నేటి పెళ్ళిచూపుల పరిస్థితి..
పెళ్ళిచూపులని చెప్పి అమ్మాయిని చూస్తావు,
అందం, కట్నం నచ్చి సరేనని అంటావు..
చెప్పుడు మాటలు నమ్మి మధ్యలోన ఒకసారి,
ఎక్కువ కట్నాలిచ్చే మనిషి దొరికి మరుసారి,
ఇచ్చిన మాటను మార్చి సాకులన్ని చెప్తావు...
నిశ్చయమైనా గాని నచ్చలేదు అంటావు...
ఆ తల్లి తండ్రి బాధ నీకు తలపైనా వచ్చిందా,
ఉద్యోగం వచ్చిందను తలపొగరే పెరిగిందా..
ఆ ఆస్తిపాస్తి తోన నీకు మనశ్శాంతి వస్తుందా..
ఆడపిల్ల ఉసురు నీకు తగలకుండ ఉంటుందా..
మగువ విలువ తెలియని ఓ అపరిపూర్ణ పురుషుడా..
నీ రెండు కళ్ళు తెరిచి కాస్త పురాణాలు చూడరా...
నీకు సతి కావాలంటే నువు స్వయంవరం గెలవాలి,
నీవు పతి అవ్వాలంటే వేల పరీక్షలను నెగ్గాలి...
దేవత గా భావించే వేదాలయుగం ముగిసింది..
అనర్థాల ఆవిర్భం ఈ కలియుగమే మొదలైంది..
అతివ అనే అపురూపం అందుబాటు అయ్యింది..
తలవంచుకు కూర్చుందని మీకు లోకువయ్యింది...
ప్రతి వారం వెళ్ళి ఒక అమ్మాయిని చూడడం..,
చిన్న చిన్న లోపాలను దోశాలుగ చెప్పడం...
కొన్నిసార్లు సరేనని ముహూర్ఠాలు పెట్టడం,
చివరి గడియకొచ్చాక మొఖం చాటువేయడం...
ఆ అతివ పడే భాధ నీ ఊహకైన అందదు రా...
ఆ వ్యధల లోతు ఏమిటో మీ అమ్మనైన అడగరా...
ఈ స్థితిలో ఒక్కసారి నీ చెల్లిని ఊహించరా...
నీకు పొడుచుకొచ్చు కోపాన్నే మనసారా గమనించరా..
మగువ మనసు తెలుసుకోని మగ జన్మే వ్యర్థము..
అతివ ఆనందం కాపాడుటే మన జీవిత పరమార్థము..
మీ చెల్లి కిచ్చు విలువలోన నువ్వు చూపు స్వార్థము..
అది ప్రతి అమ్మాయికి ఇస్తేనే ఆ గౌరవానికి అర్థము..
సాఫ్టువేరు వేతనాలు మీ నీతిని మసి చేసెనా,
ఆ నోట్లకున్న పొగరులు మీ నరనరాల ఇంకెనా...
సర్కారీ కొలువులు మీ మానవతను చంపెనా,
ఆస్తి అనే చెత్త కన్ను నీకు తప్పుదారి చూపెనా....
ఏ మూలనైన దాగుందా మీలోన మనిషితత్వము.
ఏ మాత్రమైన మిగిలుందా మీలోన మానవత్వము..
ప్రతి విషయంలో మంచి నేర్పు మీ అమ్మా నాన్నలు...
ఈ నిమిషంలో నీ వెంట నడిచి చేయిదులుపుకున్నారా..
కుదిరించిన పెళ్ళినాపు కాబోవు పెళ్ళి పెద్దలూ...
మీ కూతురికే ఈ స్థితి వస్తే నిశ్చింతగ ఉంటారా..
ఒకటి కాదు వందసార్లు ఆలోచన చెయ్యండి,
శరతులు మీకెన్నున్నా ముందుగానె చెప్పండి,
సరేనని చెప్పాక సాకులింక వద్దండీ..
అమ్మాయిని బాధపెట్టు హక్కు మీకు లేదండి,
పెళ్ళి కొడుకు తల్లులూ మీరైనా కదలండి,
మగువ మనసు ఏమిటో పూసగుచ్చి చెప్పండి,
పెళ్ళినాపు తండ్రులూ మీ పెత్తనాలు ఆపండి,
ముహూర్థాలు పెట్టాక వద్దనడం తప్పండీ..
పున్నమిలో వెన్నలంటి చిరునవ్వుల చెల్లెమ్మా...
అమ్మ నాన్న బెంగ చూసి చింతించకు వద్దమ్మా...
ఆ దేవుడి సృష్టిలో ఒక అద్బుతమే నీవమ్మా,
అటువంటి నిన్ను కోల్పోయిన వెర్రివాడు వాడమ్మా...
అదృష్టమన్నపదానికే పర్యాయపదం నీవమ్మా..
అది తెలియక వదులుకున్న స్వార్థపరుడు వాడమ్మా...
నీ ప్రతి ఇష్టాన్నీ అందించే ఆ దేవుడే నీవైపమ్మా...
నీ ఆనందం నిలుపువాడు నీకై వస్తాడమ్మా..
అంతదాక నిశ్చింతగ ఉండమ్మా చెల్లెమ్మా...
మా ప్రతిపూటా గడిచేదే నీ ఆనందం వల్లమ్మా..

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home