ఎదవ సందేహం
మనిషి:::
నీ ఉనికిని నిలిపే పునాది లేదు,
ఈ భూమిని కలిపే వారది లేదు..
చక్కు చెదరక నిలుచున్నావు,
చుక్కలపైనే నిలబడినావు…..
ఏ పునాదిలేని తారాదలమే,
నీ పునాదులనుకొని తలఊపేనా….
నిలకడనెరుగని వాయురూపమే,
మీ వారది అనుకొని వెనుతిరిగేనా….
నీ ఆంతర్యం చెప్పవె అంతరిక్షమా,
ఓ ఆదారం చూపవె తారాపథమా….
ఆకాశం:::
అర్థం లేని ఆలోచనలతొ,
అణ్వేశించకు ఓ మానవాథమా….
పునాదులేసే భూమికిసైతం పునాదిలేదు….
నిలకడగా నువు నడిచే చోటుఎ నిలకడ లేదు…..
నీ కల్లముందరే కదలాడే ఆ సూర్యుడికే ఏ చలనం లేదు….
నీ కంటికి మాత్రం మార్పులు చూపే ఆ చంద్రుడి రూపం మారుటలేదు….
రంగురంగులుగ కనపడు నేను రంగులనసలే మార్చుటలేదు….
రాత్రి మాత్రమే కనిపించేటి తారాదలమే పగటిపూటలో దాగుటలేదు….
నీ తిక్క ప్రశ్నకి సమాదానమే ఈ “సృష్టి” నాయనా…
నువు అలోచించే ఈ గోలంతా ఓ “సుత్తి” నాయనా….

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home