Wednesday, January 1, 2014

My 10th Class Life.......... This is really a base for my life

My 10th Class Life  
This is really a base for my life

“అమ్మ...” తెలుగులో ఉన్న ఎన్నో లక్షల పదాలలో అన్నిటికన్నా అందమైన పిలుపుప్రేమపదం అమ్మ..అటువంటి అందమైన పిలుపుని నాతో పలికించింది, నేర్పించింది మా అమ్మే అయినా పిలుపుని అలవాటు చేసిమరిచిపోకుండా చేసింది మాత్రం మా స్కూల్ శ్రీ భారతీ విధ్యా మందిరం..
Mummy, Mom అని “అమ్మ”ని, Madam, Mam అని అధ్యాపకురాలుని పిలిచే నేటితరంలో కూడా... అమ్మని "అమ్మ" అనే పిలవాలని, అధ్యాపకురాలిని "మాతాజీ" అనే పిలవాలని చెప్పి, పలికించి, నేర్పించిన మా స్కూల్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం...
“Campus లో తెలుగు మాట్లాడితే 10/- Fine” అని Rule పెట్టుకున్న ఎన్నో School లని చూశాను... "మా కొడుకు/కూతురు ఇంగ్లీష్ లో తప్ప, తెలుగులో అస్స…లు మాట్లాడడు/దు..." అని గర్వంగా చెప్పుకునే ఎంతో మంది కన్నతల్లులని కూడా చూశాను. "తెలుగులో “అమ్మ” అని పిలవడం చిన్నతనంగా అనిపిస్తే , ముందు ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు సిగ్గుపడండి..." అని తెలుగు అభిమానులు గొంతు చించుకుని అరుస్తూ చెప్తున్నా.. తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నందుకు గర్వపడే కన్నతల్లులను, తెలుగు మాట్లాడద్దనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లని చూస్తున్నాను.
ఏదేమైనా ఒకటిమాత్రం నిజం... ఆంగ్ల భాష మన అవసరం కావాలే కానీ, మాతృభాష మనకు భారం కాకూడదు... ఒకే మాటలో చెప్పాలంటే మాతృభాషని మర్చిపోవడం అంటే, జన్మనిచ్చిన కన్నతల్లిని మర్చిపోయింట్లే లెక్క..
"నా మాతృభాష తెలుగు…అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉందిఅటువంటి నా గర్వాన్నినాలో భాషపైన గౌరవాన్ని… పెంచినిలిపి తెలుగుభాషలో ఉన్న తీపిని, కమ్మదనాన్ని నాకు పరిచయం చేసి నన్ను ఓ తెలుగు అక్షరాభిమానిలా మార్చి, నేను రాసిన ఎన్నో కవితలకి కారణం అయిన మా స్కూల్ "శ్రీ భారతీ విధ్యామందిరం" అంటే నాకు చెప్పలేనంత ఇష్టం…
ఎన్నో కొత్త అలవాట్లుసరికొత్త నాగరికతలు పుట్టుకొస్తున్నామా స్కూల్ లో ఉన్న కొన్ని నిబంధనలు  గుర్తొస్తే మాత్రం "ఇంకా మన సస్కృతి బతికే ఉందిఅనిపిస్తుంది.
v Male Teachers అందరూ మన సంస్కృతికి చిహ్నమైన తెల్ల పంచకట్టులోనే రావాలి…
v Female Teachers అందరూ మన భరతమాత, సరస్వతీమాతల వేషధారన అయిన తెల్ల చీరలోనే రావాలి…
v Classes Start అయ్యేముందు సరస్వతీ మంత్రం, భోజనం చేసేముందు భోజనమంత్రం, సాయంత్రం ఇంటికి వెల్లేముందు శాంతి మంత్రం తప్పనిసరిగా చెప్పాలి.
v పలకరించాలన్నానమస్కరం చెప్పాలన్నా రెండు చేతులు జోడించి స్వచ్చంగా నమస్కారం చెప్పాలి.
v అమ్మాయి అయినా, అబ్బాయి అయినా…  నుదిటిపైన బొట్టు లేకుంటే Class కి Not Allowed.
v Male Teacher లని ఆచార్యుడు అనే అర్థమొచ్చేలా "ఆచాజీఅనే పిలవాలి.
v Female Teacher లని తల్లితో సమానం అనేలా "మాతాజీఅనే పిలవాలి..
ఇలా ఒకటిరెండుమూడు అని ఎంచుకుంటూ, రాసుకుంటూ పోతుంటే ఇంకా చాలా నిబంధనలు గుర్తొస్తున్నాయ్.. నిజంగా ఇవన్నీ మేము పాటించామంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, Same Time చాలా గర్వంగా కూడా ఉంది
      ఈరోజు Date 27-12-2013 . నేను తెల్ల చొక్కాకాఖీ ప్యాంట్ వేస్కున్న  భారతీ విధ్యామందిర్ స్టూడెంట్ లా బయటకొచ్చి ఈరోజుకు సరిగ్గా ఏడు సంవత్సరాలా ఏడు నెలలు అయిందిఅయినా ఇప్పటికి కూడా ఇంటినుంచి స్కూల్ దాకా నేను వేసిన ప్రతీ అడుగూ జ్ఞాపకమే.. 6th నుంచి 10th  వరకు మా స్కూల్ లో నేను చేసిన ప్రయాణం అంతా జ్ఞాపకమే... ఐదు సంవత్సరాలు అచ్చమైన తెలుగు సంస్కృతి ఒల్లో చదువుసంస్కారం నేర్చుకున్న నేను... రాబోయేఇంకా నేను బతికి ఉండగలిగే ఐదు దశాబ్దాల వరకు  సంస్కారాన్ని వీడను.
B.Tech First Year లో నేను College కి రోజూ బొట్టు పెట్టుకుని వెల్తుంటే అబ్బాయిలుఅమ్మాయిలు నవ్వేవాల్లు.. ఎంత నవ్వినాఎన్ని రోజులు గడిచినా నేను అలాగే బొట్టుపెట్టుకుని వెళ్తుండేసరికి "బొట్టు పెట్టుకునే అబ్బాయి" అని నన్ను గుర్తు పట్టడానికి  గుర్తులా పెట్టుకున్నారు. First Year Over, Second Year Over…. Third Year లో చాలామంది అమ్మాయిలు Direct గా అడిగారు.. "ఎందుకు భరత్.. నువ్ రోజూ బొట్టు పెట్టుకుంటావ్" అని.."చిన్నప్పటినుంచి మా స్కూల్ నేర్పించిన అలవాటు ఇది" అని నేను గర్వంగా చెప్పేవాన్ని... హా హా హా మొత్తానికి ఒకటి మాత్రం చాలా బాగా అనిపించేది... ఎప్పుడన్నా నేను బొట్టు లేకుండా College కి వెల్తే "నీ Face బొట్టు లేకుండా ఏం బాలేదురా" అని అందరూ అనేవాల్లు... హా హా
Any way… ఈరోజు Date 27-12-2013... Time Night 8.45 PM. ఎన్నోరోజులనుంచి  Article రాయటానికి చేస్తున్నా కానీ అస్సలు కుదరట్లేదు.. రేపు 28-12-2013… తెల్లవారితే అమ్ములు Birthday.. Wish చేయడానికి ఎలాగూ మేలుకోవాలి.. అందుకే రాబోయే  మూడుగంటల సమయం నా జ్ఞాపకాలని అక్షరాలుగా మరుస్తుంది అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది..
06th June 2005… 10th Class first day morning time 6:59 AM…  ఏంటో  6:59... 7:00 కి కొన్ని సెకన్లు మాత్రమే వెనక ఉన్నా అది 6:00 లాగే కనిపిస్తుందిహా హా.. Any way.. Now time is 6:59 AM. అప్పుడే ఆల్లగడ్డనుంచి పాల బాటిల్స్ ఇచ్చివచ్చి గడపదెగ్గరే చెప్పులు వదులుతూ బాటిల్స్ బుట్టని కిందకు వదిలేస్తూ "అమ్మా Carriage Box Ready నా...." అని గట్టిగా అరిచాను… అమ్మ నుంచి No Reply.. నా వాల్లు అయిఉండి కూడా నా మాటకు Reply ఇవ్వకుంటే నాకు వెంటనే కోపం వచ్చేస్తుందిఅందుకే  బుట్టని కిందకి వదిలేసి Fast గా పక్కనే ఉన్న Bathroom తొట్టిలో కొన్ని నీల్లు చేత్తో తీస్కునినోట్లో వేస్కుని పుక్కలించుకుని Fast గా Kitchen లోకి వెల్లాను... అమ్మ నోట్లో Brush పెట్టుకునినా స్నానం కోసం కాగిన నీల్లని Stove పైనుంచి కిందకు దించుతూ కనిపించిందివచ్చిన కోపమంతా మరుక్షణమే మాయమైపోయింది"Box Ready నా అమ్మ..."అని అడిగాను... మల్లీ No Reply… "రేయ్ నీయబ్బ భరత్ గా.. నోట్లో Brush ఉంటే Answer ఎలా ఇస్తుందిరా" అని నన్ను నేనే మనసులో తిట్టూంటూ కదిలే అమ్మ చేతులవైపు చూస్తున్నా.. Ready గా ఉన్న వేడి వేడి అన్నం, Curry  మూతలు తీసి “అన్నీ రడీగా ఉన్నాయ్ చూడు” అన్నట్లుగా నోట్లో Brush ఉండటం వల్ల మాట్లాడలేక ".. ..." అని సైగలు చేస్తూ చూపించిందిహా హా గుడ్ గుడ్ అన్నీ రడీగా ఉన్నాయ్ లే అనుకునిఅమ్మ కొన్ని క్షణాలముందు కింద పెట్టిన వేడినీల్లను తీస్కుని నేను స్నానానికి వెల్లిపోయాను..
ఈరోజు 10th Class కి మొదటిరోజు వెళ్తున్నా..  Year అంటే స్టూడెంట్లకన్నా పేరెంట్స్ కే చాలా భయం.. పిల్లాడు 10th Class చదువుతున్నాడంటే ఏదో Separate Care తీస్కుంటారు. Summer Holidays Enjoy చేసి చేసి చిరాకు వచ్చేసిందిఅందుకే I always love to attend first day class after every summer holidays.
7.20 కి స్నానం చేసి  టవల్ నడుముకి కట్టుకునిఇంకో టవల్ తో తల తుడుచుకుంటూ మల్లీ కిచెన్ లోకి వచ్చేశానుఅమ్మ అలాగే నోట్లో Brush పెట్టుకుని రడీ చేసిన బాక్స్ ని  క్లాత్ తో తుడుచుకుంటూ Final Touch ఇస్తుంది"నోట్లో Brush పెట్టుకుంటే నోరు Clean అవ్వదు అమ్మా.. అప్పుడప్పుడు తోము..." అని  సెటైర్ వేసి, " అరె నేనే లేట్” అనుకుని Fast గా Pant, Shirt వేస్కుని Belt, Barge పెట్టుకున్నానుఇంకా ఏం పనులు Pending ఉన్నాయా అని అలోచిస్తుండగానే పొగలు వస్తూ ఉన్న వేడి వేడి Breakfast plate తెచ్చి అమ్మ నాముందు పెట్టింది. “అరె Right... ఇంకా తినలేదు కదా...” అనుకుని తినుకుంటూ అలా Watch వైపు చూశాను Time 10:20 .. అరె అదేంటి అప్పుడే టైం 10 అయిందా అని Shock అయ్యేలోపే  Watch పదిరోజులనుంచి పనిచేయట్లేదని గుర్తొచ్చిందిఅలాగే Plate  చేత్తో పట్టుకుని గుమ్మం దెగ్గర నేను ఉదయం టైం చూసిన అబ్బ టైటాన్ వాచ్ లో Time చూద్దామని అక్కడికి వెళ్తే, అక్కడ వాచ్ కూడా లేదు. "అరె అబ్బ బయటకు వెళ్ళినట్లు ఉన్నాడే.." అనుకుని Fast గా తినేసిచెప్పులు వేస్కునిబ్యాగ్  చేత్తోసైకిల్ పంప్  చేత్తో నేను... Lunch Box  చేత్తో, Waste cloth  చేత్తో అమ్మ... ఇద్దరం బయటకు వచ్చాం… Back tire కి కాస్త గాలి తక్కువ ఉన్నట్లు అనిపించి Full చేసేలోపే అమ్మ సైకిల్ ని నీట్ గా తుడిచేసి lunch బాక్స్ ని సైకిల్ హ్యాండిల్ కి తగిలించింది. "వెళ్ళొస్తామా.." అని అమ్మకి చెప్పి సైకిల్ తిప్పగానే అబ్బ(Grand father) ఎదురుగా వస్తున్నాడు.. "Time ఎంత అయింది అబ్బా?" అని అడగంగానే వాచ్ చూసి 8.35 అన్నాడు... "అరె ఇంక 15 నిమిషాలే ఉందిఅనుకుని సైకిల్ ని కాస్త తోసి సీట్ పైన కూర్చుని తొక్కడం Start చేశా... వీధి చివరకి వెల్లేసరికి "ఏం రా In shirt చేస్కోలేదు..." అని అబ్బ Voice వినిపించింది... "వార్ని.. ఇది మర్చిపోయానే.." అనుకుంటూ ఊరు దాటి రోడ్ లోకి వచ్చేశాను...
"10th Class First Day..  Year అంతా School లో మేమే Seniors ".... "అవునూ.. First Day కదా.. School కి ఎంత మంది వచ్చి ఉంటారో..." "అమ్మాయిలు ఎంత మంది వచ్చి ఉంటారో..." "First Day కదా..  పది నిమిషాలు Late అయినా ఏం అనరేమోలేఅని పిచ్చి పిచ్చి అలోచనలతో ప్రయాణం చేస్తూ  పది నిమిషాల్లో సైకిల్ లో స్కూల్ గేట్ ముందుకు చేరుకున్నాను
మెల్లగా గేట్ లోనికి వెళ్తూ వెళ్తూ అలా గ్రౌండ్ వైపు చూశా... అప్పటికే అందరూ లైన్లలో నించుని "..హ్రమ.. దక్ష.." (Standardize.. Attention..)  అని SPL చెప్పే ఆదేశాలను అనుసరిస్తూ ఉన్నారు. "రే భరత్ గా నువ్వు మొదటి రోజే లేట్ రా..." అని అనుకుంటూ మల్లీ ముందుకు చూశానునా సైకిల్ పార్క్ చేయలేనంత ఇరుకుగా చాలా సైకిల్లు నా కల్లముందు కనిపించాయి… వామ్మో First Day అయినా, First Show చిరంజీవి సినిమాకి వచ్చినట్లు వచ్చారే అందరూ" అనుకుంటూ, Cycle parking space కోసం వెతుక్కుంటూ, ఎక్కడా ప్లేస్ కనపడకపోయే సరికి Girls cycle parking లో సైకిల్ ని పార్క్ చేసి నా Carriage Box తీస్కుని అడుగు ముందుకేశానుతొందర్లో  అడుగు ముందుకేయగానే... నా సైకిల్ కి ఎదురుగా ఉన్న వేరే సైకిల్ హ్యాండిల్ నా బ్యాగ్ కి తగిలి నన్ను ముందుకు వెళ్ళకుండా అపేసింది.. చాలా చిరాకులో   చిక్కుని తీస్కుని ముందుకు వెల్తుంటే సైకిల్ పైన "స్వాతిఅని పేరు కనిపించింది... "ఓహ్.. స్వాతి వచ్చిందాఅనుకుంటూ గ్రౌండ్ లోకి Enter అయ్యాను.
కాస్త దూరం వెల్లేసరికి లైన్ చివర్లో నించున్న  సర్ నన్ను కోపంగా చూడటంతో నాకు లైన్లో నించోవడానికి ధైర్యం చాల్లేదుఅక్కడే పక్కన బ్యాగ్ నిబాక్స్ ని పార్క్ చేసిగ్రౌండ్ సెంటర్ లో ఉన్న  సిల్వర్ కలర్ పోల్ పక్కనే నించున్నాను పోల్ Vertical గా కాకుండా కాస్త బెండ్ అయ్యి ఉండేది.. హా హా.. దాని స్టైల్ప్లేస్ అంతా జ్ఞాపకమే
ఇంక ఏం చేసేది లేకవెనక నించుని అటూఇటూ చూస్కుంటూ ఉన్నా... అమ్మాయిల జడల్లో ఉన్న కాశాయపు రిబ్బన్ల పైన Sunlight పడి అవి మరింత Colorful గా కనిపిస్తున్నాయ్… స్కూల్ మొదటిరోజు అవడంతో సరస్వతీ మాత విగ్రహానికి కూడా కొత్తచీర కట్టి చాలా బాగా అలంకరించారు. నిజంగా సరస్వతీ మాతని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించేది ఆ రోజుల్లో.. అలా పరిసరాల్లో మార్పుని చూస్తూ ఓసారి వెనక్కు తిరిగి చూశా.. నాతో పాటు ఇంకో నలుగురు నించుని ఉన్నారు. "వార్నీ..నిమిషానికే నలుగురు చేరిపోయారు కదరా లేట్ గా వచ్చిన నా లిస్ట్ లో..." అనుకుంటూ ముందుకు తిరిగేలోపే... "ఉప...విష" (Sit Down) అని SPL గట్టిగా అరిచాడు. అందరం కూర్చోవడం, "యాకుందేందు తుశారహార ధవళా….." అని సరస్వతీ మంత్రం Start చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి…
మొదలుపెట్టిన మూడు నిమిషాల్లో ప్రార్థన అయిపోయింది.. ప్రార్థన అయిపోయిన మూడు నిమిషాల్లో లేట్ గా వచ్చినందుకు మాకు కోటింగ్ మొదలైంది.
“Head Master సుబ్రమణ్యం సర్... చూసేకి Height గాసన్నగారింగులు జుట్టుతో ఉంటాడు.. నవ్వితే చాలా బాగుంటాడుకానీ అస్సలు నవ్వడు..." ప్రార్థన అయిపోయిన వెంటనే లేచిచేతులు వెనక పెట్టుకుని కోపంగా మా వైపే చూస్కుంటూ నడుస్తూ వస్తున్నాడు..." First Day నే ఈయన కోపానికి బలి కావాల్సిందేనా..." అని మనసులో అనుకుంటూ సర్ వైపే చూస్తున్నా
మాకు సరిగ్గా  పది అడుగుల దూరంలో ఇంకో నలుగురు సర్ లు మమ్మల్ని చూసి నవ్వుకుంటూ కనిపించారునవ్వుకుంటున్న సర్ లని మనసులో  నాలుగు తిట్లు తిట్టుకునేసరికి Head Master మాముందు నించుని మమ్మల్ని తిట్టడం మొదలు పెట్టాడు
ఇటువైపు మమ్మల్ని తిడుతుంటే ఇంకోవైపు మాత్రం “ఆహ్రమ.. దక్ష.. ఆహ్రమ... విశ్రమ... (Standardize, Attention …. Standardize… Go…)” అని SPL అదేశాలను అనుసరిస్తూ అందరూ క్లాస్ లకి వెల్లిపోయారు"ఏమయ్యా మొదటి రోజే పాఠశాలకి ఆలస్యంగా వచ్చారు" అని మా H.M కోపంగా కారణాలు ఆరా తీయడం మొదలు పెట్టి 15 గుంజిల్లు తీయమన్నాడు... క్లాస్ లకి లైన్లో వెల్తున్నవాల్లు మమ్మల్ని చూసి నవ్వడం మొదలుపెట్టగానే నేను గుంజిల్లు తీయడం మొదలుపెట్టి వాల్ల నవ్వునినవ్వుకునే వాల్ల సంఖ్యని ఇంకాస్త పెంచాను...
 పది గుంజిల్లు తీయడం అవ్వగానే సుబ్రమణ్యం సర్ మాకు దూరంగా వెల్లిపోవడంతో " చాల్లే.. క్లాస్ కి వెల్లండి... నువ్వేమయ్యా In Shirt కూడా చేస్కోలేదు...." అని నావైపు కోపంగా చూశాడు మా కంప్యూటర్ సర్ మధుసుధన్… Friendly గా ఉండే సార్ అవడంతో, చూసి కాస్త నవ్వి బ్యాగ్ తగిలించుకునిలంచ్ బాక్స్  పట్టుకుని “ఆవాసం (Hostel students mess)” వైపు వెల్లి Fast గా In Shirt చేస్కుని క్లాస్ కి బయలుదేరాను.
“అదేంటో... నాలుగు సంవత్సరాలనుంచి ఇదే స్కూల్ లో చదువుతున్నాఈరోజెందుకో కొత్తగా అనిపిస్తుందిఎందులోనూ పెరగకున్నాఏదో  మెట్టు పైకి ఎక్కినట్లు అనిపిస్తుంది.” అని మనసులో అనుకుంటూ మెల్లగా 10th Class "" Section దెగ్గరికి చేరుకున్నాను.
కొత్తగా కనిపిస్తున్న Brown color Entrance Door..పక్కనే ఓ 1.5 Meter Width Corridor, Next  ఐదు చిన్న Steps, మొదటి మెట్టు మొదలయ్యే చోట వరుసగా చెప్పులు కనిపించాయి. "ఒకటిరెండుమూడు..- - - పన్నెండు...", "ఒకటిరెండుమూడు..- - - తొమ్మిది...", అని అబ్బాయిల చెప్పులజతలుఅమ్మాయిల చెప్పులజతలు వేరే వేరేగా లెక్కపెట్టుకుని.. "హమ్మ పన్నెండు మంది అబ్బాయిలుతొమ్మిదిమంది అమ్మాయిలు వచ్చారే అని మనసులో అనుకుంటూ మెల్లగా Steps ఎక్కడం మొదలు పెట్టా... Steps ఎక్కడం పూర్తి అవ్వకముందే క్లాస్ లో స్టూడెంట్స్ కనిపించారుప్రసాద్ గాడు నన్ను చూసి "రే మహేష్.. భరత్ గాడు వచ్చాడురాఅని చెప్తుంటే... వాడి Voice ని పూర్తిగా Dominate చేస్తూ స్వాతి నవ్వులు వినిపించాయి.
హా హా హా... స్వాతి నవ్వు... చుట్టూ ఎంతమంది ఉన్నాఅది ఎంత చిన్న జోక్ అయినా చాలా Happy గా, Free గా, Loud గా నవ్వేది నవ్వులో వచ్చే చిన్న చిన్న Breaks తో పాటు అంతా నాకు జ్ఞాపకమే...
మొత్తానికి Corridor లో Brown color door కి  అడుగు దూరంలో నించుని ఖాలీగా ఉన్న మొదటి రెండు బేంచీల్లో ఎక్కడ కూర్చోవాలా అని అలోచిస్తూ నించున్నాను...
“6.5 X 3.8 M Size Room… మూడు వరుసల్లో 15 Benches .. ఓక్కో వరుసకి 5 benches .. రెండిటిలో అబ్బాయిలుఒక వరుసలో అమ్మాయిలు అన్నట్లు అందరూ Separate గా కూర్చున్నారుMiddle వరుసలో మొదటి బెంచ్ కి  మూడు అడుగుల దూరంలో Sir Table & Chair.., ఆ Chair కి  మూరెడు దూరంలో 2.5X1.2 M Size Black Board, Bench పైన రెండు Chock piece లుఓ Duster, Benchకి Right corner లో మేకు సరిగా కొట్టలేదు... అలాగే పైకి కనిపిస్తూ ఉన్నింది…” ఇవన్నీ గమనించిన  అరనిమిషం తర్వాత మెల్లగా కుడికాలు పెట్టి లోపలికెల్లి Middle వరుసలో Second Bench లో కూర్చుని అటూ ఇటూ గమనిస్తూ ఉన్నాను...
"ప్రసాద్మహేష్మణికంఠసురేష్సుబ్రమణ్యంశ్రీకాంత్చంద్రజాఫర్అనీల్మస్తాన్ సురేష్రవిబలరాంగురుప్రసాద్.." అని అబ్బాయిలందర్నీ చూసి మెల్లగా బెంచ్ చివరి వరుసలో చూశాను.. "లతసువర్ణహరిణి, B. హిమబిందు,తేజెశ్వినిసుస్మితనాగ మౌనికస్వాతి, K. హిమబిందు..." అని ఇప్పటి 13 Boys, 9 Girls లెక్కనినేను బయట Footwear Count చేసిన 12 Boys, 9 Girls లెక్కని Match చేస్కుంటూ, Match అవ్వకపోయేసరికి "ఎవరో  అబ్బాయ్ Without footwear వచ్చి ఉంటాడులేఅనుకుని వదిలేశాను
చివరి వరుసచివరి బెంచ్ చివర్లో కూర్చునికాల్లు బెంచ్ పైన పెట్టుకుని Straight గా, Constant గా చూస్తూ లత కనిపించింది. "వార్ని.. Tution లో అయితే మొదటి వరుసలోమొదట్లో కూర్చుంటావ్ గాఅని మనసులో అనుకుంటూ మల్లీ ముందుకు తిరిగాను.. స్వాతి మాత్రం అలాగే నవ్వుతూ ఏదో చెప్తూనే ఉందితను చెప్పేది వింటూ పక్కనే హిమబిందు మాత్రం తలదించుకుని స్వాతి మాటలకి  కొడుతూనవ్వాలా వద్దా అని అలోచిస్తూ మెల్లగా నవ్వుతూ బుక్ పేజీలు తిప్పుతుందివార్నీ.. మొదటిరోజు అనుకుంటే బిందు అప్పుడే బుక్ లో లాస్ట్ పేజ్ చదువుతుందేంట్రా..." అని వెనక ఉన్న మహేష్ గాడు నన్ను తలపైన కొట్టి అలా ముందుకు తోశాడు..
వాడు కొట్టగానే కాస్త ముందుకు వెల్లిన నా తల మల్లీ వెనక్కు వచ్చేసరికి Class కి S.P. Raju Sir  వచ్చేశాడువెంటనే మొత్తం 23 మందిమి పైకి లేచి "నమస్తే ఆచాజీ" అనుకుంటూ నించున్నాంతరవాత  5 క్షణాలు అందరం Silent, నవ్వుతున్న స్వాతి కూడా నవ్వు ఆపేసింది..
"హా నమస్కారం.. నమస్కారం.. కూర్చోండి.." అని అనుకుంటూ Duster ని రెండుసార్లు Bench పైన కొట్టాడు. Duster కొత్తది కావడంతో No Dust, No chock Powder… వెంటనే పక్కనే ఉన్న రెండు Chock piece లలో ఒకటి తీస్కుని బోర్డు పైన తన పేరుని S.పుల్లమరాజు అని రాశాడు. వెంటనే మా వైపు తిరిగి, ఆ Chock piece ని బెంచ్ పైన టక్ టక్ అని కొట్టుకుంటూ " హా… నా పేరు S. పుల్లమరాజు అయ్యా... నేను మీ Class teacher ని, మీకు గణితం కి వస్తాను.. ప్రతి రోజూ ఈ క్లాస్ కి నేనే వస్తాను.." అనుకుంటూ మెల్లగా Attendance Register Open చేశాడు.
ఒకటి.. శ్రీలతరెండు.. నాగమౌనిక... ,  మూడు.. సుస్మిత... అనుకుంటూ మొదలు పెట్టితొమ్మిది.. సువర్ణ... అని క్రాస్ చేసి 24…. భరత్ కుమార్ రెడ్డి... అని నన్ను పిలిచాడు... లేచి "ఉపస్తే ఆచ్చీ (ఉపస్తే ఆచాజీ, Present Sir) "  అని చెప్పి కూర్చుండిపోయాను.
అలా 6th June 2005 Monday Morning 9:25 AM కి 10th Class First Day నేను Present అని Attendance Register లో Book అయిన దెగ్గర్నుంచి..... End of March 2006 లో Morning same 9:25AM కి, Social Paper-2 Exam లో, Exam hall  లో Invigilator ఇచ్చిన Hall Ticket 2nd copy లో Sign చేసిన చివరి రోజువరకు ఎన్నో గాయాలుఎన్నో జ్ఞాపకాలు... గాయాలు మాని పోయాయిమర్చిపోయాను... కానీ జ్ఞాపకాలు మాత్రం మాయనివిమరిచిపోలేనివి...
ఆకాశంలో చందమామ రోజుకి పన్నెండు గంటలే కనిపించినామనకు చూడాలనిపించినపుడు కళ్ళు మూస్కోగానే మన కళ్ళముందుకొచ్చేస్తాడు.. అలాగే నేను 10th చదివింది ఒక్క సంవత్సరమే అయినా ఒక్క సంవత్సరం గడిచిపోయి ఓ ఏడు సంవత్సరాలైనా, ఒక్కసారి కళ్ళుమూస్కుని అలోచిస్తే అంతా జ్ఞాపకమొస్తుంది.
స్వాతి నవ్వు, S.P. Raju Sir దెబ్బలత చూపుసుస్మిత జడమా H.M జుట్టుజయ విజయల Same డ్రస్ లుయోగచాప్ఘోష్చక్కబజనకోలాటంక్లాస్ ఎదురుగా అప్పుడప్పుడు వరుసగాఅప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్లు ఉండే చెప్పుల వరుసలుచెప్పుల పక్కనే ఉన్న చెట్టు, ఆ చెట్టు చుట్టూ కూర్చోవడానికి కట్టిన  రౌండ్ దిమ్మె... తెల్ల చొక్కాకాఖీ ప్యాంట్కాశాయం రిబ్బన్లు చేత్తో గోచీ చివర పట్టుకుని అటూ ఇటూ ఊపుతూ నడిచే సర్ లు... అందరూ జ్ఞాపకమే... ప్రయత్నిస్తే ప్రతి నిమిషం జ్ఞాపకమే... ఇంకాస్త లోతుకెల్తే ప్రతి క్షణం జ్ఞాపకమే...
గతానికి ఎదురువెల్లిజ్ఞాపకాలన్నింటినీ పదాలుగా మార్చి పేపర్ పైన పెట్టి నా అందమైన గతాన్ని అక్షరాలుగా మార్చడం అంటే నాకు చాలా ఇష్టం... నాకు ఏమున్నాఏం లేకున్నా… చేతులో పెన్జోబులో పేపర్ లేకుంటే కష్టం... వీలైనంతవరకు పేపర్ కిపెన్ లో నిబ్ కి దూరాన్ని లేకుండా చేస్తుంటాను.. అదే ప్రయత్నంలోనే ఇన్ని కవితలు, Songs, Articles ...
రోజూ తప్పనిసరిగా డైరీ రాస్తా.. Because I want to record each and every day of mine in Toto. నాకు  డైరీ చాలా ఉపయోగపడుతుంది... ఎందుకంటే... “నాగురించినా రోజులగురించి రోజులు నాకు నేర్పిన పాఠాల గురించిరోజు రోజుకి నాలో మార్పు గురించి.. నావాల్ల గురించివాల్లు నాకు ఇచ్చిన ఆనందాన్ని గురించి చదువుకుని నవ్వుకుంటూ ఏడ్చడానికిఏడ్చుకుంటూ నవ్వడానికి రోజు Experience తో ఇంకో రోజుని Design చేస్కోవడానికి చాలా బాగా పనికొస్తుంది నా డైరీ...
హా హా  కాలం జనాలు మనం చెప్పేది వినరు.. వాల్లు వినాలనుకున్నదే వింటారు…. Any way let us start….
1.   భారతీలో నాకు అనిపించిన పెద్ద బాధ....
10th Class Memories గురించి ఆలోచిస్తూ, రాస్తూ కూడా 9th class కి వెల్లాల్సి వస్తుంది. హా హా హా Any Way…18th October 2004… Morning 9:35 AM.. అప్పట్లో నేను 9th Class... సుధీర Madam మా Class Teacher.. రోజూ చాలా Soft గా మట్లాడుతుంది. కానీ ఆరోజు మాత్రం చాలా Rough గా మట్లాడింది.
నాకు Appendicitis Operation అవడంతో 9th Class Start అయిన ఓ నెలనర్ర రోజుల తర్వాత School లో Join అయ్యాను. Join అయిన ఓ నెలనర్ర రోజులకే Quarterly Exams Start అయ్యాయి. అందరితోపాటు నేను కూడా కష్టపడ్డాను. 10th Class కి ఇంకా One Year కూడా లేకపోవడంతో Tuition కి వెల్లేవాన్ని, అక్కడ బాగా చదివేవాన్ని. మొత్తానికి దసరా Holidays కి ఓరోజు ముందు Quarterly Exams అయిపోయాయి. చెప్పుకోతగ్గ కాకున్నా బానే రాశాలే అనుకున్నా..
17th October వరకు Holidays లో Enjoy చేసిన ఆనందాన్నంతా ఒక్కసారిగా దూరం చేస్తూ 18th October 2004 Morning 9:25 AM కి Quarterly maths exam papers correction  చేసి సుధీర Madam ఇచ్చేస్తుంది. అందరి పేపర్ లు తీసి, మార్కులు పైకి చెప్తూ చేతికి ఇస్తుంది. “Roll No 24 Bharath Kumar Reddy 50 Out Of 50…” అని చాలా అనుమానంగా చెప్పి నా Paper చేతికి ఇచ్చింది. ఆ Marks విని Madam తో పాటు చాలామంది Shock అయ్యారు కానీ.. నాకు మాత్రం అంత కొత్తగా అనిపించలేదు.
మొత్తానికి ఇంకో పదిహేను నిమిషాల్లో క్లాస్ అయిపోవడంతో Madam బయటకు వెల్లిపోయింది. పక్కనే ఉన్న మహేష్ గాడు, సురేష్ గాడు నా పేపర్ ని చూసి మల్లీ నాకే ఇచ్చేశారు. మల్లీ ఓ క్లాస్ తర్వాత Break వస్తే బయటకెల్లి అందరితో మాట్లాడుతూ నించున్నాను. అప్పుడు మహేష్ గాడు చాలా Anxiety గా నా దెగ్గరికి వచ్చి... "రే... భరత్ గా పక్క Section లో కూడా ఎవ్వరికీ 50/50  రాలేదంటరా... మొత్తం 61 మందిలో నీకు ఒక్కడికే 50/50 రా" అన్నాడు.  అయినా నాకు అంత కొత్తగా అనిపించలేదు… ఆ పేపర్ లో 50 కి 50 తెచ్చుకోవడం అంత గొప్పగా కూడా అనిపించలేదు.. కానీ సరిగ్గా ఓ పదిహేను నిమిషాల తర్వాత చాలా కొత్తగా, ఇంకా చాలా బాధగా అనిపించింది.
Break అయిపోయాక M.H.K. Prasad సర్ Social Class Start అయింది. పక్క Section సందీప్ అన్నా, విష్ణు అన్నా ఈ Sir కి చాలా ఇష్టం. ఆ Same సందీప్ వచ్చి... "ఆచ్చీ" అని Blue color entrance door దెగ్గర నించున్నాడు... "చెప్పు సందీప్.." అని సర్ అనగానే "భరత్ ని Head Master సర్ పిలుస్తున్నాడు ఆచ్చీ" అన్నాడు. అప్పట్లో H.M., Room కి పిలిచాడు అంటే అదేదో పెద్ద Coating కోసమే అని అందరికీ తెలుసు. అలా సందీప్ గాడు అనగానే అందరూ ఒక్కసారిగా నావైపు చూశారు. వెంటనే బయటకొచ్చి "ఎందుకురా, రూం లో ఎవరెవరు ఉన్నారు" అని సందీప్ గాన్ని అడిగితే... "ఏమో రా..." అని చెప్పి వాడి క్లాస్ కి వాడు వెల్లిపోయాడు…
H.M Room దెగ్గరికి వెల్లి బయటనుంచే "లోపలికి రావచ్చా ఆచాజీ...(May I come in sir)" అని అడగంగానే H.M Sir "రా..." అన్నాడు. అప్పటికే Head Master తో మాట్లాడుతున్న రామాంజనేయులు సర్,  సైలెంట్ గా తలదించుకుని ఉన్న సుధీర Madam వెంటనే నా వైపు చూసారు.
నేను Shock నుంచి తేరుకునేలోపే "పేపర్ ఎంతకు కొన్నావ్" అనే ప్రశ్న నా చెవుల్ని చేరుకుంది. "ఏ పేపర్ ఆచాజీ.." అని నేను అనీ అనకముందే "నోర్ముయ్...." అని రామాంజనేయులు సర్ వెంటనే చైర్ నుంచి పైకి లేచి నావైపు Fast గా ఓ అడుగు వేసి ముందుకు వచ్చాడు.
అప్పట్లో రామాంజనేయులు సర్ మా పక్క Section కి Maths కి వెల్లేవాడు.. నాకు ఏం అర్థంకాక "ఏం పేపర్ సర్" అని మల్లీ Same answer (That was a question actually) repeat చేశాను.. Head master cool గా “గణితం Paper” అన్నాడు..
“ఎంతకు కొన్నావ్" అంటే "పేపర్ లీక్ చేకోవడము" అని అప్పడే నాకు అర్థమయింది. షాక్ అయి "నాకు ఏమీ తెలీదు సర్.. నిజంగా నేను బాగా చదివాను" అన్నాను.. Head Master, Sudheera madam కాస్త వినే పరిస్తితుల్లో ఉన్నా కూడా రామాంజనేయులు సర్ మాత్రం నా మాటలు అస్సలు వినలేకున్నాడు... "ఏమ్మా... నువ్వేం మాట్లాడవేం.." అని Head Master సుధీర Madam ని అనగానే.. “ఏం భరత్.. నీకు ఆపరేషన్ జరిగి రెండు నెలలు కూడా అవ్వలేదు.. అస్సలు నువ్వు సగం సిలబస్ విననేలేదు.. ఎలా వచ్చాయ్ మరి నీకు అన్ని మార్కులు హా...." అని స్లోగా Start చేసి తన Voice లో Pitch ని Peak point వరకు తీస్కెల్లింది. “Tuition కి వెల్తున్నా మాతాజీ.." అని నేను మెల్లగా అనేసరికి, ముందునుంచే కోపంగా ఉన్న రామాంజనేయులు సర్ కి Full గా కోపం వచ్చి కొట్టేలా చెయ్ పైకి ఎత్తాడు. అప్పట్లో వెళ్ళేవాల్లంటే రామాననేయులు సర్ కి చాలా కోపం.. సర్ కోపాన్ని చూసేసరికి, ఇంట్లో అమ్మ రడీ చేసిన వంట తినకుండా హోటల్ లో తిని వచ్చి "కడుపు నిండింది అమ్మా.." అంటే అమ్మకి కూడా కోపం వస్తుంది కదా అనింపించింది…
మొత్తానికి అక్కడ ఆరోజు Head Master Room లో నన్ను కొట్టలేదు కానీ... అంతకన్నా పెద్ద అవమానమే చేశారు... ఉన్న Talent ని గుర్తించకపోయినా పర్లేదు... కానీ ఇలా అనుమానించి, అవమానించి కోప్పడటం  చాలా బాధేసింది.. రామాంజనేయులు సర్ కోపం 10th Pre final Exams ల దాకా ఉన్నింది కానీ సుధీర Madam కోపం మాత్రం 20th Oct 2004 వరకే ఉన్నింది. ఆరోజు ఉదయం Same 9:25 AM కి ఇచ్చిన Science paper లో 46 out of 50 రావడం, Total లో Class లో 5th Rank రావడంతో కాస్త నమ్మి మల్లీ ఎప్పుడూ నన్ను కోపంగా అరవలేదు…
2.  Class Leader గా నా ప్రయాణం…
10th Class Start అయింది June 6th అయినా Syllabus ముందే Summer లో కాస్త Cover చేసి ఉండటంతో ఇప్పుడు Syllabus లో Speed పెరిగింది. 9th Class లో నాకు 50 Out Of 50 Marks వస్తే పేపర్ లీక్ అయింది అని అనుమానించే సర్ లు, Madam లు నా చుట్టూ ఉంటే... ఇక్కడ మాత్రం నాకు Unit Test లో వచ్చిన 25 out of 25 Marks కే నాకు కూడా  Talent ఉంది అని, చదవగలను అని S.P.Raju నమ్మాడు. అప్పటినుంచి అన్నింటిలోనూ కాస్త Involve చేస్తుండేవాడు. కొన్నిరోజుల తర్వాత నన్ను నించోబెట్టి... "చూడండి.. ఈ అబ్బాయి ఈరోజునుంచి ఈ క్లాస్ కి లీడర్" అని అందరితో చెప్పి, "ఏమయ్యా.. వినపడిందా... నీకు సమ్మతమేనా..." అని నాతో అన్నాడు. నేను తల ఊపి కూర్చుండిపోయాను...
తర్వాత రోజు నుంచి లీడర్ గా లైఫ్ ని చాలాబాగా Enjoy చేసేవాన్ని. క్లాస్ లో సర్ లేట్ గా వస్తే ఆ పదినిమిషాలు టేబుల్ దెగ్గర నించోవడం… ఎవరన్నా అల్లరి చేస్తే వాల్ల పేర్లు బోర్డ్ పైన రాయడం… అమ్మాయిల పేర్లు ఓ వైపు, అబ్బాయిల పేర్లు ఇంకో వైపు Separate గా రాయడం... ముందు బోర్డ్ పైన పేరు రాసినా కూడా ఇంకా అల్లరి చేస్తుంటే, వాల్ల పేరు పక్కన “XXXX” అని Marks పెట్టడం; సర్ క్లాస్ కి రాకుంటే వెల్లి గుర్తు చేయడం; బోర్డ్ పైన ప్రతీరోజూ ఒక సూక్తి(proverb) రాయడం; బోర్డ్ కి Design లు వేయడం;... హా హా హా నిజంగా ఆరోజులు బలే ఉండేవి.
పేర్లు రాయడం అంటే ఒకటి మాత్రం బాగా గుర్తొస్తుంది. నేను బోర్డ్ పైన అందరికన్నా ఎక్కువసార్లు రాసిన పేరు "స్వాతి"... నవ్వకుండా అస్సలు ఉండలేని స్వాతి, సైలెంట్ గా కూడా అస్సలు కూర్చునేది కాదు.. నవ్వడం,.. వెనక్కు, ముందుకు తిరుగుతూ ఉండటం... సర్ లేకుంటే ఎప్పుడూ అలాగే గుసగుసలాడుతూ ఉండేది.. First Bench లోనే Middle లో కూర్చునేది... నేను ఎన్నిసార్లు టేబుల్ దెగ్గర నిలబడి ఉంటానో అన్నిసార్లూ పక్కాగా స్వాతి పేరు రాశే ఉంటా.. కొన్ని సార్లైతే తన పేరు పక్కన XX Marks బోర్డ్ చివరిదాకా వెల్లేవి… Ha Ha Ha Really sooo funny…
ఇంకా సువర్ణ, లత, సుస్మిత... ముగ్గురూ చివరి రెండు బెంచీల్లో కూర్చునేవారు.. అమ్మాయిల్లో స్వాతి తర్వాత ఎవరాన్న ఇంకా అల్లరి చేస్తారా అంటే వాల్లు ఈ ముగ్గురే... ఎవరు ఎవరితో మాట్లాడుతుండేవాల్లో గుర్తు రాట్లేదు కానీ ముగ్గురూ బానే అల్లరి చేసేవాల్లు… ఇంక అబ్బాయిల విషయానికి వస్తే అనీల్, మస్తాన్, శ్రీకాంత్, చంద్ర, మహేష్, మణికంఠ, సురేష్... అందరూ అల్లరి చేసేవాల్లు... హా హా హా ఓ సారి నేను పేరు రాయటం వల్ల సురేష్ గాన్ని సర్ కొట్టాడు.. అందుకని వాడు నాతో ఓ రెండు రోజులు మాట్లాడకుండా అలిగినట్లు గుర్తు...
ఇవన్నీ పక్కన పెడితే.. నన్ను లీడర్ గా చేసిన తర్వాత నాలో, నాపైన నాకే Confidence పెరిగింది. ఇంకాస్త బాగా చదవడం మొదలు పెట్టాను. Maths లోనే కాకుండా అన్నిట్లో కష్టపడి చదివేవాన్ని. అన్నీ Main Exams లో గణితంలో అందరికన్నా ఎక్కువ వచ్చినట్లు, Half Early లో మాత్రం Total Subjects లో కూడా క్లాస్ లో 3rd Rank వచ్చినట్లు గుర్తుంది.
ఇలా ఇవన్నీ జరిగాక, అందరూ భరత్ కూడా బానే చదువుతాడని గుర్తించారు. కానీ ఒకరు మాత్రం అస్సలు నమ్మేవాడూ కాదు.. నేనే చూసి పలకరించినా మాట్లాడేవాడూ కాదు. He is one and only Ramanjaneyulu sir…
3.  Parts of speech
“John said, “I will give you a Pen” … దీన్ని Indirect Speech లోకి మార్చాలి..” అని చెప్పి ఎవర్ని అడగాలా అని అలోచిస్తూ మహేష్ గాడిని పైకి లేపాడు ఆరోజు చివరి క్లాస్ కి 20 నిమిషాలు లేట్ గా వచ్చిన మా Head Master సుబ్రమణ్యం సర్.. "ఇంకో పది నిమిషాల్లో క్లాస్ అయిపోయి ఇంటికి వెల్దామనుకుంటే మీరేంటి సార్" అన్నట్లుగా మహేష్ గాడు సర్ నే చూస్తూ, ఏదో గుర్తొస్తున్నట్లు నటిస్తూ నిలబడ్డాడు. Next అనగానే సురేష్ గాడు, మల్లీ Next అనగానే ప్రసాద్ గాడు, ఇంకో Next కి నేను నించుని Same Acting చేస్తున్నాము.
అబ్బాయిలను నమ్ముకుంటే పని అవ్వదని అర్థమయ్యి తల తిప్పి "ఏమ్మా నువ్ చెప్పు" అని స్వాతి వైపు బుక్ చూపించాడు.. అరనిమిషం కూడా ఆగకుండా స్వాతి పైకి లేచి “ John said that he would give me a pen” అని నించున్న మా నలుగురినీ "అరె మీరు చెప్పలేదే... నేను చెప్పాను గా" అన్నట్లుగా వెటకారంగా చూసింది. But sir Face లో no expression.. "ఏంటి ఈ అమ్మాయి బుక్ లో లేనిది చెప్పింది... Correct or wrong” అని Doubt గా చూశాడు.. అప్పట్లో స్వాతి, బిందు బయట English Tuition కి వెళ్తుండడంతో వాల్లు ఏం చెప్పినా అంత Easy గా “తప్పు” అని అనేవాడు కాదు.. "ఇప్పుడు ఏం చేయాలా అని అలోచిస్తూ చివరకు తెలివిగా.. ఏమ్మా ఆ అమ్మాయి చెప్పింది కరెక్టేనా అని బిందుని చెప్పమన్నాడు"
English dictionary లో Ctrl + F కొట్టినట్లు బిందు వెంటనే లేచి... "హా సర్ కరెక్టే... Direct నుంచి Indirect కి మారితే మద్యలో That వస్తుంది, Noun ఉన్న చోట Pronoun వస్తుంది.” అని మొత్తం Explain చేయడంతో మా సర్ కి Confusion ఇంకా పెరిగిపోయింది.. మాకు అప్పటికే బాగా నవ్వువస్తుంది. నిలబడి నవ్వలేక, నవ్వును ఆపుకోలేక రెండిటికి మద్యలో ఉంది మా Position...  అక్కడ ఓ వైపు సర్ కి ఏం చేయాలో అర్థం కాక Case ని Close చేయాలనుకున్నాడేమో.. "ఆ... అట్లా చెప్పాల.. Right...  Answer అర్థం అయిందా… John said that he will give me a pen… అంతే కదమ్మా.." అని Head master అంటూ అంటూ మల్లీ బిందూనే అడిగాడు. “No sir, He Will కాదు , He would రావాలి” అని బిందు అనడంతో.. "హా అదే అదే... "John said that he would give me a pen” అని బుక్ లో పేజీలు తిప్పుకుంటూ చెప్పాడు.
నించున్న నలుగురం మాత్రం ఓ క్షణం బిందుని, మరో క్షణం మా సర్ ని, అప్పుడప్పుడూ మాట్లాడే స్వాతిని చూస్కుంటూ ఏదో English Movie చూస్తున్నట్లు నించున్నాం.  సర్ ఇంకో పేజ్ తిప్పగానే బెల్ మోగడంతో సర్ వెల్లిపోయాడు. తర్వాత "మన Sir కి నిజంగానే English వచ్చు అంటావా" అని అందరం మాట్లాడుకుంటూ ఇల్లకి వెళ్ళిపోయాం..
4.  నవ్వు తెప్పించిన తిట్లు
డేట్ సరిగా గుర్తు లేదు.. టైం మాత్రం సాయంత్రం 5:30... 4:50 కి క్లాస్ అయిపోయాక "గుంటమయ్య" సర్ నోట్స్ చెప్పాలని Extra Class తీస్కున్నాడు. అందరిని క్లాస్ ముందే కింద కూర్చోపెట్టి, నా చేతికి ఓ నోట్ బుక్ ఇచ్చి, "నువ్వు చెప్పు... అందరూ రాస్కుంటారు" అని సర్ వెల్లిపోయాడు. నవ్వడం అన్నా, నోట్స్ చెప్పడం అన్నా స్వాతి కి చాలా ఇష్టం. వెంటనే.. "నేను చెప్తా భరత్ ప్లీజ్.." అనింది.... "ఏం.. మాకు రాదా..." అని సురేష్ గాడు వెంటనే Counter వేశాడు. నేను మాత్రం అదేం పట్టించుకోకుండా నోట్స్ స్వాతికి ఇచ్చి "నువ్వే చెప్పు" అన్నాను. స్వాతి సురేష్ గాడి వైపు కాస్త కోపంగా చూసి, మల్లీ వెంటనే నావైపు చూసి నవ్వి “Thank you భరత్” అని నోట్స్ తీస్కుంది.
వరుసక్రమం లేకుండా అబ్బాయిలు, అమ్మాయిలు కాస్త Gap Maintain చేస్తూ ఇష్టం వచ్చినట్లు కూర్చుని, "ఈ Extra Class ఎంత సేపు ఉంటుందా" అని అలోచిస్తూ చాలా Dull గా Notes రాస్కుంటూ ఉన్నాము.
"భూగోళ సాస్త్రం" అని Main Heading చెప్పి, "భారత దేశంలో ఖనిజ సంపద...." అని స్వాతి నోట్స్ చెప్పడం మొదలు పెట్టింది. అందరం Silent గా రాస్కుంటుంటే సురేష్ గాడు మాత్రం స్వాతి చెప్పిన Same Words ని Repeat చేస్తూ వెక్కిరిస్తున్నాడు. అలా ఓ ఐదుసార్లు వెక్కిరించేసరికి స్వాతికి బాగా కోపం వచ్చేసింది… "ఏం సురేష్.. నీ బాధ... అప్పటినుంచి బలే ఎక్కువ చేస్తున్నావే ఊర్కే ఉన్నానని.." అని చెప్తున్న నోట్స్ ని Sudden గా ఆపి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. అందరం పెన్ కి రెస్ట్ ఇచ్చి స్వాతి వైపు, సురేష్ వైపు చూస్తున్నాం... "నా ఇష్టం... నా నోరు.. నేను ఏమైనా అంటా... ను నోట్స్ చెప్పు.." అని సురేష్ గాడు స్వాతికి Reply ఇవ్వగానే కోపంగా స్వాతి "తు.." అని పేజ్ తిప్పి "అర్థశాస్త్రం" అని Main Heading మార్చి చెప్పి నోట్స్ Start చేయబోతుండగానే... "అ...ర్థ...శా...స్త్రం..." అని సురేష్ గాడు మల్లీ వెక్కిరించాడు.. "చూడు సురేష్.. నేను మీ అమ్మకు చెప్తా చూడు అలాగే చేస్తుంటే..." అని స్వాతి గట్టిగా గదురుకుంది.. నేను స్వాతికి ఓ మూడు అడుగుల దూరంలోనే కూర్చున్నాను.. చెవులు అదిరిపోయేలా అరుస్తుంది... పక్కనే కూర్చున్న జయ, లత వాల్ల చెవుల పరిస్తితి ఏంటో పాపం.  "ఏం నేను చెప్పలేనా మీ అమ్మకు...ప పోదాం పా" అని సురేష్ గాడు కూడా గదురుకున్నాడు. పాపం ఆ మాటలో స్వాతి కి ఏం అనిపించిందో తెలీదు.. గట్టిగా ఏడ్చడం మొదలు పెట్టింది.
స్వాతి నవ్వుతుంటే మధ్యలో బ్రేక్ ఇస్తూ ఎక్కిల్లు వస్తున్నట్లు బలే నవ్వేది. ఇప్పుడు కూడా అలాగే ఎక్కిల్లు వస్తున్నట్లే ఏడుస్తుంది. And చాలా గట్టిగా ఏడుస్తుంది... నోట్ బుక్ క్లోస్ చేసింది. పక్కనే "జయ, లత" ఇద్దరూ స్వాతి ని ఓదార్చడం మొదలు పెట్టారు. Girls అందరూ సురేష్ గాడివైపు కోపంగా చూస్తున్నారు. But వాడి Face లో మాత్రం ఎటువంటి Feeling లేదు. "నీయబ్బ నీకెందుకు రా ఇదంతా" అని మహేష్ గాడు సురేష్ గాన్ని Foooottttt అని ఒకటి పీకాడు...", పాపం స్వాతిని ఏడిపించేసరికి మణికంఠ గాడికి బాగా కోపం వచ్చేసింది. "రే కోతినాయాలా.. కాం గా రాస్కోలేవా.." అని సురేష్ గాడికి అస్సలు ఇష్టం లేని “కోతి” అనే పేరుతో తిట్టాడు... "రేయ్ ఏనుగు నాయాలా నువ్వు అన్నీ మూస్కుని కూర్చో" అని సురేష్ గాడు మణికంఠ గాడికి అస్సలు ఇష్టం లేని పేరుతో Reveres satire వేశాడు. కానీ ఈ Setire లకన్నా స్వాతి ఏడుపు లో Sound పెద్దగా ఉన్నింది. "పట్టు భరత్.. నువ్వే చెప్పు... నేనేం చెప్పనులే.." అని స్వాతి నోట్స్ నాకు ఇచ్చేసి కింద పడేసిన పెన్ ని మల్లీ తీస్కుని రాస్కోవడానికి రడీ అవుతున్నట్లు, ఏడుపు ఆగిపోయే Stage కి చేరుకుంది.
మేము కూర్చున్న చోటుకు Staff Room దెగ్గర్లోనే ఉండటంతో స్వాతి ఏడుపు టీ తాగుతూ పేపర్ చదువుకుంటున్న నాగభూషణం సర్ కి వినిపించింది... ఆ సర్ సరిగ్గా నిలబడి మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ కాల్లు కాస్త బెండ్ చేస్తూ ఓ యాసలో మాట్లాడేవాడు. Fast గా మేము కూర్చున్న చోటుకి వచ్చి స్వాతి ఏడ్చడాన్ని గమనించాడు. స్వాతిని “ఏమ్మా ఏమైంది…" అని కూడా అడగలేదు.. వెంటనే నావైపు వేలు చూపించి "నీయబ్బ రేయ్ భరత్ గా నువ్వే ఏడిపించావ్ కదూ.. నాకు తెల్సురా నువ్వే ఏడిపించింటావ్... ఇప్పుడే చెప్తున్నా రాసిపెట్టుకో.. నీకు చదువు రాదు ఏం రాదు... నీకు పబ్లిక్ పరీక్షల్లో 500 మార్కులు వస్తే నేనే వెయ్యి రూపాయలు ఇస్తా చూడు రాసిపెట్టుకో..." అని నన్ను చెడా మడా తిట్టి... "లేదులేమ్మా స్వాతి.. తిట్నా లే..." అని వెల్లిపోయాడు.
ఆ తిట్లకి నాకు అణువంత బాధ కూడా కలగకపోగా పిచ్చ నవ్వు వచ్చింది. గట్టిగా నవ్వడం మొదలు పెట్టా... అందరూ నవ్వేసరికి స్వాతి కూడా మామూలు అయిపోయి గట్టిగా నవ్వేసింది. ఎక్కిల్లు పెడుతూ చాలా బాగా అనిపించే ఆ నవ్వు ఓ పదినిమిషాలకే తనని మల్లీ చేరుకుంది.
క్లాస్ అయిపోయిన తర్వాత నేను బుక్స్ సర్దుకుంటుంటే... "Feel అయ్యావా భరత్...” అని స్వాతి నన్ను అడగడం, "అయ్యో అస్సలు కాలేదు" అని నేను Reply ఇవ్వడం.. " రేయ్ భరత్ గా... అయన నాలుకపైన మచ్చలు ఉన్నాయ్ రా" అని మహేష్ గాడు అనడం.. "ఆయనవన్నీ గాలి మాటలు లేరా" అని చెప్పి అందరం వెల్లిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి…
నాగభూషణం సర్... 10th Class లో మాకు తెలుగు Subject కి, పక్క Section వాల్లకి సోషల్ Subject కి వచ్చేవాడు. Head Master కాకపోయినా Head Master అంత Powers ఉన్నవాడు. క్లాస్ చెప్పాలని అనిపించకుంటే తనే బెల్ కొట్టించుకుని క్లాస్ ఓవర్ చేయించేవాడు. Afternoon తన lunch box కోసం నన్ను, చంద్రని పడకండ్లకి పంపేవాడు. ఆ Lunch box వచ్చేవరకు ఇక్కడ స్కూల్ లో పిల్లల్ని తిననివ్వకుండా “ఓం బ్రహ్మార్పణం... బ్రహ్మ చవితి..” అనుకుంటూ భోజనమంత్రం చెప్పించి, అందరూ బాగా చెప్పిన తర్వాత కూడా.. "ఏం బాలేదు మల్లీ చెప్పండి" అని మల్లీ మొదటినుంచి చెప్పిస్తూ తన Box వచ్చేదాకా Time pass చేసేవాడు… అందరు Parents తో Contacts పెట్టుకునేవాడు.. "సంధులు, సమాసాలు" అని ఎప్పుడూ నోట్స్ చెప్పేవాడు.
హా హా హా ఈ సందర్భాన్ని తలుచుకుంటూ "తెలుగు, సోషల్ Subjects తప్ప సైకిల్ తొక్కడం కూడా రాని మా సర్ ని తలుచుంకున్నందుకు చాలా ఆనందంగా ఉంది… We all miss you sir.. still we remember those funny and inspiring classes given by you.
5.  కోపం తెప్పించిన పొగడ్తలు
నాకు నవ్వు తెప్పించిన నాగభూషణం సర్ నోట తిట్లు విని ఓ నాలుగైదు రోజులైనా గడవలేదు... ఓరోజు మద్యాహ్నం Lunch time లో ఏదో పనిపైన అల్లగడ్డకి వచ్చిన అమ్మ, నన్ను పలకరిద్దామని మా స్కూల్ కి వచ్చింది. నేను, అమ్మ క్లాస్ ముందు మాట్లాడుతుంటే... "ఏమ్మా బాగున్నావా" అని మాముందుకొచ్చాడు నాగభూషణం సర్…  "ఈయన Lunch box ఇంకా రానట్లు ఉంది" అని నేను అనుకుంటూ ఉండగానే ... అమ్మ మాట్లాడుతూ "హా బాగున్నాం సర్.. మీరు బాగున్నారా..." అని వెంటనే "మావాడు ఎలా చదువుతున్నాడు సర్" అని అందరు Parents కి బాగా అలవాటైన Question అడిగింది.
నాలుగు రోజులముందే 500 మార్కులు రావు అన్న తన తిట్లనే మర్చిపోయాడేమో... "అబ్బ భరత్ గాన్ని నువ్వు మర్చిపోమ్మా... మేము చూస్కుంటాము. 520 పైన మార్కులు రాకుంటే నువ్వొచ్చి నన్ను అడుగు.. కత్తిమా నీ కొడుకు.. ఏం బెంగ పెట్టుకోవాకు... పాలసాగరం పరువు నిలబెడతాడులేమ్మా..." అని బాగా పొగిడాడు. ఆ పొగడ్తలు వినగానే నాకు పిచ్చ కోపం వచ్చేసింది. సర్ వైపు అలాగే ఓ విధంగా చూస్తూ నించున్నాను. "ఏం రా భరత్.. తెచ్చుకుంటావ్ గా 520" అని నా భుజంపైన చెయ్ వేసి అలా Sudden గా నన్ను కదిపాడు. "హా ఆచాజీ.. తెచ్చుకుంటా.." అని తల ఊపి, ఇంకోసారి సర్ ని కోపంగా చూసి అమ్మని ఇంటికి పంపించి మల్లీ క్లాస్ కి వెల్లిపోయాను.
ఏంటో... సర్... Just 4 Days back 500 కూడా రావన్నాడు, ఇప్పుడేమో 520 అంటున్నాడు... అప్పుడు తిడితే నవ్వొచ్చింది, ఇప్పుడు పొగిడితే కోపమొచ్చింది.. తిట్టిన ఓ ఆరు నెలలకి మా 10th క్లాస్ Result కూడా వచ్చింది. వింతగా అనిపించింది ఏంటంటే నాకు 10th లో సర్ చెప్పిన 520 నే Exact వచ్చాయి. హా హా హా ఆరోజు మాత్రం "520 పైన వస్తాయమ్మా" అని మా అమ్మతో సర్ అన్న మాట, "సర్ నాలుకపైన మచ్చలు ఉన్నాయ్ రా" అన్న మహేష్ గాడిమాట అలా అలా గుర్తొచ్చాయి.
6.  N.S. Sir తిట్లు
10th Class లో one of the important subject N.S…. Natuaral Science… This is a part of science. N.S. Subject కి వచ్చే మా సర్ పేరు మధుసుధన్... చూసేకి పొట్టిగా, చాలా సన్నగా ఉంటాడు. కానీ పాఠం మాత్రం చాలా బాగా చెప్తాడు. మనలో చాలా మంది బాత్ రూం సింగర్స్ ఉంటారు, ఆయన మాత్రం క్లాస్ రూం సింగర్. టైం దొరికినప్పుడల్లా మీసం మీద చెయ్ వేస్కుని "ఊ....ఊ..." అని రాగాలు తీస్కుంటూ ఉంటాడు. పాఠం ఎంత బాగా చెప్పేవాడో తిట్లు కూడా అంతే బాగా తిట్టేవాడు. అమ్మాయిల ముందు అయితే కాస్త మామూలుగా తిడతాడు. అదే అమ్మాయిలు లేకుంటే ఆయన నోటికి అదుపే ఉండదు. బండబూతులు తిట్టేవాడు. అటువంటి సర్ క్లాస్ అంటే రోజూ కాస్త జాగ్రత్తగా ఉండేవాల్లం. అన్ని రోజులు ఒకలా ఉండేవి కాదు. కానీ ఓ రోజు మాత్రం నాకు అచ్చి రాలేదు. నా లైఫ్ లో ఒకేరోజు అన్ని సార్లు N.S. Sir ని కలవడం అంటే అది ఆరోజే..
Date సరిగా గుర్తులేదు. టైం ఉదయం 8:55 అయింది. టైం అవుతుందని చాలా హడావుడిగా స్కూల్ కి వచ్చాను. అప్పటికే నేను ఐదు నిమిషాలు లేట్... ఇంకో ఐదు నిమిషాల్లో ప్రార్థన కూడా మొదలౌతుంది. Fast గా వెల్లి ఎక్కడా ప్లేస్ లేకపోవడంతో లత సైకిల్ పక్కన నా సైకిల్ ని పార్క్ చేశాను. హా హా హా… Merun Red Color Cycle .. ఆ సైకిల్ వయసు ఎంత పెరిగినా చూడటానికి మాత్రం కొత్తగానే కనిపించేది. మరి ఆ సైకిల్ ని లత రోజుకి ఎన్ని సార్లు క్లీన్ చేస్తుండేదో... Any way.. ఎలాగూ లేట్ అయింది కదా అని వెల్లి లైన్ చివర్లో గ్రౌండ్ మధ్యలో అదే పోల్ పక్కన కూర్చున్నాను. ప్రార్థన అయిపోయాక లేట్ గా వచ్చినందుకు ఎవ్వరూ ఏం అనలేదు. "హమ్మయ్య..." అని అనుకునే లోపే మా N.S. సర్ కల్లముందుకొచ్చాడు. నేను మెల్లగా తల దించూంటూ ఉన్నాను. "ఏం తల దించుతన్నావే... సిగ్గులా... లీడర్ లేట్ గా వస్తే మిగిల్నోల్లు సరిగ్గా వస్తారా... In Shirt కూడా చెయ్యలేదే..." అని కాసేపు తిట్టి వెల్లిపోయాడు. "అయ్యబాబయ్.. పర్లేదు.. బూతులేం తిట్టలేదు." అని మనసులో అనుకుని క్లాస్ కి వెల్లాను.
Same day time 9:40 AM.. S.P. Raju Sir Class అయిపోయింది. Next Class N.S…. “బాబోయ్.. సర్ వస్తాడురా ఇప్పుడు” అనుకుని ఐదు నిమిషాలు Wait చేసినా Sir రాకపోయేసరికి నేను వెల్లి టేబుల్ ముందు నించుని అల్లరి చేయకుండా చూస్తున్నట్లు లీడరిజం చూపిస్తున్నాను. ఇంకో ఐదు నిమిషాలైనా సర్ రాకపోయే సరికి సర్ రూం కి వెల్లి "ఆచాజీ క్లాస్ మీదే.." అన్నాను.. "హా వస్తున్నా.. పది నిమిషాలు లేట్ గా వస్తా.. నువ్ పద..." అని సర్ కోపం ఏం లేకుండా అన్నాడు. "ఇప్పటికే పది నిమిషాలు అయిపోయింది ఆచాజీ" అని మల్లీ నేను అనగానే సర్ కాస్త కోపం వచ్చినట్లు " నేను అనింది ఇప్పటినుంచి పదినిమిషాలయ్యా..." అన్నాడు. "వార్ని.. నేను ఓ ఐదు నిమిషాలు లేట్ గా వస్తే తిడతావు. నువ్వు మాత్రం 10+10=20 నిమిషాలు లేట్ గా రావచ్చు..." అని మనసులో అనుకుంటూ క్లాస్ కి వచ్చి మల్లీ టేబుల్ ముందే నించున్నాను. ఓ 600 సార్లు సెకెన్ల ముల్లు టక్ టక్ అనేసరికి సర్ చెప్పిన పది నిమిషాలు అయిపోయింది. ఇంకో 100 సెకన్లకి సర్ వచ్చేశాడు.. నేను వెల్లి నా ప్లేస్ లో కూర్చున్నా.. వచ్చీ రాగనే.. "స్వాతి, సుస్మిత, లత, సువర్ణ, సురేష్, మనికంఠ, అనీల్, శ్రీకాంత్, గురు ప్రసాద్, రామకృష్ణ " అని నేను అప్పటికే బోర్డ్ పైన రాసిన పేర్లని చదివాడు.. సర్ ఒక్కో పేరు చదవగానే మెల్లగా ఒక్కోరు లేస్తూ చివరకు అందరూ పైకి లేచారు. "ఏం... ఏం పనిలేదా.. మాట్లాడకుండా ఉండలేరా... బాగుపడే లక్షణాలు ఒక్కరికి కూడా లేవ్... కూర్చోండి..." అని అరిచేసరికి అందరూ తలదించుకుని నవ్వుకుని కూర్చుండిపోయారు.
"నోట్స్ రాస్కోండి.." అని చెప్పి.. "మానవుని శరీర అవయవాలలో వెన్నెముక అతి ముఖ్యమైనది..." అనుకుంటూ అబ్బాయిల బెంచ్ ల మద్యలో Sir అటూ, ఇటూ తిరుగుతూ చెప్తూ ఉన్నాడు. నేను, సురేష్ గాడు, మహేష్ గాడు Second Bench లో కూర్చున్నాం. సురేష్ గాడు మా ఇద్దరి మధ్యలో కూర్చుని ప్రొద్దు తిరుగుడు విత్తనాలు తినుకుంటూ నోట్ బుక్ లో గెలుకుతున్నాడు.  
అందరం సైలెంట్ గా రాస్కుంటున్నాం. సురేష్ గాడు విత్తనాలు తినుకుంటూ ఆ బొప్పిలు మహేష్ గాడిపైన ఉమ్ముకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సర్ నోట్స్ చెప్పుకుంటూ అలా చివరి బెంచ్ వైపుకి వెల్లి చెప్పడం అపేశాడు. ఎందుకా అని వెనక్కు తిరిగి చూస్తే సర్ మాత్రం ఎందుకో కోపంగా స్వాతి వైపే చూస్తూ నించున్నాడు. స్వాతి మాత్రం సరదాగా కాల్లు బెంచ్ పైన పెట్టుకుని ఆ కాల్లపైన నోట్స్ పెట్టుకుని సర్ చెప్పేది నీట్ గా రాస్కుంటుంది. "ఏంటబ్బా సర్ చెప్పట్లేదు” అని స్వాతి వెనక్కు తిరిగి చూడగానే... "సరిగా కూర్చోవాలమ్మా.. సంస్కారం.. నేర్చుకో.." అని గదురుకుని మల్లీ నోట్స్ చెప్పడం మొదలు పెట్టాడు. అందరూ సైలెంట్ గా ఉన్నా, వెంటనే సురేష్ గాడు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు.. "అరె.. ఎవ్వరూ నవ్వట్లేదే..." అని మల్లీ వెంటనే సైలెంట్ అయిపోయాడు.. స్వాతి మాత్రం తల దించుకుని కాల్లు కింద పెట్టి, నోట్ బుక్ బెంచ్ పైన పెట్టుకుని  రాయడం మొదలు పెట్టింది.
"అమ్మాయి కాబట్టి "సరిగా కూర్చోవాలి.. సంస్కారం.." అన్నాడురా... అదే అబ్బాయి అయితే "సరిగా కూర్చొరా సొట్టనాయాలా" అనేవాడురా అని నాతో చెప్తూ "విత్తనాలు కావాలా" అని నాకు విత్తనాలు ఉన్న చెయ్ చూపిస్తూ మెల్లగా కాల్లు బెంచ్ పైన పెట్టాడు. అప్పటికే మొదటి బెంచ్, టేబుల్ దెగ్గరికి వచ్చేసిన సర్ నోట్స్ చెప్పడం అపేసి మల్లీ సైలెంట్ అయిపోయాడు… కాల్లు బెంచ్ పైన పెట్టుకున్నానని కూడా  గుర్తులేని సురేష్ గాడు దించిన తల ఎత్తగానే... "బాగా కూర్చోరా బాట్కో... ఒక సారి చెప్తే అర్థం కాదా... సిగ్గులేదా దున్నపోతు లెక్క ఉండావే... వచ్చినప్పటినుంచి బరగొడ్డులెక్క ఏదో మేస్తండావ్ (తింటున్నావ్)..  టీచర్ కొడుకువే కాని పావలా సంస్కారం లా..." అని చెడా మడా తిట్టి మల్లీ నోట్స్ చెప్పడం మొదలుపెట్టాడు.
వెంటనే నేను "నిజమేరా సురేష్... నువ్వు అన్నట్లు అబ్బాయిలనైతే "సొట్టోడా... బాట్కో... అనే అంటాడు." అని కాస్త నవ్వాను. వాడు మూతి ముడుచుకుని, తల దించుకుని, తింటున్న విత్తనాలని బ్యాగ్ లో పడేశాడు. ఇంకా ఓ పేజీ నోట్స్ చెప్పగానే బెల్ కొట్టేశారు.. అప్పట్లో సర్ బెల్ కొట్టిన తర్వాత అర క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకు వెల్లిపోయేవాడు.. వెల్లిపోయిన వెంటనే సురేష్ గాడిని చూపిస్తూ అందరూ నవ్వుతున్నారు. నేను మాత్రం "హమ్మయ్య.. ఈరోజుకు సర్ క్లాస్ అయిపోయిందిలే” అనుకుని N.S. నోట్స్ లోపల పెట్టి, Next వచ్చే నాగభూషణం సర్ తెలుగు నోట్ బుక్ బయటకు తీశాను.
"ఈయన క్లాస్ ఈరోజుకు అయిపోయింది లే" అనుకున్న నా ఆనందం కాసేపైనా ఉండలేదు.. మధాహ్నం అన్నం తిని, నాకు తినింది అరగక అటూ ఇటూ తిరుగుతుంటే N.S. సర్ చూసి నన్ను లోపలికి పిలిచాడు. "నీ సైకిల్ కి బార్ కడ్డీ ఉందా.. ఎక్కువ బరువు ఉంటుందా" అని నన్ను నిలబెట్టి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాక "హా ఆచాజీ.. నా సైకిల్ చాలా తేలికగా ఉంటుంది... చాలా బాగుంటుంది అన్నాను.." సర్ వెంటనే బయటకొచ్చి చెప్పులు వేస్కుంటూ "అక్కడిదాకా వెల్లొస్తా, సైకిల్ ఇవ్వు.. పద.." అని నన్ను గ్రౌండ్ లోకి పిలుచుకెల్లాడు.. సరే ఆచాజీ అని నేను సైకిల్ బయటకు తీసి ఇవ్వగానే మెల్లగా దాన్ని దొలుపుకుంటూనే బయటకు తీస్కెల్లాడు.. "ఇలాగే వెలతాడా, ఏమన్నా పైకెక్కి తొక్కుతాడా" అని అనుకుంటూ నేను మల్లీ క్లాస్ వైపు వెల్తుంటే, ఓ ఐదు నిమిషాల్లో సర్ వెల్లకుండా వెనక్కు వచ్చేశాడు.  "ఏమైంది సర్" అని నేను అడగంగానే.. "చాలా తేలికగా ఉంటుంది అంటివి కదయ్యా... అంత బరువు ఉంది అది..." అని సైకిల్ నా చేతికి ఇచ్చి... "పర్లేదులే నేను నడుచుకుంటూ వెల్లొస్తా" అని గేట్ దాటి నడుచుకుంటూనే వెల్లిపోయాడు. "హా హా హా... బలే ఉన్నారు సర్ మీరు" అని మనసులో అనుకుంటూ ఉదయం లత సైకిల్ పక్కన పార్క్ చేసిన నా సైకిల్ ని ఇప్పుడు బాయ్స్ స్టాండ్ లో పార్క్ చేసి నేను క్లాస్ కి వెల్లిపోయాను.
కనీసం ఇప్పటికన్నా అయిందా అంటే అదికూడా లేకుండా సాయంత్రం 4:00 కి N.S. సర్ మల్లీ క్లాస్ కి వచ్చేశాడు. “అరె.. ఈ క్లాస్ హెడ్ మాస్టర్ ది కదా ఈయన ఎందుకు వచ్చాడు" అని నేను మనసులో అనుకుంటూ ఉండగానే... "అందరూ N.S. నోట్స్ లు, English నోట్స్ లు తీస్కుని ఆవాసం వైకి రాండి..." అని చెప్పి సర్ డోర్ బయట నించుని ఒక్కోర్ని బయటకి పంపిస్తున్నాడు. "రెండు Subjects నోట్స్ లు ఎందుకబ్బా..." అని అనుకుంటూ అందరం పైకి వెల్లగానే సర్ వచ్చి అందర్నీ బాగా గ్యాప్ లు ఇచ్చుకుంటూ కూర్చోపెట్టి N.S. చదవమన్నాడు. సర్ చెప్పగానే మేమందరం గట్టిగా N.S. చదువుతూ అలా ఓ 35 నిమిషాలు చదివేశాము. సర్ మాత్రం కిటికీ నుంచి బయటకు చూస్తూ ప్రకృతిని ఆశ్వాదిస్తూ ఉన్నాడు.. కానీ అప్పుడు మాకు ఓ 15 నిమిషాలు గడిస్తేకానీ అర్థం కాలేదు మా సర్ ఎందుకు కిటికీ నుంచి బయటకు చూస్తున్నాడో.." కాసేపు అలాగే చూసిన తర్వాత Sudden గా మా వైపు తిరిగి "ఆ.. ఇంక N.S. ఆపండి.. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్కులు తీసి చదవండి.." అన్నాడు. అలా సర్ అన్నతర్వాత ఇంక బెల్ కొట్టడానికి 10 నిమిషాలు Time ఉంది అంతే... "ఆ కాస్త టైం లో ఇంగ్లీష్ ఏం చదవాలబ్బా, ఎందుకు చదవమన్నాడబ్బా.." అని అలోచిస్తూ ఇంగ్లీష్ బుక్ తెరిచి చదవడం మొదలు పెట్టేలోపే హెడ్ మాస్టర్ మా ముందుకు వచ్చేశాడు. "హా ఏం మధుసుధన్.. ఇంగ్లీష్ బాగా చదివిస్తున్నావా" అని మా H.M Sir అనగానే... మా N.S. సర్ "హా సర్ చదివిస్తున్నాను" అన్నాడు.  కాస్త అలోచిస్తే, మల్లీ వేరే సర్ చెప్తే తెలిసింది.... అసలు జరిగింది ఏంటనే... మా హెడ్ మాస్టర్ బయటకు వెల్తూ వెల్తూ మా N.S. సర్ ని పిలిచి "నేను బయటకు వెల్తున్నాను.. మల్లీ వస్తాను.. నువ్వు అంతలోగా పిల్లల్ని ఇంగ్లీష్ చదివించు" అని చెప్పి బయటకు వెల్లిపోతే, ఈయనేమో ఇలా ఉన్న 40 నిమిషాల క్లాస్ లో 30 నిమిషాలు N.S. చదివించి చివర్లో కావాలనే ఇంగ్లీష్ బుక్ తెరిపించాడు. ఇంక కిటికీ నుంచి బయటకు చూస్తూ అశ్వాదించింది ప్రకృతిని కాదు... మా హెడ్ మాస్టర్ బయటకెల్లి మల్లీ తిరిగి వచ్చే రోడ్డు ఆ కిటికీ నుంచి సరిగ్గా కనిపిస్తుంది... అలా మా H.M. కిటికీ నుంచి కనిపించిన తర్వాతే సర్ ఇంగ్లీష్ బుక్ ని తీయమన్నాడు...
హెడ్ మాస్టర్ రాగనే బెల్ కొట్టడంతో ఇంక చదవడం అపేసి అందరం క్లాస్ కి వెల్లిపోయాం. “వామ్మో.. వామ్మో.. ఎంత Cunning గా అలోచించాడు మా N.S. సర్” అని మేము నవ్వుకుంటూ ఇల్లకు వెల్లిపోయాం. హా హా హా ఒకే రోజు నాలుగు సార్లు N.S. సర్ ని కలవడం నేను 10th చదివిన సంవత్సర కాలంలో అదే మొదటిసారి, చివరి సారి. హా హా హా .. ఇన్నిరోజులతర్వాత ఈ సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ మా N.S. సర్ ని తలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. Thank You Sir, We all miss you… We really enjoyed your classes and your scolding style too….

7.  ఆదివారం అందమైన డ్రస్ లు
అన్ని స్కూల్లలో కనీసం శనివారం అయినా Color Dress లు Allow చేసేవారు. కానీ మా స్కూల్ లో Its impossible. ఓసారి మా సీనియర్స్ అడిగితే... "ఓ పోలిస్ శనివారం కలర్ డ్రస్ వేస్కుని ఎవడికన్నా Instructions ఇస్తే వింటాడా...? అక్కడ డ్రస్ కి అంత విలువ ఉంటుంది.. ఇక్కడ కూడా అంతే” అని చెప్పేసరికి ఇంక అడగడం మానేశారు.
So…. మమ్మల్ని మేము కలర్ డ్రస్ లలో చూస్కోవాలి అంటే రెండే చాన్సులు. ఒకటి.. మన పుట్టినరోజు అయి ఉండాలి...;  రెండు... అది ఆదివారం Extra Class అయినా అయి ఉండాలి. అప్పుడప్పుడు ఒక్కోసారి ఒకరిది వచ్చే Birthday లను పక్కన పెడితే, 10Th Class కావడం వల్ల Every Sunday ఉండే Extra Class లని బలే Enjoy చేసేవాల్లం. Morning 9:00 to 11:00 Class. మల్లీ కాసేపు క్రికెట్ ఆడుకుని ఇంటికి వెల్లేవాల్లం.
Tuition కి అందరం కలర్ డ్రస్ లో వస్తుంటే క్లాస్ కి వచ్చే కలనే వేరు. అందరిలో Special ఎవరు అంటే మాత్రం నాకు వెంటనే జయ & విజయ నే గుర్తొస్తారు. School Dress అయితే ఎలాగూ Same White & కాశాయం Color డ్రస్ లో రావాల్సిందే... ఈ Every Day School Dress లు పక్కన పెడితే ఆదివారం Civil Dress (Color Dress) లలో కూడా  ఒకేలా... Same color, Same Style Dress లు వేస్కుని వచ్చేవారు.. అది కూడా ఒక్కో ఆదివారం ఒక్కోలా వచ్చేవాల్లు  “అరె ఏ షాప్ లో దొరికాయ్ రా బాబు.. ఇన్ని Same డ్రస్ లు” అని మహేష్ గాడు నాతో ఎన్నోసార్లు అనేవాడు. నిజంగా చాలా బాగుండేది 10th Class లో వాల్ల Combination… వాల్లు ముందే ఒకరికొకరు Mirror Image లాగా అచ్చం ఒకేలా ఉంటారు. ఇద్దరూ Same height, same look లో ఉండటంతో అంత సులువుగా వేరేవాల్లు ఎవరూ గుర్తు పట్టేవాల్లు కాదు. Only మా క్లాస్ వాల్లమైతే రోజూ చూస్తుంటాం కాబట్టి కొన్ని గుర్తులు పెట్టుకుని గుర్తు పట్టేవాల్లం. హా హా హా Really they are special look for our class.
ఇంక మేమైతే ఒక్కో ఆదివారం ఒక్కోలా కలర్ డ్రస్ లలో చాలాబాగా వచ్చేవాల్లం. నిజంగా కలర్ డ్రస్ లలో అందరూ నడుచుకుంటూ వస్తుంటే చాలా కొత్తగా ఉండేది. అలా Tuition కి వచ్చి మల్లీ క్లాస్ అయ్యాక సైకిల్ లని పట్టుకుని నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ వెల్లేవాల్లం. అప్పుడప్పుడు ముందరే వెల్తున్న అమ్మాయిలను చూసి మహేష్ గాడు. "రే భరత్ గా... అమ్మాయిలకన్నా, వాల్ల డ్రస్ లే చాలా అందంగా ఉంటాయ్ రా.." అని అనేవాడు.. "నీకు అలా ఎందుకు అనిపించిందిరా" అని నేను అనగానే... "నిజం రా.. ఇన్నిరోజులనుంచి స్కూల్ డ్రస్ లలో ఒక్కరు కూడా బాగా కనిపించేవాల్లు కాదు.. ఇప్పుడు మాత్రం ఈ డ్రస్ లలో బలే ఉన్నారురా.." అనేవాడు.. "హా హా నిజమేరా... వాల్ల డ్రస్ లే వాల్లకి అందం" అని నేను కూడా తల ఊపేవాన్ని…
8.  సరస్వతీమాత పూజ Special
సరస్వతీ మాత.... మా స్కూల్ లో స్టేజ్ కి ఓ రెండు మీటర్ల దూరంలో ఓ చిన్న గుడిలాగా ఉండేది. ఇప్పటికి కూడా ఎప్పుడన్నా స్కూల్ కి వెల్తే ముందు మాతని మొక్కున్న తర్వాతే ముందుకు వెల్తాను.
ప్రతీ శనివారం ఏదో ఒక Section వాల్లు ఏదో ఒక Class వాల్లు మాతని బాగా అలంకరించి పూజ చేయాలి. తర్వాత అన్నీ క్లాస్ లు తిరిగి సర్ వాల్లకి ప్రసాదం పంచి పెట్టాలి. అలా ప్రతీ వారం, శనివారం రోజున మా స్కూల్ లో సరస్వతీ మాతని నిండుగా అలంకరించి పూజించుకునేవాల్లం. ఇంక రోజూ విషయానికి వస్తే... ప్రతీ రోజు దీపారాధన మామూలే...
అలా సరస్వతీమాత పూజ చేయడం, చాన్స్ రావడం అంటేఅందరికీ చాలా ఆనందం. 10th Class లో Busy వల్ల, Class ల వల్ల మాకు చాలా సార్లు చాన్స్ రాలేదు కానీ, సరస్వతీ మాతతో నా జ్ఞాపకాలకోసమే అన్నట్లుగా ఓసారి మాత్రం చాన్స్ వచ్చింది...
31st December 2005. రేపు ఉదయం New Year.. సరిగ్గా ఓ సంవత్సరం క్రితం స్కూల్ బయట నోటిస్ బోర్డ్ పైన "జనవరి దండగ... ఉగాది పండుగ" అని గంగాధర్ సర్ రాసినట్లు బాగా గుర్తు.. ఎందుకంటే మా స్కూల్ English New Year కి Full గా Opposite.
31st Dec 2005 శనివారం కావడం, మాకు పెద్దగా క్లాస్ లు లేకపోవడం & మేము పట్టుపట్టి తీస్కోవడంతో ఆరోజు సరస్వతీమాతని పూజించుకునే అవకాశం మాకు వచ్చింది. నేను, సురేష్, మణికంఠ, మహేష్, నాగమౌనిక, తేజశ్విని, స్వాతి, లత, సుస్మిత, జయ, విజయ.. మొత్తం 11 మంది పూజకోసం కష్టపడినట్లు గుర్తు. సర్ లు అందరూ ఆంగ్ల కొత్తసంవత్సరానికి వ్యతిరేకమే అయినా మా మనసులో మాత్రం, "మనం చేసే ఈ పూజ ఈ సంవత్సరంలో చివరి పూజ & ఈ స్కూల్ లో మనం చేసే చివరి పూజ కూడా..." అని అనుకుని చాలా బాగా చెయ్యాలని Deside అయ్యాం.
30th Dec 2005 Evening 4:30 PM. ఇంగ్లీష్ క్లాస్ అయిపోంగానే మా 11 మంది బ్యాగ్ లు ఓ చోట పెట్టి Collect అయిన డబ్బు ఎంత ఉందో లెక్కపెట్టుకున్నాం., ముందే క్లాస్ అందరితో ఒక్కోరితో 5 Rupees Collect చేసి వచ్చిన 150 Rupees  కి నేను, స్వాతి, సురేష్, లత, మణికంఠ, మహేష్, జయ 10 Rupees Each Add చేసి, మొత్తం 220 Rupees చేసినట్లు గుర్తు. క్లాస్ అవంగానే నేను, మహేష్ బయటకెల్లి కుంకుమ, పసుపు తెచ్చి, మిగిలిన డబ్బు రేపు ఉదయానికి కొబ్బరికాయలకి, పూల మాలకి ఉంచుకున్నాం. తర్వాత మేము Tanker నుంచి Bucket తో నీల్లు తెచ్చి ఇస్తుంటే, మాత విగ్రహానికి చుట్టూ ఉన్న Stone Columns కి చుట్టూ ఓ చీర కట్టి Neat గా మాతకి స్నానం చేయించి మల్లీ మాతకి ఇంకో కొత్త చీర కట్టి అలంకరించారు. Time 6:20 PM అయింది.. మాతకి అలంకరన అయిపోయింది. అలా ఓసారి మాత ముఖంలో కల చూసి, అందరం నడుచుకుంటూ మాట్లాడుకుంటూ రేపు నేను పాయసం, నువ్వు పులిహోర అని కేటాయించుకుంటూ చివర్లో ఓ Shop లో పూలమాల Order ఇచ్చి ఎవరి ఇల్లకి వాల్లం వెళ్ళిపోయాం.

31st Dec 2005 Morning 7:00… అమ్మతో పులిహోర చేయించుకుని మహేష్ గాడి ఇంటికి వెళ్ళి, ఇద్దరం కలసి దండ తీస్కుని 8.10 కి స్కూల్ కి వచ్చాము. వచ్చేదారిలో స్లోగా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న జయవిజయలని క్రాస్ చేసి వచ్చాం. వచ్చిన తర్వాత వెంటనే మాతకి దండవేసి బాగా అలంకరించి అప్పుడే టెంకాయలతో వచ్చిన సురేష్, మణికంఠలని పలకరిస్తూ ఆ టెంకాయలని మాత ముందే ఉంచాం. అప్పుడు ఓ 12 టెంకాయలు తెస్తే అందరూ సర్ లు ఒక్కో టెంకాయ కొట్టేవారు.
Time 8:30… ప్రార్థనకి ఇంకో 20 నిమిషాలే ఉంది. "నేను బియ్యం పాయసం తెచ్చా... మరి నువ్వేం తెచ్చావ్" అని లత స్వాతిని అడగంగానే... "నేను బెల్లం పాయసం తెచ్చా.." అని మహేష్ గాడు Reply ఇచ్చాడు... లత కోపంగా చూడకముందే "నీకు బెల్లం షాప్ ఉందని మాకు తెల్సులే మహేష్..." అని స్వాతి గట్టిగా నవ్వింది. అందరం అలా మాట్లాడూంటూ నవ్వుకునే సరికి టైం 8:50 అయింది. ఇంక స్వాతి, జయ మాత్రమే ప్రార్థన దెగ్గరికి వెల్లి సర్ లకి టెంకాయలు అందించడం, అదీ ఇదీ చూస్తున్నారు. మేము మాత్రం స్టేజ్ కి దూరంగా ఉన్న ఆవాసంలో ప్రసాదం అంతా నీట్ గా పెట్టుకుంటూ "యాకుందేందు తుశార హార ధవళా..." అని అందరూ పలికే ప్రార్థనని పలుకుంకుంటూ మేముకూడా పని చేస్కుంటూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అవ్వంగానే అందరం వెళ్ళి మాతని బాగా మొక్కుని సర్ వాల్లు కొట్టంగా మిగిలిన 4 టెంకాయలని స్వాతి, సురేష్, లత, మణికంఠ కొడితే చూసి 10th లో మంచి మార్కులు రావాలి అని బాగా మొక్కుని, బొట్టు ఉన్నా కూడా మల్లీ దానిపైనే బొట్టు పెట్టుకుని, టెంకాయి కొట్టిన తర్వాత మిగిలిన కొబ్బరి చిప్పలను అన్నిటినీ తీస్కుని మల్లీ ఆ ప్రసాదాల దెగ్గరికి వెల్లిపోయాం.
"మేమందరం మా ప్రసాదాలని ముందే సరస్వతీ మాత ముందు పెట్టేశాం.. మరి నువ్ ఎందుకు పెట్టలేదు... బ్యాగ్ లొ పెట్టుకుంటే అది పాయసం అవుతుందేకానీ, ప్రసాదం ఎలా అవుతుంది.." అని బ్యాగ్ లోంచి పాయసం బాక్స్ ని అప్పుడే బయటకు తీస్తున్న తేజశ్విని తో స్వాతి అంటుంది. మేము అందరం ఒక్కో చిప్ప తీస్కుని అందులోంచి చాలా కష్టపడి కొబ్బెరని బయటకి తీస్తున్నాం... మొత్తానికి ప్రసాదాలన్నీ రడీ అయిపోయాయ్. First Class కూడా Start అయిపోయింది. "ప్రసాదాలకి పదకొండు మంది అవసరమా..." అని స్వాతి అనడంతో మహేష్, మణికంఠ, జయ, నాగమౌనిక కాస్త Feel అయ్యి Class కి వెల్లిపోయారు. ఇంక మేము ఒక్కోరం ఒక్కో ప్రసాదం బాక్స్ పట్టుకుని ప్రతీ క్లాస్ తిరిగి ప్రసాదాలు పంచి లాస్ట్ లో మా క్లాస్ కి మాత్రం ప్రతీ స్టూడెంట్ కి ప్రసాదాలు పంచి సరదాగా మిగిలిన నా పులిహోరని మహేష్ గాడు, లత బియ్యం పాయసం నేను, స్వాతి చెక్కెర పొంగలిని మణికంఠ.. అనుకుంటూ అందరం బాగా Full గా తినేశాం.
హా హా హా... నిజంగా సరస్వతీ పూజ చేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుందో, చీర కట్టి అలంకరించిన తర్వాత మాతని చూస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది.
9.  Cultural Activities Super…
"బాలురు... వామర్దావృత...
బాలికలు... దక్షినర్దావృత..
ఆహ్రమ.. దక్ష...
ఆదిత్యస్య నమస్కారాం....." అని 4:10 కి  SPL అరుపులు వినిపించాయి. సూర్యనమస్కారాలు మొదలయ్యాయి. మేము  10th Class అవడంతో Regular గా Attend అయ్యేవాల్లం కాదు. కానీ ఆరోజెందుకో సర్ వెల్లమన్నాడు. Fast గా వెల్లి Join అయిపోయి Line లలో Last లో నించున్నాం.
          "ఓం మిత్రాయనమః... ఏక్..." అని మొదలు పెట్టి మొత్తం ఓ పదిసార్లు దాకా చేయించారు. నిజంగా సూర్యనమస్కారాలు No-1 Excersice. సరిగ్గా చేస్తే Body చాలా బాగుంటుంది. మా స్కూల్ లో మాత్రం Maximum రోజూ చేయించేవాల్లు.
ఇవొక్కటే కాకుండా.. యోగచాప్, ఘోష్, కోలాటం, చెక్కబజన... ఇవన్నీ చాలా సందడిగా ఉండేవి.
యోగచాప్: ఓ పెద్ద స్కేల్ సైజ్ లో ఒక కర్ర పైన, ఓ చిన్న స్కేల్ లో సగం సైజ్ లో ఇంకో కర్ర కింద, మధ్యలో సవ్వడి చేయడానికి గిలకల్లాంటివి పెట్టి మొత్తం 100 మంది స్టూడెంట్స్ ని ఓ పది లైన్లలో నించోబెట్టి చేయించేవారు. నిజంగా మా స్కూల్ కి ఈ Activities అన్నీ Super Attraction. ప్రక్క స్కూల్ వాల్లు చూసి "వాహ్" అనేవారు.
          యోగచాప్ అనగానే నాకు వెంటనే ఓ పాట గుర్తొస్తుంది … "ఈ దేశం మనదేనని, మనమంతా ఒకటేనని..." అని మొదలు పెట్టి మధ్యలో... "నడుం కట్టి నడువరో, అడుగు ముందుకేయరో...నడుం కట్టి నడువరో, అడుగు ముందుకేయరో...
ఉత్తరాన కాశ్మీరం మాదంటూ వస్తున్నరు,
దక్షిణాన కన్యకుమరి కన్నెమేరి అంటున్నరు,
తూర్పున అస్సాములో, పడమట పంజాబులో... తూర్పున అస్సాములో పడమట పంజాబులో...
అగ్గి రగులు కున్నదిరో బగ్గున మండిందిరో... అగ్గి రగులు కున్నదిరో బగ్గున మండిందిరో...
"ఈ దేశం మనదేనని, మనమంతా ఒకటేనని... చాటి చెప్ప నిలువరో, కాంతిని వెదజల్లరో...
నడుం కట్టి నడువరో, అడుగు ముందుకేయరో... నడుం కట్టి నడువరో, అడుగు ముందుకేయరో..." 
అని సరిగ్గా మనసు పెట్టి వింటే రక్తం వేడెక్కేలా ఉండేవి ఆరోజుల్లో దేశభక్తి గీతాలు. మేము యోగచాప్ చేసేటపుడు జయ, విజయ ఈ పాట పాడేవాల్లు. అసలు యోగచాప్ కి ఈ పాట Perfect match... జయ, విజయ కూడా Excellent గా పాడేవాల్లు. వాల్లు పాట పాడుతుంటే... ఆ పాటలోని పంక్తులను బట్టి మా Steps మారిపోతుంటే చూడటానికి కూడా ఎంతో బాగుండేది…
          నేను, మహేష్, లత, స్వాతి, సువర్ణ, సురేష్... ఒక్కరేంటి... అందరూ యోగచాప్ Team లో ఉండేవాల్లం. ఓ 100 మంది పది లైన్లలో నించుని, జయ, విజయ పాడే పాట పల్లవితో పాటు మొదలు పెట్టి, పాటలో చరణం మొదలవ్వగానే అందరం లైన్లలోంచి At a time Split అయిపోయి With in seconds లో భారతదేశం Map shape లో ఓ సారి, ఓ కారం Shape లో ఓసారి, సరస్వతీ మాత చేతిలోని వీణ Shape లో ఓసారి, స్వస్తిక్ Shape లో ఓసారి వెంటవెంటనే Fast గా వెల్లిపోయేవాల్లం. నిజంగా కాస్త పైనుంచి చూస్తే Exact Shapes కనిపించేవి. ఆ పాట పంక్తులను అనుసరించి మారే మా గమకాలు, ఓ రిధం లో ఉండే ఆ సవ్వడి, మద్యలో ఒకేసారి అందరం కూర్చోవడం, లేవడం. మల్లీ చరణం అయిపోగానే Fast గా మొదటిలాగా లైన్లలో నించోవడం... అబ్బా... ఎంత బాగుండేదో అసలు.
          హా హా ఇవన్నీ తలుచుకునేసరికి నేను లైన్లో నించున్నట్లు, యోగచాప్ నా చేతులో ఉన్నట్లు, అటూ ఇటూ అనుకుంటూ సవ్వడి చేస్తున్నట్లు, జయ, విజయల Voice వింటున్నట్లు చాలా బాగుంది ఈ Feeling.         
చక్కబజన, కోలాటం, ఘోష్..  యోగచాప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మూడిటిలో ఏదో ఒకదాన్లో మాత్రమే ఉండచ్చు... అమ్మాయిలు కొంతమంది కోలాటం, ఇంకొంతమంది ఘోష్ వంశీ లో ఉండేవాల్లు.. అబ్బాయిలు మాత్రం కొంతమంది చెక్కబజన, ఇంకొంతమంది ఘోష్ లో "ఆనక్"(Drums) , "శంఖ" లో ఉండేవాల్లం. నేను మాత్రం చెక్కబజనకి లీడర్ గా ఉండేవాన్ని. సురేష్ గాడు ఘోష్ కి లీడర్ గా ఉండేవాడు.
ఇంక కోలాటం చేసేటపుడు అమ్మాయిలను చూస్తే చాలా ముచ్చటగా అనిపించేది అసలు. ఎంత బాగా కర్రలని కలుపుకుంటూ వెల్లేవాల్లో నిజంగా... అసలు ఆ కర్రల సవ్వడి ఎంతో వినసొంపుగా ఉండేది.. హా హా హా వాల్ల Steps, Different Dressing style Super గా ఉండేవి అసలు..
"దిగు దిగు దిగునాధ... నగన్నా.. దిగురా సుందర నాధా... నగన్న..." అని నేను పాడే చెక్కబజన పాట, దానికి తగ్గట్టుగా ఆ చెక్కల సవ్వడి, తలకి కట్టుకునే కాశాయం రిబ్బన్ లు అంతా జ్ఞాపకమే...
ఇంకా ఘోష్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు... ఆ Drums Sound వింటేనే Body అంతా Full Mood లోకి వచ్చేది. మా స్కూల్ కి ఓ అందం ఈ ఘోష్. ఆనక్, వంశీ, పనవ, త్రిభుజి, శంఖ, బల్లెం లాగా ఇంకోటి అన్నీ అందులో భాగాలు. వీటిలో ఏది లేకున్నా అందులో అందం రాదు.  ముందు ఓ నలుగురు ఆనక్ (Small Drums) కొడుతుంటే, మల్లీ ఒకరు పనవ (Big Drum) కొడుతుంటే, ఇంకొంతమంది వంశీ (flute) వాయిస్తుంటే, వెనక ఇంకొంతమంది శంఖ  ఊదుతుంటే... వాహ్... ఎంత బాగుండేదో అసలు..
మొత్తానికి మా స్కూల్ లో ఈ Cultural Activities Super. ఎప్పుడన్నా అన్నీ స్కూల్ లు కలసి ఏదైనా Programme చేసినప్పుడు ఇలా మా స్కూల్ Famous అయ్యేది.
హా హా బాబోయ్.. కన్నీల్లు వచ్చేస్తున్నాయ్ అన్నీ గుర్తొస్తుంటే... Cool రా భరత్ Cool...
10.                        ఇప్పుడు నేను అందరి దృష్టిలో Intelligent నే...
Date సరిగా గుర్తులేదు. Time Evening 3:00 to 5:00 మధ్యలో ఉండచ్చు...Public Exams కి ఇంకో నెల టైం ఉంది అంతే.. ఓ పదిరోజులముందు రాసిన Prefinal math’s పేపర్ ఇస్తాం అని రామాంజనేయులు సర్ రెండు Section వాల్లని పిలిచి మా ఆవాసం (Mess for hostel students) లో కూర్చోపెట్టాడు.
రామాంజనేయులు సర్.. ఆ రోజు వరకు నన్ను ఎవరన్నా నమ్మకుండా ఉన్నారు అంటే అది ఆ సర్ ఒక్కడే.. Prefinal Exam… Out చేసేకి అస్సలు కుదరదు.. And papers correction కూడా ఆయనే చేశాడు. అప్పట్లో ఆయనది కాస్త Strict correction ... Math’s paper-1 & Paper-2  రెండూ ఇస్తున్నాడు. మొదట Paper-1 ఇచ్చాడు. నాతో పాటు చాలా మందికి 50/50 వచ్చాయి. So No problem వెళ్ళి కూర్చున్నాను. తర్వాత Paper-2 ... అందరి పేపర్లూ పేర్లు చదువుకుంటూ మార్కులు పైకి చెప్తూ ఇస్తున్నాడు.
Sir Door కి ఎదురుగా White Plastic Chair లో కూర్చున్నాడు, సర్ కి ఓవైపు అమ్మాయిలు, ఇంకో వైపు అబ్బాయిలు కూర్చున్నాము. రామాంజనేయులు సర్ కాబట్టి రోజూ మొదట్లో కూర్చునే నేను ఈరోజు మాత్రం చివర్లో కూర్చున్నాను. అమ్మాయిల ముందు వరుసలో మాత్రం బాగ్య, దీప్తి, వాల్ల పక్కనే లత కూర్చున్నట్లు బాగా గుర్తు. లత మాత్రం రోజూ వెనక కూర్చునేది ఇప్పుడు మాత్రం ముందు కూర్చుంది... హా హా...
Any way… Sir marks చెప్తూ ఇస్తూ సగం పేపర్స్ Already ఇచ్చేశాడు.. నేను మాత్రం బాగా చదివేవాల్ల మార్క్స్ వింటూ, అన్నీ ఓచోట రాస్కుంటూ ఉన్నాను. ఆ పేపర్ చాలా Tough గా రావడంతో ఎవరికీ 45 కూడా రాలేదు. సురేష్ గాడికి 37, సుబ్రమణ్యం 39, సందీప్ 41 అని Sir చదివాడు. అంతకంటే ముందు క్లాస్ First బాగ్యకి 46.5 , ఇంక దీప్తి కి 46, స్వాతి కి 42, లతకి 41, బిందుకి 44 అని అందరి మార్కులు సర్ చెప్పగానే బుక్ లో రాసి పెట్టుకున్నాను. హా హా ఆ Books అన్నీ నాతో ఇప్పటికీ బద్రంగానే ఉన్నాయి. అప్పట్లో Math’s లో 100/100 Marks అంటే చాలా విలువ ఉండేది. అలాంటిది బాగ్యకే 97 Marks వచ్చాయి.. ఇంక ఎవారికీ రావులే అనుకుని నేను కూడా Cool అయిపోయాను. “ఇంత మందికి ఇంత తక్కువ Marks వస్తున్నాయ్ అంటే పక్కాగా నేను కూడా ఏదో తప్పు చేశే ఉంటా” అనుకుని నా పేపర్ కోసం Wait చేస్తూ ఉన్నాను.
ఓ ఐదు నిమిషాల తర్వాత "భరత్ కుమార్ రెడ్డి" అని సర్ పిలిచేసరికి నేను లేచి ముందుకెల్లాను. నలభై తొమ్మిదీ నర్ర (49.5) అని చదివి... "వీడు రా కింగ్ అంటే... అందరిలో వీడొక్కడికే 100/100 వచ్చాయ్" అని చెప్పినా వీపుపైన శభాష్ అంటూ అలా కొట్టాడు. అయన పొగిడిన పొగడ్తలో ప్రతీ పదం నాకు ఇప్పటికీ గుర్తుంది. మామూలుగా పొగిడినందుకో, 100/100 మార్కులు వచ్చినందుకో ఆనందంగా లేదు కానీ... "పేపర్ లీక్ చేస్కున్నావ్ కదూ" అని అడిగి నన్ను అవమానించిన సర్ నన్ను ఇప్పుడు ఇంత బాగా పొగిడే సరికి చాలా ఆనందమేసింది. ఆరోజు సర్ ఎంతో ఆనందంగా నేను రాసిన పేపర్ ని మల్లీ మల్లీ పేజీలు తిప్పుకుంటూ గుడ్ గుడ్ అని పొగుడుతూ మొత్తం పేపర్ అంతా చూసినట్లు గుర్తు.
ఆరోజు ఇంటికి వెళ్ళేటపుడు దారిలో అనుకున్నా... "హమ్మయ్య... ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను అందరి దృష్టిలో Intelligent ని అని చాలా గర్వంగా Feel అయ్యాను. తర్వాతరోజు నాకు ఒక్కడికే 100/100 వచ్చాయని మా Maths S.P.Raju సర్ కూడా నన్ను పిలిచి పేపర్ అంతా చూసి బాగా పొగిడాడు.

11.                    మా Head Master చేసిన అతి పెద్ద తప్పు..
That may be Jan 2006… అప్పట్లో Final Exams కి ఇంక రెండు నెలలే ఉందని Night Classes పెట్టేవాల్లు, తర్వాత మల్లీ ఉదయం కూడా 6:00 కే Extra Class పెట్టేవారు. రోజూ సాయంత్రం స్కూల్ అవ్వంగానే ఇంటికి వెల్లడం, రడీ అవ్వడం, మల్లీ వెంటనే ఆల్లగడ్డకి వచ్చి అంకాల్ సర్ ఇంట్లో Dinner బాక్స్ పెట్టి స్కూల్ Extra Class కి వచ్చేయడం అలవాటైపోయిన్నింది. రాత్రి మల్లీ వెళ్ళి, మల్లీ ఉదయం 6:00 కి లేచి Class కి వచ్చేవాల్లం. Almost అందరం Night Dress లలోనే Class లకి వచ్చేవాల్లం.
అన్నీ రోజుల లాగానే, ఆరోజు కూడా నైట్ క్లాస్ మొదలైంది. గ్రౌండ్ మధ్యలో బెండ్ అయి ఉన్న Silver Color Pole చుట్టూ అబ్బాయిలమంతా కూర్చుని ఉన్నాం. అప్పట్లో Lights చాలా తక్కువ Place లలో ఉండటం వల్ల ఇష్టం వచ్చిన చోట కూర్చోలేకపోయేవాల్లం. అమ్మాయిలు మాత్రం మాకు దూరంగా స్టేజ్ పక్కన కొందరు, కంప్యూటర్ రూం దెగ్గర ఇంకొందరు కూర్చుని చదువుకుంటూ ఉన్నారు. అబ్బాయిలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి పోల్ కి అటువైపు కొందరం, ఇటువైపు కొందరం కూర్చుని, తల దించుకుని చదువుకుంటున్నాం.
అది హిందీ క్లాస్.. రహ్మాన్ సర్ క్లాస్. Night అవడంతో మా హిందీ Madam రాలేదు. కానీ పక్క Section Hindi Sir వచ్చాడు. కాస్త మాట తడబడినా హిందీ మాత్రం చాలా బాగా చెప్పేవాడు. Same Time చాలా మంచోడు కూడా.. అప్పుడప్పుడు తిట్టేవాడు, మల్లీ వెంటనే నవ్వేవాడు. అమ్మాయిలు ఏం అనుకుంటారో అని కూడా లేకుండా "నీ రూపులే..." అని తిట్టేవాడు. హా హా… Really soo nice… ఆ రోజు అబ్బాయిలు మాత్రమే ఉండడంతో సరదాగా మాట్లాడుతూ... "ఇంక రెండు నెలలేరా... తర్వాత మీరెవరో, మేమెవరో..." అని చెప్తూ నవ్వుతూ... "సరే... నేను వెల్తున్నాను... Next English Class" అని చెప్పి వెళ్ళిపోయాడు.
కాసేపట్లోనే మా హెడ్ మాస్టర్ మా మధ్యలోకి వచ్చేశాడు. అందరం సైలెంట్ గా చదువుకుంటున్నాం. రెండు భాగాలుగా కూర్చున్న మా Boys lines మధ్యలో ఓ Plastic Chair ఉన్నింది. సర్ వచ్చి కాసేపు మా మధ్య తిరిగి అలా అమ్మాయిల వైపు వెళ్ళాడు. Sir దారిలో ఉండగానే ఎవరో రాయి తీస్కుని మా మధ్యలో ఉన్న Chair ని Footttt అని కొట్టారు. సర్ కి కోపం వచ్చినా సరే, ఏమీ అనకుండా అటూ ఇటూ తిరుగుతూ ఈసారి ఆవసం వైపు వెల్లి అలాగే ఆవాసం లోపలికి వెల్లాడు. సర్ లోపలికి వెల్లిన వెంటనే మల్లీ ఎవడో Chair ని రాయితో కొట్టాడు. కిటికీ నుంచి చూడటానికే ఆవాసంలోపలికి వెల్లిన మా H.M. Sir Fast గా మా దెగ్గరికి వచ్చాడు. “ఎవడురా కొట్టింది... మర్యాదగా చెప్పండి. ఈ పక్కనుంచే వచ్చింది ఆ రాయి...నేను చూశాను”. అని మావైపు వీపు చూపించి నిలబడి మా Opposite side వాల్లని అడుగుతున్నాడు. " ఎవడో మీరే మర్యాదగా చెప్పండి.. లేకుంటే అందర్నీ తంతా..." అని బాగా కోపంగా అంటున్నాడు.. దూరంగా ఉన్న అమ్మాయిల దృష్టి కూడా మెల్లగా మా వైపుకు వచ్చేసింది… "నువ్వా... నువ్వా..." అని వేలు చూపించి అందర్నీ అడుగుతూ, వెంటనే మావైపుకు తిరిగి "ఏమయ్యా.. నువ్వు చూశావా" అని వేలు చూపించి నన్ను అడిగాడు.. "లేదు ఆచాజీ.. నేను తల దించుకుని చదువుకుంటున్నా" అని చాలా చిన్నగా అన్నాను. మల్లీ వెంటనే అటు తిరిగి జాఫర్ ని, కాజాపీర్ ని నిలబెట్టాడు.
"వాడే కొట్టాడు కదూ... వాడే కొట్టాడు కదూ...” అని కాజాపీర్ వైపు వేలు చూపిస్తూ కోపంగా జాపర్ గాడిని అడుగుతున్నాడు. ఏం చెప్తే ఏం అంటాడో అని జాఫర్ గాడేమో సైలెంట్ గా ఉన్నాడు... కానీ కాజాపీర్ కి మాత్రం చాలా భయంగా ఉంది. వాడు అలాగే సైలెంట్ గా ఉంటే నేనే కొట్టాను అనుకుంటాడనుకున్నాడేమో.. వెంటనే కాజాపీర్ గాడు "రే జాఫర్.. బోల్ రే.. సహీ బోల్ రే..." అని వాల్ల భాషలో అంటున్నాడు. వాడు అలా అనగానే హెడ్ మాస్టర్ జాఫర్ గాడి కాలర్ పట్టుకుని వాడిని అటూ ఇటూ ఊపుకుంటూ "బోల్ రే.. ఝూట్ అంట బోలు..." అని ఉన్న కోపాన్ని పెంచుకుంటూ అంటున్నాడు. అది విని కాజాపీర్ గాడు.. "ఝూట్ కాదు సార్... సహీ సహీ..." అని అనగానే... "హా బోలు.. సహీ అంట బోలు..." అని వాడు పడిపోతాడేమో అన్నట్లుగా కాలర్ పట్టుకుని ఊపుతున్నాడు.
          ఈ ముగ్గురి మాటల Conversion లో ఘూట్, సహీ ల వలన కాస్త Comidy Create అవడంతో A.విష్ణు గాడు ఆపుకోలేక "హు హు.." అని మెల్లగా నవ్వాడు. ఇంక అంతే... ఆ నవ్వు మా హెడ్ మాస్టర్ కి వినపడింది.. ముందే విపరీతమైన కోపంలో ఉన్నాడు.. వాడు నవ్వడంతో అది రెట్టింపు అయిపోయింది. వెంటనే జాఫర్ గాడిని వాడి కాలర్ ని వదిలేసి, "ఏ నా కొ__కు రా నవ్వింది..." అని గట్టిగా అరుస్తున్నాడు.. ఓ వైపు అమ్మాయిలందరూ ఓ చోటికే వచ్చి మమ్మల్నే చూస్తున్నారు.
          నవ్వింది విష్ణు అని ఎలా కనుక్కున్నాడో గుర్తు రావట్లేదు కానీ... వెంటనే జాఫర్ గాడి దెగ్గర్నుంచి ఓ ఐదు మీటర్ల దూరంలో ఉన్న విష్ణుగాడి దెగ్గరికి చేరుకున్నాడు. ఆ చేరుకునే ప్రయత్నంలో కుడికాలి చెప్పు Slip అయ్యి కాస్త పక్కకు జారిపోయింది. ఇంక వెంటనే జారిన చెప్పుని చేతికి తీస్కుని, వాన్ని కాస్త బెండ్ చేసి వీపు పైన ఇష్టం వచ్చినట్లు Fooot Fooot Fooot… అని మూడు సార్లు కొట్టాడు. అలా చెడా మడా చెప్పుతో కొట్టేసి Head Master దూరంగా వెల్లిపోయాడు. మేమంతా Shock... ఓ H.M. ఓ Student ని చెప్పుతో కొట్టడమా…
          ఆరోజు చెప్పుతో కొట్టి దూరంగా వెల్లింది Extra Class నుంచే అనుకున్నాం. కానీ కాదు... అది జరిగిన తర్వాత ఓ నెల రోజులపాటు అస్సలు మా స్కూల్ లో కనపడలేదు . కొంతమంది సర్ లని అడిగితే Suspend అయ్యాడని అన్నారు. ఇంకొంతమందేమో శాఖ(Training) కి వెల్లాడు అని చెప్పారు. What ever it may be.. అది మాత్రం చాలా తప్పు. ఓ హెడ్ మాస్టర్ గా ఎవ్వరూ చేయకూడని తప్పు మా హెడ్ మాస్టర్ చేశాడు. “మా స్కూల్ సంస్కృతికి నిలయం” అనుకునే మేము ఈ ఒక్కసారి మాత్రం “అస్సలు Waste” అనుకున్నాం. That is totally because of this incident.
          హా హా హా వింత ఏంటంటే.. ఆ Chair ని రాయితో ఎవరు కొట్టారో నాకు ఈరోజుకు కూడా తెలీదు.


12.                    రక్షాబంధన్  is always a special for us..
రాఖీ పండుగ.. అచ్చంగా చెప్పాలంటే రక్షాబంధన్... మా స్కూల్లో ఈ రక్షాబంధన్ ని చాలా బాగా జరుపుకుంటారు... ప్రతీ సంవత్సరం ఆ రోజు ఉదయం ఓ Function లాగా పెట్టి అందరూ ఒకరి చేతికి ఇంకోరు రాఖీలు కట్టుకుని చాలా ఆనందంగా, బాగా జరుపుకుంటారు.
చూస్తుండగానే మా స్కూల్ లో మేము ప్రతీసారీ ఎంతో ఆనందంగా జరుపుకునే చివరి రక్షాబంధన్ వచ్చేసింది. Auguest 19th 2005 Morning 8:40 AM. నేను, సురేష్, మహేష్, మనికంఠ, ప్రసాద్ అందరం మాట్లాడుకుంటూ రోజూ ప్రార్థన చేసే చోటు కాకుండా ఇంకో షెడ్ లాగా ఉండే "ప్రాథమిక పాఠశాల" (LKG To 5th Class School) కి వెళ్ళాం. అక్కడ అప్పటికే విజయ, జయ, నాగమౌనిక, తేజశ్విని అందరూ ఉన్నారు.
రాఖీ పండుగ ఎంతో ఆహ్లాదంగా ఉన్నా, కొందరికి మాత్రం ఎంతో భయాన్ని కలిగించేది. హా హా ఎందుకంటే అప్పట్లో ఆ తెలిసీ తెలీని వయసుల్లో ఉన్న ఆకర్శనల వల్ల అబ్బాయిలు తిక్క తిక్కగా ప్రవర్థించడం, అమ్మాయిలు అదంతా గుర్తు పెట్టుకుని రాఖీ పండుగరోజు వెంటపడి రాఖీ కట్టి మరీ నవ్వుకోవడం ఆ పండుగకి Special attraction...
Time 9:00 AM అయింది. ప్రార్థన ఈరోజు పది నిమిషాలు లేట్ అయిపోయింది... అందరూ కూర్చున్నారు.. "యాకుందేందు తుశారహార ధవలా..." అని మొదలు పెట్టి మూడు నిమిషాలకు అవగొట్టేశాం. తర్వాత సర్ వాల్లు అందరికీ రాఖీలు పంచేశారు. ఆ రాఖీలు చాలా చిన్నిగా, ఓ దారం కట్టి దానికి మధ్యలో కాస్త Cotton పెట్టి, మొత్తానికీ కాశాయం రంగు అంటించి దాన్ని రాఖీలా తయారు చేసేవారు.
Already Even వరుసల్లో కూర్చున్న అందరిని ఎదురెదురుగా తిరిగి కూర్చోమనేసరికి నేనూ, ప్రసాద్ ఎదురెదురుగా కూర్చున్నాం. మా పక్కనే మనికంఠ, మహేష్ లు ఎదురెదురుగా కూర్చున్నారు. స్టేజ్ పైకెక్కి అమరేంద్ర సర్ రాఖీ మంత్రం చెప్తున్నాడు. First ఏదో మంత్రం పలికించాడు. తర్వాత "ఇలా పలుకుతూ రాఖీలు కట్టుకోండమ్మా" అని అంటూ .... "నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరమూ కలసి ఈ దేశానికి రక్ష..." అని చెప్పి ఇంక కట్టుకోండి అన్నాడు. పక్కనే మహేష్ గాడు మాత్రం... "రేయ్ మనికంఠ.. నేను నీ పెల్లానికి రక్ష, నువ్వు నా పెల్లానికి రక్ష, మన ఇద్దరమూ కలసి పక్కింటోడి పెల్లానికి రక్ష..." అని వెటకారాలు చేస్కుంటూ రాఖీలు కట్టేస్కున్నారు. హా హా హా నిజంగా ఎంతో Funny గా ఉండేది అప్పట్లో…
తర్వాత చేతినిండా రాఖీలతో అమ్మాయిలు Particularly కొంతమంది అబ్బాయిలని వెతికి వెతికి రాఖీ కట్టడం, దొరకకుంటే అబ్బాయిల ఇంటికి వెళ్ళి పిలిచి మరీ కట్టడం చాలా Funny గా ఉండేవి. జాఫర్, కాజాపీర్ లకు మాత్రం మోచేతివరకు రాఖీలే ఉండేవి... నిజంగా ప్రతీ సంవత్సరం ఆరోజు చాలా చాలా Enjoy చేసేవాల్లం హా హా హా…
ఈ జ్ఞాపకాన్ని తలుచుకుంటూ మధ్యలో స్టేజ్ ఎక్కి రాఖీ మంత్రం చెప్పాడు అని చెప్పింది మాకు Physics కి వచ్చే అమరేంద్ర సర్... చూడటానికి చాలా బాగుంటాడు. చాలా సున్నితంగా మాట్లాడుతుంటాడు. మీకు Future లో English Words చాలా Important అమ్మా... అని ప్రతీ Lesson కి, Side Heading లకి పక్కనే Brackets లో English లో ఏమంటారో రాయించేవాడు. సర్ కి Subject లో మంచి Indepth knowledge ఉండేది. I still remember those inspiring words of Amarendra sir. We really miss you sir. We know... You will make many bright students …
13.                    Tuition లో మరపు రాని క్షణాలు..
ఎవరన్నా Maths Tuition వెల్తుంటే, & వాడికి Maths public exam లో 99 or 100 out of 100 మార్కులు వస్తే.."నాకు 100 మార్కులు రావడానికి కారణం మా Tuition" అని చెప్తారు.. But No…. నేను మాత్రం అలా చెప్పను. ఎందుకంటే నాకు మాత్రం ఇలా చెప్తేనే నచ్చుతుంది. "నాకు 10th Public Exams లో Maths లో 99 మార్కులు వచ్చాయంటే, And Total లో 520 Marks వచ్చాయంటే కారణం మా Ankal Sir Tuition ..."
హా హా నేను స్కూల్ లో Lessons వినేవాన్నేగానీ, చదివేదంతా మా Ankal Sir Tuition లోనే.. 10th Class మొదటినుంచి Maths Tuition కి వెల్లేవాన్ని. నాతో పాటు సురేష్, లత, సుస్మిత Regular గా వచ్చేవాల్లు. స్వాతి, సువర్ణ, జయ, విజయ ఓ నాలుగు రోజులు వచ్చి మల్లీ మానేసినట్లు గుర్తు.
Tuition గుర్తు వస్తే నాకు వెంటనే గుర్తొచ్చేది లత.. స్కూల్ లో ఎంతో సైలెంట్ గా ఉండే తను Tuition లో విపరీతంగా అల్లరి చేసేది. నేనేం మాట్లాడినా నాకు Counter వేసేది. అందర్నీ Dominate చేసే Voice తనది. Same Time పోటీగా కూడా చదివేది. Ankal Sir Maths Class చెప్తుంటే మొదటి వరుసలో, Just నాకు ఓ మూరెడు దూరంలో కూర్చుని చాలా Interesting గా క్లాస్ లు వినేది. సర్ “ఏదైనా చెప్పండి” అనగానే వెంటనే Answer చెప్పేది. Tuition లో మాత్రం లత చాలా Friendly గా మాట్లాడేది. But School లో no contact at all… Ankal Sir Weekly ఓ Test పెట్టేవాడు. అందులో పోటీపడి చదివి రాసేవాల్లం… "నీకు 49 నే….. నాకు 50" అని ఒకసారి నాతో లత చాలా గర్వంగా చెప్పినట్లు గుర్తు. హా హా హా నిజంగా ఆ రోజులు ఎంత బాగుండేవో అసలు…
And Next apart from latha & other boys and girls… 10th class last 2 months మాత్రం ఇంటినుంచి అక్కడికే బాక్స్ తెచ్చుకునేవాన్ని. నేను, శివ, శ్రీకాంత్, సుబ్రమణ్యం, ప్రసాద్, మహేష్, నాగరాజు... అలా అందరం కలసి రాత్రి 10 దాకా, ఒక్కోసారి 11 దాకా చదువుకుని అక్కడే బొంతలు వేస్కుని కింద పడుకుంటే, సర్ పక్కనే మంచం పైన పడుకునేవాడు. Sir మమ్మల్ని Night 10:00 లోపు పడుకోనిచ్చేవాడూ కాదు, ఉదయం 4:00 దాటినా పడుకోనిచ్చేవాడు కాదు. నేను ఉదయం మాత్రం ఎంత చెప్పినా నిద్రలేచేవాన్నే కాదు. హా హా సర్ అయినా వదలకుండా మంచం దిగి వచ్చి "రే భరత్ గా... లేయ్.. లేరా చాయ్.." అని చాలా Friendly గా అనేవాడు. అప్పట్లో మా ప్రయత్నం కంటే మా సర్ తాపత్ర్యమే ఎక్కువగా ఉన్నింది. నిజంగా అలా ఆ రెండు నెలలు సర్ నన్ను రోజూ అలా Care గా చూస్కుని చదివించాడు కాబట్టే నాకు Public Exams లో 520 వచ్చాయ్.
నేను, సర్ ఇద్దరం కలసి Night అన్నం తినేవాల్లం. నేను ఇంటినుంచి బాక్స్ తెచ్చుంకుంటే, సర్ తనే Prepare చేస్కునేవాడు. కర్రీలు, పెరుగులు Share చేస్కుంటూ తినేవాల్లం... ఓసారి సర్ బయటకెల్తూ "రేయ్ భరత్ గా పొయ్ మీద అన్నం పెట్నా చూడు జగ్రత్త" అని గేట్ తలుపు వేసి బయటకెల్లాడు. "మీరేం టెన్సెన్ పడకండి సర్.. నేను ఉన్నా కదా..." అని నేను కాస్త ఎక్కువగానే చెప్పి సర్ ని పంపేశా.. వెళ్ళిన 40 నిమిషాల తర్వాత సర్ వచ్చి చూస్తే నేను Full గా Hall మధ్యలో నిద్రపోతున్నాను. అప్పుడే స్కూల్ నుంచి రావడంతో బాగా నిద్ర పట్టేసిన్నింది. అన్నం గురించి అసలే మర్చిపోయాను… Kitchen అంతా అన్నం మాడిపోయిన వాసన, పొగలు వస్తున్నాయ్.. అది అంతా మాడిపోయింది... సర్ వచ్చి చూసిన తర్వాత Full గా Coating నాకు. "చాయ్.. లేయ్.. నిన్ను నమ్ముకుంటే నా కొంప తగలబెట్టావ్ కదరా.. లే చాయ్.." అని పాపం చాలా బాధగా కోపంగా నన్ను లేపాడు. నేను వెంటనే లేచి కిచన్ లోకి వెల్లి గ్యాస్ ఆపేశాను.. అది సర్ చూసి "ఇప్పుడు దాన్ని అపేసినా, ఆపకున్నా పెద్ద తేడా ఏం లేదులేరా" అన్నట్లు బాగా గుర్తు. అన్నంతో పాటు మాడిపోయిన ఆ Bowl , దాన్ని మల్లీ కడిగి బాగా చెయ్యడానికి సర్ పడిన శ్రమ, అప్పుడు మల్లీ అన్నం చేస్కుని రోజూలాగా కాకుండా లేట్ గా తిన్న టైం అన్నీ అలా అలా గుర్తొస్తున్నాయి.  హా హా హా అప్పుడప్పుడు ఎప్పుడన్నా సర్ దెగ్గరికెల్తే సర్ ఈ సన్నివేశాన్నే గుర్తు చేస్తుంటాడు. Really soo funny…
Sir Tuition లో రోజూ ఉదయం 4:00 కి లేచి 5:00 దాకా చదివి, మల్లీ సోప్ తీస్కుని అలా శివాలయం దెగ్గరికెల్లి ముఖం కడుక్కుని మల్లీ పాత బస్టాండ్ వైపు వెల్లి టీ తాగి మల్లీ Tuition కి వచ్చేవాల్లం. శివరాత్రి రోజు శివాలయంలో Late Night పూజ జరిగుతుంటే చూసి, పూజ అయ్యాక Life లో మొట్టమొడటి సారి Second show Movie కి వెల్లాము. ఆ సినమా Name కూడా గుర్తుంది.. గౌతం S.S.C .. అది కూడా మిని Theator లో.. సినిమాకి వెల్లి వచ్చిన తర్వాత ఇంటి గేట్ తీసి “తలుపు తీయ్ రా” అని సినిమాకి రాకుండా లోపలే నిద్రపోతున్న సుబ్రమణ్యం గాడిని లేపితే, వాడు నిద్రమొబ్బులో లేచి వెల్లి బాత్ రూం సైడ్ డోర్ తీసి "రాండి.. లోపలికి రాండి" అని మల్లీ వచ్చి పడుకున్నాడు.. "చాయ్... ఈ వాకిలి తీసి పడుకో.." అని సర్ అరవంగానే మొత్తం మొబ్బు వదిలి నవ్వుకుంటూ వచ్చి ఇప్పుడు సరైన తలుపు తీశాడు. హా హా హా అలాంటి వింత చేష్టలు సుబ్రమణ్యం గాడు నిద్రలో చాలా చేసేవాడు. మొదలు పెడితే అది ఇంకో Article అయిపోతుంది.
నిజంగా అంకాల్ సర్ Tuition లో నేను చదివిన ఆ రెండు నెలల చదువు వల్లనే నాకు వచ్చిన 520 మార్కులు. లేకుంటే అన్ని మార్కులు అస్సలు వచ్చేవి కాదు. మా Tuition , అక్కడ మేము చేసిన Enjoyment అన్నీ గుర్తొస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు. నాకు గుర్తు ఉన్నంతవరకు ఎన్నోసార్లు సర్ నాపైన కోపాన్ని నటించాడేకానీ... నిజంగా కోప్పడినట్లు మాత్రం నాకెప్పుడూ గుర్తులేదు. Thank you sir.. Thank you soooo much for your care upon me… really you are the reason for my achievement in 10th class.
14.                     మహాధ్బుతం...
12th March 2006… ఇంకో ఐదారు రోజుల్లో Final Exams మొదలౌతాయని తెలిసినా కూడారేపటినుంచి చదవడం Start చేద్దాంలే” అని నాకు నేనే వాగ్దానాలు చేస్కుంటూ, అస్సలు భయం లేకుండా,  చోట స్థిరంగా కూర్చోకుండా సైకిల్ లో అటూ ఇటూ తిరుగుతున్నాను... నా అస్థిరత్వానికి ఆదివారం కూడా తోడవడంతో ఇంకాస్త నిర్లక్షంగా, Freeగా తిరుగుతూనడిసాయంకాలాన మహేష్ గాడి ఇంటిముందుకొచ్చి సైకిల్ ఆపేశానువచ్చినంత Speed గా సైకిల్ దిగేసి, Cycle Stand వేస్తూ వేస్తూ "మహేష్...." అని గట్టిగా అరిచాను... Stand పైకిలాగి, Wheel Lock వేసేలోగానే  "లోపలికి రారా..." అని మహేష్ గాడి పిలుపు వినిపించింది. Fast గా వెల్లొద్దాం అని Bag అలాగే సైకిల్ పైనే పెట్టిఇంటి Gate తీసి పైకి వెల్తున్నానుఅదేంటో వీడి ఇంటి Steps ఎక్కుతుంటే, ఏదో ఓ పెద్ద కొండ ఎక్కుతున్నట్లుదిగుతుంటే అదే కొండపైనుంచి జారి పడుతున్నట్లు అందరికీ వింతగానాకు మాత్రం భయంగా ఉంటాయి
మొత్తానికి మొదటిమెట్టు ఎక్కడం మొదలుపెట్టిన  ముప్పై సెకన్లకి TVలో లీనమైపోయిమహేష్ గాడు “Pant వేస్కుందామా వద్దా” అని అలోచించుకుంటూఆ Pant ని భుజంపైన వేస్కుని, అది ఉండాల్సిన Place లో ఓ Towel కట్టుకుని  “ఇంకాస్త గట్టిగా ఊగితే ఆ Towel ఊడిపోతుందేమో” అనిపించేంతలా అటూ ఇటూ ఊగుతూ నించున్నాడు"ఏరా Tuitionకి రావాఇంకా Ready అవ్వలేదు..." అని నేను అడిగేలోపే..."నీయబ్బరేయ్.. భరత్ గా... ఈరోజు Tution కి వెల్లాలంటావా..." అని మహేష్ గాడు చాలా బెంగగా అన్నాడు… వార్ని వీడికేం పోయేకాలం వచ్చిందిరా” అని మనసులో అనుకుంటూ.. "అంకాల్ సర్ తిడతాడ్రా వెల్లకుంటే.. అయినా ఏం చేస్తావ్ రా వెల్లకుండా హా" అని అనగానే... “నేనేం చెప్పను.. నువ్వే చూడు” అన్నట్లుగా TV నే చూస్కుంటూ Channel మార్చాడు… చూస్తే Shock... Australia (vs) South Africa 5th one-day match వస్తుంది. సిరీస్ Already 2-2 తో Equal గా ఉంది.. That means whoever wins this match; obviously that team will become the winner of this series. Keeping this in mind Australia has done extremely well on that day. చూసి Shock అయ్యా... 434/4 in 50 overs. అప్పటిదాకా 300 నే High Score అనే నేను, ఇప్పుడు ఈ Score board చూసి ఏమనాలో అర్థం కాలేదు… ఆ Shock నుంచి తేరుకునేలోపే.. "రేయ్ ఇప్పుడే వాల్ల Batting అయిపోయింది, Next South Africa Batting… ఆనాయాల్లు 435 కొట్టేలా ఉన్నారురా... ఇక్కడే ఉండి చూద్దాం" అని మహేష్ గాడు అన్న మాట నాకు ఓ పిచ్చి వాగుడులా వినిపించింది. “లేకపోతే 434 Score ని Chase చేయడమా... Impossible” అని మనసులో అనుకుంటూ.."రే పిచ్చోడా.. నీకు అనిపిస్తేనో, నేను కోరుకుంటేనో వాల్లు కొట్టడానికి ఇదేం 234 కాదురా.. 434…, South Africa ఎలాగూ ఓ రెండు గంటల్లో Pack up అంటుంది.. నువ్వుకూడా నీ Bag ని Pack చేస్కుని Tuition కి పద..”  అని అనేసి, వీడు కాల్లు ఊపడం అపేలా లేడే అనిపించి వాడి భుజంపైన ఉన్న Pant లాగి వాడి చేతిలో పెట్టి “Pant వేస్కుని ఊగురా బాబు” అని, నేను పక్కన ఉన్న Books ని సర్దడం మొదలుపెట్టా… పాపం మహేష్ గాడు, చాలా బాధగా Pant వేస్కుని నామీద కోపంతో Fast గా తల దువ్వుకుని, Fair & lovely పూస్కుంటూ, Tv లో వచ్చే Fair & lovely Fourth empire చూస్తూ ఉన్నాడు. ఆ TV లో మాట్లాడే English నాకు అర్థం కాక, దూరంగా బెంచ్ పైన ఉన్న తెలుగు బుక్ తెద్దామని బయటకెల్లి, సరదాగా, సైకిల్ ఉందా లేదా అని కిందకి చూసి,, “ఉందిలే, ok అనుకుని” మల్లీ వచ్చి వాడి Bag మొత్తం Ready చేసి వాడి కాల్లకి ఆనించాను. South Africa Batting Start అవ్వకముందే Power Cut అవడంతో, మహేష్ గాడు "దీనమ్మ Power పోయిందిరా....సరే రా పద Tuition కి" అని Bag తీస్కుని బయటకొచ్చేశాడు… ఇంటికి Lock చేసి వెల్తూ వెల్తూ..., Just అప్పుడే బయటకెల్లి వస్తున్న మహేష్ అమ్మకి Key ఇచ్చి, ఇద్దరం సైకిల్ లో Tuition కి బయలుదేరాం… Main Road నుంచి లింగమయ్య Street లోకి Enter అవ్వగానే..."రేయ్ నీ ముందే సుస్మిత వెల్తుంది చూడురా" అని వెనక కూర్చున్న మహేష్ గాడు తల బయటకు పెట్టి చూస్తూ చెప్తున్నాడు…"వార్ని... అంత దూరం నుంచి ఎలా గుర్తు పట్టావ్ రా నువ్వు"... అని అడిగితే.. "అంత పొడవు జడ ఇంకెవరికి ఉంటుందిరా బాబు" అని గట్టిగా నవ్వేశాడు… “వాల్లింట్లో కూడా Power Cut అయినట్లుంది రా... అందుకే Late గా వస్తుందేమో…” అని నేను అంటూ ఉండగానే మా సైకిల్ సుస్మితని దాటి Tuition ముందుకు వచ్చేసింది. వెంటనే దిగి హడావుడిగా లోపలికెల్లి, తగిలించుకున్న Bag ని కింద పెడుతూ అలా చుట్టూచూశాను… ముందరే సల్మ, తాజ్ ఇద్దరూ చదువుకుంటున్నారు... నన్ను చూసి "హాయి భరత్" అని తాజ్ అనగానే..."మన స్కూల్ అమ్మాయిలు ఒక్కరు కూడా రాలేదు కదరా.." అని మహేష్ గాడు బెంగగా కింద కూర్చున్నాడు.. నేను కూడా తాజ్ కి హాయ్ చెప్పి, "వెనకనే సుస్మిత వస్తుంది కదరా మన స్కూల్ అమ్మాయి" అని కూర్చుండిపోయాను. మా మాటల శబ్దానికి బయటకొచ్చిన అంకాల్ సర్, "చ్చాయ్.. ఏంది... వచ్చీ రాంగానే ఉప్పర్ మీటింగ్ పెట్నారే... బుక్కులు తీసి చదవండి.." అని Tip Top గా Ready అవుతూ చేతిలో Ponds Sandal Powder వేస్కుని, Face కు పూస్కుంటున్నాడు. సర్ తిడుతున్నా, ఆనందంగా నవ్వుతూ మోకాల్లు ఓ ఊపుకుంటూ కూర్చున్న మహేష్ గాడివైపు తిరిగి "ఏం అంత అందంగా ఉన్నాయా..అమ్మాయిలముందు తిట్లు" అని ఊగుతున్న మోకాలు పైన Fooottttt అని ఒక్కటి ఇచ్చాను…
"నీయబ్బ రేయ్..అది కాదురా సర్ రడీ అయ్యాడుగా, అంటే ఎక్కడికో వెల్తున్నాడు.. మనం వెల్లి Match చూడచ్చు రోయ్...” అంటూ ఈఈఈ అని నవ్వుతున్నాడు…  “Match నా..  Match రా... వార్ని.. నీ మనసు ఇంకా అక్కడే ఉందా.. దాన్ని మర్చిపోరా బాబు నీకు దండం పెడతా.." అని నేను అంటుండగానే.. "రేయ్..నేను బయటకు వెల్తున్నాను , మల్లీ 8.30 కల్లా వచ్చేస్తా.. బాగా చదువుకోండి.." అని అంకాల్ సర్ అంటూ అంటూ Door curtain తీసాడు… curtain తీయగానే సర్ కి  అడుగు దూరంలో Tuitionకి లేట్ గా వచ్చిన సుస్మిత కనిపించడంతో కాస్త ఓ అడుగు వెనక్కు వేసి "రామ్మా.. రా.. ఏం అప్పుడే వచ్చినావే.. ఇంకా రోంచేపుండి రావద్దూ.. మీ Friend లత ఏం చేచ్చందీ.. నిద్రపోతుంది కదూ.." అని గదురుకుంటూసుస్మిత నుంచి Answer Expect చేస్తూ మల్లీ లోపలికి వచ్చాడు... అప్పటికే తల దించుకుని బుక్స్ తీస్కుంటున్న సుస్మిత Reply ఇవ్వకపోవడంతో కాస్త కోపంగా చూసి బయటకు వెల్లిపోయాడు… వెంటనే మహేష్ గాడు "లత ఏం చేచ్చంది.... నిద్రపోతుంది కదూ" అని సర్ అన్న మాటని మల్లీ మల్లీ నాకు చెప్తూనవ్వుకుంటూ.. రేయ్.. లత కూడా Match చూస్తుంటదిరా.. పదరా మనం కూడా వెల్లి చూద్దాం…” అంటూ నన్ను గట్టిగా  సైడ్ కి తోసేశాడు.. Almost కింద పడిపోయిన నేను వెనక్కి వస్తూ వస్తూ "సర్లేరా  పది నిమిషాలు ఆగు వెల్దాం” అనగానే.. ఊగుతున్న వాడి మోకాలులో ఉత్సాహం పెరిగింది.. అప్పట్లో వాడి ఆనందానికి, Excitement  కి Symble అది… సుస్మిత మావైపు చూస్తే కాస్త చెప్పి వెల్దామని తనవైపే ఓ ఐదు నిమిషాలనుంచి చూస్తున్న నన్ను, మహేష్ గాన్ని గమనించిన తాజ్.. "ఏం భరత్.. Topics అన్నీ వచ్చా.." అని మెల్లగా నవ్వింది.. "హా వచ్చుగా వచ్చు.. తాజ్.. మేము బయటకు వెల్తున్నాం...సర్ ఎప్పుడు వచ్చి అడిగినా.. “వీల్లు ఇప్పుడే బయటకు వెల్లారు సర్ “ అని చెప్పు Plzz " అని బుక్ మూయగానే, ఐదు నిమిషాలనుంచి ఎంత గమనించినా చూడని సుస్మిత, తల పైకి ఎత్తి కోపంగా చూసింది… "సరిపోయిందిలే…" అని మనసులో అనుకుంటూ, Bag అక్కడే పెట్టి సైకిల్ లో మణికంఠ ఇంటికి బయలుదేరాం…
మెల్లగా సైకిల్ తొక్కుకుంటూ వెల్తుంటే.. “Fast గారా Fast గా..” అని  మహేష్ గాడు వెనక కూర్చుని నన్ను దొబ్బుకుంటూ అటూ ఇటూ ఊగుతున్నాడు… "Fast గా వెల్లాలంటే నన్ను కాదురా.. కిందకు దిగి సైకిల్ ని దొబ్బు…” అని నేను గదురుకుంటూ ఉండగానే సైకిల్ లో సందీప్ గాడి ఇల్లు దాటేశాం… నేను గదురుకున్న కోపాన్ని కూల్ చేస్తూ, Match అనే Topic ని పూర్తిగా Divert చేస్తూ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న లత కనిపించడం గమనించి "రేయ్ మహేష్ గా లత వస్తుందిరా" అని సైకిల్ ని ఇంకాస్త స్లో చేశాను… "నీయబ్బరోయ్.. స్లో చేయకురా.. ఇక్కడ లత వస్తుంటే అక్కడ Match కూడా వస్తుంటదిరా.. నువ్ పద" అని వీపు పైన గట్టిగా కొట్టాడు… ఆ మాటల్లో వాడు, “లత అన్నా మావైపు చూస్తుందా లేదా” అని Expectation తో నేను, ఇద్దరం కలసి లత ని Cross చేస్తున్నాము... Cycle కాస్త దెగ్గరికెల్లగానే నాకు తెలీకుండానే నా చెయ్ సైకిల్ బెల్ ని కొట్టడంతో లత Fast గా తల ఎత్తి, చిన్నగా ఉన్న కల్లని పెద్దగా చేసి కోపంగా చూసింది… "ఏంటో వీల్లు... కోపంగా చూడటం Fashion అనుకుంటున్నారేమో" అని మనసులో అనుకుంటూ ఉండగానే "రేయ్ భరత్ గా మన క్లాస్ అమ్మాయిలు Waste రా... అసలు మనల్ని చూడనే చూడరు... అదే "క" అమ్మాయిలైతే వాల్ల Section Boys తో ఎంత బాగా మట్లాడతారో అసలు… ఆఖరికి పక్క స్కూల్ అమ్మాయిలు కూడా మేలేరా.. చూసి నవ్వకపోయినా... వీల్లలాగా మాత్రం అస్సలు కోప్పడరు..” అని మహేష్ గాడు, లత చూపులవలన వచ్చిన కోపంతో, Match ని కూడా మర్చిపోయి చెప్పాడు. వాడు అలా అమ్మాయిల Topic మాట్లాడుతూ మట్లాడుతూ మల్లీ Match గుర్తొచ్చేలోగా సైకిల్ తెచ్చి  మణికంఠ ఇంటిముందు ఆపేశాను.
సైకిల్ లాక్ చేసి, లొపలికి వెల్తే, మణికంఠ ఓ రెండు Apple లు, రెండు జామపండ్లు ముందు పెట్టుకుని, Match చూస్కుంటూ, ఆ నాలుగు పండ్లలో ఒక్కోసారి ఒక్కోదాన్ని కొరుక్కుంటూ, పద్మాసనం వేస్కుని Bed మద్యలో కూర్చుని, Serious గా TV నే చూస్తూ కనిపించాడు. అది గమనించగానే "రేయ్ Wrong Time లో వచ్చమేమో రా..." అని నేను, "అబ్బా.... కరెక్ట్ Time లో వచ్చాం రా" అని మహేష్ గాడు ఒకేసారి అనడం నాకు చాలా నవ్వు తెప్పించింది. అంతా చూసినప్పటికీ, ఏమీ చూడలేదన్నట్లుగా.."మణికంఠా...." అని గట్టిగా మహేష్ గాడు పిలిచాడు.. పాపం వాడు ఏమనుకున్నాడో, వెంటనే ఆ పండ్ల ప్లేట్ వాల్ల అమ్మకిచ్చి ఇంట్లోకి పంపించి, బయటకు వచ్చాడు…
ఆ పండ్ల విషయాన్ని మర్చిపోయి “Score ఎంతరా.. South Africa వాల్లు ఎలా ఆడుతున్నారు..” అని మహేష్ గాడు చాలా Anxiety గా అడిగాడు. “South Africa 279/2 in 30 Overs .. 156 Required From 120 Balls….” అని మణికంఠ అనగానే మహేష్ గాడు, మణికంఠ Permission కూడా అడగకుండా, నన్ను పక్కకి తోసేసి Fast గా ఇంట్లోకి వెల్లిపోయాడు... "అరె వీడేంటి ఇలా వెల్లిపోయాడు… అమ్మ పండ్ల ప్లేట్ లోపలికి తీసుకెల్లిందో లేదో" అనుకున్నాడో ఏమో.. చాలా Fast గా మణికంఠ కూడా లోపలికి వెల్లిపోయాడు. “వార్ని.. ఏంట్రా మీ ఇద్దరి బాధ” అని మనసులో అనుకుంటూ నేను ఇంట్లోకి వెల్లేసరికే మహేష్ గాడు TV Sound Full గా పెంచేశాడు.. “Unbelievable innings, unbelievable innings from both the teams” అని Commentator చెప్తుండగానే, Bracken has taken the ball to bowl 31st over. Batting ఆడేది ఎవడ్రా అని చూసి, "గిబ్స్" అని గుర్తు పట్టేలోగానే Gibbs Four కొట్టేశాడు.. “Excellent… Amazing shot through covers… No matter, whoever the bowler is he never cares now…what an innings… this night in Johannesburg will be a memorable night for all cricket lovers” అని మహేష్ గాడు పెట్టిన Sound చాలదన్నట్లుగా ఆ Commentator  కూడా తన Mike Sound ని పెంచుకుని చెప్పినట్లు, గట్టిగా అరుస్తున్నాడు… "రే వాడేంట్రా మద్యలో ఏదో Stadium పేరు అన్నాడు అన్నాడు.. అదేదో ముందే విన్నట్లు ఉంది, ఈ Match ఎక్కడ జరుగుతుంది.." అని Commentator వైపు వేలు చూపిస్తూ మణికంఠ వైపు ముఖం తిప్పి అడిగాను.. మణికంఠ గాడు పలకకముందే "చూడ్రా భరత్ గా ఎలా ఆడుతున్నారో ఈ నాయాల్లు.. నేన్ చెప్పాగా కొట్టేస్తారని” అనుకుంటూ మహేష్ గాడు అలాగే కల్లు ఆర్పకుండా Match చూస్తున్నాడు.. “Now De Villiers on strike.. let us see what he will do” అని Commentator అనగానే De Villiers hit the ball to long on very hardly… ఆ బాల్ లైన్ దాటకముందే "రే సిక్స్" అని మహేష్ గాడు పక్కనే ఉన్న మణికంఠని ఒక్కటి పీకాడు... "నీయబ్బ పొట్టినాయాలా.." అని వాడుకూడా ఒకటి పీకేలోగా.. Clark has taken a beautiful catch… oh my goddd… De Villiers out… మహేష్ గాడు కాస్త ముందుకు జరిగి, ఇంకాస్త లీనమై చూస్తున్నాడు…  31st Over completed… South Africa 286/3, Still 149 Required From 19 overs.. Mean while “Match Johannesburg లో జరుగుతుందిరా” అని నేను ఎప్పుడో అడిగిన Qustion కి మణికంఠగాడు Answer ఇచ్చాడు.
After an advertisement, total score board is Fetched in to 21 inches on the TV screen. “Ricky Ponting 164 runs from 105 balls with the help of 13 fours and 9 impeccable sixes” is the highlighting figures in the Australian score board. I still remember those sleepless & insomniac night minutes of  23rd March 2003, that was because of the India’s World cup final defeat with Australia in Johannesburg… Because of Our poor play and Ricky Ponting’s 140 runs with four fours & eight huge sixes, that was the biggest defeat to India with Australia. Now in this same stadium Johannesburg, this same Ricky Ponting has scored 164 runs out of 105 balls. After seeing the figures in Australian score board, I want to see an individual score in South African scoreboard which is more than Ricky’s164. But…Noooo.. There is no more than164 is found. But I have seen Gibbs163 runs out of 107 balls with 21 fours and five big sixes which is almost equal to 164. Wahhh what an innings.. May be by next over I can see more than 164 runs in the South African scoreboard.
అని ఏదేదో మనసులో అనుకుంటూ ఉండగానే Symonds Bowling కి వచ్చేశాడు.. “చూస్తుంటే మహేష్ గాడు అన్నట్లు వీల్లు గెలిచేలాగే కనిపిస్తున్నారు. గెలిస్తే మాత్రం World record అయిపోతుంది .. Gibbs Batting..  “Huge… Huge Six …Over mid wicket” అని Ball గాలిలో ఉండంగానే Commentator అరుస్తున్నాడేంట్రా అనుకున్నా… But this is really a big one. More than 100 Meters in distance. With this his score is 169 which is greater than 164 as desired by me and this is his sixth six. As he has already drawn 21 beautiful fours from Australian bowlers, still he has to hit another four sixes to beat Ricky in number of sixes too…
 Another six…. A similar one.. a huge six … Gibbs has converted a full toss ball in to a beautiful six over the mid wicket. What happened to this sunday… I think the whole world cricket lovers could be in front of TV only.
After hitting two consecutive sixes Gibbs is in relaxing mode, where as Symonds and Ricky are discussing about something very seriously…. After moving 10 feet apart from wickets Symonds is coming back to bowl with more confidence and ease. A good length ball. And a huge hit to long off.. after seeing the powerful stroke from Gibbs it is seemed to be a six.. but it is not… Bret Lee has done no mistake… he has taken… And during that catch lee’s posture was impeccable.“ My Godd.. it’s OUT.”  The Great Gibbs Gone for 175 out of 111 balls after hitting 21 fours, and 7 huge sixes. All Australians are celebrating like anything… Still I remember that regret shout  from Gibbs after removing his helmet... Really a great innings… I don’t know what was the discussion done between Symonds and Ricky just before a ball. But I think that Discussion has made a difference. Ha Ha Ha… I thought “When one idea can change a life, why not a single match” … Let us see who will come on to the twenty two yards pitch to take the responsibility now…
South African wicket keeper, Boucher crease లోకి వచ్చాడు... ఇంతకముందు దాకా వచ్చినంత Runs కానీ, అన్ని Boundaries కానీ ఏమీ రావట్లేదు… Slowly match is becoming boar…  299/4 (32 Overs) దెగ్గర గిబ్స్ అయ్యాడు.. ఇప్పుడు 325/4 (37 overs)…. Only 26 runs drawn from 30 balls.  Still 113 runs required from 78 balls. Really a tough task to complete. Kallis, Boucher చిన్నపిల్లల్లాగా ఆడుతుంటే చూడబుద్దికూడా అవ్వట్లేదు… Match లో Drinks Break అని చెప్పగానే.. మహేష్ గాడికి, మణికంఠగాడు వాల్లా అమ్మకిచ్చి లోపలికి పంపించిన పండ్లు గుర్తొచ్చాయనుకుంటా.."మణికంఠ.. Drinks Break అంట, తిని రాపో లోపలికెల్లి" అని Indirect గా చెప్పాడు... వాడుమాత్రం మహేష్ గాడి మాటలేం పట్టించుకోకుండా WWE పెట్టుకుని చూస్తున్నాడు.. ఇంక WWE అంటే కూడా ప్రాణం అవడంతో మహేష్ గాడు కూడా అలాగే చూస్తూ ఉండిపోయాడు.
నాకు అస్సలు ఇష్టంలేని చానల్ పెట్టడంతో నా అలోచనలన్నీ మణికంఠ ఇల్లుని దాటిపోయాయి… 8.30 కల్లా వచ్చేస్తాను అని సర్ చెప్పిన మాట, “ఇప్పుడే వస్తాం తాజ్” అని నేను చెప్పి వచ్చిన మాట, హా సరే భరత్.."సర్ అడిగితే “వీల్లు ఇప్పుడే వెల్లారు” అని చెప్తాలే” అని తాజ్ నాకు ఇచ్చిన మాట, వచ్చేటపుడు “Complaint చేస్తాలే” అనేలా సుస్మిత చూసిన చూపు, దారి మద్యలో లత మనసు చిన్నగా, కల్లు పెద్దగా చేసుకుని చూసిన కోపపు చూపు అన్నీ అలాలా గుర్తొచ్చాయి…  వెంటనే లేచి "రేయ్ నేను సర్ వచ్చాడేమో చూసొస్తారా" అని Fast గా Tution కి వెల్లిపోయాను.
సైకిల్ ఆపి Steps ఎక్కగానే Room లో సర్, లత, సుస్మిత, సల్మ, తాజ్ ల నవ్వులు వినిపించాయి...  Door Curtain తీసి "సర్…" అనగానే నవ్వుతున్న Face వెంటనే Serious గా పెట్టి "ఎక్కడికి వెల్లింటివి, నేను అలా వెల్లగానే మీరు కూడ ఇలా వెల్లిపోయారు కదూ.. రేపు సంతలో మీ అమ్మ ఎదురైతే చెప్తా లే" అని సర్ నన్ను అరుస్తున్నా మిగిలిన నలుగురు అమ్మాయిలు మాత్రం నవ్వుతూనే ఉన్నారు... "ఛ... వీల్లకసలు జాలే లేదా”.. అని మనసులో అనుకుంటూ.."ఇప్పుడే వెల్లాం సర్" అని నేను సర్ తో అనగానే బాగా నవ్వుతున్న తాజ్, నవ్వడం ఆపేసి కాస్త జాలిగా Face పెట్టి, నోటిపైన చెయ్ వేస్కుంది... "తు.. ఆడపిల్లలముందు అపద్దాలు ఆడటానికి సిగ్గులా.." అని కాస్త మాటల్లో సౌండ్ పెంచి అలాగే అరుస్తున్నాడు.. అవన్నీ పట్టించుకోకుండా నేను తాజ్ ఏం అంటుందో చూద్దామని తనవైపు చూస్తే... తను మాత్రం ఏమీ తెలీదన్నట్లుగా తల దించుకుని బుక్ లో పేజీలు తిప్పుతుంది... "ఏం మల్లా అట్ట చూస్తనావే.. నేను ఎక్కడికి పోలా.. ఆ వీధి చివరకు వెల్లగానే, పని అవ్వదని చెప్తే మల్లా 20 నిమిషాలకే వెనక్కు వచ్చా" అని గదురుకోవడం Continue చేశాడు… “Sorry sir..” అని అనగానే "మల్లీ సారీ అంట.. సారీ.. ఈ అమ్మాయిలు చూడు ఎంత బాగా చదువుకుంటున్నారో..." అని లత, సుస్మిత వాల్లని చూపిస్తూ పెద్దగా దీర్గం తీశాడు... "అవును నిజమే బాగా చదువుకుంటున్నారు.. చూస్తేనే అర్థం అవుతుంది సర్ ఎంతబాగా నవ్వుకుంటున్నారో.. "ohhh సారీ .. ఎంత బాగా చదువుకుంటున్నారో" అని వాల్ల వైపు చూస్తూ అనగానే... వాల్ల మొఖంలో నవ్వు పోయి నాకు ముందే ఎన్నోసార్లు అలవాటున్న కోపపు చూపు నన్ను చేరింది.. అలా నేను అన్నాననో, లేక Time కూడా అయిపోయిందనో.. వెంటనే నలుగురూ లేచి వాల్ల వాల్ల ఇల్లకు బయలుదేరారు….
వాల్లు అలా బయటకు వెల్లగానే... "భరత్ Hurt అయ్యావా... అమ్మాయిలముందు నవ్వుకుందామని ఆట పట్టించాలే... ఎక్కడికి పోయింటివి...” అని సర్ మెల్లీ కూల్ గా అడిగాడు.. హా హా అని నవ్వి " మంచి Match వస్తుంది సర్.. Last లో ఉంది.. వెల్లొస్తా సర్ ప్లీజ్..” అని అనగానే.. "ఏం Match, ఎక్కడ చూస్తున్నారు..మనం కూడా ఒక TV కొనాలి భరత్” అని సర్ అంటుండగానే… "వెల్లొస్తా సర్" అని Fast గా బయటకొచ్చి మల్లీ సైకిల్ తీసి బయలుదేరాను… ఓ 50 మీటర్లు వెల్లగానే ఇంటికి వెల్తున్న లత కల్లముందరే కనిపించింది.. “వెనక Back Seat ఖాలీగానే ఉందిగా, I can drop her” అని సరదాగా మనసులో అనుకుంటూ... ముందర వెల్తున్న లతని అస్సలు పెట్టించుకోకుండా Side ఇవ్వు అన్నట్లుగా, గట్టిగా బెల్ కొట్టి.. తనని Cross చేసి వెల్లిపోయాను… తను మల్లీ పక్కాగా కోపంగా చూసే ఉంటుంది.. నాకైతే “లత Tution లో నవ్విన నవ్వుకి కోపమొచ్చి” వెనక్కు తిరిగి కూడా  చూడాలనిపించలేదు.
లతని Cross చేసిన ఓ ఐదు నిమిషాలకి మల్లీ TV ముందరే వాలిపోయాను… TV లో Advertisement వస్తుంది, మహేష్, మణికంఠ మొఖాల్లో మాత్రం పట్టరాని Anxiety, Tension ... అవన్నీ చూసేసరికి "హమ్మయ్య Match ఇంకా అయిపోలేదు లే..” అనుకుని వాల్లతో పాటు Match కోసం Wait చేస్తూ పక్కనే నించున్నా... "కూర్చో బాబు" అని మణికంఠ వాల్ల అమ్మ నాకు Chair వెయ్యగానే,  TV Screen పైన Bat పట్టుకుని Boucher, Ball పట్టుకుని Bracken కనిపించారు… Now South Africa score is 422/7 in 48 overs. Still 13 required from 12 balls.
First ball in 49th over, Boucher taken a single through covers. Now this is a cool game, easily they can win…
But no… Bracken gave an another break for Australians.. Result of that second ball was a big shot by a new batsman. But hussy has done no mistake and he has taken that tough catch very Easily and perfectly. That was a very tough one actually… that dive was also excellent… with this wicket bracken has taken 5 wickets in this match. I think for this Whole day he is only successful bowler  in both the teams. After completion of 49th over South African’s score is 428/8. Still 7 runs required from 6 balls. Number of balls is not a problem, but the number of wickets in hand is definitely a problem for South Africans… Bret Lee has taken ball to bowl 50th over, that is last over of this big match.. Now chances are 50-50.
50th over Ball1: Lee to Boucher.. a tough single taken by boucher..
50th over Ball2: Lee to Hall.. My god.. it’s a four.. a superb attacking shot over the                mid wicket. Winning Chances for South African were suddenly increased… after that marvels shot, Boucher and Hall are discussing about something… Again Nerves Ricky came between the wickets to suggest Lee …
50th over Ball3:  Lee to Hall.. A waste shot… and that was out… Still I don’t know Really what that Reckey ponting is saying to his bowlers… May be that is one of the quality of captaincy… Apart from that.. “What is happening here..” “if there is any heart patient, please switch of the TV” Commentator is saying repeatedly… Now score is 433/9… South Africans lost wicket in very important stage.. A Very good bowler Ntini entered in to 22 yards pitch… But now job is not with the ball, but with the bat… Don’t know what he will do… If SA lost this wicket, entire innings will be wasted… Bret Lee is moving apart from wickets to bowl his very important ball…. My body is becoming cool.. I am not able to control my feelings…. With the a lot of tension, I am applying tensile forces to Mahesh’s T shirt… I still remember the Stretching ability of that T shirt also… Bret Lee stopped and turned suddenly after moving 20 feet away from the wickets… I am stretching that T shirt to some more extend…. Lee started running to bowl very important ball of his life… and he reached the wickets… after few nano seconds… 
50th over Ball4: Lee to Ntini.. A good line and length ball.. But it was not good enough.. Ntini has pushed the ball to the third man, and taken a quick single… scores Tie… South Africans are already in celebration mode… but I have not seen that grate Gibbs in the stands… any way… Still one run required to reach an incredible victory… I thought, in this whole world except 20.7 Million people who are belongs to Australia, Remaining every one might have waited for South Africans victory. Bret Lee reached wickets again…
50th over Ball5: Lee to Boucher.. A good length delivery, but Boucher smashed the ball through mid on… and that is for four… With that Boucher’s Half century is completed. And now, South Africans are the match winners. And with this excellent win, they are the series winners too… they deserves it… they really deserves it… an amazing batting from South Africans… “Where are you Gibbs..”  I was busy in searching Gibbs in stands… But in such huge crowed, that was really not easy to find the Great Gibs… any way.. this is the end for an extraordinary match here in Johannesburg.  And this Johannesburg was the Stage to my 23rd  March 2003 insomniac hours during the night, after the world cup final defeat … But now the same Johannesburg  has gave me a big memory to record every moment in my mind.. My dear Johannesburg… I have no regrets with you now….  
50th over Ball6: Boucher to audience… with a happiness of a great victory…. Ha Ha.. that was not at all a 6th ball of 50th over actually…
          "హమ్మా... ఏం ఆన్నార్రా ఈనాయాల్లు.. " అంటూ ఒక్కసారిగా బిగబట్టుకున్న ఊపిరినంతా వదిలేస్తూ మహేష్ గాడు బెడ్ పైనుంచి పైకి లేచాడు… “బాబోయ్.. నువ్వన్నది నిజమేరా మహేష్.. 234 నే కష్టమని నేననుకుంటే, వీల్లు ఏకంగా 438 కొట్టేశారు..” అని Shock నుంచి బయటకి వస్తూ మహేష్ గాడితో అన్నాను…
          “అస్సలు అంత Tension లో, అంత పెద్ద Scoreని Chase చేయడమంటే మాటలా…. నిజంగా Great రా అసలు…” అనుకుంటూ మెల్లగా ఇద్దరం మల్లీ Tuition కి వెల్లిపోయాం… వెల్లంగానే, కూల్ గా ఉన్న అంకాల్ సర్ తో Match గురించి మొత్తం చెప్పి, 9.35PM కి ప్రశాంతంగా పడుకున్నాను… ఎంత పడుకుందామన్నా అస్సలు నిద్ర రావట్లేదు.. ఎంత ప్రయత్నిస్తున్నా, గిబ్స్Batting , Last లో Ntini కొట్టిన Single నే గుర్తొస్తున్నాయ్… "Last లో Ntini Single కొట్టకుండా Out అయ్యి ఉంటే South Africa పరిస్థితి ఏంటి??” అనే Qustion నా చుట్టూ చాలా సేపు తిరుగుతూనే ఉంది..
872 runs in a single match… నిజంగా ఇది మాత్రం క్రికెట్ ప్రపంచంలో ఓ మహాద్భుతం... ఇంకా ఇలాంటి అద్భుతాలు ఎన్ని చూస్తానో ఏమో అనుకుంటూ మెల్లగా అలాగే నిద్రలోకి వెల్లిపోయాను. మల్లీ మరుసటిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత రాబోయే 10th class public exams తప్ప మరేవీ గుర్తురాలేదు. ఆ Match అయిపోయిన కొద్దిరోజులకే మా Exams మొదలయ్యాయి.
15.                    ఆనవాల్లే లేని మా Farewell party
B.Tech లో Farewell జరుపుకున్నంత ఘనంగా 10th Class లో జరుపుకోలేదని గుర్తు ఉంది కానీ... “ఎలా జరుపుకున్నామా” అని ఎంత అలోచించినా అందులో లోతులోకి వెల్లలేకపోతున్నా.. ఎప్పుడో ఓరోజు మాత్రం శేఖర్ స్టూడియో నుంచి శేఖర్ అంకుల్ వచ్చి మా అందరికి గ్రూప్ ఫోటో తీసినట్లు, ఆ ఫోటో టైం లో చంద్ర గాడు దేనికో అలిగి ఫోటో తీయించుకోవడానికి రానట్లు మాత్రం బాగా గుర్తుంది.
16.                    10Th Class Public exams…
10Th Class Public Exams… High School Life మొదలైన దెగ్గర్నుంచి “మేము ఎలా రాస్తామో” అని స్టూడెంట్స్, “మా పిల్లలకి ఎన్ని మార్కులు వస్తాయో” అని పేరెంట్స్ భయపడే 10th Class Final Exams వచ్చేశాయి.
ఓ పదిహేను రోజులముందే ఎవరెవరికి ఏ ఏ Exam Center లు వచ్చాయో చెప్పేశారు. నాకు & నాతో పాటు ఇంకా చాలా మందికి మా పక్కనే ఉన్న రాఘవేంద్ర స్కూల్ సెంటర్ వచ్చింది. అప్పట్లో ఎందుకో రాఘవేంద్ర స్కూల్ కి, మా స్కూల్ కి అంతాగా సరిపోయేది కాదు. అందుకని ఆ Effect మా పైన చూపించి చాలా Strict గా ఉంటారేమో అని చాలా భయమేసేది. కానీ ఆ భయం మొదటిరోజు తెలుగు పేపర్-1 పరీక్ష అయిపోయిన వెంటనే మాయమైపోయింది.
మొత్తం 6 Subjects, 11 Papers.. అన్నీ Subjects లో Paper 1, Paper 2 అని రెండు Exams ఉండేవి. కానీ హిందీలో మాత్రం ఒకే Paper.. So Total 11 Exams రాయాలి.
First day first exam “Telugu paper-1”… ఆరోజు అందరం మా స్కూల్ కి వచ్చి ఓ చోట కూర్చుని ఉన్నాం. మా హెడ్ మాస్టర్ & నాగ భూషణం సర్.. ఇద్దరూ వచ్చి "ఏం భయపడకండి.. జాగ్రత్తగా మీ పరీక్ష మీరు రాసి వచ్చేయండి" అని Speech లు ఇచ్చి మమ్మల్ని పక్కనే ఉన్న రాఘవేంద్ర స్కూల్ లో వదిలి వెల్లిపోయారు. ఓ షెడ్ లాగా ఉన్న ఓ చిన్న రూం అప్పట్లో నా Exam Hall. నా వెనక కాజాపీర్, కాస్త పక్కనే క K. హిమబిందు కూర్చుని ఉన్నారు.... First Day కావడంతో అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. అందరం సైలెంట్ గా కూర్చుని అటూ ఇటూ చూస్తూ ఉండగానే Invigilator వచ్చేశాడు. వచ్చీ రాగానే చేతులో ఉన్న పేపర్ బంచ్ ని చైర్ పైన విసిరేసి, "చూడండీ.. ఎవరి పరీక్ష వాల్లు రాస్కుని మర్యాదగా బయటకు వెల్లండి, కాస్త పక్కకు తిరిగినా పేపర్ గుంజేసుకుని నేనే బయటకు పంపిస్తాను జాగ్రత్త..." అని కాస్త Rough Voice తో అనేసరికి నాకు ఏదో ఒక మూల పిచ్చ భయమేసింది. నాకేసిన ఆ భయం వయసు ఓ పది నిమిషాలు అయ్యేసరికి మా Invigilator Papers Distribute చేసి ఏదో ఓ చాక్లెట్ నోట్లో వేస్కున్నాడు. ఏం చాక్లెట్ తింటున్నాడో చూద్దాం అని నేను తన చేతిలో నలుగుతున్న చాక్లెట్ కవర్ వైపే చూస్తుంటే, నా చూపులకు అస్సలు చాన్స్ ఇవ్వకుండా సర్ వెల్లి ఆ కాగితాన్ని బయట పడేశాడు.
ఇంక Exam Start.. Question Paper చూశాను. Question Paper లో ఉన్న మొత్తం Questions కి Answers తెలుసు. కానీ తెలుగు పేపర్ లో ఎంత రాసినా నాకు ఇప్పటిదాకా వచ్చిన Highest Marks 92 out of 100. So ఇది కూడా అంతే అనుకుని అప్పుడే ఇంటినుంచి పూజ చేసి పట్టుకొచ్చిన పెన్ తో Exam రాయడం మొదలు పెట్టాను. ఆ invigilator నోట్లో చాక్లెట్ కరిగిపోంగానే మెల్లగా ఏదో ఓ Bunch of చిత్తుకాగితాలు తీస్కుని ఓక్కో స్టూడెంట్ దెగ్గరికి వెల్తున్నాడు. ఓ ఐదారు స్టూడెంట్స్ దెగ్గరికి వెల్లంగానే.. “Sir Additional” అని నేను కాస్త గట్టిగానే అడిగాను. అప్పుడు Invigilator నా వైపు కోపంగా చూసి ఓ పేపర్ ఇచ్చి "ఇది మీ ఇల్లు కాదు" అన్నాడు. అలా ఎందుకన్నాడో మరి... Additional Paper ఇచ్చిన తర్వాత ఓ పేపర్ లో Already ఉన్న అందరి పేర్ల లిస్ట్ లో నా పేరు వెతికి, నా పేరు పక్కనే "1+" అని వేస్కున్నాడు. "ఏంటి సర్ ఇది.." అని నేను అడగంగానే "పేపర్ తీస్కున్నావ్ గా" అని Reply ఇచ్చి మల్లీ ఆ చిత్తుకాగితాలు తీస్కుని అందరి దెగ్గరికీ వెల్తూ వెల్తూ బిందు దెగ్గరికి చేరుకున్నాడు.
Sir బిందు దెగ్గరికి వెల్లగానే, బిందు "సర్.. అడిషనల్.." అని చాలా చిన్నగా, తన ముందరున్న అబ్బాయికి కూడా వినిపించకుండా సర్ ని అడిగింది. సర్ కాస్త నవ్వి పేపర్ ఇచ్చి తన పేరు పక్కన కూడా "1+" అని వేస్కుని మల్లీ అందరి స్టూడెంట్స్ దెగ్గరికి వెల్తున్నాడు. అలా వెల్లి వెల్లి చివరకు నా దెగ్గరకు వచ్చి "ఏది.. హాల్ టికెట్ చూపించు" అన్నాడు. నేను జోబులోంచి హాల్ టికెట్ తీసి చూపించగానే "సంతకం పెట్టు" అని అచ్చం నా హాల్ టికెట్ లాంటిది ఇంకోటి నా చేతికి ఇచ్చాడు. "హేయ్..నా హాల్ టికెట్ ఇంకోటి కూడా ఉంటుందా..." అని మనసులో అనుకుంటూ బయటకు మెల్లగా నవ్వుకుంటూ సంతకం పెట్టి.. "రామ రామ... ఇవి చిత్తు కాగితాలు కావు రా చెత్తనాయాలా... మీ హాల్ టికెట్స్ ఇంకో కాపీ.." అని నన్ను నేనే తిట్టుకుని మల్లీ Exam రాయడం మొదలు పెట్టాను.
మొత్తానికి ఓ అరగంట టైం మిగిలి ఉండగానే Main Paper రాయడం అవగొట్టేసి, బిట్ పేపర్ కోసం Wait చేస్తూ కూర్చున్నాను. అప్పట్లో Main Paper రాయడం ఎంత ముందు అయిపోయినా, Exam అయిపోవడానికి అరగంట ముందు మాత్రమే Bit Paper ఇచ్చేవారు. ఓ అరగంట తర్వాత ఇచ్చిన Bit Paper కూడా Easy గానే ఉండటంతో Fast గా రాసి బయటకు వచ్చేశాను. Exam రాసి బయటకు రాగానే రాఘవేంద్ర స్కూల్ అంటే మేము పెట్టుకున్న భయమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. "మన Exam మనం రాస్కునేటపుడు ఎవరు ఎంత Strict అయితే మనకేంటి" అనిపించింది.
తర్వాత, రోజూ Morning మా స్కూల్ కి రావడం, మల్లీ పక్క స్కూల్ కి వెల్లడం, Exam రాయడం, మల్లీ ఇంటికి వెల్లడం అలా అలా జరిగిపోయేది. After few days Maths paper-2 Exam.
మొన్న Maths Paper -1 Exam బాగా రాసి అంకాల్ సర్ కి, S.P.Raju సర్ కి 50 Out 50 Marks వస్తాయ్ సర్ అని గర్వంగా చెప్పి ఈరోజు రాయబోయే Maths Paper-2 Exam కి ఓరోజు Holiday రావడంతో నిన్న అంతా బాగా Prepare అయ్యాను.
Paper 2 exam start అయింది . ఇది కూడా చాలా Easy గా వచ్చింది. అప్పట్లో ఎన్ని Choice లు ఉన్నా Maths అంటే ఒక్క Question కూడా వదలకుండా మొత్తం రాసేవాన్ని. అలా రాసిన తర్వాత కూడా ఇంకా 45 నిమిషాల  పైనే Time మిగిలేది. అలా Main Exam రాయడం అయ్యాక Bit Paper కోసం Wait చేస్తూ, అది కూడా Easy గా రావాలని మనసులో కోరుకుంటూ వెనక కాజాపీర్ గాడు ఏమో అడుగుతుంటే చెప్తూ ఉన్నాను. 45 నిమిషాలు గడిచీ గడవకముందే నా చేతిలో బిట్ పేపర్ వచ్చేసింది. వచ్చినవి వచ్చినట్లు రాస్కుంటూ వెల్లగా చివర్లో రెండు బిట్స్ Answer మాత్రం రావట్లేదు. ఒకటి మాత్రం Answer అస్సలు తెలీదు. ఇంకోటి మాత్రం గుర్తొస్తున్నట్లుగానే ఉంది. అది కూడా పక్కాగా Answer "0" Or "1" నే ఉంటుంది.
Bit Paper ఇచ్చిన పది నిమిషాలకే అందులో ఉన్న 30 బిట్లలో 28 వాటికి Answer పెట్టేసిన నేను మిగిలిన ఆ రెండు బిట్స్ కి Last Second వరకు Answer పెట్టలేకపోయాను. ఒక బిట్ కి Answer ఎలాగూ రాదని దాని గురించి అలోచించడమే మానేశాను. కానీ మిగిలిన ఇంకోటి కరెక్ట్ గా రాస్తే 49.5 Marks వస్తాయి. అంటే మొత్తం 99.5 Marks వస్తాయి. So 100 వేసేస్తారు. కానీ ఈ బిట్ Answer ఏంటో కరెక్ట్ గా తెలీట్లేదు. ఇంక అలోచించి ఫలితం లేదు, ఏదోటి పెట్టేద్దాంలే అని వెంటనే "0" అని పెట్టేశాను. వెంటనే టైం ఇంకా 5 నిమిషాలే ఉందని Announcement వచ్చింది. "0" అని పెట్టిన తర్వాత మల్లీ నాకు Negitive thinking Start అయింది. అందుకే టైం అయిపోతున్న చివరి నిమిషం లో మల్లీ "0" ని కొట్టేసి "1" అని రాసి ధైర్యంగా పేపర్ ఇచ్చేసి బయటకొచ్చాను. Maths Exam అయిపోయింది. “99 పక్కా.. 100 కాస్త డౌట్” అని నాకు అర్థమైపోయింది. “100 కి 100 Marks రావు అంటే అంకాల్ సర్ నాకు ఇచ్చే కోటింగ్ అలా ఇలా ఉండదు” అని అలోచిస్తూ ఇంటికెల్లి కాసేపు పడుకున్నాను.
Same Day Evening 5:30 PM… కాస్త డల్ గా అంకాల్ సర్ ఇంటి గేట్ ఓపెన్ చేశాను. సర్ బయటే కూర్చుని నాకంటే ముందే వచ్చిన లత, సుస్మిత వాల్లతో మాట్లాడుతున్నాడు. లత & సుస్మిత చాలా Confident గా, చాలా బాగా రాశాం అని చాలా ఆనందంతో సర్ తో చెప్తుంటే అది చూసి "అరె నాకు ఈ చాన్స్ లేదే" అని చాలా బాధేసింది. కానీ ఇప్పటికీ ఆ బిట్ Answer "1" అయితే నాకు కూడా 100 కి 100 వస్తాయ్ కదా అనిపించి "సర్ ఆ బిట్ కి Answer "1" ఏ కదా.." అని అడగంగానే పక్కనే కూర్చున్న లత “"1" కాదు.. దాని Answer "0"” అని గట్టిగా అరిచింది. వెంటనే సర్ కూడా తల నిలువుగా ఊపడంతో... "దొబ్బిందిరా భరత్ గా.. ఇంక నీకు 99 నే గతి" అనుకుని “సార్.. 100 రావు సార్.. 99 వరకు Fix అయిపోండి” అనేశాను. లత, సుస్మితలతో నవ్వుకుంటూ ఎంతో ఆనందంగా మాట్లాడుతున్న సర్ వెంటనే పైకి లేచి "తు.. సిగ్గులా అలా చెప్పడానికి.. నా ఆశలన్నీ దిబ్బలో పడేశావ్ కదరా... ఎన్ని Unit పరీక్షల్లో, Quartarly, Halfyearly, Prefinal పరీక్షల్లో 100 కి 100 వచ్చి ఏం లాభం, పబ్లిక్ పరీక్షల్లో తెచ్చుకోలేనప్పుడు... రేయ్ భరత్ గా ఒక్కటి గుర్తు పెట్టుకో Total 550 వచ్చిన వాడికన్నా Maths లో 100 కి 100 వచ్చినవాడికే ఎప్పటికైనా ఎక్కువ విలువ... అర్థమైందా.. అదిప్పుడు నీకు లేదు" అని Non-Stop గా ఓ పెద్ద డైలాగ్ చెప్పి Chair ని పక్కకి తోసి లోపలికి వెల్లిపోయాడు.
"ఏం భరత్.. ఆ బిట్ నీకు రాదా.. లేక గుర్తు రాలేదా.." అని పక్కనే కూర్చున్న లత నా బాధకి  ఓ ఓదార్పులాగా అడిగింది. "గుర్తు రాకుంటే ఏం, అసలే రాకుంటే ఏం.. మొత్తానికి Answer అయితే రాయలేకపోయా కదా... ఈ జన్మకి 10th Class Maths లో 99 తోనే సరిపెట్టుకుంటాలే" అని కాస్త సెంటిమెంట్ గా లతకి Reply ఇవ్వగానే లోపల ఉన్న సర్ మల్లీ వెంటనే బయటకు వచ్చి "సిగ్గులా అలా చెప్పడానికి... బతికితే కింగులాగా బతకాలి, లేకుంటే అస్సలు బతకకూడదు.. రేయ్ భరత్ గా... జీవితంలో సెకెండ్ వచ్చిన వాడికి ఎప్పటికీ విలువ ఉండదు గుర్తు పెట్టుకో.." అని మల్లీ లోపలికి వెల్లిపోయాడు.
"అయ్యబాబోయ్.. ఈయనేంటి.. మద్యాహ్నం అన్నం తినలేదా.. ఓ రెచ్చిపోతున్నాడు" అని అనుకుంటూ... "నువ్వెలా రాశావ్ లత... 100 కి 100 వస్తాయా..." అని లతని అడగగానే "ఏమో భరత్.. అన్నీ రాశాను.. కానీ మార్కులు ఎన్ని వస్తాయో చెప్పలేను" అని నవ్వుతూ Reply ఇచ్చింది. "Hmm ok ok.. మరి నువ్వెలా రాశావ్ సుస్మిత.." అని సుస్మిత ని అడగగానే తను సొంతంగా ఏం Answer చెప్పకుండా "Same Answer" అని లత వైపు వేలు చూపించింది.
Sir లోపల ఏం చేస్తున్నాడో తెలీదు.. వాల్ల మాటలు వినగానే బయటకు వచ్చి మల్లీ అరుస్తున్నాడు.. "మేయ్.. మీకు అస్సలు సిగ్గులా.. ఇంకోసారి "బానే రాశాం కానీ ఎన్ని మార్కులు వస్తాయో తెల్దు" అని అంటే ఇద్దర్నీ బయటకు దొబ్బుతా... ఇదేమన్నా తెలుగు, హిందీ అనుకుంటున్నారా తెల్దు అనడానికి హా... Maths Exam రాస్తే అర మార్కుతో సహా ఎన్ని మార్కులు వస్తాయో ముందే తెలిసిపోవాలి.. వాడు చూడు.. దున్నపోతు.. "99" వస్తాయ్ అని సిగ్గులేకుండా ఎలా చెప్తున్నాడో... వాడికి 100 రావు, 98 కూడా రావు..." అని చెడా మడా పొగడ్తలో తిట్లో అర్థం కాని మాటలు మాట్లాడి ఈసారి లోపలికెల్లకుండా వచ్చి మా పక్కనే Chair లో కూర్చున్నాడు.
నేను అలాగే బాధగా ఉదయం రాసిన Question పేపర్ చూస్కుంటూ కూర్చున్నాను. సర్ అది గమనించి వెంటనే ఆ Question పేపర్ ని లాగి ఇంక చాల్లే చూసింది, ఇంక Physics తీసి చదువు అని ఆ పేపర్ ని ముక్కలు ముక్కలుగా చింపి బయట పడేశాడు. "వార్నీ.. లత, సుస్మిత ఉన్నంతవరకు సర్ నన్ను అవమానిస్తూనే ఉంటాడేమో” అనుకుంటూ, “లత, సుస్మిత ఇంటికి వెళ్ళిపోవాలని” మనసులో కోరుకుంటూ తలదించుకుని Physics చదవడం మొదలు పెట్టాను.
అలా చదవడం మొదలు పెట్టిన మరుసటిరోజు Physics Exam, Next N.S., Next Social Paper-1, Next & last but not least Social Paper-2 Exam…..
“నా Life లో చివరి School Day ఈరోజు. ఈ Exam రాసి ఇంటికి వచ్చానంటే 10th Class అయిపోయినట్లే..” అని మనసులో అనుకుంటూ ప్రతీ Exam కి ఏదో ఒక బుక్ తీస్కెళ్ళే నేను, ఈసారి మాత్రం ఖాలీ చేతులతో Lastday Morning 8:10 AM కి మా స్కూల్ కి చేరుకున్నాను. వచ్చి అందర్నీ చూస్కుంటూ "నేనే అనుకుంటే, నాతోపాటు చాలా మంది ఖాలీ చేతుల్తో వచ్చారే..." అని అనుకుంటూ, అలాగే అందర్నీ పలకరించుకుంటూ Exam గురించి అస్సలు Tension లేకుండా స్కూల్ దాటి వెళ్ళి Exam Hall లో నా ప్లేస్ లో నేను కూర్చున్నాను.
కూర్చున్న కాసేపటికి Invigilator రావడం, పేపర్ ఇవ్వడం, మేము Exam మొదలు పెట్టడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. తర్వాత కాసేపటికి మా Hall Tickets ఇంకో కాపీలు ఉన్న బంచ్ ని పట్టుకుని అందరి దెగ్గర సంతకాలు తీస్కుంటూ నా దెగ్గరికి వచ్చేశాడు… నేను నా Hall Ticket తీస్కుని అలా ఓ 2 Seconds చూసి "భరత్ కుమార్ రెడ్డి" అని నా సంతకం తెలుగులోనే పెట్టి మల్లీ Sir కే ఇచ్చేశాను. “ఈ సంతకంతో నా10th Class life as well as my school life.. Both are over…” అనుకుని మిగిలిన Exam రాయడం మొదలు పెట్టాను.
Exam అయ్యాక స్కూల్ కి వచ్చి అందరితో అలా అలా మాట్లాడి "ఇంక రేపటినుంచి ఇంట్లో ఏం చేయాలో.." అని అలోచించుకుంటూ ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఆ రోజు సాయంత్రం 7:30 దాకా నిద్రలేవకుండా అలాగే పడుకున్నట్లు బాగా గుర్తుంది. అమ్మ "లేరా" అని లేపిన తర్వాత నిద్ర లేచి కాస్త అన్నం తిని మళ్ళీ పడుకున్నాను.
Next Day Morning నిద్రలేచి ఏం పని చెయ్యాలన్నా చేయబుద్ది కావట్లేదు. ప్రతీ సంవత్సరం ఎండాకాలం సెలవులు మొదలయ్యాయ్ అంటే ఎంతో ఆనందంగా అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే 8th Class అయిపోయిన తర్వాత సెలవుల్లో "ఇంకా 9th, 10th  ఉందిలే.." అని, 9th అయిపోయిన తర్వాత సెలవుల్లో "ఇంకా 10th ఉందిలే.." అని ఆ మొత్తం సెలవుల్లో కనీసం కొన్నిరోజులన్నా బాగా Enjoy చేసేవాల్లం. కానీ ఇప్పుడు అలా కాదు. 10Th Class అయిపోయింది.
Ø రేపటినుంచి నేను శ్రీ భారతీ విధ్యామందిర్ స్టూడెంట్ ని కాదు, Just Old Student ని అంతే... నిజంగా తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.
Ø రేపటినుంచి లీడర్ లాగా టేబుల్ ముందర నించుని ఎవరి పేర్లూ రాయలేను…
Ø రేపటినుంచి No S.P.Raju Sir, No N.S. Sir, No నాగభూషణం Sir…
Ø రేపటినుంచి అమ్మాయిల జడల్లో అందంగా కనిపించే కాశాయపు రిబ్బన్లు, మా అందరి చెవుల్లో అందంగా వినిపించే దేశభక్తి గీతాలు ఏవీ ఉండవ్...
Ø రేపటినుంచి నా School Dress, Barge, Belt, Lunch Box అన్నీ మూలన పడిపోతాయ్…
Ø రేపటినుంచి రోజూ మా సరస్వతీమాత దెగ్గరికెళ్ళి నేను మొక్కోలేను, ప్రతీ శనివారం మాతని పూజించుకోలేము...
Ø రేపటినుంచి లేట్ గా వచ్చి ఆ సిల్వర్ కలర్ పోల్ పక్కనే నించోవడానికి కుదరదు...
Ø రేపటినుంచి లత కోపపు చూపూ ఉండదు, స్వాతి ఎక్కిల్ల నవ్వూ ఏవీ ఉండవు.....
Ø రేపటినుంచి No కబ్బడి, No ఖోఖో...
Ø రేపటినుంచి మా N.S. Sir తిట్లు మాకు దూరమైపోతున్నాయ్...
Ø రేపటినుంచి యోగచాప్ పట్టుకుని జయ, విజయల పాటకి కదలలేము…
Ø రేపటినుంచి No సూర్యనమస్కారాలు, No కోలాటం, No చెక్కబజన, No ఘోష్...
Ø రేపటినుంచి No Night Tuitions…
ఏంటో.... రేపటినుంచి యుగాంతం అనేంతలా ఉంది నా మనసు. చాలా బరువుగా, వింతగా, కొత్తగా అనిపిస్తుంది... అలా వింతలోనే, బాధలోనే ఒకటి రెండు రోజులు గడవంగానే మెల్లగా రోజులు మామూలు అవుతూ వచ్చాయి. బాధ తగ్గింది అనాలో, బాధ అలవాటు అయింది అనాలో అర్థం కావట్లేదు కానీ ఆ 10th Class Last Exam తర్వాత నా ముఖంపైన స్వచ్చమైన నవ్వు నన్ను చేరుకోవడానికి ఓ వారం రోజులపైనే పట్టింది.
          10th Class అయ్యాక అప్పుడప్పుడూ ఆల్లగడ్డకి వెళ్ళడం, అంకాల్ సర్ తో సరదాగా మాట్లాడి రావడం, మహేష్, సురేష్, మణికంఠ వాల్లని కలుస్తుండటం…  అలా అలా ఏప్రిల్ 2006 అంతా గడిచిపోయింది.  తర్వాత ఏప్రిల్ లోనే అంకాల్ సర్ APRJC అని, పాలిటెక్నిక్ అని కోచింగ్ సెంటర్ మొదలుపెట్టడంతో నామొఖంలో దూరమైన కల కాస్త మల్లీ నన్ను చేరుకుంది. చంద్ర, లత వాల్లంతా నాతోపాటు ఆ కోచింగ్ కి రావటంతో ఇంకొన్ని రోజులు బానే గడిచినట్లు గుర్తుంది.
          May 5th 2006… Its my birthday.. ఎవరూ లేరని తెలిసినా అలా సైకిల్ లో ఆల్లగడ్డకి వెళ్ళి అంకాల్ సర్ కి ఓ చాక్లెట్ ఇచ్చి మల్లీ అలా అలా సరదాగా Streets తిరిగి ఇంటికొచ్చి "ఈ పుట్టినరోజు అంత బాలేదుమా..." అని అమ్మతో అనుకుంటూ రాత్రి అలాగే నిద్రపోయాను.
          అలా నన్ను Dull గా S.S.C. Board చూడలేకపోయిందేమో.. Birthday అయిపోయిన ఓ నాలుగైదు రోజులకే మా 10th Class Public Exams Results ని Release చేసింది. ఆరోజు “520 out of 600, maths 99 out of 100” అని నా Results చూస్కోగానే చాలా ఆనందమేసింది. వెంటనే ఆల్లగడ్డకి వెళ్ళి అంకాల్ సర్ తో "Sir… Maths 99" అని చాలా ఆనందంగా చెప్పాను. ఆరోజు Exam రాసిన తర్వాత 99 వస్తాయ్ అన్నానని చెడా మడా తిట్టిన అంకాల్ సర్ ఇప్పుడు మాత్రం "99 వస్తాయని చెప్పావ్... 99 తెచ్చుకున్నావ్... Verrrrrrrrrrrryyyyy Goodddd" అని ఓ రిథంలో బలేగా అన్నాడు. “Thank you sir.. Total 520 marks sir…” అని నేను... "అబ్బ.. చాలా బాగా వచ్చాయ్ భరత్..." అని సర్, అలా అలా మాట్లాడుకుంటూ అలాగే సాయంత్రం వరకు అక్కడే ఉండి చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళి పడుకున్నాను.. మామూలుగా రోజూ ఎంత ఆనందంగా ఉన్నా రాత్రి పడుకునేటపుడు మాత్రం స్కూల్ ని మిస్ అవుతున్నానే అనే బాధేసేది. అదే బాధలో అలాగే మెల్లగా నిద్రపోయేవాన్ని.. కానీ ఆరోజు మాత్రం చాలా రోజులతర్వాత ఆనందంగా నాకు వచ్చిన మార్కులనే తలుచుకుంటూ పడుకున్నాను.
          తర్వాత After Five Days తెల్సింది ఏంటనే... మా స్కూల్ లోనే కాదు.. ఆల్లగడ్డలో ఎవ్వరికీ Maths లో 100 Out of 100 Marks రాలేదంట.. 99 నే Highest అంట.. హా హా అది తెలిసి మా అంకాల్ సర్ ఇంకా ఆనందపడ్డాడు. అప్పుడు డబ్బు ఖర్చైనా పర్లేదు అని సర్ ఓ టి.వి చానల్ దెగ్గరికెల్లి మార్కులతో సహా "భరత్ కుమార్ రెడ్డి 99, సురేష్ బాబు 98, సుబ్రమణ్యం 95, శ్రీ లత 93..." అని మా పేర్లన్నీ T.V లో Publish చేయించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మా స్కూల్ వాల్లు 500 మార్కులు దాటినవాల్ల అందరి పేర్లు, ఫోటోలు, మార్కులు ఉంచి Poster లు వేయించి ఊరు, ఊరికు తిరిగి అంటించారు. ఇంకొన్ని రోజులకి "గణితం 99" అని మా స్కూల్ మాసపత్రిక "స్పూర్థి" లో నా పేరు, ఫోటో వేశారు.. హా హా హా ప్రతీ సారి మా ఊర్లో వేరేవాల్ల పేర్లున్న పోస్టర్లు, ఇలా స్పూర్థి బుక్కుల్లో ఫోటోలు చూసి “ఇలా నా ఫోటో వస్తదో రాదో” అనుకునేవాన్ని.. కానీ ఇప్పుడిలా నన్ను కూడా పోస్టర్లలో, బుక్కుల్లో చూసేసరికి చాలా చాలా happy గా అనిపించింది. అందుకే ఆ పోస్టర్లు, ఆ బుక్కులు అన్నీ ఇప్పటికీ బద్రంగా దాచుకున్నాను.
          హా హా హా... నిజంగా 10th Class Life ఎంత బాగున్నిందో 10th Class అయిపోయాకనే బాగా అర్థమైంది. రోజూ ఇంటినుంచి School వెళ్ళడం; ఓ ఐదు నిమిషాలు లేట్ అయిందంటే సర్ ల చేత తిట్లు తినడం; ఒక్కొక్కరి Character ఒక్కోలా ఉన్న అందరి Sir’s క్లాసులు వినడం; టైం ఉంటే యోగచాప్, చెక్కబజన, సూర్యనమస్కారాలు చేయడం; ఇంటికి వెళ్ళేటపుడు నా సైకిల్ ని బయటకు తీసే ప్రయత్నంలో నా బ్యాగ్ తగిలి ఓ సైకిల్ పడి, అలా అన్ని సైకిల్ లు పడిపోవడం; మళ్ళీ వాటన్నిటినీ నిలబెట్టడం; Night Classess కి రావడం; మళ్ళీ ఉదయం 6 కే లేచి క్లాస్ కి రావడం; క్లాస్ లో అప్పుడప్పుడు Quiz లు; Hostel వాల్లతో Cricket Match లు; అలా అవీ ఇవీ అన్నీ రాస్కుంటూ పోతే చాలానే వస్తాయ్.. ఈరోజు ఓ మధుర జ్ఞాపకాలుగా మారిపోయిన ఇలాంటి ఎన్నో సంగతులు మా 10th Class Life లో ఉన్నాయ్..
          ఆనందాలు, బాధలు, జ్ఞాపకాలు... ఈ మూడూ అందరి జీవితాల్లో ఉంటాయ్... వస్తూ పోతూ ఉండే ఈ ఆనందాలు, బాధలని పక్కన పెడితే, ఒక్కసారి వస్తే మెళ్ళీ వదిలి వెళ్ళని ఈ జ్ఞాపకాలంటే నాకు చాలా ఇష్టం.. ఏదైనా ఓ జ్ఞాపకం కదిలే ఓ మసక తెరలాగా ఉన్నా కూడా దాన్ని అక్షరాలుగా మార్చి పేపర్ పైన పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటే ఈ జ్ఞాపకాలన్నిటినీ ఎప్పుడైనా చదువుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.. అందుకే నేను బాధనైనా, ఆనందాన్నైనా వెంటనే పేపర్ పైన పెట్టేస్తుంటాను. హా హా వింత ఏంటనే బాధని పేపర్ పైన పెడితే ఆ బాధ తగ్గుతుంది, ఆనందాన్ని పేపర్ పైన పెడితే ఆ ఆనందం పెరుగుతుంది.. పెద్దలు అప్పడప్పుడు "జ్ఞానం ఒక్కటే తరిగిపోని ఆస్తి" అని అంటుంటారు... కానీ నా దృష్టిలో ఈ జ్ఞాపకాలు కూడా ఎన్నటికీ తరిగిపోని ఓ విలువైన ఆస్తే…
          Hmmmmmmmmmmmmmm……. Any Way… Let us come to present... Today Date is 27-12-2013… Time 11:56 PM… ఇంకో నాలుగు నిమిషాలు ఆగితే డేట్ మారుతుంది... ఆ డేట్ మారిన తర్వాత ఓ నాలుగు రోజులు ఆగితే నెల, సంవత్సరం కూడా మారిపోతాయి... నాలుగు రోజుల తర్వాత మారే నెల, సంవత్సరం గురించి పక్కన పెడితే, ఇంకో నాలుగు నిమిషాలతర్వాత మారే రోజు నా అమ్ములు పుట్టినరోజు.. హా హా హా అమ్ములు ఇప్పటికే సెల్ పట్టుకుని నా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది… అర నిమిషం లేట్ అయినా అలుగుతుంది. 
          ఇవన్నీ మనసులో ఆలోచిస్తుండగానే నా సెల్ లో డేట్ మారిపోయింది. వెంటనే సెల్ తీస్కుని “9030_ _ _ _ _6” అని Dail చేసి సెల్ చెవి దెగ్గర పెట్టుకున్నా... Tring… Tring…










Happy Birthday నే అమ్ములూ....
Your’s
CHINNA


          

1 Comments:

At September 12, 2015 at 2:41 PM , Blogger Unknown said...

నేను కూడా అదే స్కూల్‌లో చ‌దువుకున్నాను మీ ర‌చ‌న వ‌ల్ల చిన్న‌నాటి సంగ‌తులు పాఠ‌శాల జ్ఞాప‌కాల‌న్నీ గుర్తుకువ‌చ్చాయి

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home