Sunday, October 21, 2012

నువ్వూ ఒంటరి వాడివే



నడి కడలిన కదులుతు ఉన్న, అందమైన నావపైన,
తనను నమ్మి పయణిస్తున్న ప్రయాణికులు ఎందరు ఉన్నా...
కడలి అంచు చేరేసరికి పడవ తోడు తానేలే,
తీరానికి చేరిన మనిషి అడుగు కూడ తోడు రాడులే...
మనుషులనే నమ్మి పాపం, సాయపడిన పిచ్చినావ...
అలలు అనే ఊయలపైన ఒంటరిదై చింతిస్తున్నా..
అలలు కూడ తోడు రావులే,
తనను తరిమేయక ఊరుకోవులే....


కాలమనే కడలిన వడిగా పయణించే పిచ్చి మానవా...
నావ తీరులాగే ఉన్న, నీ అందమైన జీవితమందు...
ఎవరితోడు ఎన్నాల్లున్నా, చివరితోడు నువ్వేరా...
నీ చెంపపైన కన్నీల్లున్నా నీ చంతచేర ఎవరు రారురా...
తీరమందు చేరినాక తిరిగిరారు ఎవ్వరైనా,
వెలుగులేని దారిలోన నీ తోడురాదు నీ నీడైనా...

ప్రతినిత్యం పరుగులు తీసే ప్రవాహమే, ప్రపంచమన్నది...
ప్రత్యేకత లేని మనిషికి పలకరింపు ఉండబోదులే...
కనికరమే లెక్కపెట్టక కదిలేదే కాలమన్నది,
వెనుకబడిన వారికోసం క్షణము కూడ ఆగబోదులే...

బంధాలకు బంధీవై నువు మధ్యలలో నిలిచిపోకురా..
గుర్తింపే వచ్చినరోజు అందరు నీ చెంతవాలురా..
ఆరోజును నువు చేరుతీరుగా,
నేటినుంచె పయనించుసోదరా...
తీరమెంత దూరానున్నా ఎప్పటికీ నువు అలసిపోకురా,
పయనమెంత కంగారైనా భయంతోన నువు ఆగిపోకురా...

ఒంటరిగా వచ్చిన నువ్వు,
ఒంటరిగా పోయే లోపే....
ఒక్కడిగా పోరాడు సోదరా,
అనుకున్నది సాధించు సోదరా...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home