దూరమైన మన స్నేహం తిరిగి చేరువైన వేల.... చిన్ననాటి స్నేహం ఉన్న ప్రతివారికి ఓ తీయ్యని జ్ఞాపిక...
అనగనగా ఓ సాయంకాలం,
అనుకువగా చిరుగాలుల సాయం...
అన్యోన్యంగా ప్రతి తారల బంధం,
అదనంగా ఆ చంద్రుడి అందం...
ఆహ్లాదంగా చిరుచినుకుల చైత్రం,
అనుకూలంగా ఆ పక్షుల గాత్రం..
అందమైన ఈ సిరిసాయంత్రం,
అలలవంటి నా కన్నీటికి సాక్షం...
అరుదు అయిన ఈ సాయంసమయం,
అలసటగా నా మనసున బారం...
అంచెలుగా నిను చేరిన వైనం,
అల్లరిగా నీ చెలిమిలొ ఐఖ్యం...
అఖిలముగా నీ తలపుల లాస్యం,
అలవోకగ నను తాకెను హాస్యం...
చెరోలోకమై పయనించే మనము,
స్నేహమనే ఒక గూటిన చేరి,
నవ్వులతో ప్రతిరోజును మలచి,
కష్టాల్లోనూ కలిసే నడిచి,
చిన్ననాటి ఆ చిలిపితనాన్ని,
ఆ చిలిపితనంలో చిరుతప్పులను,
ఆనందిస్తూ, ఆశ్వాదిస్తూ...
స్నేహం ఒడిలో అల్లరి చేస్తూ...
అనుదినమూ పయనించిన మనము,
అనుకోకుండా విడిపోయాము...
కనుచూపుమేర కనిపించనంతగా ఎడబాటే మనకెదురయ్యింది,
కల్లనీల్లు కనుజారుతీరుగా యదకోతే నా వరమయ్యింది...
రూపురేఖ మొదలుకుని నీ గుణగణాలవరకు,
అణువణువూ జ్ఞాపకమే మన అందమైన స్నేహాన...
నా పేరు పిలుపు మొదలుకుని నీ మాటతీరు వరకు,
క్షణక్షణమూ మధురమే మన ఆహ్లాదమైన చెలిమిలోన..
చందమామనే తలపించేలా అందమైన నీ మోమూ గురుతే,
నెమలినడకలే తలవంచేలా అనుకువైన నీ నడకా
గురుతే...
కోకిలసైతం గమనించేలా ఆహ్లాదమైన నీ పలుకూ
గురుతే,
భగవంతుడు కూడా పులకించేలా అతి స్వచ్చమైన
నీ భక్తీ గురుతే,
పురాణాలనే తలపుకు తెచ్చే, చిన్నవాల్లపై
నీ భాద్యత గురుతే...
వెన్నెలంటి నీ మనసు,
వేకువంటి చిరునవ్వు...
హిమమువంటి నీ గుణము,
హేమంతమంటి నీ చెలిమి...
అందమైన నీ గతులు,
ఆదర్షమైన గుణగణాలు,
ఆహ్లాదమైన మన స్నేహమందు,
అణువణువూ ఓ జ్ఞాపకమే...
నీ పరిచయాన ప్రతిదినమూ,
పూటకొక్క పరిమలము...
నువు చెంతనున్న ప్రతిక్షణము,
నను చేరుకున్న ఓ వరము...
నీ ఊహ చాలు నాలోన,
చిరునవ్వుతోన సిరివాన...
నీ తలపు చాలు మదిలోన,
మధు పరిమలాలు విరిసేనా...
గతంలోని మనగతులన్నీ, గమనిస్తూ గడిపేస్తున్నా,
నేటిరోజు నువు నాతోలేవని ఒంటరిగా చింతిస్తున్నా....
బదులివ్వలేని నా పిచ్చిమనసుకే ఎదురువెల్లి
నించుంటున్నా,
చిన్ననాటి నా నేస్తమేదని ప్రతిరోజూ నే
నిలదీస్తున్నా...
నువులేవని తెలిసే నా యదలో ఈ నిట్టూర్పు,
అది తీర్చగ నినుకోరెను ఓ కమ్మనైన ఓదార్పు...
అస్తమించిన ఆ సూర్యుడిసైతం,
మరు ఉదయాన్నే ఉదయించేను...
ఇక దూరమైన మన ఈ స్నేహం,
ఏనాడైనా మరి ఉదయించేనా...
స్నేహాస్తమయం అనుకుంటున్నా,
ఉదయించే ఆ ఉదయాన్నే నే కలగంటున్నా...
రోజులెన్నొ గడిచినా, మార్పులెన్నొ తెచ్చినా,
అపురూపమైన నీ స్నేహం ఎన్నటికీ మరువనిది...
మన వయసు ఎంత పెరిగినా, మన రూపురేఖ మారినా,
చిన్ననాటి నీ రూపం, నా కనులలోన చెదరనిది...
నాలోని నమ్మకం నిజమైనరోజున,
మదిలోని ఆశలే నను చేరు గడియన...
కలలుగన్న మన స్నేహోదయమే,
నా కనులముందు కనిపించుతీరుగా...
నీ పిలుపు సర్వమై వినిపించింది,
ఇన్నాల్ల కలతనే తుడిచేసింది...
మనసు పడిన ఆ దిగులు సర్వమూ,
నా ఆనంద కడలిలో కడతేరు తీరుగా...
నీ పలకరింపు నను చేరింది,
కన్నీల్ల నవ్వునే తెప్పించింది...
చిన్ననాటి చిరుకారణాలకై,
దూరమైన మన ఈ స్నేహం...
ప్రతి జ్ఞాపకాలను తలపుకు తెస్తూ,
మల్లీ నేడే చిగురించింది,
సర్వం తానై అలరించింది...
దూరమైన మన స్నేహం చేరువైన వేల ఇది,
పండుగగా జరుపుకునే నా మనసున మేల ఇది...
చెలిమిలోని మనని ఈ కాలం విడదీసినా,
ఇలా నేడు కలిపింది...
స్నేహమనే తోటలోన మన నడక మొదట ఆగినా,
మరీ నేడు మొదలైంది...
అందమైన మన నడక ఎందాకా సాగునో...
అపురూపమైన మన బంధం ఏతీరం చేర్చునో...???

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home