ఈ ప్రేమ సఫలం అయ్యేదెలా..
నన్ను చేరాలను ఆశే నీది,
నిన్ను కలవాలను కోరిక నాది,
రైలు పట్టాల స్నేహం మనది,
దారి పొడుగునా కలదది అవధి...
ముందరున్న కాలం మనది,
మనం కలిసుండబోవు వేదిక కలది...
దూరమున్న కొండలు నునుపు,
అని మోసపోయి మన కన్నులు తెలుపు...
నా వెంటుండాలను తాపత్ర్యం నీది,
నీ తోడుండాలను తాత్పర్యం నాది...
ఆ నింగి నేలల మనసులు మనవి,
ఎదురెదురైనా ఈనాటికి కూడా కలవలేనివి...
అనుక్షణము నా ముందుండాలను తీరే నీది,
ఏక్షణమూ నిను వీడిపోననే తత్వం నాది...
ఆ సూర్యచంద్రుల బంధం మనది,
జగానికే రారాజులు అయినా, ఓరోజైనా కలిసుండలేనివి...
ఏదేమైనా నీ తోడవ్వాలను ప్రయత్నం నాది,
దారేదైనా నా తోడొస్తానను ప్రేమే నీది...
ఆ నీడా నిశిల తలరాతలు మనవి,
రెండిటి రంగులు ఒకటే అయినా, ఏనాటికి కూడా ఒకటవ్వలేనివి...
అందమైన ఆ ఇంద్రధనస్సులో,
కలసిఉన్న ఆ రంగులు మనము..
మన కలయిక ఎంతో స్వచ్చము అయినా,
మన బంధం ఎంతో నిశ్చలమే అయినా...
మన గగన గృహానికి మన కలయిక నచ్చదు,
తన గడపలోపల ఓ దినమైనా ఉండనివ్వదు..
అప్పుడప్పుడు అనుమతికోసం గగనాన్ని చేరడం,
అనుమతిలేక మరునిమిషాన్నే కనుమరుగు అవ్వడం....
శతసంద్రాలను మించిన ప్రేమా ఈ గగనం చెంతే,
శతాబ్దాలుగా తరగని కోపం ఈ గగనం చెంతే...
ఇంధ్రధనస్సు అతిపవిత్రమైనా గగనం కంటికి అపవిత్రమే..
మన ఇద్దరి ప్రేమ అతిస్వచ్చం అయినా మన కుటుంబాలకు నచ్చనిదేలే..

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home