ప్రతిదానికి అవది ఉంది
జననమనే ఓ వెలుగున మొదలై,
మరణమనే ఓ నిశిలో కలిసే...
నీ జీవితమే ఓ పథము సోదరా,
పయణించే ఓ రథము సోదరా...
సారథివై నువు దారి చూపినా,
తన అవదిని దాటి వెల్లబోదురా...
నీకనువుగ ఓ మార్పు కోరినా,
ఏతీరుగైన అది మారబోదురా...
నువు జనియించిన ఆ మొదటి రోజునే,
నీ చివరి రోజు రాసుంటుంది...
నడక నేర్చి నువు నడిచిన క్షణము,
నీ చరణాలకు అది దరి అవుతుంది...
మార్చాలని ప్రయత్నించినా మారనిదే మన మరణమన్నది,
చెరపాలని ప్రతిణ పూనినా, చరగనిదే తలరాత అన్నది...
ఆనందంగా నింగిన ఎగిరే,
అందమైన ఆ పథంగమైనా..
ఆధారం దాటి వెల్లలేదులే,
ఆ దారం తెగితే ఎగరలేదులే...
అటు ఇటు ఊగే ఊయలలోన,
తన అణువణువూ స్వేచ్చే ఉన్నా..
తన అవదిని దాటి ఊగలేదులే,
తన స్కంబమునొదలి వెల్లబోదులే....
చిన్న చిన్న సరదా కోసం,
నీలోన ఉన్న సత్తా కోసం,
శక్తికి మించిన సాహసాలను,
ఫలితం లేని ప్రయత్నాలను,
చెయ్యబోకురా ఓ వెర్రి మానవా...
పతనమవకు రా ఓ పిచ్చి మానవా...
ఆది ఉన్న ప్రతిఒక పనికి,
అవది కూడ ఉండుంటుంది..
ఆ అవది దాటి నడిచిన క్షణము,
అంతమొచ్చి మన చెంతుంటుంది...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home