Saturday, August 3, 2013

ఈ తరం మగువ తీరు


పేరుకు నే మగువనని, బయటిపనికి తగను అని,
ఇంటి పట్టు ఉండమనే చిన్నచూపు దేనికో....
చూపుకు నే వనితనని, పెద్దపనులు వద్దు అని,
దూరంగా వెల్లమనే అల్పదృష్టి దేనికో...

శతాబ్దాల కాలంగా అతివ అడగలేదనో,
దశాబ్దాల కాలంగా పడతి ప్రశ్న లేదనో...
నిన్నవరకు జరిగింది, నేటి మొదలు జరగదిది..
గతంలోన సాగింది, ఈరోజు మొదలు సాగదిది....

సాధనతో వచ్చేదే విజయమని వాధిస్తే,
మగ అయిన, మగువైనా   సాధనేమొ ఒకటేగా...
ప్రయత్నానికోచ్చేదే ఫలితమని అంటే,
పురుషుడైన పడతైనా ప్రయత్నమేమొ ఒకటేగా...

పల్లము వైపుంటే ప్రవాహానికి తనకేంటి,
తూర్పైనా పడమరైన, ఏదిక్కుకైన దా సోహమే...
ప్రయత్నాన కసి ఉంటే విజయానికి తనకేంటి,
ఆడైనా మగ అయినా ఎవరికైన బానిసే....

గతంలోని మగువకున్న అనుకువంత మసిచేసి,
తరంలోని మగువలకది శక్తిగానె మలిచేసి...
వస్తున్నా కాలమా విజయమనే వేటకి...
మగువకున్న తెగువ చూసి నీ చేతనైతె ఆపుకో....
అడుగేస్తున్న సమయమా నీ యుద్దమున్న చోటుకి..

కొండంతటి శక్తితో నీకెదురొస్తున్నా కాచుకో....

1 Comments:

At February 28, 2018 at 12:22 AM , Anonymous Anonymous said...

Awesome poetry !! :)

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home