Thursday, November 21, 2013

చిన్ననాటి జ్ఞాపకాలు అమ్మతో అనుబంధం


      17–11–2013, ఆదివారం, Time 6.30 AM; బీహార్ లో, పావపురిలో, నా రూం లో ఓ కొత్తకాలపు మడతమంచం పైన ఉన్న పరుపు పైన నిన్న రాత్రి ప్రశాంతంగా పడుకున్న నేను, ఈరోజు ఉదయం కాస్త బెంగగా, కల్లనుంచి జారీ జారని కన్నీల్లతో పైకి లేచాను. ఆ కన్నీల్లు నిద్ర తక్కువై వచ్చినవో, చలి ఎక్కువై వచ్చినవో, నాకొచ్చిన అలోచనలవల్ల వస్తున్నవో అర్థం కాకపోయినా మెల్లగా అరచేతుల్తో ఆ కన్నీల్లని తుడుచుకుని, నా ఒంటిపైన ఉన్న రగ్గుని మెల్లగా తీసి మంచం ఓ చివరన వదిలేశాను. మంచానికి సమాంతరంగా కూర్చున్న నేను, మెల్లగా ఇటు తిరిగి కుడికాలుకి చెప్పు వేస్కుని, మంచంకింద దాక్కున్న ఇంకో చెప్పు ని కాలితోనే వెతుకుతున్నా... ఆ వెతికే ప్రయత్నంలో తొందర్లో నా కాలు నేలని తాకింది. ఒక్క క్షణం Body అంతా Shiver అయింది.  ఆ బండల చల్లదనానికి నా కల్లనీల్లు గడ్డకట్టినంత పనైంది. ఇప్పటికే ఐదు డిగ్రీలు ఉన్న చలి రాను రాను పెరుగుతూ ఇంకా ఎంత నరకం చూపిస్తుందో అని అలోచించూంటూ దొరికిన ఎడమకాలు చెప్పుని వేసుకుని మెల్లగా పైకి లేచాను. ఉన్న ఆరడుగులు చాలదన్నట్లు చేతులు పైకి అని ప్రశాంతంగా Relax అయ్యాను.
అవ్వాల్సినంత Relax అయ్యి చేతులు కిందకి దించుతూ దించుతూ నిద్రలో వచ్చిన నా అలొచనల్లో క్లారిటీని వెతుక్కుంటున్నా.. గుర్తురానట్లు అనిపించేసరికి మెల్లగా అడుగు ముందుకేశా. అడుగుకో అరనిమిషం ఆగుతూ మంచానికి మూడూనర్ర అడుగుల దూరంలో ఉన్న డోరుని ఆరునర్ర నిమిషాల్లో చేరుకుని డోర్ కి అనుకుని నించుని చూస్తున్నా... అటూ ఇటూ చూస్తుంటే నిన్న రాత్రి Laptop Shutdown చేసి Charger Off చేయడం మర్చిపోయానని గమనించి, మెల్లగా ముందు Bed light Switch ని పైకి, Main light Switch ని కిందకి నొక్కి, తర్వాత వెంటనే Charging Switch ని కూడా అపేశాను.
మెల్లగా డోర్ తీద్దామని Door Handle పైన చెయ్ పెట్టగానే, నా చెవులపైనే ఉన్న Calling Bell పెద్దగా మోగింది. నాకొచ్చిన చిరాకుకి ఆ Bell కొట్టినవాడిని కొరికేయాలనిపించింది. ఎలాగూ చెయ్యి Handle పైనే ఉంది కదా అని అదే చేత్తో డోర్ తీశా... చూస్తే దోభీ "కపడా దీజియే సార్..." అంటూ చలికి బాగా ఒనుకుతూ  కనిపించాడు. "ఆదాగంటా కే బాద్ ఆజావ్" అని వాడితో అనేసి, మెల్లగా Skipping Thread తో చలిని తరిమేద్దామని Exercise Start చేశా. Start చేసిన మూడు నిమిషాలకే నిద్రలో నాకు వచ్చిన అలోచనలన్నీ గుర్తొచ్చేశాయి. వెంటనే Thread పక్కన వదిలేసి, Heater పెట్టిఉన్న Bucket లోంచి కాస్త నీల్లు తీస్కుని మొఖం పైన చల్లుకున్నాను. Face wash అయ్యాక చేత్తో ఒకసారి, Towel తో మూడుసార్లు మొఖం బాగా తుడుచుకుని, అమ్ములు రోజూ 6.20 కి పంపే “Good Mng ra. . . .” అనే SMS కి Reply ఇద్దామని సెల్ ని చేతికి తీస్కున్నా.. చూస్తే No Message.
అలోచిస్తే అరనిమిషం తర్వాత గుర్తొచ్చింది, అమ్ములు అనంతపూర్ లో లేదు, కర్నూల్ కి వెల్లింది అని… సర్లే అనుకుని మడిచని దుప్పటిపైనే సెల్ విసిరేసి, పక్కనే ఓ పెన్, బుక్ తీస్కుని చెప్పులు విడిచి మంచం పైన మెల్లగా పద్మాసనం వేస్కుని కూర్చుని కాల్లవరకు దుప్పటిని, కల్ల పైన అలోచనల్ని కప్పుకుని జ్ఞాపకాల అణ్వేశనకి బయలుదేరాను.
ఇంక నిద్రలో వచ్చిన అలోచన విషయానికి వస్తే... ఓ వారం రోజులనుంచి "అమ్మ" గురించి, మా చిన్ననాటి కష్టాల గురించి ఓ Article రాయాలనుకుంటూ రోజూ రాయలేక మర్చిపోతున్నాను. ఈరోజు Sunday కూడా అవడంతో ఆ అలోచన కాస్త పెద్దది అయ్యి, రాయాల్సిన సంఘటనలన్నీ కల్లముందే కనిపించి నా గుండెని కదిలించాయి. ఎలా Start చెయ్యాలా అని ఆలోచిస్తూ గడ్డంకి పెన్ కొట్టుకుంటూ కూర్చున్నా.. ఓ నిమిషానికి గుర్తొచ్చింది గడ్డం పెరిగిందని, Shave చేస్కోవాలని…. Leave It అని పెన్ ని పేపర్ పైన పెట్టి అక్షరం మొదలెట్టేలోపే మల్లీ Calling Bell మోగింది. చిరాకు దొబ్బి చెప్పులు కూడా లేకుండా వెల్లి Door తీశా. చూస్తే మల్లీ దోభి…. "ఆదా గంటా హోగయా సార్.. , కపడా దీజియే " అని అప్పటిలాగే ఒనుకుతూ నించున్నాడు. నాకు అప్పటికే చలి చెవులదాకా పాకింది. “Ok ఇస్తా రా చెప్పులు బయట వదిలి లోపలికి రా” అన్నాను. పాపం వాడు చెప్పులు వదలమనేసరికి భయపడ్డాడు. వాడి భయాన్ని చూడలేక "వేస్కునే రా" అనగానే వెంటనే వచ్చి "ఏక్, దో, తీన్ అని దస్ దాక లెక్కపెట్టి తీస్కెల్లిపోయాడు. హమ్మయ్య… అనికుని, తలుపు మూసేసి మంచంవైపు నడుచుకుంటూ వస్తున్నా.. Damn It… మల్లీ Calling Bell… ఎవడ్రా రేయ్... అని కోపంగా తలుపు తీస్తే మల్లీ వాడే... Same దోభి… ఐదురూపాయల బిల్ల చూపిస్తూ "ఆప్ కా పాకెట్ మే మిలా సార్..." అని నాకు ఇచ్చాడు. Ok thank you అని మల్లీ Door వేసి "ఇలా Pocket లో వెయ్యిరూపాయలు మర్చిపోయే Stage ఎప్పుడు వస్తుందో అనుకుంటూ ముందుకు నడిచాను. అయినా నా పిచ్చిగానీ వెయ్యిరూపాయలు దొరికి తే మల్లీ తిరిగి వాడెందుకిస్తాడు..
ఇంక ఎవరూ రార్లే అని మెల్లగా కూర్చుని  రాయటం మొదలుపెట్టా...  Let me Copy Our Hon’ble Former President A.P.J. Abdul Kalam’s terminology once for a while.
Up to now, I have orbited twenty three times around the sun. By next may 5th I will complete my 24th round also. ఈ 23 సంవత్సరాల కాలంలో చివరి మూడు సంవత్సరాలు పర్లేదు అనేలా ఉన్నా మిగిలిన ఇరవై సంవత్సరాలు Criticle. ఈరోజెందుకో ఆ ఇరవై సంవత్సరాలని ఓ ఇరవై పేపర్లలో నింపాలనిపించింది. ఎన్నో కవితలు రాశా, కొన్ని పాటలు రాశా, ఇంకొన్ని Articles రాశా... కానీ ఎందుకో ఇప్పుడు ఇది రాయాలంటే చేతికి కొత్తగా, మనసుకుకి వింతగా ఏదోలా అనిపిస్తుంది.
చిన్నప్పటినుంచి పడిన కష్టాలు, బాధలు, భయాలు.. అన్నీ వీలైనంత వివరంగా, నాకు & నా వాల్లకు ఎప్పటికీ ఓ జ్ఞాపకం అయ్యేలా ఈ Article ని మలచాలనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో... నేను నా కన్నీటి చుక్కలని ఎంచుకుంటూ రాస్తానేమో అనిపిస్తుంది. ఎందుకంటే... We came through a tough path . ఇలాగే అలోచించుకుంటూ ఒక చెయ్యి పేపర్ పైన, ఇంకో చెయ్యి నుదుటిపైన పెట్టి రాస్తూ ఉంటే మల్లీ Calling Bell మోగింది.. “వార్ని... ఎప్పుడూ Calling Bell లే మోగుతుంటే ఇంక Content ఏం రాయాలిరా ఇందులో” అనుకుంటూ వెల్లి Door తీశాను.. చూస్తే ఎవరూ లేరు... మల్లీ తలుపు వేసి వెనక్కు వస్తుంటే దూరం నుంచి ఓ పిలుపు..."రెడ్డి గారూ…. టిపిన్ రడీ..." అని మా Colleague  పిలిచాడు. ఇంకా రాయడం ఎలాగు మొదలు పెట్టలేదుగా అని వెల్లి 2.4M X 25M Size Corridor Middle లో కూర్చుని ముందరున్న గోడని చూస్కుంటూ తింటున్నా... గోడవైపు చూస్తున్నా అనే గానీ నా అలోచన మత్తులో నా చూపులు ఆ గోడని తాకడం లేదు.. ఒక్కో పూరీ తింటుంటే వచ్చే అలోచనలు మాత్రం " ఇంక చాలులే తినింది" వెల్లి రాయడం మొదలు పెట్టు అంటున్నాయి. ఓ ఐదు పూరీలు తిన్న తర్వాత మెల్లగా వెల్లి చెయ్యి, ప్లేట్ రెండూ కడిగేసి మెల్లగా నడుచుకుంటూ “ఇంత Disturbance లో రాయడం కన్నా, ముందు ఏ ఏ విషయాలు రాయాలో అన్నీ Neat గా అనుకుంటే చాలులే” అని అలొచిస్తూ రూం కి వచ్చి, ఇంకాస్త మెల్లగా మంచంపైన కూర్చున్నాను. మెల్లగా తీసిన తలుపు వెనక్కి వెల్తూ వెల్తూ "భడేల్...." అని శబ్దం చేస్తూ Close అయింది... ఆ తలుపుతో పాటు నా కల్లని కూడా మెల్లగా మూస్కొని అలోచనలకి ఎదురు వెల్తున్నా….
2012, 2011 _ _ _ _ _ _ 2002, 2001, 2000, 1999, 1998…. అని కాలనికి ఎదురు వెల్లి అలోచిస్తూ 1998 లో ఆగిపోయా….
1.  నాన్న నన్ను వదిలివెల్లిన రోజు....
జనవరి 13th – 1998… Night…. Time సరిగా గుర్తు లేదు. అప్పటికి నాకు సరిగ్గా ఆరు సన్వత్సరాలా ఏడు నెలలు. ఎన్ని సార్లు, ఎంతమంది, ఎన్ని విధాలుగా అడిగినా ఇప్పటిదాకా ఈ సంఘటన ఎవరితోనూ పంచుకోలేదు. అడిగినా చెప్పడం ఇష్టం లేక "అప్పటికి నాకు ఊహ లేదు" అనేవాన్ని. కానీ ఇప్పుడెందుకో గుర్తు ఉన్నదానికన్నా ఇంకాస్త ముందుకెల్లి ఇంకా బాగా గుర్తు తెచ్చుకుని రాయాలనిపిస్తుంది...
తెల్లవారితే సంక్రాంతి. అమ్మ ఇంట్లో లేదు, శంకరాపురం వెల్లింది అని జేజి చెప్పడంవల్ల తెలుసుగానీ ఎందుకు వెల్లిందో తెలీదు. సాయంత్రం నట్టింట్లో డైనింగ్ టేబుల్ పైన రెండు టెంకాయలు, ఓ కవర్ లో చెక్కర కనిపించాయి. ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. నాన్న ఎక్కడికెల్లాడు అని కానీ, అమ్మ ఎందుకు వెల్లింది అని కానీ అడగకుండా నేనూ, అక్క ఇద్దరం పక్కపక్కనే పడుకున్నాం.. అప్పట్లో నేను అక్కపైన చెయ్ వేస్కుని పడుకునేవాన్ని...
14th జనవరి 1998, మకర సంక్రాంతి... ఉదయం అలాగే మెల్లగా నిద్ర నుంచి పైకి లేచాను. అబ్బదెగ్గర ఎవరో ఒక పెద్దాయన కూర్చుని మట్లాడుతున్నాడు. "ఎప్పుడూ లేనిది ఏమో మావాడు ఈరోజు పొలానికి వెల్లి పని చేస్తున్నాడంట" అని అబ్బ ఆయనతో చాలా సంతోషంగా చెప్తున్నాడు.  కాసేపు గడవంగానే నాన్న నా ముందుకొచ్చాడు. నన్ను, అక్కని తన చేతులతో తీస్కుని ప్రేమగా తన చేతులారా స్నానం చేయించి అపురూపంగా చూస్కుంటూ ముందునుంచే మాకోసం తెచ్చిపెట్టిన కొత్తబట్టలను వేశాడు. వేయడం అయ్యాక నా గుండెపైనుంచి కాల్లదాకా తన రెండు అరచేతులతో బట్టల్లో మడతలు ఏమన్నా ఉంటే పోవాలని కిందకి అలా నెమిరాడు... అక్కకి వేసిన ఆ చిన్న గౌను రంగు నాకు గుర్తు రావట్లేదు కానీ ఆ గౌను మాడల్ మాత్రం కల్లుమూస్కుంటే వెంటనే నా కల్లముందు ఉంటుంది..
ఉదయం లేచీ లేవంగానే పొలంకెల్లి పని చేసొచ్చి మల్లీ పిల్లలను ప్రేమగా చూసుకోవడం చూసి, జేజి చాలా ఆనందపడింది. వారం, పది రోజులుగా మాట్లాడని నాన్నతో " స్నానం చేసిరాపో రా పల్లెం వేసి టెంకాయ్ కొడుదువు..." అని చెప్పింది. అప్పటికే తయారు చేసిన పూర్ణం తినుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ నాన్న ఎదురు వస్తే భయపడి పక్కకి జరుగుతూ ఉన్నాను. "అమ్మపైన ఓ సారి నాన్న కోప్పడటం చూసిన దెగ్గర్నుంచి నేనెందుకో నాన్నని చూడగానే భయపడి పక్కకు వెల్లేవాన్ని.." జేజి ఇచ్చిన టవల్ భుజంపైన వేస్కుని నాన్న బాత్ రూం వైపు నడిచాడు. మధ్యలో నడుస్తున్న నన్ను రెండు భుజాలపైన చెయ్ వేసి ఆపి, నాన్న కూడా మోకాల్లపైన కూర్చుని " చిన్నా... నేను మంచోన్ని కాదా" అని అడిగిన ప్రశ్న, "ఏమో…." అని నేను తలతిప్పుకుంటూ ఇచ్చిన సమాధానం ఎప్పటికీ మర్చిపోలేను...
నేను దూరంగా వెల్లడానికి ప్రయత్నిస్తున్నా నా చేయి వదలకుండా దెగ్గరకు లాక్కుని నా బుగ్గలపైన అటూ, ఇటూ రెండు ముద్దులు పెట్టి పక్కనే Calm గా నించున్న అక్కదెగ్గరికెల్లి ప్రేమగా ముద్దు పెట్టి బాత్ రూం లోకి వెల్లాడు. నేను ఆ ముద్దు పెట్టిన బుగ్గలని వెంటనే చేత్తో తుడుచుకుని అక్క, నేను ఇద్దరం బయటకు వెల్లాం.. జేజి పూజకి రడీ చేస్తుంది. పది నిమిషాలు దాటింది. నాన్న రాలేదు.15, 20, 25.... ముప్పై నిమిషాలైనా నాన్న రావట్లేదు... జేజి గట్టిగా పిలిచింది అయినా పలకట్లేదు. అక్క బాత్ రూం దెగ్గర ఓ చిన్న రంద్రముంటే చూసి “నాన్నా….” అని మల్లీ గట్టిగా పిలిచింది.. అది పిలుపో, అరుపో, భయమో, భాధో నాకు అప్పుడు అర్థమే అవ్వలేదు. అబ్బ, వేరే ఇంకా ఎవరో గుర్తు లేదు, గట్టిగా తలుపు తీసి లోపలికి వెల్లారు. వెల్లేసరికి నాన్న అక్కడే అలాగే కిందపడిపోయి కదలకుండా ఉన్నాడు.. మెల్లగా తెచ్చి నాన్నని ఓ మంచంపైన పడుకొపెట్టేలోపే చాలా మంది చుట్టూ చేరారు. ఓ పదినిమిషాల్లోనే అంతా Fast Fast గా Tractor లో Hospital కి తీస్కెల్లారు.
నేను, అక్కనే ఇంట్లో ఉన్నాం.. మా పక్కన ఎవ్వరూ లేరు. అమ్మ శంకరాపురంలో; జేజి, అబ్బ నాన్నతో పాటు ఆసుపత్రికి.. నాకు ఏమీ అర్థం కావట్లేదు. అక్క మాత్రం బాగా ఏడుస్తుంది. అది మాత్రం బాగా గుర్తుంది. ఏదో, రోజూ లాగే నాన్న చెప్పకుండా ఆల్లగడ్డకి వెల్లాడులే అనే Feeling లో నేను ఉన్నా... గంట, రెండుగంటలు అలాగే ఉన్నాం.. కాసేపటికి విజయ పెద్దమ్మ వచ్చి ఇంటికి పిలుచుకెల్లి మాకు టిపిన్ పెట్టింది. నేను కాస్త తిన్నా, అక్క అయితే ఏడ్చుకుంటూ అసలు ముట్టుకోనేలేదు పాపం... 
అందరం Silent గా ఉన్నాం... ఓ అరగంటకి దూరంగా పొలాల నుంచి ట్రాక్టర్ శబ్దం వినిపించి అందరూ దస్తగిరి స్వామి గుడివైపు పరిగెత్తడం మొదలు పెట్టారు. నేను కూడా మెల్లగా వెనకనే వెల్లాను. ఆ జనంలో అక్క ఎక్కడుందో కనిపించలేదు. చూస్తుండగానే ట్రాక్టర్ నన్ను దాటి మెల్లగా ఇంకా ముందుకు వెల్తుంది. దాటిన తర్వాత వెనక్కు తిరిగి ట్రాలీలో చూశా  "ముందు ఎలా తీస్కెల్లారో, ఇప్పుడుకూడా అలాగే నాన్నని పడుకోబెట్టి తీస్కువచ్చారు. పక్కనే జేజి కూర్చుంది.. తన జుట్టుకి ఉన్న రబ్బర్ బ్యాండ్ ఊడిపోయింది.. గట్టిగా… అరుపులు ఆకాశానికి వినిపించేలా అరుస్తుంది. భయంకరంగా ఏడుస్తుంది…. నాకు అప్పటికి కూడా ఏం జరిగిందో తెలీట్ల.. ఓ మూడు గంటల్లో ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. “నాన్న”.." నాన్న చనిపోయాడని వింటున్నాను. కానీ మనిషి చనిపోతే తిరిగి రాలేరని మాత్రం అప్పట్లో నాకు తెలీదు. అందుకే కన్నీరు అస్సలు రాలేదు. భాదేసినట్లుగా కూడా గుర్తులేదు.. అప్పుడు వచ్చిన బంధువులందరికీ నీల్లు ఇస్తూ తిరుగుతూ ఉన్న నేను అబ్బకి దెగ్గరగా వెల్లగానే .. చేయి పట్టి లాగి గట్టిగా వీపు పైన బాదాడు.. ఆ బాధ, ఆ నప్పి ఇప్పటికీ గుర్తే...  "మీ నాన్న చనిపోయి అందరూ ఏడ్చి చస్తుంటే చీమ కూడా కుట్టనట్లు ఎలా తిరుగుతున్నావ్ రా దరిద్రుడా... దరిద్రుడా..." అని గట్టిగా ఏడుస్తూ మల్లీ రెండుసార్లు కొట్టేసరికి నేను కూడా ఏడ్వడం మొదలు పెట్టాను. అబ్బ ఏడుపుని, అరుపుని మించిన శబ్దం నాది అవడంతో అందరూ వచ్చి నన్ను లాగి అబ్బకి నచ్చచెప్పారు..
బాగా నప్పిగా అనిపించింది.. కాసేపట్లో నప్పికి, నిజం జతకలిసింది.. నాన్న వదిలి వెల్లింది నన్ను మాత్రమే కాదు... లోకాన్నే వదిలి వెల్లాడని అర్థమైంది.. నప్పి, నిజం, బాధ అన్నీ కలిసిపోయాయి. ఇంట్లో అమ్మ లేదనే విషయం కూడా గుర్తు రాలేదు నాకు..   చాలా సేపటి తర్వాత అమ్మ కార్ లో వచ్చినట్లు, స్పృహ తప్పి పడిపోయేంతలా ఏడ్చినట్లు మాత్రమే ఎంతో ప్రయత్నిస్తుంటే గుర్తువస్తున్నాయి. ఆ తర్వాత కలంకి వెల్లడం, నాన్నని పూడ్చడం, నాకు జుట్టు తీసేయడం, "నాకు కూడా గుండు చేయండి అని ప్రకాష్ మారాం చేయడం" అన్నీ అలా అలా గుర్తు ఉన్నాయి.
తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.. కానీ నాన్న లేని లోటు అని మాత్రం నాకు ఎక్కడా అనిపించలేదు.. నేను ఓ సెంటిమెంట్ లేని చెత్త Worst Fello నో, లేక నా వయసు అలాంటిదో నాకు ఇప్పటికి కూడా తెలీట్లేదు. ఆ రోజుల్లో అక్కతో నా జ్ఞాపకాలు కూడా అంతంత మాత్రమే గుర్తు ఉన్నాయి. ఇదంతా జరిగి నాన్న నాకు, లోకానికి దూరమయ్యి 16 Years అయింది. ఈ 16 సంవత్సరాలలో చాలా మంది తండ్రీ కొడుకులనీ, తండ్రీ కూతుర్లనీ చూశా... నాన్న ప్రేమని చాలామంది మాటల్లో విన్నా, నాన్న నమ్మకాన్ని, నాన్న భాద్యతల్ని చాలామంది ఇల్లలో చూశా.. నాన్నతో ఆడుకునే ఆటల్ని, నాన్న నవ్వే నవ్వుల్ని ఎందరి ఇల్లల్లోనో చుట్టంగా వెల్లినప్పుడు చూశాను. నాన్న ప్రేమ నా మనసుకు తెలీదు కానీ, నా కల్లకి మాత్రం బాగా తెలుసు.. నాన్న 16 సంవత్సరాల క్రితం స్నానంకి వెల్లేముందు ఇచ్చిన ముద్దుని నాకు వద్దు అన్నట్లుగా తుడుచుకున్నానే…. అని ఓ లక్ష సార్లు అనుకుని బాధపడి ఉంటా.... చాలా బాధేసేది.... నాన్న కావాలనిపించేది.. కానీ ఈరోజు వరకు, అమ్మతోకానీ, అక్కతోకానీ ఎవరితో అయినా... "నాకు నాన్న కావాలనిపిస్తుంది" అని అనలేదు... అలా ఎందుకు అడగలేదో కూడా నాకు తెలీదు. ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మని కానీ, అబ్బని కానీ ఎవర్నీ నాన్న ఎందుకు చనిపోయాడు అని కూడా అడగలేదు. ఇప్పుడు ఊర్లో నడుస్తున్నప్పుడు అందరూ "అచ్చం రామంజనేయ రెడ్డే" అంటూ ఉంటారు... ఎప్పుడైనా కోవెలకుంట్లకి వెల్తే మామ అంటుంటాడు "Same మీ నాన్నలాగే ఉన్నావ్ భరత్ " అని... అవన్నీ వింటుంటే...అప్పుడప్పుడు ఆనందమేసేది, కొన్నిసార్లు బాధ కూడా వేసేది..
·       St. Anns School లో చదివేటపుడు సాయంత్రం వచ్చి సైకిల్ లో నన్ను ఇంటికి పిలుచుకొచ్చేవాడు.. అప్పుడు ఆ బార్ కడ్డీ పైన నించుని నాన్న భుజం పట్టుకుని వచ్చేవాన్ని... " నాన్న భుజం పైనుంచే పిల్లలు ప్రపంచాన్ని చూస్తారు” అని అంటుంటారు... అలా నేను ప్రపంచాన్ని చూడలేకపోయినా కనీసం మా నాన్న భుజం పట్టుకుని వచ్చానన్న జ్ఞాపకమే చాలా ఆనందాన్ని ఇస్తుంది.
·       అక్క వాసవీ School లో చదివేటపుడు అక్కని Evening School నుంచి పిలుచుకొస్తూ "రాణీ... రాణమ్మా... ఆనాటి నవ్వులు ఏవమ్మా.. నీ వేడుక చూడాలనీ.. నా ముంగిట ఆడాలనీ…. " అని పాట పాడుకుంటూ అక్కతో పలికించుకుంటూ వచ్చేవాడు.. ఇది కూడా ఈమధ్యే అక్క చెప్తేనే తెలిసింది..
·       మీ నాన్న అప్పుడప్పుడు కోప్పడటం, Suddenగా Mood Change అవడం, చెడు స్నేహం వల్ల కాస్త బాలేకుండా ఉన్నాడు... కానీ మనసు మాత్రం చాలా మంచిది రా అని అప్పుడప్పుడు అమ్మ చెప్పేది..
·       అందరి గురించి నాకు తెలీదుగాని... నాకు మీ నాన్న మనసు చాలా బా గా తెలుసు భరత్... “He is a very nice man actually” , తన అలోచనలు చాలా అద్భుతంగా ఉండేవి... అని అప్పుడప్పుడు శేషారెడ్డి మామ చెప్తుంటే చాలా ఆనందమేసేది...
నాన్న... నాన్న... నాన్న...
నన్ను ఆ పిలుపుకు దూరం చేసి  వెల్లిపోయాడు మా నాన్న... హు హు హు... Miss You alooooooooooottttttttttttttt  నాన్న…
అన్నిటికన్నా వింతగా, బాగా అనిపించేది ఏంటనే.. ఇప్పుడు దీన్ని తలుచుకునే ప్రయత్నంలో నాన్న, నాన్న అని నేను 18 సార్లు అనుకుంటూ రాస్తుంటే ఏదో కొత్తగా.. నాకు అలవాటులేని పిలుపుగా అనిపిస్తుంది.
2.  అమ్మ బాధ రెట్టింపు…
"నాన్న" అన్న పిలుపుకి నేను దూరమైన ఓ సంవత్సరం లోపే అమ్మ కూడా ఆ పిలుపుకి దూరం అయింది... మా తాత కూడా చనిపోయారు అని తెలిసి అమ్మ బాధ రెట్టింపు అయింది. తల్లి చనిపోయిన మూడు సంవత్సరాలకే భర్త, భర్త చనిపోయిన ఓ సంవత్సరంలోపే తండ్రి చనిపోయినా అలాగే తట్టుకుని మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉంచిన మా అమ్మని తలుచుకుంటే ఏక్షణం అయినా వెంటనే కల్లలో నీల్లు తిరుగుతాయి.. Hats off మా నీకు...
3.  నేను కూడా English Medium లో…
నాన్న చనిపోకముందునుంచే ఆల్లగడ్డలో St. Anns School లో చదివేవాన్ని. నాన్న ఉన్నంతవరకు ఒకలా ఉన్నింది. తర్వాత రోజులు మారిపోయాయి. బాధపడినట్లు గుర్తులేదు కానీ, జీవితంలో వచ్చిన మార్పు మాత్రం చాలాబాగా గుర్తు ఉంది. అసలే English medium కొత్త, ఇంక అస్సలు చదవలేకపోయేవాన్ని... రోజూ ఇంటికి రాగానే అమ్మ నాకు డ్రస్ మార్చేది. అలా డ్రస్ మార్చే ప్రతీ రోజూ ఒంటిపైన రోజుకో చోట Fresh వాతలు కనిపించేవి... School అంటే అంతేలే.. కొట్టడం మామూలే అని వదిలేశేవారు.. నేను బాగా చదవలేకున్నానని క్లాస్ లో అందరికీ తెలిసిపోయింది. ఆడుకునేటపుడు కానీ, మద్యాహ్నం లంచ్ అప్పుడు కానీ నాకు మిగిలిన స్టూడెంట్స్ నుంచి Response మంచిగా వచ్చేదే కాదు. ఎందుకో తెలీదు….
ఓ రోజు Exam లో Fail అయ్యా అని " Black గా ఉన్న ఒక Sister (Madam) నన్ను రోజూ కింద కూర్చొమనేది. అందరూ బెంచ్ పైన ఉన్నా, నేను మాత్రం వాల్ల పక్కనే నేలపైన, కింద కూర్చున్నట్లు బాగా గుర్తు... రోజులు అలాగే నెలలుగా మారి గడిచిపోతున్నాయి... కానీ ఒకరోజు This has reached to peak…  
అదే Black Sister… Full గా కొట్టింది.. కనికరం లేకుండా ఎంత ఏడుస్తున్నా అలాగే కొట్టింది.. ఆ Sister Face color, Body language, ఆ Dressing style అన్నీ నాకు గుర్తు ఉన్నాయ్.. Full గా ఎర్రగా Body అంతా వాతలు.. ఏడ్చుకుంటూ ఇంటికి వెల్లాను. అమ్మ చూసి, తను కూడా ఏడ్చడం మొదలు పెట్టింది. కాసేపాగి వచ్చిన అబ్బకి విషయం అంతా చెప్పింది. మల్లీ తర్వాతరోజు స్కూల్ కి అబ్బ కూడా వచ్చి ఆ Black sister ని చెడా మడా తిట్టేసి నన్ను ఆ స్కూల్ మానిపించి వాసవీ స్కూల్ లో చేర్పించారు… దెబ్బకి మల్లీ వచ్చి తెలుగుమీడియంలో పడ్డాను..
4.  No Fee… Go Home…
అప్పుడు ఏ క్లాస్ చదువుతున్నానో పెద్దగా గుర్తు లేదు, భారతీ విద్యామందిర్ లో చదువుతున్నా.. ఇంకా నిక్కర్ వేస్కునే వయసులోనే ఉన్నాను. చాలా సార్లు పాంట్ కుట్టివ్వమని అడిగితే "క్లాత్ ఎక్కువ కావాలి వద్దులేమ్మా" అని అమ్మ నచ్చచెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే... ఆ తెలిసీ తెలియని వయసులో నేను అమ్మని ఎన్నిసార్లు బాధపెట్టానో ఊహించుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంటుంది. రోజూ సాయంత్రం జారుడుబండ పైన జారుకుంటూ ఆడుకుని, వెనక నిక్కర్ చింపుకుని ఇంటికి వెల్లేవాన్ని. అది అమ్మ చూసి, బయటకు నన్ను తిట్టి, లోపల తాను బాధపడేది. ఆ చినిగిపోయిన నిక్కర్లతో స్కూల్ కి వెల్లిన నెలలు కూడా నాకు గుర్తే...
ఏ టైం నో సరిగా గుర్తులేదు... అక్క నా పక్కన ఉందో లేదో కూడా గుర్తు లేదు. చిన్నప్పుడు అక్క చాలావరకు శంకరాపురంలో చదవడం వల్ల ఎంత అలోచించినా అక్కతో ఆరోజుల జ్ఞాపకాలు గుర్తు రావట్లేదు.
ఆ భారతీలో ప్రతీ నెలా మొదటి తేదీల్లో కట్టాల్సిన 25 రూపాయల ఫీజు ఇంకా కట్టలేదని ఇంటికి వెల్లి తీస్కురమ్మంటే... 8.10 కి ఇంట్లోంచి నడుచుకుంటూ బడికి వచ్చిన నేను, మల్లీ 9.00 కే తిరిగి ఇంటికి వెల్లేవాన్ని. దార్లో తెల్సినవాల్లు "ఏమ్మా వెనక్కి వస్తున్నావ్, సెలవ్ ఇచ్చారా" అంటుంటే .. "లేదు ఫీజు కట్టలేదని ఇంటికి పంపించారు" అనేవాన్ని. అలా ఇంటికి వెల్లడం అమ్మ చూసి ఏడ్చేది. కానీ అమ్మదెగ్గర కట్టడానికి డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పుడన్నా అలోచిస్తే నాకు అనిపిస్తుంది. " కన్న కొడుకుని ఆ పరిస్థితిలో చూసి కూడా ఏమీ చెయ్యలేకపోతే ఓ తల్లిగా ఎంత బాధగా ఉంటుందో కదా" అని...
5.  అక్క చేసిన రెండు రూపాయల త్యాగం…
అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా... అక్క అప్పటికి 7th  అనుకుంటా . నేను భారతీ స్కూల్, అక్క పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్.. ఇద్దరికీ ఒకేసారి పరీక్షలు వచ్చాయ్... ఇంట్లో గంటముందే అమ్మ ఇచ్చిన చెరో రెండు రూపాయలు తీస్కుని Exam Papers (అప్పటి భాషలో టావులు) కొందామని ఇంటినుంచి బయలుదేరాము. అక్క చదివే స్కూల్ దాటి షాప్ కి దెగ్గర్లో వెల్తూ వెల్తూ నేను నా జోబులో చెయ్ పెట్టుకున్నా.. చూస్తే జోబుకి చిల్లు పడింది. Fast గా అన్ని జోబులు చూస్కుంటే అమ్మ నాకు ఇచ్చిన రెండురూపాయలు పోయిందని అర్థమైంది.. ఏం చేయాలో అర్థం కాలేదు. భయం, బాధ రెండూ వేశాయి.. ఆ టావులు లేకుంటే అసలు పరీక్ష లోపలికి అడుగు కూడా పెట్టనివ్వరు. అప్పు అడిగితే ఇచ్చేవాల్లు కూడా ఎవ్వరూ కనిపించలేదు.. నేను ఏడ్చడం, అక్క నన్ను ఓదార్చడం క్షణాల్లోనే మొదలయ్యాయి. అప్పుడు నా ఏడుపు చూడలేక అక్క తన రెండు రూపాయలతో నాలుగు టావులు కొనిచ్చి, " ను వెల్లురా నేను మా టీచర్ తో చెప్పి ఇప్పించుకుంటాలే , ను వెల్లు టై అవుతుంది" అనగనే ఓ చేత్తో ఆ టావులు, ఇంకో చేత్తో నా కన్నీల్లు తుడుచుకుంటూ, అక్కడే వెనక మెల్లాగా Friends తో నడుచుకుంటూ వస్తున్న అక్కని అప్పుడప్పుడు వెనక్కు తిరిగి చూస్కుంటూ స్కూల్ కి వచ్చి పరీక్ష రాశాను.
అక్క చేసిన ఆ రెండురూపాయల త్యాగం, నేను పోగొట్టుకున్న ఆరెండు రూపాయల బిల్ల కోసం అంత ఏడుపు, బాధ... ఇంటికెల్లి చెప్పగానే అమ్మ నన్ను బాగా తిట్టింది. కానీ అక్క " నాకు టావులు వేరేవాల్లు ఇచ్చారు లేమ్మా" అని సర్ది చెప్పినట్లు గుర్తు.  ఆ రోజు గురువారం అవడంతో అమ్మనో , జేజినో సంతకి వెల్లి ఓ రెండు డజన్ల టావులు తెచ్చి ఇంట్లో పెట్టారు..
ఆరోజులు తలుచుకుంటే.. అప్పుడు అలా ఉన్నామా అన్న బాధ, ఇప్పుడు ఇలా ఉన్నాం కదా అన్న సంతోషం రెండూ కలసి నా కల్లలో కన్నీల్లలా మారి కిందకు జారకుండా కల్లలోనే తిరుగుతున్నాయి...
6.  దీపావళి ఉదయం బాధ, అదే రోజు రాత్రి ఆనందం..
ఏ సంవత్సరం దీపావళినో పెద్దగా గుర్తు లేదు. నాకు Crackers కావాలని గొడవ పెడుతున్నా.. అక్క మాత్రం అడగట్లేదు. Silent గా కాస్త Dull గా పక్కనే కూర్చుని ఉంది. చాలాసార్లు అమ్మని అడిగాను. "వద్దులే నాన్నా" అంటుంది అమ్మ.. ఎంత అడిగినా వద్దు అనేసరికి నేను అలిగి మద్యాహ్నం అన్నం తినలేదు. అమ్మకి చాలా బాధేసింది. ఏం చేసిందో తెలీదు, సాయంత్రం 4.00 కి ఓ 25/- ఇచ్చింది.
ఒకప్పుడు స్కూల్ కి ఇదే 25/- ఫీజు కట్టలేదని ఇంటికి పంపించారు.. అదే 25/- డబ్బు నా Crackers కోసం అమ్మ ఇచ్చింది. అప్పుడు నాకు తెలీదు, ఓరోజు రాత్రి ఆనందం విలువ, నా నెలరోజుల చదువుతో సమానం అని.
వెంటనే ఎంతో ఆనందంగా ఆల్లగడ్డకి వెల్లి, Crackers Shop కి వెల్లి నా దెగ్గర ఎంత ఉందో వాడికి చెప్పకుండా, ఆయనతో అన్నీ మంచి మంచి వెరైటీ Crackers చూపించుకుని చివరకు నా జోబులో ఉన్న 25/- డబ్బు తీసి దానికి సరిపడా వచ్చిన ఓ ఐదు వస్తువులు తీస్కుని ఇంటికి వచ్చాను. అమ్మ వాటన్నిటినీ ఓ పెద్ద చాటలో ఉంచి గాలికి పెట్టేది. హా హా నేను ఆ చాట పక్కనే కాల్లు జాపుకుని కూర్చున్న బంగిమ, ఆ కూర్చున్న చోటు ఇప్పటికీ గుర్తే నాకు. ఆ 25/- లతో తెచ్చుకున్న టపాకాయల్లో కూడా "సగం కార్తీకమాసం కోసం ఎత్తిపెట్టుకోమ్మా" అని అమ్మ చెప్పగానే దానికి మాత్రం సరే అని నాకంటూ పెట్టుకున్న ఓ గూడుని బియ్యం మూటెల పైకి ఎక్కి అందుకుని అందులో నా Crackers పెట్టి, తలుపు వేసేశాను.
ఆ గూడు తలుపులు మూస్కోగానే, నా కనురెప్పలనే తలుపులు తెరుచుకున్నాయి...
ఒక్కసారిగా కల్లు తెరిచాను.. కల్లముందర "ప్రస్తుతం" కనిపించింది. తెరవంగానే కాస్త తడిగా ఉన్న కల్లు, చుట్టూ గోడలు, మద్యలో మంచం, మంచంపైన నేను.. పక్కనే ఉన్న సెల్ చూసాను. Time 11.30 AM .. ఇవన్నీ తలుచుకుంటూ చాలా లోతుకి వెల్లిపోయాను.
మెల్లగా కాస్త బయటకు వెల్లి చూద్దాం అని Same Corridor కి వెల్లి ఓ రెండు సార్లు అటూ ఇటూ తిరిగాను. Corridor మద్యలో ఓ టేబుల్ వేస్కుని, చుట్టూ ఓ నలుగురు Colleagues కూర్చుని గట్టిగట్టిగా నవ్వుకుంటూ, పేకాట ఆడుకుంటూ ఉన్నారు. నేను ఓ నిమిషం అలాగే చూసి, "ఏదో మిస్ అయిందే" అని మనసులో అనుకుంటూ వాల్లనే చూస్తున్నాను.. అది గమనించి ఓ Colleague "ఏం రెడ్డిగారు.. వస్తారా.. ఏం చేస్తున్నారు లోపల.." అని అడిగితే  "చిన్న పని అండి" అని చెప్పి అలాగే అటూ, ఇటూ తిరుగుతున్నాను. 
అలా అలా తిరుగుతూ.. పేకాట అడేవాల్ల మద్యలో ఒక టేబుల్ ఉంది.. మరి ఇంకో టేబుల్ ఉండాలి కదా.. అదెక్కడ ఉందబ్బా... అని వెతుకుతూ ఉన్నాను.. ఎంత చూసినా కనపడకపోయేసరికి పేకాట అడేవాల్లని Disturb చేయక తప్పలేదు.. "ఇంకో టేబుల్ ఉండాలి కదండీ.. ఎక్కడికి పంపించారు.." అని వ్యంగ్యంగా అన్నాను.. నేను అడిగిన మాట పూర్తి అవ్వకముందే... బయటనుంచి ఇంకో ఇద్దరు Colleagues ఆ టేబుల్ పైన ఓ రెండు చిన్న గిన్నెలు, మరో రెండు పెద్ద గిన్నెలు పెట్టుకుని మెల్లగా తెచ్చి Corridor Corner లో Park చేశారు..
ఏంటి వీల్లు ఇలా తెస్తున్నారు అని ఆ గిన్నెలని చూస్తే లోపల ఒక దాన్లో చికెన్, ఇంకో దాన్లో బిర్యానీ ఘుమఘుమలాడుతూ కనిపించాయి. చికెన్ ని, బిర్యాని ని పక్కన పెడితే టేబుల్ బయటకు ఎందుకు తీసుకెల్లినట్లు… ఆ గిన్నెలనే తెచ్చి టేబుల్ పైన పెట్టచ్చు కదా.. అని డౌట్ వచ్చి అడిగాను.. దానికి ఆ ఇద్దరూ... " “అదేం లేదండీ.. మొత్తం నాలుగు గిన్నెలు ఉన్నాయ్ కదా.. ఇద్దరం ఒకేసారి తీస్కురావడం కష్టం కదా... ఆ పేకాట రాయుల్లు ఊర్కే ఉండకుండా "మీకు దమ్ముంటే ఆ నాలుగు గిన్నెలనీ ఒకేసారి లోపలికి తీస్కురండి చూద్దాం" అన్నారండీ.. పౌరుషానికి పోయి చేత్తో తెచ్చి కిందపడితే అందరి కడుపులు మాడిపోతాయ్ కదా.. అలా అని “తీస్కురాలేము” అంటే ఆ నలుగురి తెలంగాణా వాల్లముందు మన రాయలసీమ పరువు పోతుంది కదా.. అందుకే ఇలా ప్లాన్ చేశాం అండీ" అన్నాడు..
రాయలసీమ, పరువు, పౌరుషం అనే మాటలు వినగానే వెంటనే ఆ తెలంగాణ ఆయనకి కోపమొచ్చి పైకి లేచి..."హా భో సెప్పినార్లె, గదేదో ఈ జిందగీ ల మీరే గిట్ల దెచ్చినట్లు...” అని సరదాగా కోపాన్ని నటిస్తూ ఆ రాయలసీమ అతని దెగ్గరికొచ్చాడు.. “ఏటీ… మీదకొచ్చేత్తనావేటీ...” అని ఇంకో ఆంధ్రా ఆయన ఆ మీదకొచ్చే ఆయనని అపేశాడు… హా హా హా మొత్తనికి బలే కామిడీ Create చేశారులే ఆ రెండు నిమిషాలు మాత్రం…
ఇంక పేకాట కూడా బంద్ చేసి ప్లేట్ లు తీస్కుని అందరూ తినడానికి వచ్చేశారు.. మెల్లగా అందరూ ప్లేట్లో పెట్టుకోబోతుంటే… "ఓయ్ తీపిలేని తెలంగాణా వాసుల్లారా.. మీకు దమ్ముంటే ఈ చికెన్ ని మొత్తం అవగొట్టేయండి." అని ఇందాక టేబుల్ మోసిన రాయలసీమ అతను వాల్లని Reverse చాలెంజ్ చేశాడు..
వార్నీ… వీల్లేదో కొంపలు ముంచేలా ఉన్నారే అనుకుని నేను Enter అయ్యి... "బాబూ Mr. రాయలసీమా.. నువ్ ముందు Qustion లో Clarity Maintain చెయ్... అవగొట్టేయండి అంటే.., వాల్లు బాగా తిని, మిగిలింది తీస్కెల్లి బయటపడేసి నువ్వన్నట్లు అవగొట్టేసి వస్తే కడుపు మాడి చచ్చేది మనమే.." ... "నాయనా Mr. తెలంగాణా... ఎలా అవగొట్టాలా అని ను ఏమీ ప్లాన్లు వేయకు.. మాకు కూడా ఆకలిగా ఉంది.. అందరం కలసి అవగొట్టేద్దాం." అని ఇద్దరికి చెప్పి నేను పెట్టుకోవడం మొదలు పెట్టాను… నేను అన్న మాటకి గట్టిగా నవ్వి అందరూ పెట్టుకోవడం Start చేసి, వచ్చి మల్లీ Corridor లో నించుని తింటున్నాం...
"ఇంతకీ ఇప్పుడు చికెన్ ఏంటి... ఏంటి ఈరోజు Special అని అడిగితే" పక్కన ఒక అతన్ని చూపిస్తూ.. మా వాడు ఈరోజు పేకాటలో 2500 గెలిచాడు.. అందుకే ఈ పార్టీ అని బాధగా చెప్తున్నాడు..
"ఆయన 2500 గెలుచుకుంటే మీరెందుకు బాధగా చెప్తున్నారండీ బాబూ అని నేను అడిగితే… "వాడు గెలుచుకున్న 2500 నావే రెడ్డిగారూ…నావే…" అని ఇంకాస్త బాధపడుతూ చెప్పాడు… మల్లీ అందరూ గట్టిగా నవ్వారు..
ఇంక మల్లీ లేట్ అవుతుందని Fast గా తినేసి, ప్లేట్ కడిగేసి, ఓ చాక్లెట్ నోట్లో వేసుకుని, ఆ 2500 పోగొట్టుకున్నవాడికి All The Best చెప్పి.. మెల్లగా Room లోపలికి వచ్చాను..  కాస్త నిద్ర మత్తుగా అనిపిస్తంది.. అయినా సరే అని మెల్లగా పేపర్ పైన పిచ్చి గీతలు గీస్కుంటూ మల్లీ జ్ఞాపకాల వేటకి బయలుదేరాను..
7.  No children’s movies… No stationary articles…
నేను భారతీ విద్యామందిర్, అక్క మాత్రం పక్కనే Government Girls High School . అప్పుడప్పుడు Children’s movies Conduct చేసేవాల్లు, ఎవరో వచ్చి సినిమా గురించి చెప్పి “ఎవరైనా రావాలనుకుంటే పేర్లు ఇవ్వచ్చు”  అనేవాల్లు.. అలా వాల్లు అనగానే అందరితోపాటు నేను కూడా లేచి పేర్లు ఇచ్చేవాన్ని.. కానీ ఇంటికి వెల్లేసరికి కుదరదు అనేవాల్లు. ఎంత అడిగినా, ఎంత అలిగినా కుదరదనే అనేవాల్లు. అక్క మాత్రం పాపం అడిగేది కూడా కాదు. ఇన్నాల్ల నా చిన్ననాటి ప్రపంచం లో "నాకు ఇది కావాలి" అని అక్క మారాం చేసినట్లుగా నాకు అస్సలు ఓ సంఘటన కూడా గుర్తు లేదు.. 
అలా స్కూల్ కి వచ్చిన పదికి పైనే సినిమాలలో ఒక సినిమాకి మాత్రం అమ్మ డబ్బు ఇస్తే, భవానీ థియేటర్ లో నిలబడి, అందరితో పాటు అరుచుకుంటూ సినిమా చూసినట్లు మాత్రం గుర్తుంది. 
అదే టైం లో అప్పుడప్పుడు, School కి Stationary వస్తువులు వచ్చేవి. ఏదో ఒక బుక్,  లోపల ఓ కవర్ ఉంటుంది, దానిపైన రాయచ్చు, మల్లీ కవర్ ని పైకి అంటే రాసినవన్నీ చెదిరిపోయేవి. అది పింక్ కలర్లో అందంగా, కొనుక్కోవాలి అనిపించేలా ఉండేది. First Bench లో కూర్చొవడం వల్ల అన్నిటినీ చాలా Exciting గా, Interesting గా చూసేవాన్ని. వాటి రేట్లన్నీ పేపర్లో రాస్కుని వెల్లి ఇంట్లో అడిగే వాన్ని. కానీ ఇప్పటిదాకా వాటిని వాడినట్లు కానీ, కొన్నట్లు కానీ నాకు గుర్తు లేదు.  
పాపం అమ్మ, ఇలా నేను ప్రతిదానికి అడిగి ఎన్ని సార్లు బాధపెట్టానో తలుచుకుంటుంటే ఎంత బాధేస్తుందో చెప్పలేకున్నా నిజంగా.. హు హు హు…
I am so sorryyyyyyyyyyyyyy ma…..
8.  నా అలకకి అలవాటు పడిన అమ్మ…
సంవత్సరం సరిగా గుర్తులేదు.. ఏప్రిల్ నెలలో చివరి ఐదు రోజులు గడుస్తున్నాయి. ఇంకో పది రోజుల్లో నా పుట్టినరోజు. ఇంకా డ్రస్ కొనలేదు. అమ్మ మాత్రం "ఈసారికి ఒక్కసారి డ్రస్ వద్దులే నాన్న" అని నాకు బాగా నచ్చచెబుతుంది. నేను ససేమిరా వినట్లేదు. చాలా ఘోరంగా అలిగి పక్కకు వెల్తున్నాను. కొన్నాల్లకే మే నెల మొదలైంది. క్యాలెండర్ కల్లముందే ఎప్పుడూ May 5th ని చూపిస్తుంది. వెంటనే క్యాలెండర్ తీసి May 5th ని Round off చేసి..."ఈ సారి నా పుట్టినరోజు లేదు" అని పెన్ తో రాసి మల్లీ అక్కడే తగిలించాను. అది చూసి అమ్మ పడిన బాధ ఇప్పటికీ నా కల్లలోనే ఉంది. May 5th దాటిపోయింది... అదే బాధలో అలకలో First Time Without New Dress నా Birthday కూడా దాటిపోయింది.
పాపం అమ్మ చేతిలో డబ్బు ఉండి ఉండదు అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పుడు మాత్రం, " అమ్మ నా అలకలకి అలవాటు పడిపోయింది లే " అని చాలా బాధపడేవాన్ని...
9.  అమ్మతో కలసి గడ్డి మోపులు మోసిన జ్ఞాపకాలు…
వయసూ, సంవత్సరం గుర్తు రావట్లేదుకానీ, అమ్మతో కలసి నేను, అక్క గడ్డికి వెల్లేవాల్లం. అమ్మ చాలా Fast గా గడ్డి కోసేది. అది చూసి నేను, అక్క Help చేసే వాల్లం. నాకు కోసేది రాదని, అమ్మ Fast గా కొడవలితో, అక్క Slow గా చేత్తో పీకుతుంటే నేను ఎగురుకుంటూ తిరుగుతూ ఆ గడ్డినంతా కుప్పలు పెట్టేవాన్ని. అమ్మ తర్వాత అంతా మోపులాగా గడ్డినంతా ఓ పెద్ద మూట అమ్మకి, ఓ బుల్లి మూట నాకు కట్టేది…
ఎంతో బిగుసుగా కట్టే ఆ కట్టు, ఆ కట్టు కట్టే విధానం నాకు ఇప్పటికీ గుర్తే.. ఖాలీ పట్టలతో వెల్లేటపుడో, మల్లీ ఆ పట్టనిండా గడ్డితో వచ్చేటపుడో , ప్రతీరోజు ఏదో ఒక ప్రయాణంలో అమ్మ కన్నీల్లు పెట్టుకోని రోజే ఉండదు.
పాపం ఎంత కష్టం వచ్చినా ఉన్నంతలో నాకు, అక్కకి ఏలోటూ చేయలేదు... అప్పుడప్పుడు నాపైన కోపమొస్తే "అంతా మీ నాన్నలాగే" అని కసురుకునేది. నాకు అసలేం అర్థమయ్యేది కాదు.. చాలా బాధేసేది. ఓ గంటసేపు ఏం మాట్లాడకుండా వెల్లి డల్ గా పడుకునేవాన్ని. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నాలో Negitive Point ఏంటంటే "మనసులో బాధని అస్సలు దాచుకోలేను, అరక్షణంలోనే అది కల్లపైకి వచ్చేస్తుంది..." అలా కల్లపైకి వచ్చిన నా బాధని అమ్మ ఇట్టే పసిగట్టేది… వెంటనే మల్లీ బుజ్జగించి అన్నం నోట్లో పెట్టి తినిపించేది.
ఇలా అమ్మనో, నేనో బాధపడుతున్నప్పుడల్లా, “అమ్మ ఈ ఇంట్లో కాకుండా వేరే ఎక్కడన్నా ఉండి ఉంటే మామ వాల్లలాగా ఆనందంగా ఉండేది కదా” అనిపిస్తుండేది. కానీ అలా వేరే ఇంట్లో ఉంటే, నేను, అక్క అమ్మతో ఉండేవాల్లము కాదుగా అని గుర్తురాగానే ఆ ఆలోచన నన్ను వదిలి పారిపోయేది..
10.                    అమ్మ పెట్టిన వాత... ఇప్పటికీ ఓ గుర్తే...
ఓరోజు స్నానం చేసి టవల్ కట్టుకుని ఎగురుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాను... అటూ ఇటూ తిరుగుతుంటే చెపాతీ వాసనవచ్చి వంటింట్లోకి వెల్లాను. అమ్మ చెపాతీ కాల్చడం గమనించి, కాస్త తుంచుకుని నోట్లో పెట్టుకుని అలాగే ఎగురుకుంటూ బయటకు వెల్లాను. బయటకు వచ్చేసరికి, బయట వీధిలో శ్రీను పెదనాన్న నీల్ల బిందె ఎత్తుకుపోతుండటం గమనించి సరదాగా "లంబు, జంబు"… "లంబు, జంబు"….. అని ఎగతాలి చేశాను. అలా నోటికొచ్చిన విధంగా అనుకుంటూ ఎగురుకుంటూ, చెపాతీ కోసం మల్లీ వంటింట్లోకి వచ్చాను. చెపాతీ తినాలని అలోచనే కానీ, బయటివాల్లని ఎవర్నో ఎగతాలి చేశానని అమ్మకి కోపం వచ్చి ఉంటుందని మాత్రం నేను గుర్తించలేకపోయాను.
వంటింట్లోకి వచ్చి ఓ ముక్క చెపాతీ నోట్లో పెట్టుకుని కట్టుకున్న టవల్ తీస్కుని తల తుడుచుకుంటూ ఎగురుతున్నా.. అమ్మ వెంటనే చేతులో ఉన్న చెలాకు(One Type of గరిటె) తీస్కుని తొడపైన కొట్టింది. నన్ను అయితే కొట్టింది కానీ ఆ చెలాకుతో చెపాతీలు కాలుస్తున్నానని, కాల్చి కాల్చి అది బాగా వేడెక్కిందని అమ్మ గుర్తించలేకపోయింది. అమ్మకన్నా ముందే "ఆ చెలాకు అమ్మకన్నా వేడిగా ఉందని" నా తొడ గుర్తించింది. వెంటనే గట్టిగా అరవడం మొదలు పెట్టాను. అమ్మ ఆ చెలాకుని వెన్నక్కు తీస్కోగానే నా చెర్మం కాస్త చెలాకుకి అతుక్కుని వచ్చిది. అమ్మ అది గమనించి భయపడి వెంటనే నన్ను బయటకు ఎత్తుకుని వచ్చింది. నన్ను బయటకు తెచ్చి నాతోనే ఉండటం వల్ల, మాడిపోయి వచ్చిన చెపాతీవాసన గుర్తు ఉంది కానీ, నాకు ఇచ్చిన Treatment మాత్రం ఎంత అలోచించినా గుర్తురావట్లేదు.
By the way … ఆ వాత ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడప్పుడు నా Close Friends కి సరదాగా చెప్పుకోవడానికి ఈ Situation నే చెప్తుంటా..
11.                                                                               అమ్మ నాకు చేసిన మొదటి మోసం
                                      Age సరిగా గుర్తులేదు. మొత్తానికి ఇంకా Pant వేస్కునే వయసుకూడా రాలేదు. రాత్రి అమ్మ ఇంట్లో ఏదో సర్దుతున్నట్లు అనిపించింది. ఏంటమ్మా అని అడిగితే ఏంలేదురా అనింది. నాకు డౌట్ వచ్చి "ఎక్కడికో వెల్తున్నావ్ కదూ... హు హు నేను కూడా వస్తా " అని అలుగుతూ అన్నాను. "ఎక్కడికీ లేదన్నానా..." అని అమ్మ కోప్పడింది. నేను అలిగానని అమ్మనే అన్నం పెట్టి తినిపించి పడుకోపెట్టింది. బాగా నిద్రపోయి, మరునాడు ఉదయం లేస్తూ లేస్తూ అమ్మతో కాసేపు మాట్లాడకూడదు అని అనుకుంటూ మెల్లగా నిద్రలేచి ఇల్లంతా తిరిగాను. అక్క, అమ్మ ఇద్దరూ కనిపించట్లేదు. మారాం చేసి అడిగితే తప్పక, నన్ను తట్టుకోలేక అబ్బ చెప్పాడు.."బైరేన్ స్వామికి వెల్లారు రా.. రేపు వచ్చేస్తారులే.." అని చెప్పాడు. అది వినగానే భరించలేనంత బాధ, ఆపుకోలేనంత కోపం.. బాధ కన్నీల్లుగా, కోపం అరుపుగా రెండూ కలసి ఏడుపులా మారి గట్టిగా బైరేన్ స్వామి భయపడేంతలా అరిచాను. అబ్బ నన్ను నీల్లకు పిలుచుకెల్లి, తను బోరింగ్ కొడుతుంటే నేను మట్టిలో పడి ఇష్టమొచ్చినట్లు దొర్లుకుంటూ ఏడుస్తుంటే, ఎలా ఓదార్చాలో తెలీక అబ్బ పడిన తిప్పలన్నీ గుర్తొస్తున్నాయి.
                                      తర్వాతరోజు అమ్మ, అక్క వాల్లు రావడం, నాకోపానికి, అలకకి Double Deccer Bus బొమ్మ ఇవ్వడం నేను కోపం తగ్గించుకోకపోయేసరికి అమ్మ ఓరోజంతా తినకుండా ఉండటం, మల్లీ నేనే వెల్లి కలసిపోయి ఇద్దరం కలసి తినడం అన్నీ గుర్తున్నాయి.
                               నా తప్పు కాకున్నా, నాకోపం తగ్గకున్నా, నా అలక తీరకున్నా మొట్టమొదటిసారి అమ్మ దెగ్గరికెల్లి మామూలుగా మాట్లాడా.. కేవలం అమ్మ అన్నం తినట్లేదని మారిపోయా ఒక్కసారికి..
                               మామూలు అయితే అయ్యాకానీ.. నన్ను పిలుచుకెల్లలేదని చాలారోజులు బాధపడుతూనే ఉన్నాను. “నన్ను పిలుచుకెల్తే అది కావాలి, ఇది కావాలి అని అడిగి ఖర్చు చేపిస్తానని భయపడిందేమో, అందుకే చెప్పకుండా, నన్ను పిలుచుకెల్లకుండా వెల్లిందేమో” అని చాలా బాధపడ్డాను నిజంగా... నా జీవితంలో మొదటిసారి అమ్మ నన్ను మోసం చేసింది. అని అనుకుంటూ చాలా బాధపడ్డాను. గడిచేకొద్దీ ఆ అలకలన్నీ కాలగమనం లో కొట్టుకుపోయాయి...
12.                                                                               భారతీ నుంచే నా భవిష్యత్తు మొదలు...
                                          కొన్నిరోజులు ప్రొద్దుటూర్ లో, సంవత్సరం St.Anns లో, సంవత్సరం వాసవీ School లో, ఇంకో సంవత్సరం పాలసాగరంలోనే చిన్న School లాంటి రూం లో ఇలా ఐదు తరగతులు పూర్తి చేసేసరికి నాలుగు స్కూల్లు మారాను... నన్ను బాగా చదివించాలని పట్టుదల వచ్చిందో ఏమో, అందరూ వద్దన్నా అమ్మ తీస్కెల్లి నన్ను శ్రీ భారతీ విధ్యామందిర్ లో చేర్పించింది. అప్పుడు నా School Fee 25/-. ఆరోతరగతికి అరపాంట్ (నిక్కర్) వేస్కుని రోజూ వెల్లేవాన్ని.. చెప్పులే అలవాటు లేని నాకు అమ్మ చెప్పులు కొనిచ్చింది. అయినా నేను అస్సలు వేస్కుని వెల్లేవాన్నే కాదు. అలా అదే స్కూల్ లో నేను 10th వరకూ చదివేశాను. నా Mentality ఇలా ఉందీ అన్నా, నాకూ మంచి మనసు ఉందని నాకు అనిపించడానికి  కారణమైనా, ఇప్పటికి కూడా రోజూ తప్పకుండా బొట్టు పెట్టుకునే నా అలవాటుకైనా, నే కవితలు రాసే తెలుగు జ్ఞానానికైనా, పెద్దల్ని గౌరవించే బుద్దికైనా, సెల్యూట్ కాకుండా రెండు చేతులు జోడించి చెప్పే నమస్కారానికైనా కారణం నేను చదివిన మా స్కూల్ శ్రీ భారతీ విధ్యామందిర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను...
                              ఐదు సంవత్సరాలు, ఉదయం లేవడం, అమ్మ Ready గా ఉంచిన పాలబాటిల్లను తీస్కెల్లి ఆల్లగడ్డలో ఇచ్చి మల్లీ ఇంటికి వచ్చి Ready అయ్యి స్కూల్ కి వెల్లడం.. మల్లీ స్కూల్ అయ్యాక సాయంత్రం సరదాగా ఇంటికి వెల్లడం... అవన్నీ గుర్తొస్తే ఆనందబాష్పాలో, బాధనో తెలీని విధంగా కల్లలో తడి మొదలౌతుంది..
                                          ఇక 10th class విషయానికోస్తే.. ఆజ్ఞాపకాలు, ప్రపంచం అంతా వేరే... 9th దాకా రకంగా ఉన్న నా Life 10th లో మారిపోయింది. భరత్ కూడా బానే చదువుతాడు అని కొంతమంది గుర్తించారు. S.P. Raju సర్ మాత్రం ఇంకా ఇంకా బాగా నమ్మాడు. అతను నన్ను Class Leader ని చేస్తే, నన్ను Class leader గా చూసి చూసి అలవాటు పడిన మా Head master నన్ను SPL (School people leader) నే చేశాడు రెండునెలలపాటు..
·       8th లో ఉన్నప్పుడు స్కూల్ ని వదిలి వెల్లిపోయిన మా అప్పటి Maths Teacher రామకృష్ణ సర్,
·       9th లో ఉన్నప్పుడు Quarterly Exams లో Maths లో నాకు 50 out of 50 వచ్చాయని, Headmaster Room కి పిలిచి నాకు ఏం తెలీకున్నా "పేపర్ ఎక్కడ కొన్నావ్, ఎంతకు కొన్నావ్" అని అడిగిన అప్పటి మా Class teacher సుధీర Madam & రామాంజనేయులు సర్…
·       నన్ను, నా Talent ని నమ్మి, నా ధైర్యాన్ని అనూహ్యంగా పెంచిన మా 10th Class maths teacher cum class teacher S.P. Raju సర్
·       అమ్మాయిలముందు మామూలుగా, అబ్బాయిలు మాత్రమే ఉన్నప్పుడు బండబూతులు ఉపయోగించి తిట్టే మా Natural science మధుసుధన్ సర్
·       స్వాతి ని సురేష్ గాడు ఏమో అన్నాడని తను ఏడుస్తుంటే... అది గమనించి   " నీయబ్బరోయ్.. భరత్ గా.. నువ్వే ఏడిపించావ్ కదూ..ఇప్పుడు చెప్తున్నా చూస్కో.. నీకు చదువు రాదు, ఏం రాదు..నీకు పబ్లిక్ పరీక్షల్లో 500 దాటితే నేను వెయ్యిరూపాయలు ఇస్తా చూడు రాసిపెట్టుకో" అని కాల్లు ఒంచుకుంటూ తిట్టి, నాతో పాటుఏడుస్తున్న స్వాతీ”ని కూడా నవ్వించిన అప్పటి "తెలుగు, Cum Social Teacher నాగ భూషణం సర్
·       6th to 7th Telugu Teacher గాయత్రీ Madam, 6th to 7th Social teacher M.H.K సర్ , 10th Hindi Teacher తహారా Madam , 10th Social Teacher గుంటమయ్య సర్, అందరూ జ్ఞాపకమే..
·       ప్రతీ శనివారం చేసే సరస్వతీ పూజ, Over excitement & Over enjoyment During that పూజ అన్నీ గుర్తే..
Apart from school life, I had another beautiful world. That is.. Ankal sir tution….. 10th లో నాకు వచ్చిన 520 Marks ని ఎవరికన్నా అంకితం ఇవ్వాలీ అంటే అది మా అంకాల్ సర్ ఒక్కడికే... రోజూ Night అక్కడే పడుకునేవాన్ని. Night 10 దాకా నిద్రపోనిచ్చేవాడూ కాదు, ఉదయం నాలుగు తర్వాత పడుకోనిచ్చేవాడూ కాదు.. నా ప్రయత్నం కన్నా ఆయన తాపత్రయం ఎక్కువగా ఉండేది.. అందుకే నాకు వచ్చిన 520 Marks మా అంకాల్ సర్ కే అంకితం.. అక్కడ ఆరోజుల్లో Friendship, అల్లరి, గోళ… అదో లోకం... చంద్ర, సురేష్ , లత, నేను Tution Time లో మాటల్లో, Exam Time లో మార్కుల్లో(only maths) పోటీ పడేవాల్లం.. Ego లు, కోపాలు, అల్లరులు అన్నీ కల్లముందరే కదుల్తున్నాయి...
ఏదేమైనా నా భవిష్యత్తు ఇప్పటికి అందంగా ఉందీ అంటే… That is because of those five years in bharathi vidya mandir….
ఐదు సంవత్సరాల ఆనందంకన్నా ఎక్కువగా నన్ను సంతోషపెట్టిన విషయం ఏంటంటే...
10th Results వచ్చాక నాకు వచ్చిన 520 Marks  & Maths 99 Marks ని చూసి అమ్మ పడిన ఆనందం, “వీడికోసం ఎంత కష్టపడినా పర్లేదు” అన్న మాట, మెల్లగా నన్ను చేరుకుని నాకు ఇచ్చిన ముద్దు స్పర్శ... అవి అలాగే నా మనసులో బతికే ఉన్నాయి…
13.                    మొట్టమొదటిసారి అమ్మ చేతిలో ముప్పైవేలు...
చిన్ననాటి సంగతులన్నీ గడిచిపోతుండగానే, వాటితో పాటు నా 10th class  కూడా అయిపోయింది. నాకొచ్చిన 520 Marks ని చూసి అమ్మ చాలా ఆనందపడింది. నా భవిష్యత్తుని ఇంకాస్త ముందుకు అలోచించి ఇంటర్ ఎక్కడ చేర్పించాలో తెలీక చాలా చర్చలు చేసి, చివరకి శేషా రెడ్డి మామ స్నేహితుడు సుధాకర్ అంకుల్ సహాయంతో నెల్లూర్ నారాయణ కాలేజ్ లో చేర్పిద్దాం అని Fix అయింది.
జూన్ 2006... అందరం ఓ Toofan Vehicle తీస్కుని నెల్లూర్ కి వెల్లాం. అక్కడ అందరూ నాన్నలతో, ఇంకొంతమంది మొత్తం Family లతో వచ్చారు. నాతో నాన్న రాలేదని నేను బాధపడలేదు కానీ, అమ్మ ఎంత కష్టపడుతుందో అని అని తలుచుకుని బాధపడ్డాను.. 
అమ్మ నా కల్లముందే డబ్బుల్ని  వేలల్లో లెక్కపెట్టి అక్షరాలా 28000/- సర్ కి కట్టేసింది. నా కల్లముందర మొట్టమొదటిసారి అమ్మచేతిలోంచి అంతపెద్ద మొత్తాన్ని చూసి, అమ్మ చేయి దాటిపోయినా అలాగే దానివైపే చూస్తున్నాను. చూస్తుండగానే, ఎన్నో వందల నోట్ల కట్టలను తీస్కున్న ఆ సర్, అన్నిటితో పాటు ఆ కట్టని కూడా ఆ నోట్ల కుప్పలోకి విసిరేశాడు.. ఆ సమయంలో నాకెందుకో ఆ నోట్ల కట్టల కుప్పకన్నా.. అమ్మ చేతిలోంచి వెల్లిన డబ్బే చాలా బాగా కనిపించింది... మల్లీ అక్కడ Pocket Money కి ఓ Bank లాగా వాల్లు Maintain చేసేవాల్లు.. అందులో అందరు 1000 Money వేస్తుంటే, అమ్మ పాపం 1000 తీస్తే మల్లీ ఏదన్నా ఖర్చు వస్తే ఎలాగా అని మనసులో అనుకుంటూ పర్సులో ఉన్న చివరి 1000 ని తీసింది. కట్టేటపుడు.."అమ్మా నాకు 500 చాలు అన్నాను." అమ్మ 1000 వేయడానికి ఎంతో ప్రయత్నించినా నేను మారాం చేసేసరికి 500 వేసి, మిగిలింది వెనక్కు తీస్కుంది. అంతకముందే Vehicle కి 1000 Advance ఇచ్చేసింది…. మొత్తానికి ఈరోజు అమ్మ చేత్తో 30000 ఖర్చు పెట్టించానే అన్న బాధ చాలారోజులు తగ్గలేదు. మల్లీ దసరా సెలవులకి ఇంటికి వెల్లేంతవరకు నేను పెట్టిన ఖర్చు 78/- + ఇంటికి వెల్లడానికి చార్జీలు 128/- అని చాలా లిమిట్ గా ఖర్చు పెట్టి అమ్మకు చెప్పినట్లు అలోచిస్తుంటే గుర్తొస్తుంది…. అలా చెప్పానని అమ్మ ఆనందపడుతుందని అనుకున్నా.. But No… బయటకు నవ్వుతున్నా, కల్లలో నీల్లు మాత్రం వెంటనే జారేవి.... కష్టాలు పెరిగేకొద్దీ ఏడ్చి , ఏడ్చి కన్నీల్లు ఇంకిపోతాయి అంటుంటారు. కానీ, ఎన్ని కష్టాల కొలిమిల్లోంచి నడిచొచ్చినా అమ్మ కన్నీల్లు ఇంకా ఇంకిపోలేదు. ఇప్పటికి కూడా పాతవిషయాలు గుర్తు తెచ్చుకుని ఏడుస్తూనే ఉంటుంది. అమ్మకి ఆ ఏడుపుని ఎప్పటికి దూరం చేగలనో ఏమో...
14.                                                                               నాకు నాన్న కావాలి...
                                          చిన్నప్పటి తెలిసీ తెలీని వయసు దాటిపోయింది. ఇప్పుడు రెండుతో మొదలయ్యే రెండంకెల వయసు, అర్థం చేస్కునే మనసు రెండూ వచ్చేశాయి.. అలాగే మెల్లగా B.Tech 2nd Year కి వచ్చేశా... అప్పుడు అక్క ఎమ్మిగనూర్ లో B.Tech 3rd Year చదువుతుంది. క్రికెట్ ఆడి వచ్చి అలసిపోయి రూం లో కూర్చున్నా... అలసట తీరకముందే, ఆయాసం ఆగకముందే ఫోన్ రింగ్ అయింది. చూస్తే అక్క.. చాలా డల్ గా మాట్లాడుతుంది. ఎంత అడిగినా ఏమీ చెప్పట్లేదు. అడిగి ప్రయోజనం లేదని తెలిసి Topic మార్చి నవ్వించడానికి ప్రయత్నిస్తున్నా... అయినా అక్క మాటతీరులో మార్పు లేదు.. Silent అయిపోయింది. నా అంతట నేను అలాగే మాట్లాడుతుంటే మెల్లగా చిన్న ఏడుపు వినిపించింది.
                                          అక్కా.. అక్కా.. ఏమైంది...అని నేను అడిగిన ప్రశ్న పూర్తి అవకముందే "నా......న్న కావా....లీ......." అని గట్టిగా ఏడ్చింది. నాకు ఎలా ఓదార్చాలో, ఏమని చెప్పాలో అస్సలు అర్థం ఆలేదునాన్న చనిపోయినప్పటి అక్క Face ఇప్పటికీ నాకు గుర్తుంది. అప్పుడు కూడా ఇంత గట్టిగా ఏడ్చలేదు.. “ఏమైంది, ఏమైంది...ఎందుకు అలా గుర్తొచ్చాడు” అని ఎంత అడిగినా చెప్పలేదు.
                                          ఇంక ఎంత అడిగినా ప్రయేజనం లేదని ," విషయం అమ్మకి తెలిస్తే మనకేదో లోటు చేస్తుందని బాధపడుతుంది అక్కా.....plzz cool" అని మొదలు పెట్టి, మొట్టమొదటిసారి ఫోన్ లో 93 నిమిషాలు మాట్లాడాను. 93 నిమిషాలల్లో చివరి మూడు నిమిషాలు మాత్రమే అక్కని నవ్వించగలిగాను. హు హు హు Luv you soo much అక్కా... ను అలా బాధపడితే నేను అస్సలు చూడలేను... హు హు హు
                                   ఆ మూడు నిమిషాల పుణ్యమా అని నా మూడు కూడా మల్లీ బాగా అయిపోయింది. కానీ రాత్రి పడుకునేటపుడు మాత్రం "అక్కకి Sudden గా నాన్న ఎందుకు గుర్తొచ్చాడు", “ఇన్నాల్లు నాన్న నాకెందుకు గుర్తు రావట్లేదు" "అసలు నాన్న అంటే నాకు ప్రేమ ఉందా లేదా.." అని నాకు పెద్దగా అలవాటు లేని పిలుపు గురించిన ప్రశ్నలని నాను నేనే వేస్కుంటూ... Luv U అక్క, Sorry అమ్మ, Miss U నాన్న అని మనసులో అనుకుని మెల్లగా నిద్రలోకి వెల్లిపోయాను…
15.                                                                              అమ్మతో పెట్టించిన చివరి వేస్ట్ ఖర్చు...
                                   ఆగస్ట్ 2010... B.Tech Join అయింది Sep 2008 లో అయినా అమ్మ మొదటిసారి మా కాలేజ్ కి వచ్చింది ఈరోజే… ఆనందంగా అమ్మ చెయ్ పట్టుకుని కాలేజ్ అంతా తిప్పి చూపించాను.. అదేంటో అమ్మ కల్లలో ఆనందానికి కూడా ఇట్టే కన్నీలు వచ్చేస్తాయ్... ఎందుకో నన్ను చూసి కన్నీల్లు పెట్టుకుంది. క్షణాల్లో మల్లీ మామూల్ అయిపోయింది.
                                   చిన్నప్పటినుంచి నేను అలిగి, గొడవపడి అమ్మతో చాలా వేస్ట్ ఖర్చులు పెట్టించా. కానీ నాకు గుర్తు వచ్చిన తర్వాత అమ్మతో నేను పెట్టించిన చివరి వేస్ట్ ఖర్చు ఇదే...
                                   అప్పుడు లాబ్ కి షూ కావాలి అని సర్ చెప్పారు. కానీ నాతో అవి లేవు. చాలామంది Friends Without Shoo Manage చేస్తున్నారని తెలిసినా "అమ్మా.. షూ కావాలి" అన్నాను. అమ్మ కాస్త అలోచించి "ఎంత అవుతాయ్ నాన్న" అనింది. "ఓ రెండురోజులనుంచి చాలా షాప్ లు తిరిగి ముందే తెలుసుకున్న నేను 300/- అమ్మా అన్నాను. "సరే వెల్దాం పద" అనింది. అప్పుడు ఆటోలో షాప్ కి వెల్తున్నప్పుడు నేను పడిన ఆనందం ఇప్పుడు నాకు గుర్తొస్తే నాపైన నాకే అసహ్యం వేస్తుంది.
                                   అప్పుడు నేరుగా ఓ షాప్ కి వెల్లి చిన్నప్పటి దీపావలి లా కాకుండా కావాల్సినవి మాత్రమే చూసి, వేస్కుని అమ్మకి చూపించా... చిన్నగా నవ్వి బాగున్నాయి అనింది. అప్పుడు షాప్ అతను "సాక్స్ కూడా కావాలా అమ్మా.." అని అమ్మని అడిగితే "వద్దు" అని అనకుండా నావైపు తిరిగి "అవి ఎంత అవుతాయ్ చిన్నా...?" అని నన్నే అడిగింది... ఆశకి అంతు ఉండదని తెలుసు.. కానీ ఆరోజెందుకో నా ఆశకి అంతు ఉన్నింది. "సాక్స్ వద్దమ్మా బయట తక్కువ ఉంటాయ్ అక్కడ కొంటా.." అన్నాను.. సరే అనింది.  అంతలోగా షాప్ అతను 299/- అని వేసి బిల్, దాంతో పాటు షూ కవర్ ఇచ్చాడు...
                                   అప్పుడు మెల్లగా పర్స్ జిప్ ఓపెన్ చేసి ఒకటి, రెండు, మూడు… అని మెల్లగా బయటకు తీసి మల్లీ చేతిని తడి చేస్కుని ఒకటి, రెండు, మూడు... అని ఎంచి ఇచ్చింది. వాడు ఇచ్చిన ఒక రూపాయ్ కాయిన్ ని కూడా బయట ఉన్న ఒక అవ్వకి ఇచ్చి ఆటోని పిలిచి బయలుదేరాము. అప్పుడు అమ్మకి తెలీకుండా "అమ్మతో మనీ ఉందో లేదో అని పర్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంకా 100 నే ఉంది. చాలా బాధేసింది.. తట్టుకోలేక అమ్మని అడిగేశాను. అప్పుడు అమ్మ ఇచ్చిన ఆ Reply ,ఆ Voice లో Intensity తో సహా అంతా గుర్తుంది. "సరిపోతుందిలే నాన్నా... ఈ ఆటోకి 14/- పోయినా ఇంకా 86/- ఉందిగా.. బస్ టికెట్ 54/- నేగా ఏం కాదు..” అని నాకు షూ కొనిచ్చానన్న పూర్తి సంతృప్తితో అనింది. ఆటో వాడికి ఇచ్చిన 14/- తర్వాత ముప్పై రూపాయలు నా చేతిలో పెట్టి "సాక్స్ లు కొనుక్కో నాన్నా" అనింది. "కానీ నేను ఆ 30/- లు తీస్కుంటే ఇంక టికెట్ కి పోను అమ్మదెగ్గర మిగిలేది అక్షరాలా రెండు రూపాయలు… అందుకే "వద్దమ్మా.. నేను కొనుక్కుంటాను అని వెనక్కు ఇచ్చేశాను.."
                                   మా అమ్మ ప్రేమని, త్యాగాలని గుర్తు చేసుకోవడానికి ఇలాంటి సంగతులు, సంఘటనలు ఎన్నో నా మనసులో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి.
                                   ఇన్నాల్లు గమనించనిది, ఇప్పుడు గమనిస్తున్న కొత్త విషయం ఏంటంటే ... అమ్మ నన్ను ప్రేమగా పిలుస్తూ చివర్లో అనే "నాన్న" అన్న పిలుపు …." చెప్పు నాన్నా", “అవి ఎంత అవుతాయ్ నాన్న", "తొందరగా ఇంటికి వచ్చేయ్ నాన్నా..", "జాగ్రత్తగా రా నాన్నా" అనే పిలుపు నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. హా హా హా ... Fact ఏంటంటే “నాన్న” అన్న పిలుపు నాకూ, అమ్మకీ ఇద్దరికీ ఓ సంవత్సరం తే డా లోనే దూరం అయింది…
16.                                                                              అమ్మ మాటల్లో అత్యధిక ఆనందం చూసిన రోజు…
                                   ఆగస్ట్ 2011.. 12.30 కి అమ్మ బస్ నుంచి కాల్ చేసి "మీ కాలేజ్ దాటిపోయింది చిన్నా" అనింది. హామా.. సరే అని ఫోన్ కట్ చేసి 12.40 కి క్లాస్ అవ్వంగానే ఆటో ఎక్కి Railway Station కి వెల్లాను. అమ్మ అప్పటికే అబ్బ, జేజిలను Hyderabad Hospital కి పిలుచుకుని వెల్లేకి Railway Station లో కూర్చుని ఉంది.
                                   నేను వెల్లి టికెట్స్ తీస్కుని నలుగురం కలసి వెల్లి Train లోనే కూర్చున్నాం. అమ్మ తెచ్చిన అన్నం, చెపాతీలు తిని Train లోనే మాట్లాడుతున్నా.. అబ్బ, జేజి లకు ఇద్దరికీ అరోగ్యం బాగోలేదు.. Money కూడా Tight గా ఉంది. ఇలా Hyd కి అటూ ఇటూ తిరుగుతూ Manage చేయడం కష్టం అవుతుందని నెలకి 3500/- తెచ్చి పెట్టే పాడి ఎనుములను కూడా తప్పని పరిస్తితుల్లో అమ్మేసింది. అక్కకి 2000/-, నాకు 2500/- పంపి మిగిలిన 5000 ని పర్స్ లో పెట్టుకుని Hyd కి 3.00 PM కి బయలుదేరింది. తర్వాత నేను అలాగే మల్లీ కాలేజ్ కి వెల్లిపోయాను.
                                   మల్లీ తర్వాతరోజు సాయంత్రం అమ్మ ఫోన్ చేసి," ఈ Hyd ఆటో చార్జీలకు, ఖర్చులకి, టెస్టులకి ఉన్న మనీ అంతా అయిపోయింది రా... ఇప్పుడు అయ్యే ఖర్చంతా చంద్రశేఖర్ మామ పెడుతున్నాడు... మనం మల్లీ ఇవ్వాలి" అనింది. అలా అమ్మ నోటినుంచి వినగానే చాలా బాధేసింది.. నాతో డబ్బూ లేదు.. సంపాదించే వయసూ కాదు... Part Time Jobs కోసం చేస్తుంటే "మామ వాల్లకి తెలిస్తే బాధపడతారు చిన్నా" అని అమ్మ చెప్పిన మాటకి ఆగిపోయాను. ఇవన్నీ అలోచిస్తూ బాధపడుతుంటే.. ప్రతాప్, అనీల్ ఇద్దరూ "బయటకు పోదాం పదరా జఫ్ఫా" అని చెయ్ పట్టుకుని లాగారు.. "Friends తో కలసి నవ్వుతుంటే ప్రతిసారీ కష్టాలను మర్చిపోయేవాన్ని.. కానీ ఇప్పుడెందుకో అస్సలు కుదరట్ల”...
                                   అలా నడుచుకుంటూ దేవనగర్ దాకా వెల్లాం.. దూరంగా చూస్తే ఓ ATM కనిపించింది. అందులో ఉండాల్సిన Balance 1520/- అని తెలిసినా.. పెరిగిందేమో చూద్దాం అని ఆశతో Balance Check చేశాను.. చూస్తే ... Your balance is 16,920/- అని చూపించింది.. Shock… 15,400/-పెరిగింది. వచ్చి ప్రతాప్ గాడు మల్లీ చూశాడు.... Same 16,920/- … వెంటనే అమ్మకి కాల్ చేసి “అమ్మా నా Account లో 15,000/- Money వచ్చింది” అని Happy గా అన్నాను  అమ్మకి నమ్మకం కుదరక “ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది” అని అడుగుతుంది…  నాకేం చెప్పాలో అర్థం కాక తొందర్లో ఏదోటి చెప్పాలి అని, Scoller ship అని చెప్పేశాను.. అప్పుడు వెంటనే అమ్మ మాటల్లో ఆనందం కనిపించింది. "సరే నాన్న డబ్బు జాగ్రత్త... Hyd కి వచ్చేయ్" అని చెప్పి చాలా ఆనందంగా పెట్టేసింది... అమ్మకైతే Scoller ship అని చెప్పా కానీ, అది ఎలా వచ్చిందో తెలీక నేను సతమతం అవుతున్నా. వెంటనే Mini Statement Check చేశా.. అందులో కూడా Scoller ship అనే వచ్చింది... పిచ్చ ఆనందమేసింది.. అనీల్, ప్రతాప్ ATM లు కూడా Check చేశాం.. వాల్ల కి కూడా 15,400/- వచ్చింది. Fee Reimbursement లో First Installment అని తెలుసుకుని Full Of Happyness తో Room కి బయలుదేరాం..
                                   సెల్ మోగింది.. జోబులొంచి తీసి చూస్తే అమ్మ కాల్ చేస్తుంది.. Lift చేసి "హా చెప్పుమా..." అనగానే .. " చిన్నా..అది ఎవరి డబ్బో పొరపాటున నీ అకౌంట్ లో వచ్చి పడింది అయితే కాదు కదరా" అని చాలా బాధగా అడిగింది. "లేదమ్మా ఇది మనదే, ఫీజు వెనక్కు వచ్చింది" అన్నాను. చాలా అనందంగా "బాబా ఉన్నాడురా, సరే.. జగ్రత్తగా రా నాన్నా".. అని కాల్ కట్ చేసింది..
                                   నాజీవితంలో నేను పొందిన ఆనందాలన్నిటినీ ఓ పేపర్ పైన రాయమంటే నేను రాసే మొదటి ఆనందం ఇదే అవుతుంది. And There is No doubt in this. Thank you Mr. Y.S.Rajasekhar Reddy .. అనుకుని బాబాకి మనసులోనే ముక్కుని ముగ్గురం Room కి వెల్లిపోయాము.

నిజంగా Soooo Happy అనుకుంటూ ఉండగానే నేను, ప్రతాప్, అనీల్ కలసి నడిచిన ఆ కర్నూల్ దేవనగర్ రోడ్, సెంట్రల్ ప్లాజా ఆంధ్రా బ్యాంక్ ఎ.టి.యం, ఆ రోడ్డుపైన వినాయకుడి గుడి, కె.సి కెనాల్ అన్నీ గుర్తొచ్చి వెంటనే కల్లు తెరిచాను.. జారాలా వద్దా అని, ఓ కన్నీటి బొట్టు జారి నా చెంపపైన పడింది. కంటిపైన కన్నీల్లు ఉండటంతో గోడలు కదులుతున్నట్లు, గోడపైన ఉన్న లైట్ గ్రీన్ కలర్ బ్లూ గా మారిపోయినట్లు రూం అంతా మసక మసకగా కనిపిస్తుంది... అలాగే కల్లు కాస్త తుడుచుకుని ఓ నాలుగైదుసార్లు కల్లు మూసి మల్లీ తెరిచాను. కాస్త మామూల్ గా కనిపించింది. ఇప్పటిదాకా మనసుపైన ఉన్న బారం అంతా ఒక్కసారిగా తగ్గినట్లు అనిపించింది. వల్లంతా చల్లగా అనిపించింది. చలి ఎక్కువైందని అర్థమయ్యి Loose గా ఉన్న Jarkin Zip ని వేస్కుంటూ మెల్లగా కాల్లు కిందపెట్టి అవేచెప్పులు వేస్కున్నాను. వల్లంతా పట్టుకుపోయింది.. Body అణువణువునా Tensile Forces Apply చేస్తూ అడుగు ముందుకేశాను... ఒక్కో అడుగు ముందుకేస్తుంటే గతం ఒక్కో అడుగు వెనక్కు వెల్తుంది... Body ని Mind ని Relax చేద్దామని కాస్త Corridor లోకి వచ్చాను. అక్కడే ఉన్న ఓ Water Mug ని చేతికి తీస్కుని కల్లు మూస్కుని మెల్లగా తల పైకి ఎత్తి నీల్లు తాగుతున్నాను. తాగడం అయ్యాక, తల దించుతూ దించుతూ అలా బయటకు చూశాను.
                                   "దీనమ్మ జీవితం... చీకటి పడిపోయింది..." Fast గా లోపలికెల్లి సెల్ చూశాను. My God… Time 7.30 PM. అంటే నేను ఆపకుండా ఏడూనర్రగంటలపాటు అలాగే ఆలోచిస్తూ గడిపేశానా అని Shock అయ్యాను..Any Way Its ok, Relax.. అని మల్లీ మెల్లగా Corridor లోకి వచ్చాను.
                                   ఈసారి బయటకు కాకుండా Corridor ఇంకో వైపు చూశాను. మద్యాహ్నం పేకాట అడుకున్నప్పుడు “ఒకటి మిస్ అయిందే” అనుకున్నది ఇప్పుడు చేరిపోయింది... అదే Corridor లో, అదే టేబుల్ చుట్టూ కూర్చుని, అదే నలుగురూ పేకాట ఆడుకుంటూ, పక్కనే బీర్ బాటిల్ పెట్టుకుని అప్పడప్పుడు తాగుకుంటూ  నవ్వుకుంటూ Enjoy చేస్తున్నారు.
                                   నేను మాత్రం Relax, Relax అని మనసులో అనుకుంటూ మెల్లగా అటూ, ఇటూ నడుస్తున్నాను... వెనకనుంచి పెద్దగా Voice... మా Colleague..  "రెడ్డిగారూ... రండి రెడ్డిగారూ ఓ బీర్ వేసి Relax అయిపోదాం రండి.." అన్నాడు. వార్ని.. నాకు Relaxation కావాలని నీకెలా తెలిసిందిరా బాబు... అని మనసులో అనుకుంటూ ఉండగానే వెంటనే ఇంకో Voice ... " ఏటి రెడ్డిగారూ... రారేటీ.. ఈడకొచ్చి మేము సెప్పేది ఆలకించండి.." అని ఇంకో Colleague అన్నాడు. “నేను Already Relax అవుతున్నాండీ… మీరు కానివ్వండి, No Thanks అన్నాను.”… "అలవాటు చేస్కోవాలి రెడ్డిగారూ... అసలు రెడ్డి అంటే ఎలా ఉండాలి..." అని Topic ని Extend చేసాడు ఇంకో Colleague  ... నేను నవ్వుకుంటూ... "తాగడం నా అలవాటు కాదండీ... తాగకపోవడం నా Principle ".. “Habbits may change.. But principles will not…” అని నవ్వుకుంటూనే అన్నాను. పాపం ఏమనుకున్నాడో... తాగుతూ ఉన్న పక్కవాన్ని ఒకటి పీకి "చూడు రెడ్డిగారిని చూసి నేర్చుకో.." అని బాటిల్ ఎత్తి మల్లీ తాగుతున్నాడు... ఇలా ఓ నాలుగైదు మాటలు వాల్లకీ నాకు Exchange అయ్యేసరికి నా Mind కి నిజంగానే Relaxation వచ్చేసింది.
                                   మెల్లగా వెల్లి సోప్ తీస్కుని Face Wash చేస్కున్నా... "అరె సోప్ అయిపోయిందే... రేపు కొనాలి" అని అనుకుంటూ మల్లీ రూం లోకి వచ్చి Laptop On చేశాను. Laptop Screen లో Light రావడం, Room Space లో Light పోవడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. Power Cut… "దీనమ్మ జీవితం.. “ఈ ఊర్లో కరెంట్ బిల్లులు, మీటర్లు ఉండవని ఇష్టమొచ్చినపుడు తీస్తారు కదరా” .. అని తిట్టుకుంటూ, అలోచిస్తూ... మెల్లగా మంచంపైనే పడుకుని కనిపించీ కనిపించని Roof ని చూస్కుంటూ మల్లీ అలోచనల్లోకి వెల్లిపోయాను.
                                   నన్ను వదిలి వెల్లిన నాన్న, నేనే సర్వస్వం అనుకున్న అమ్మ, నాన్న కావాలి అని అడిగిన అక్క... అందరూ మల్లీ అలా అలా కల్లముందు కదిలారు.. నిజంగా మొట్టమొదటిసారి ఓ రోజంతా చిన్నప్పటి జ్ఞాపకాలగురించే అలోచిస్తూ గడిపేశాను.. నిజంగా నేను చేసే అల్లరికి అమ్మ నన్ను ఎలా పెంచిందో అసలు.
·       చిన్నప్పుడు నేనడిగే పిచ్చికోరికలని తీర్చలేకపోతుందని అమ్మ పడే బాధ...
·       ఊర్లో నాకోసారి తేలు కుడితే నాకేమౌతుందో అని అమ్మ పడిన భయం...
·       నాకు 10th లో 520 వచ్చాయని అమ్మ కల్లో నేను చూసిన ఆనందం...
·       అప్పుడప్పుడు నా తిక్కమాటలు, ఎవరో నేర్పించిన బూతులు విని అమ్మ చూపించిన కోపం...
·       రక్తం వచ్చేలా నన్ను గిచ్చిందని, అక్క గోర్లు కత్తరించాలని నేను, అమ్మ కలసి చేసిన ప్రయత్నం..
·       నాకు కడుపు నస్తుంది అంటుంటే నా చొక్కా కాస్త పైకి అని బొజ్జపైన నాలుకతో గిలి గిలి పెట్టి అమ్మ చసే ప్రేమ వైధ్యం..
·       బాధైనా, ఆనందమైనా వెంటనే జారే అమ్మ కన్నీల్లు..
·       మనసులోనే అన్ని Caliculations వేస్కుంటూ మెల్లగా అమ్మ డబ్బు లెక్కించే తీరు...
·       కదపలేనంత బరువుగా పెట్టుకునే అమ్మ గడ్డిమోపు..
·       ఎంతగట్టిగా కట్టినా తాడు ఓ చివరపట్టి లాగంగానే ఊడిపోయేలా అమ్మ వేసే గడ్డిమోపు ముడి…
ఇలా గతానికి ఎదురు వెల్లి ఆలోచిస్తే ప్రతీదీ ఓ జ్ఞాపకమే... ఆ బాధలన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు మాత్రం పెద్దగా బాధ అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను సంపాదిస్తున్నా... అమ్మని బాగా చూస్కోగలననే నమ్మకాన్నీ, దాంతో పాటు డబ్బునీ రెండిటినీ సంపాదిస్తున్నా...
                                   నాన్న లేకున్నా అన్ని కష్టాలు పడి మమ్మల్ని ఈ స్థాయికి తీస్కొచ్చిన అమ్మని ఎప్పటికీ Neglect చేయను. ఎన్నో గుడులు, పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఎంతో మంది దేవతలని దర్శించుకున్నాను. కానీ నా మనసులో మాత్రం ఎప్పటికీ మా అమ్మే మొదటి దేవత...
Luv u sooooooo much maa…..
ఎవరు ఉన్నా, లేకున్నా, కలిసున్నా, కాదన్నా, రాకున్నా, రామన్నా... నీకు నేనున్నా...
ఇంతబాగా అమ్మకి కూడా ఎప్పుడూ చెప్పలేదు.. చెప్పాలని కూడా అనుకోలేదు. కానీ అమ్మని బాగా చూస్కోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా..
                                   అబ్బ చెప్పిన IAS , నేను చిన్నప్పుడు అవ్వాలనుకున్న IPS లు పక్కన పెడితే... ఓ రెండు సంవత్సరాల క్రితం "శేషారెడ్డి మామ, నేను కోవెలకుంట్ల Busstand లో నడుచుకుంటూ వెల్తున్నప్పుడు.. "M.Tech చదువు భరత్.. మంచి Future ఉంటుంది అంట కదా... I will pay fee for you "  అని అంటుంటే కూడా వద్దు అన్నాను… Because I want to start my earnings at the earliest… & I don’t want to see my mother in this position for another two more years.
                                   “అబ్బ, జేజి అరోగ్యాలు బాగుండటం లేదని, అమ్మ పాడి ఎనుములు కూడా అమ్మేసింది... Considarable Income ఏమీ లేకపోయినా ప్రతినెలా నాకు 2500, అక్కకి 2000, అబ్బజేజిల మాత్రలకి 1000 ఖర్చుపెట్టి కూడా ఇంటిని నడిపేది. మల్లీ నేను M.Tech పేరుతో ఆ ఖర్చుల్ని Continue చేయడం నాకు ఇష్టం లేదు.”  ఇవన్నీ మనసులో అలోచించుకుంటూ బయటకు మాత్రం “Sorry మామ, M.Tech Interest లేదు” అని Interest ఉన్నాకూడా మొట్టమొదటిసారి నాకెంతో ఇష్టమైన మామకి అపద్దం చెప్పాను.
                                   హా హా హా..అమ్మ అప్పుడప్పుడు అంటుండేది.."నాకు నలుగురు ఇంజినీర్ లు కావాలి" అని... అక్కని డిగ్రీ చేర్పించమని అందరూ అంటున్నా పట్టుపట్టి, డొనేషన్ కట్టి..చేర్పించి ఆ నలుగురు ఇంగినీర్లు అనే మాటలో మొదటి ఇద్దర్ని తయారు చేసేసింది.. మూడో ఇంజినీర్ గా మా బావ కూడా అమ్మ List లోకి ఈ మధ్యనే చేరిపోయాడు..  షభాస్ మా...You are greatest and best…  అని మనసులో అనుకుంటూ, మనసారా నవ్వుకుంటూ...ఇదంతా తొందర్లో పేపర్ పైన పెట్టాలని ఆశపడుతూ మెల్లగా కల్లు తెరిచాను.
                                   Time 8.30 PM.. “వార్నీ.. Power వచ్చేసిందే.. అసలు తెలీనే లేదు”. అని Fast గా వెల్లి, జొన్నరొట్టెకన్నా మందంగా చేసిన మూడు Worst Roti లు, అమ్మ పెట్టించిన పొడి, కాస్త తిని, నీల్లు తాగి "ఉస్ ఉస్" అని మంటగా ఉసకొడుతూ రూం కి వచ్చి డోర్ వేశాను.
                                   ఎలాగూ Power కూడా వచ్చింది కదా అని Laptop తీసి Facebook, Gmail Check చేసి Laptop close చేసి, నిన్నలాగా కాకుండా ఇప్పుడు Laptop చార్జర్ ని కూడా అపేసి, లోపల పెట్టి అంతా Pack చేసి, Bag కింద పెడుతున్నాను.
                                   ఆ Bag నేలని తాకకముందే…. "గగనపు వీధి వీడి వలసపొంది పోయిన నీలి మొబ్బుకోసం... తరలింది తనకు తానే.. ఆకాశం.. " అని Phone Ring అయింది. చూస్తే మా బాస్ మహేష్ సర్.. "రేపు మీటింగ్ కి అంతా రడీనా ... అన్నీ జాగ్రత్తగా చూస్కో .. There will be no problem. Take care. Good night" అని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంటనే Mind, Mood మొత్తం మారిపోయింది. ఈరోజంతా అస్సలు గుర్తురాని రేపు జరగబోయే మీటింగ్, మహేష్ సర్ కాల్ తో ఇట్టే గుర్తొచ్చేసింది. దాంతో “అమ్మ, ఆనందం, బాధ, బెంగ, గతం, కన్నీల్లు” అనే పదాలనుంచి, “Office, Files, Claims, Bills, BBS” అనే పదాలలోకి తెలీకుండానే వచ్చేశాను..   అంతా మహేష్ సర్ పనే… అనుకుంటూ సెల్ కింద పెట్టేసాను…
మల్లీ రేపు Meeting .. "రేయ్ భరత్ గా .. జాగ్రత్తరారోయ్...రేపు మీటింగ్ అంట.." హా హా హా... All the best for your meeting…
                                                                                Your’s

                                                                                                 CHINNA

2 Comments:

At November 22, 2013 at 6:31 PM , Anonymous Anonymous said...

ఏ మని కామెంట్ రాయాలో తెలియడo లేధు కానీ ఒకటి మాత్రం రాస్తా నిజంగా ఛాలా ఛాలా బాగుంది నిన్ను చూస్తుంటే నాకు చాల గర్వంగా మరియు కొంచెం భాదగా ఉంది కంటిన్యు మై ఫ్రెండ్.................

 
At November 22, 2013 at 6:33 PM , Anonymous Anonymous said...

ఏ మని కామెంట్ రాయాలో తెలియడo లేధు కానీ ఒకటి మాత్రం రాస్తా నిజంగా ఛాలా ఛాలా బాగుంది నిన్ను చూస్తుంటే నాకు చాల గర్వంగా మరియు కొంచెం భాదగా ఉంది కంటిన్యు మై ఫ్రెండ్.................

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home