Monday, January 2, 2017

ఓరిమి ఇచ్చిన ఓటమి

నలుదిక్కుల నలుపెక్కిన ఈ చీకటి ఒడిలో,
నిదురన్నది దరిచేరని నా బాధల బడిలో,
నా అందమైన గతంలోని గురుతుల సవ్వడిలో,
కన్నీల్లుగ జారుతున్న నా జ్ఞాపకాల జడిలో,
నాకు దగ్గరైన దూరాన్ని స్వీకరించలేకున్నా…
ఈ దూరమైన దగ్గరని విడిచి ఉండలేకున్నా...

ఏమని ఓదార్చేను, ఓడిన నా మనసును,
ఒంటరినై ఉన్నాను, మది గడివేసిన గదిలో...
ఎవరికి వివరించేను, నాలోన ఉన్న వేదనను,
నా నీడైనా కనపడదే, ఈ నడి రాతిరి నిషిలో...

సుఖదుఃఖపు అలలవలే గడిచే నా జీవితం,
రకరకాల ఓటములను ఎన్నెన్నో చూసాను...
ఎగుడుదిగుడు దారిలోన సాగుతున్న నా పయనం,
విధివిధాల బాధలకు బాగేనే ఎదురెళ్ళాను...

ప్రేమను నమ్మిన నేను, నేడు ఓడిపోయి ఉన్నాను..
ప్రేమ పేరుతోన ఉన్న ప్రళయాన మునిగిపోయాను..
ఈ ఓరిమి తెచ్చిన ఓటమి నాకైతే కొత్తదే,
ఎంత ఓర్చుకున్నా ఈ బాధేమో తగ్గదే...

ప్రేమకు ప్రేమే తెలుసని భ్రమలోనే బ్రతికాను...
ప్రేమిస్తే ప్రేమై తిరిగిస్తుందని నమ్మాను..
ప్రేమను నాకొదిలేసి ప్రేయసి కదిలెళ్ళింది..
ప్రేమంటే నీదేనను బిరుదు మాత్రమిచ్చింది..

ఏదైతే ఏమైంది, ఇక కథ అయితే ముగిసింది...
పోయింది ఏముంది, గుణపాఠమైతె మిగిలింది..
బ్రతుకు అనే చదువులోన ఈ ప్రతి పాఠం అవసరమే..
జీవితాన ఎదుగుదలకు ఈ ప్రతి బాధ అవకాశమే...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home