కూడ గడపలేని నేను…
నా హ్రుదయాన్నే కోవెలగా భావించే నీవు,
ఆ కోవెలలో నిన్ను ఉంచి పూజించే నేను….
నా మదిన మెదులు కథలో ప్రతి పుటలోనూ నీవు,
నీ నగుమోముకు ఏకార్థం నీ మనసులోన నేను….
నా మదిలోనే నీవున్నా,
నీ మనసంతా నేనైనా….
మనము కలవలేము, ఇక కలసి నడవలేము…
మన మనువు జరగబోదు, మన మనసు అతకలేదు….
మన అలోచనలొకటైనా, ఆశయాలు వేరే …
మన మనసులు ఒకతైనా, బతుకు తీరు వేరే….
ఆశయాలు వీడినా… మన బతుకు తీరు మార్చినా…
మన కన్నవాల్ల నిర్ణయాన్ని కాదనడం అసాద్యమే…
ఓ అథిదిలాగ వచ్చిపోవు ఆదరణే తప్ప,
అందమైన హరివిల్లుకె ఆ గగనమందు చోటు లేదు…
నీ చెంతనె నిశ్చింతగ ఉండెదనని హరివిల్లు అడుగుతున్నా,
జాలిగుణం మరిచిన ఆ గగనమొప్పుకోదు,
కాల్ల వేల్ల పడినా ఆ హరివిల్లు నుండనీదు…
గగనమంటి మన ఇల్లు, హరివిల్లు లాంటి మన ప్రేమ,
అథిదిగ నువు వచ్చినపుడు నిన్ను చూసి నవ్వినా….
కలసి ఉన్న కాసేపు కబుర్లెన్నొ చెప్పినా…
పెల్లి మాటకొస్తే మన ప్రేమ శత్రువేగా,
నువ్వెంత దగ్గరున్న, అందనంత దూరమేగా….
కల్లముందు కనిపించిన ఓ కొలను మాయమైతే,
అది అందం గా కనిపించిన ఓ ఎండమావి అయితే,
దాహంతో దరిచేరిన ఆ గొంతు మూగబోదా,
ఆశతోన ఆశ్రయించు ఆ మనసు విరిగిపోదా….
మనము కన్న కలలన్నీ కల్లలుగా మిగిలితే,
మనువు అన్న మాట మనకు ఊహే అయిపోతే,
అనుక్షణము నిన్ను ద్యానించిన నా హృదయమాగిపోదా…
దంపతులుగ మారాలను మన ఆశ నేలవాలి పోదా….
ప్రేమ అనే మన బంధం అందమైనదేగా…
జీవితాన ఒకరికొకరు తోడు నడవలేకున్నా,
ఓ జ్ఞాపకాల పుస్తకంగ ఈ జీవితాన్ని మలచనీ….
మనసంతా నీ ప్రేమే జన్మంతా తోడుగా,
ఏ క్షణమూ నను వీడని నీ జ్ఞాపకాల నీడలో,
మన ప్రేమ మాట తప్ప, ఏ పెల్లి ఊసు లేకుండా,
నీ ద్యానం తప్ప, ఏ పక్క ద్యాస లేకుండా,
ఈ జీవితాన మన ప్రేమ శాశ్వతంగ మిగలనీ…
విడిపోయే ప్రేమికులకు ఓ శాశనంగ మారనీ…

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home