Saturday, December 29, 2012

ఊసరవిల్లి



ముట్టుకుంటే మాడిపోయేంత వేడిగా ఉండేదీ నేనే,
హిమాలయ హిమమంత చల్లగా ఉండేదీ నేనే....
విశ్వమంత విశాలమూ నేనే,
నగర వీధులంత ఇరుకూ నేనే...
కడలి మధ్యమాన కనిపించేంత ప్రశాంతతనీ నేనే,
అదే కడలి అంచున అలల వంటి అలజడినీ నేనే....
శత్రువుల్ని సైతం జయించేంత ప్రేమగా ఉండేదీ నేనే,
స్నేహితుల్ని కూడా త్యజించేంత కోపం గా ఉండేదీ నేనే....
సొంతవాల్లే అనిపించే నమ్మకమూ నేనే,
అదే సొంతవాల్లను శంకించే అనుమానమూ నేనే....
లోకాన్నే జయించినంత ఆనందమూ నేనే,
వెల్లిన ప్రతిచోటా ఓడినంత బాధనీ నేనే...
ఎముకల సంకెల్లలో బంధీనీ నేనే,
ఇలలో మూలకైనా వెల్లేంత స్వేచ్చనీ నేనే...
నలువైపులా నలుపునే నిలుపు చీకటినీ నేనే,
రంగులెన్నో రంగరించు వెలుగునూ నేనే.....
నెలవంకనే మరిపించే అందమూ నేనే,
అమావాస్యనే తలపించే అందవికారమూ నేనే....
మేఘం వదిలిన  చినుకంత చంచలంగా ఉండేదీ నేనే,
చినుకుల వలన పెరిగిన చెట్టంత నిశ్చలంగా ఉండేదీ నేనే...
శతకోటి కలుషుతాల కల్మషమూ నేనే,
మలినమనేదే లేని నిర్మలమూ నేనే.....
నాపేరే మనసు,
నేనందరికీ తెలుసు....
బయటకనిపించే ఊసరవిల్లిని చూసి ఆశ్చర్యపోయే జనం మీరు...
అతిపెద్ద ఊసరవెల్లి నీలో ఉన్న నేనే అని తెలుసుకోరు....

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home