Friday, March 20, 2015

నీలాకాశంలో జాబిల్లివా... Song


పల్లవి:
నీలాకాశంలో జాబిల్లివా...
ఆనడిసంద్రంలో ముత్యానివా...
కాశీక్షేత్రంలో సింధూరమా...
ఆభూగర్భంలో బంగారమా....

అలకలతో అలరించే ఓ అందమా...     
అలసటలో అందించే ఆనందమా...
నాకలలను పాలించే ఓ ప్రణయమా...
నా కలతను లాలించే నా ప్రాణమా...

ప్రేమించానమ్మా.... చిరునవ్వుల చిలకమ్మా...
ఆశించానమ్మా... నీ ఆధరణనీ...
అలోచించమ్మా... సిరివెన్నెల మొలకమ్మా...
ఆహ్వానించమ్మా... ఈ అభిమానినీ....

చరణం1:
ముందుగా... నా ఏరోజులో... లేనేలేదు ఈ భావన...
ఇంతలో.. ఇపుడే..మాయనో నేనేలేను నా చెంతన...
ప్రియతమా... నువ్వే నన్నే...ఇంత మార్చింది నీ మనసులా....
ఓ ప్రియా నీతోన నడిచేన నీ ప్రతి అడుగులో...
                             నీ తోడొచ్చే  ఓ నీడలా...

కలిసుంటానమ్మా... కాలం సాక్షిగా...
కదిలొస్తానమ్మా... నీ కష్టం తీర్చగా...
కలిసుంటానమ్మా... ఈ కాలం సాక్షిగా...
కదిలొస్తానమ్మా.... Humming….

వెన్నెల వెలుగులలోన... నీకోసమై....
వేచిన హృదయం నాది... ఓ ప్రియా... 
కన్నుల కోవెలలోన... దేవిలా...
వెలిసిన రూపం నీది ఓ చెలీ...

నీలాకాశంలో జాబిల్లివా...
ఆనడిసంద్రంలో ముత్యానివా...
కాశీక్షేత్రంలో సింధూరమా...
ఆభూగర్భంలో బంగారమా....

చరణం 2:
అందమా...నువు మారాణిలా నాతోరావ ప్రతిజన్మకీ...
ప్రాణమా... నీ ప్రతి ఆశనీ నే తీర్చేను నీరాజునై...
ప్రణయమా... నిన్నే నేనింక వలచింది నా మనసున...
ఓ చెలీ నన్నే చేరైవా నా ప్రతిక్షణములో...
నీ ఆహ్వానం అందించువా....

తోడొస్తానమ్మా...విశ్వం సాక్షిగా...
తోడొస్తానమ్మా... నీ సర్వం నేనుగా...
తోడొస్తానమ్మా... ఈ విశ్వం సాక్షిగా...
తోడౌతానమ్మా... Humming…

ఆశలలోగిలిలోన... నీకోసమై...
మురిసిన మనసే నాది ఓ ప్రియా...
ఊహల ఊయలలోన... ఓ చలీ...
సాగిన వరుసే నాది.... నీకై...

పల్లవి: 
వేకువజాముల్లో నీతోడునై...
వెన్నెల వేలల్లో నీ జంటనై...
నిశిలోనూ తోడొచ్చే నీ నీడనై...
నీకోసం జీవించే నీ వాడనై...

నీ నవ్వులలో నివసించే నీ నేస్తమై...
నీ బాధలలో నడిచొచ్చే నీ బంధమై...
నీ పెదవులనే పలికించే ఓ కవనమై...
నీ స్వరములలో విహరించే ఓ గానమై...

తోడొస్తానమ్మా... నీ ప్రతి అడుగులో....
కొలువౌతానమ్మా... నీ మనసులో...

తోడొస్తానమ్మా... నీ ప్రతి అడుగులో....
కొలువౌతానమ్మా... నీ మనసులో...

నీ అనుమతికోసం వేచే నీ వాడను...
ఏ అలజడులే ఎదురైనా నిను వీడను...

నీ అనుమతికోసం వేచే నీ వాడను...
ఏ అలజడులే ఎదురైనా నిను వీడను...


పల్లవి:
నీలాకాశంలో జాబిల్లివా...
ఆనడిసంద్రంలో ముత్యానివా...
కాశీక్షేత్రంలో సింధూరమా...
ఆభూగర్భంలో బంగారమా....

అలకలతో అలరించే ఓ అందమా...
అలసటలో అందించే ఆనందమా...
నాకలలను పాలించే ఓ ప్రణయమా...
నా కలతను లాలించే నా ప్రాణమా...

ప్రేమించానమ్మా.... చిరునవ్వుల చిలకమ్మా...
ఆశించానమ్మా... నీ ఆధరణనీ...
అలోచించమ్మా... సిరివెన్నెల మొలకమ్మా...
ఆహ్వానించమ్మా... ఈ అభిమానినీ....

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home