Thursday, March 28, 2013

నా జీవనశైలి



అనుకున్నది సాధించాలనే ఆశతో,
అది సాధించేందుకు సరిపడేంత శక్తితో,
వేకువజామున మేల్కుంది మొదలు....

అలసిన తనువుతో, సొలసిన మనసుతో,
రేపనే రోజుపైన ఆశతో,
అలసటంతా తీరిపోయేంత దీర్ఘశ్వాసతో,
వ్యాపించిన చీకటి ఒడిలో పవలించేంతవరకు....

వ్యాయామం పేరుతో నా శరీరానికి,
ఆహారం పేరుతో నా ఆకలికి,
బాధ్యత పేరుతో నా కుటుంబానికి,
కర్తవ్యం పేరుతో నా ఉద్యోగానికి,
నచ్చిన చేస్టల రూపంలో నాదైన తత్వానికి,
మంచిపనులరూపంలో మనవత్వానికి,
కవిత్వాల రూపంలో నలోని కలకి,
ప్రయత్నాల రూపంలో నేను కనే కలలకి,
పరిస్కారాల రూపంలో పరిస్థుతులకి,
పలకరింపుల రూపంలో ప్రతి స్నేహితుడికి,
అనుకువ రూపంలో నా అహంకారానికి,
వినయం రూపంలో నా ప్రవర్తనకి,
తృప్తినిస్తూ, తృప్తి పరుస్తూ...
ఆదర్శవంతుల అడుగుజాడన నడుస్తూ,
తోడడిగినవారిని మంచిదారిన నడిపిస్తూ..
సాద్యమైనంత నేర్చుకుంటూ, కుదిరినంత నేర్పిస్తూ...
వీలైనంత నవ్వుతూ, తోటివారిని నవ్విస్తూ...
ఆశకి దెగ్గరగా, దురాశకి దూరంగా,
ఆచరణలకి ఆత్మీయుడిలా, ఆడంబరాలకి కానివాడిలా...
వాతావరణం మొదలు మనుషుల మనసు వరకు,
మనిషి అడుగుల మొదలు, ఆలోచనా తీరు వరకు,
మొత్తం కలుషుతమే అయినా.....
మిగిలి ఉన్న ప్రకృతి పచ్చదనాన్ని,
చిన్నారి చెక్కిలిపైన చిరునవ్వుని చూసి....
ప్రపంచంలో ఇంకా అందం, ఆనందం మిగిలే ఉన్నాయని,
నమ్ముతూ ప్రయాణించే........
                                                            మీ తోటి ప్రయాణికుడు
                                                                       
                                                                        చిన్న

1 Comments:

At April 12, 2013 at 8:02 PM , Blogger Ram said...

chala chala bagundi ra mukyanga padala amarika ante sentence chivarlo oke prasa chala bagundi ra enka chivarlo amma gurinchi rasiunte bagundedi ra i mean amma thana biddala pi cgupinche prema like that chinna..........(JUST I FEEL.....NA


 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home