Saturday, August 22, 2020

కవిత్వం

అలతి పదాల అందమైన స్నేహం,
ప్రాసలతో అల్లుకున్న పంక్తుల హారం,
కొత్తకోణంతో ప్రభవించిన కవికిరణం,
నిజానికది భావానికే ఒక ఆభరణం...

కవిత్వం భాషకెప్పటికీ ఒక ప్రాతినిధ్యం,
మనసుతో కలం పడితే అందరికీ సాధ్యం,
కొందరికైతే అది అలుపెరగని సాహితీసేద్యం,
నిజానికది కళలతల్లికి అక్షర నైవేద్యం...

కవి కలం, పదును తగ్గని ఒక ఖడ్గం,
కవి కులం, వక్తలే మెచ్చిన ఒక వర్గం,
కవి గళం, మంచినే చూపే ఒక మార్గం,
కవి పయనం, నిజానికది అలోచనల స్వర్గం...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home