Wednesday, October 2, 2013

LOVE LETTER

If I want to write a love letter, than definitely this is the one 
వేచి ఉంది నా మనసు,
నీ చెంతకు చేరు కొరకు...
తరగబోదు నా మదివయసు,
నీ యదతో అది కలిసేవరకు...

మొదలు అయిన ప్రతినది పయనం,
ఆగబోదు తన ప్రియసంద్రం చేరేవరకు...
నిను వెతుకుతున్న నా ఈ నయనం,
అలసిపోదు నీ చిరు మోమును చూసేవరకు...

ఆకాశం చెంతన సూర్యుడిలాగా,
కుసుమంలో సుమగంధం లాగా,
మేఘం యదలో చినుకులలాగా,
చిన్నిపాపలో చిరునవ్వులలాగా,
ఇంద్రధనుసులో రంగులలాగా,
జాబిలమ్మలో వెన్నెల లాగా,
నువ్వూ నేను కలిసుండాలి...
నీ నవ్వే నా వరమవ్వాలి...

నువ్వూ నేను ఒకటని తలచి,
నీ నవ్వులలోనే నా బతుకని తెలిసి...
నా ఊహలలో నీ తలపును కలిసి,
నీ మదికనువుగ నా మనసును మలచి....

నే పదములు కలిపిన కవితను తెచ్చి,
నా కరములతో నీ చిరుచేతులకిచ్చి,
నీ స్వరములతో సిరిసంగీతం చేర్చి,
నీ పెదవులు కలుపగ పాటగ మార్చి,
                
కవనం నేను, గానం నీవని,
పుట్టుక నేను, ప్రాణం నీవని,
గమనం నేను, గమ్యం నీవని,
బహుమతి నేను, అనుమతి నీవని,
అనుక్షణమూ నీ గుర్తుండేలా,
నీ మదిలో నే బతికుండేలా....

ఆనందంలో నీ ఆప్తుడు నేనై,
బాధల్లో నీ బంధువు నేనై,
నీ ప్రతిపనిలో సాయం నేనై,
సుఖదుఃఖాల్లో నీ స్నేహం నేనై,
తొలి వేకువజామున నీ తోడుని నేనై,
మలి వెన్నెల వేలన నీ జంటని నేనై,
ఇష్టంగా నీ ఇహలోకం నేనై,
స్పష్టంగా నీ సగభాగం నేనై,
నీ భవిష్యత్తుకే బాటను నేనై,
నీ అలసట తీరే చోటును నేనై,
నీ తోడుంటానని మటని ఇస్తూ,
నీ నీడవుతానని నమ్మకమిస్తూ...

నిన్నటిదాకా నా మనసున మౌనం,
ఒంటరి వేలల నే పాడిన గానం...
నా మౌనాన్నంతా మటగ మార్చి,
నా గాత్రాన్నంతా గాధగ మార్చి...
నా ప్రేమని నీ ముందుంచాను,
నీ అనురాగానికి ఎదురవ్వడానికి..
నా మదినే నీకందించాను,
నీ యదలో విహరించడానికి...

స్వాగతించవా ఓనా చెలియా...
హృదయమనే నీ కోవెలలోకి,
కలకాలం నే కావలినౌతా,
కరుణిస్తే నీ తోడై వస్తా...
ఇట్లు,
నీ అంతరంగాన్నే అన్వీక్షిస్తూ,
నీ అనందాలను అణ్వేశిస్తూ,
నీ అలోచనలను అభిమానిస్తూ,
నీ అభిమతాలనే అలంకరిస్తూ,
నీ అనుమతినే ఆహ్వానిస్తూ,
నీ ఆప్యాయతనే అభిలాషిస్తూ,
నీ ఆహ్లాదాన్నే అశ్వాదిస్తూ,
నీ అంగీకారాన్నే ఆశిస్తూ,
నీ అనురాగాన్ని ఆశ్రయించిన అరుదైన అమాయకుడు...

చిన్న

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home