Monday, June 27, 2016

ప్రకృతిలో నీతులు-2


అణువంతటి విత్తనాన మహా వృక్షముంటుంది,
అనువుగున్న నేలలోన నాటిచూడు తెలుస్తుంది...
అతి చిన్నదైన చినుకులోన పెను వరదే ఉంటుంది,
అవి ఒకటై కురుస్తుంటె నది సైతం పొర్లుతుంది...
అందని లక్ష్యం సైతం అందుబాటు అవుతుంది..
అలుపే రాదను యత్నం నిత్యం నువు చేస్తుంటే...

సర్వం వేడిని పెంచే సూర్యుడున్న ప్రతిచోటా,
చల్లని వెన్నెల పంచే చంద్రుడుంటాడని మరవకు..
చీకటి రాజ్యాన్నేలే రాత్రి ఉన్న ప్రతిరోజూ,
పున్నమి కాంతుల కాలం ముందుందని మరువకు...
కష్టం వారథి దాటిన నీ ఆగిపోని ప్రతి అడుగూ
విజయపు ద్వారం వైపుకు వెల్తుందని మరువకు..

నీడ రంగు నిషి రంగూ ఒకటే మన కంటికి,
అయినా అవి వెల్లలేవు ఒకటై ఏ చోటుకి..
హరివిల్లున దాగిఉన్న రంగులు ఏనాటికీ,
విడిపోవు కదా ఘర్జించే ఆ వరణుడి దాటికి...
అనుకూలతలున్నాయని అన్ని పనలు అవ్వవు,
అనుకున్నవి లేవు అని ప్రతి పనులూ ఆగవు...

గమ్యం లేదను నడక సాగలేదు ముందుకి,
ప్రతికష్టం పంపగలదు నిను అలవోకగ వెనుకకి...
గాయం వద్దను నడత సాధించలేదు ఎంతకీ..
కష్టం కౌగిలి లేందే చేరలేవు ఏ గెలుపుకి..

దారంతా కనపడదు ఏ వాహనాల కాంతికి,
కదిలి చూడు దరిచేరును గమ్యం నీ చెంతకి..
చివరి మెట్టు కనపడదు నీ తొలిడుగుల కళ్ళకి,
మెట్టు మెట్టు ఎక్కి చూడు అది మొక్కును నీ కాల్లకి...
కష్టం దాటిన వాడే విజయానికి ఆప్తుడు,

ఓటమి చూసినవాడే గెలుపుకు ప్రియమిత్రుడు...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home