Wednesday, October 2, 2013

కవిత్వం నా ప్రాణం

పట్టరానంత సంతోషం అనిపించినా కవిత్వం,
భరించలేనంత బాధ అనిపించినా కవిత్వం,
తట్టుకోలేనంత కోపం వచ్చినా కవిత్వం,
చెప్పలేనంత చిరాకు వచ్చినా కవిత్వం....
మనసారా ప్రేమించాలన్నా కవిత్వం,

మదితీరా ద్వేశించాలన్నా కవిత్వం....
ప్రపంచంలో నాకున్న మొదటి స్నేహం కవిత్వం....
ఏనాటికి తరిగిపోని నాకున్న ఆస్తి కవిత్వం....
నా అలసిన మనసుకి కాస్తంత విశ్రాంతి కవిత్వం
నాకొచ్చే కష్టాల్లో నాతో నడిచే తోడు కవిత్వం...
నాకనుజారే కన్నీటికి శాశ్వత అక్షరరూపం కవిత్వం,
నాలో కనిపించని కలతలకి కనిపించే కావ్యరూపం కవిత్వం..






0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home