నా తొలి గ్రంధాలయం
అమ్మ
ఒడిన కూర్చునే, తొలి అక్షరాలు రాశాను..
నాన్న
వేలు పట్టుకునే, తొలి అడుగులు వేశాను...
నాకు
ఏడైనా నిండందే, నాన్న నూరేళ్ళూ నిండాయి...
తండ్రి
ప్రేమైనా తెలియందే, నేను తనకు దూరమయ్యాను...
ఆనాడు
మొదలు నాకంటూ, మా అబ్బే తండ్రయ్యాడు..
నా
అలోచన తీరుకు, తానెపుడూ తోడున్నాడు...
అమ్మ
కష్టంతో ఎదిగినా, అబ్బని చూస్తూనే పెరిగాను...
తన
ఆదర్శపు భావాలను, గమనిస్తూనే నడిచాను..
మాట
కొంత కఠువైనా, తన మనసెప్పటికీ మంచిదే..
తన
ముక్కుసూటి మాట వెనుక, మర్మమేమి ఉండదు...
ప్రయోజనం
ఆశించని, పరుల మనిషి తాను..
పదవులేవి
లేకున్నా, పరోపకారి తాను..
నా
వరకైతే మీరెపుడూ, ఓ గ్రంధాలయ సమానం..
మన
ప్రతి సంభాషణ, నే చేసిన ఓ పుస్తక పఠణం..
"సమన్యాయం"
శీర్షికతో మీరు నేర్పిన పాఠాలు,
దశాబ్దాలు
గడిచినా, అవి నా వ్యక్తిత్వపు పునాదులు...
అవ్వా
తాతా అన్నా, అబ్బా జేజీ అన్నా...
ఆ
పిలుపులోని మాధుర్యం, ఏ వరుసలోన ఉండదు..
ప్రతి
పిల్లవాడి బాల్యానికి చిరునామా మీరు..
మా భవిష్యత్తు విజయాలకి బాటలు వేస్తారు...
మా
జీవిత పోరాటం ముగియందే,
మీ
వయసు పెరిగిపోతుంది...
మాకు
విజయమైన రాకముందే,
దేవుడి
పిలుపు మీకు అందుతుంది...
వేల
విజయాలు మమ్ము చేరినా,
మాకు
మీరు లేని లోటు తీరదు...
మేము
ఎన్ని కష్టాలను దాటినా,
మీ
చంతలేని అసంతృప్తి తగ్గదు...
వేల
జ్ఞాపకాలను ఇచ్చారు,
వేగంగా
జ్ఞాపకమైపోయారు..
మీ మనవడనే
నా పేరున, మీ ఉనికి ఎప్పటికీ పదిలమే...
మీరు భౌతికంగ
దూరమైనా, మీ భావాలు నన్ను వీడవులే…

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home