గానం
సొంపైన సరిగమల తాండవం,
సాక్షాత్తు సంగీత తోరణం,
సాహిత్యానికి అసలైన సన్మానం,
సరస్వతీదేవికిది స్వర తాంబూలం...
దిక్కులనే స్తంభింపజేసే సూత్రం,
ధుఃఖాలనూ మరిపించగలిగే మంత్రం,
దనుజులనే స్పందింపజేసే గాత్రం,
దేవతలనూ మురిపించగలిగే స్తోత్రం...
గానం అందరికీ నేస్తం,
కొందరికైతే సమస్తం...
గానం గళానికి గౌరవం,
గానం శ్రవణాల ఉత్సవం,
గానం మార్పుకి మాధ్యమం,
గానం మనసున ఉద్యమం...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home