ప్రకృతిలో నీతులు
చెయ్యాలని మనసున్నా ఓ పనికిరాని కడలినని,
రైతన్నలు తన నీటిని ఏ సాగుకు వాడరని,
తన నీటికి ఆవిరనే కన్నీటిని జతకలిపి,
మేఘముకే అప్పగించి చినుకులుగా మలచదా...
మనసుంటే మార్గముందని చెప్పకనే చెప్పదా...
ఆ సంద్రానికి సహాయంగ మేమున్నామని జతకలిసి,
ఉపనదుల మొదలు, జీవనదులు తనలోనే కలవవా...
మంచిపనికి ఆదరణలు కరువు కాదని తేల్చవా....
తనను తాను కాల్చుకుని, కొవ్వొత్తిని వెలిగించి,
త్యాగానికి తార్కానము ఆ అగ్గిపుల్ల కాగా,
ఆ అమరమైన స్నేహితుని జ్ఞాపకాలతోన
నిలువెల్ల కరిగిపోయి, తను కూడా కాలిపోయి,
ప్రేమకు పరమార్థంగా కొవ్వొత్తి మిగలలేదా...
సువాసనలు వెదజల్లి, ప్రశాంతతగ ప్రభవించే
ఆ అందమైన కుసుమాలు మూన్నాళ్ళే బతికినా,
బతికిఉన్న కాసేపు ప్రతిమదినీ మురిపించదా....
తన సువాసనలు ఆగెనని, తను నిలువెల్లా వాడెనని,
తనకుతానె రాలిపోయి నేలపైన వాలదా...
ఇక సెలవని స్వతహాగా మట్టిలోనె కలవదా...
బతికిఉన్న క్షణమైనా మంచిగానె బతకమని,
చెడు దారిన చేరు నాడు బతికికూడ వ్యర్థమని,
మారని మన మనుషులకే మౌనంగా చెప్పదా...
ఉరుములు ఎదురై బెదిరిస్తున్నా,
మెరుపులు నిలువున చీల్చేస్తున్నా,
సూర్యుడి వేడికి అతిదెగ్గర ఉన్నా,
రోజు రోజుకూ తనతలబారం పెరుగుతు ఉన్నా...
తను విరిగిన ఆ క్షణమున ఏ మనిషీ బతకడని,
తనను నమ్ముకున్న వాల్లకై తను నరకం చూస్తుంది,
ఈ మానవాలి భవితనే ముఖ్యమని తలచింది....
నిను నమ్ముకున్న వాల్లను నువు నడిరోడ్డున వదలకని,
స్వార్థాలకు బానిసవై ఓ ద్రోహిగా నువు మిగలకని,
ఆ అందమైన ఆకాశం చెప్పకనే చెప్పదా...
పాలలోన నీల్లు కలసి అవి పాలవలె మారినా
కనుచూపుకు పాలలాగ అందరికి కనిపించినా
రాజహంస దరికి
చేరి వేరు వేరు చేయదా
ఆ పాలనీటి మిశ్రమాన పాలనొకటె తాగదా...
మంచి చెడులు కలిసి ఉన్న సమాజాన బతుకుతున్న
ప్రతి మనిషీ మంచితోనె తన అడుగులు వేయాలని,
తన చుట్టూ చెడు ఉన్నా మంచిగానె బతకాలని
తన జీవితాన్ని ఉదాహరణగ చూపిస్తూ చెప్పదా...
కంటిచూపు లేకున్నా, నీతి అనే బాటలోన నిలకడగా పయనిస్తూ,
నోట మాట రాకున్న, నీతిలోనె బతకండని ఇవి వినయంగా చెప్తుంటే,
పాటించను బరువైనా కల్లు తెరిచి చూడరా...
మంచితనం కరువైనా మనసు పెట్టి కానరా...
మనసుంటే పాటంచి, మంచిదారి పట్టరా...
పదిమందిని నడిపించి, మనిషిగ నువు నడవరా....

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home