Sunday, December 13, 2015

గోమాత అంతరాత్మ




ఋగ్వేదపు కాలమది, ఋషులు సంచరించినది,
అనంతమైన జ్ఞాననిధి, అణువణువున నిండినది...
ఊహలకే అందనిది, వారి సరళ  జీవ నది,
దివ్యమైన ధ్యానమది, దిక్కులనే శాసించునది...

ఆ సత్యయుగము నుంచి నన్ను దైవంగా తలిచారు,
గోవు అన్న నా పేరును, గోమాతగ మార్చారు...
కనిపించిన ప్రతిచోటా పవిత్రతతొ కొలిచారు,
అడగలేని ప్రతిసారీ నా ఆకలి తీర్చారు...

క్షణము మొదలు మా ధ్యేయం మానవసేవగ మారి,
మా అణువణువూ ప్రతిదినమూ మానవ క్షేమం కోరి,
మా చేతనైన సహాయాన్ని చేసుకుంటు వచ్చాము...
మీరు చేతులెత్తి మొక్కుతుంటె మనసారా మెచ్చాము...

గోవు పాలు శ్రేష్ఠమని, ఆవునెయ్యి స్వఛ్ఛమని,
గోమూత్రం మంచిదని, అది ఆయువునే పెంచునని,
ఆవుపేడ శుభము అని, అది గాలిని శుద్దపరచునని,
గోవే ఒక దైవమని, గోవధ నే మహా పాపమని...
ఋగ్వేదపు ఋషులు చేరి మా విలువని పెంచారు,
మాటరాని మా జాతిపైన గౌరవాన్ని ఉంచారు...

సత్యయుగము ముగిసింది, త్రేతాయుగం గడిచింది,
ద్వాపరయుగం మొదలైంది, మా విలువ కాస్త పెరిగింది...
భగవంతుని పాలనలో మా జాతి ప్రజ్వలించింది,
గోపాలుడి నీడలో మా ఖ్యాతి చరితకెక్కింది.....

శ్రీకృష్ణ శకం ముగిసింది, మా స్వర్ణయుగము గతమైంది,
ఈ కలియుగమే మొదలైంది,  కరుణనేది కరువైంది..
మా జాతి వలన ఈ యుగాన ఉపయోగమేమొ పెరిగింది,
ఊహించని రీతిలోన గౌరవమే తగ్గింది..

మతము అనే కొత్త కొలత, ఈ యుగాన మొదలైంది,
అది జనులచేరి, వారి నడుమ దూరాన్నే పెంచింది...
మానవత్వమను గుణము,  ఈ మనుషులనే విడిచింది,
పశుహింసే ప్రకృతిలో భాగంగా మారింది...

ఒక మతము దైవమని, భక్తితోన కొలిచింది,
మరో మతము మాంసమని, శుస్తిగ భక్షించింది..
ఇంకో మతము మాకేంటని, మౌనంగా చూస్తుంది,
మా పశుజాతే మతము మధ్య ముక్కలు అవుతుంది..

నా ఎరువులు మీ పంటలకి, మీ కడుపు నింపు వంటలకి,
గోమూత్రం మీ ఆయువుకి, మీ వ్యాది మాపు మందులకి,
మా బిడ్దలు మిము మోయుటకి, మీరు కూర్చుంటే లాగుటకి,
నా చర్మం మీ చెప్పులకి, మీరు వాడుకునే సంచులకి,

పాలు,పెరుగు,వెన్న లనీ, అనుదినమూ మీ ఆకలికి,
ఆవునెయ్యి స్వఛ్ఛమనీ, అదనంగా మీ రుచులకి,
ప్రాణమున్న పర్వమంత, ప్రతిదినము సేవ చేశాము..
ఆ ప్రాణంపోయిన రోజూ, మా చర్మన్నే ఇచ్చాము,

అడవిలోని కౄరచరుల బారిన పడతామని,
మీ అందమైన సమాజాన ఆనందం ఉందని,
మానవ సేవను మించిన మంచి పనే లేదని,
మనుషుల నీడన మాకు రక్షణ ఉంటుందని,
మీ మధ్యన బతకలాని ఆశతోనె వచ్చాము...
మీరెన్ని సార్లు కొట్టినా, మా తలలను వంచాము...

మీరు  దిన దినమూ మారుతూ, మా గోవుల వేటాడుతూ,
మా కల్లనీల్లు చూస్తున్నా, కనికరమే వీడుతూ,
మా గోవులనే చంపుతూ, మీ మానవతను చంపారు,
పశుహింసను పోశిస్తూ, ఈ యుగానికే మచ్చ తెచ్చారు..

కొందరేమొ పండుగలకి గోవును పూజిస్తుంటే,
మరి కొందరేమో గోవధనే, ఓ పండుగని భక్షిస్తుంటే,
ఋగ్వేదపు ఋషులారా, మా గతిని కాస్త చూడండి,
వీలైతే తిరిగి వచ్చి జ్ఞాన బోధ చేయండి,
గోమాత అనే గౌరవంతో గుడులేవీ వద్దండి,
గోవధనే ఆపమని, పశుహింసే పాపమని సెలవిస్తే చాలండి..

నను పూజించుట మరచినా, నా ప్రాణాలు తీయకండని,
శివుడి వాహన్నానైనా, నే శిరసు వంచి అడిగేనా...
గౌరవించడమే మానినా ,మము భక్షించ తలచకండని,
కామధేను నేనైనా, చిరు కోరికనే కోరనా...

                                                                                                           

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home