Remake of “నిలువద్దము నిను ఎపుడైనా” song
నా అడుగులు ఓసారైనా,
గతమంచుల గది చేరేనా...
మది మాటున మౌనాలన్నీ పిలవగా ఆ ఆ...
తియతీయగ ఓ క్షణమైనా,
ఆ రోజులు తిరిగొచ్చేనా...
కనుజారిన కన్నీల్లన్నీ చెదరగా ఆ ఆ ...
ఆ గాలుల ఆ చల్లదనం, మరుసారి నను తాకేలా ఆ ,
ఆ నవ్వుల పరిమలమంతా ఆ , నా మనసుని కదిలించేలా ఆ...
ఇదిగిదిగో గతమెదుటే నడిచొస్తుంటే ఏ....
"ల ల లైల లైలాల్లే.." " నా అడుగులు"
ప్రతి ఉదయం, నాకనులు రెండు,
తనకోసమెతికేవి ఈ చిన్ని లోకాన ఏ వైపు ఉందో అని...
ఆ మరుక్షణమే నా పెదవులొకటై,
నవ్వుల్ని చిందేవి నా చెల్లి రూపాన్ని నా ముందరే చూడగా....
ఆ రూపమే నాగుండెలో నిలుచుంది ఈరోజు వరకు,
నా అడుగులో ఓ నీడగా, నా తోడు నడిచేందుకు...
"ల ల లైల లైలాల్లే.." " నా అడుగులు"
ప్రతి కలలో, నా కనుల వెనుక,
అనురాగమొలికేది ఈ చిన్ని అన్నయ్య ఆనందమే పెంచగా....
ఆ మరుదినమే, నాకనులముందు...
ప్రత్యక్షమయ్యేది ఆ తీపి స్వప్నాన్ని సత్యాలుగా మార్చగా....
సంద్రాలలో సందిగ్ధమై దాగున్న ముత్యాల తళుకు...
తన అదరాలపై పదాలుగా చేరేను నా చెంతకు...
"ల ల లైల లైలాల్లే.." " నా అడుగులు"
ఏంట్రా అన్నా, ఇటురా అన్నా...
తన భాష ఏదైనా, పద యాస వేరైనా, యద ఘోష ఒకటే కదా...
తడబాటైనా, యదలోటైనా...
నా చిన్నారి చెక్కిల్ల చిగురించు చిరునవ్వు ఈ అన్న వల్లే కదా...
తనదారినో రహదారిలా మార్చేందుకే ఈ చిన్ని యత్నం...
ఆ రహదారిలో మారాణిలా పయనానికే స్వాగతం...
"ల ల లైల లైలాల్లే.." " నా అడుగులు"

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home