చిత్రము
ప్రతి చిత్రపఠముకూ పుట్టుకలు రెండు...
తనలోన కవనాలు అలరారుతుండు...
చిత్రకుడి తలపులో తొలిసారి పుట్టి,
తన కళలమనసునే కదిలించుతుంది…
సరికొత్త కోణాన్ని ప్రతిదాన్ని మీటి,
సరిలేని చిత్రమై ప్రభవించుతుంది...
కవితలని క్లుప్తంగా చెప్పేది చిత్రము,
గానాన్ని మౌనంగా పాడేది చిత్రము...
నిజ జీవితాలకి నీడలీ చిత్రాలు,
కనలేని కోణాన్ని చూపించు నేత్రాలు...
ఊహలకె ఊపిరిని అందించు మంత్రాలు,
గురుతులను గొప్పగా బంధించు సూత్రాలు...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home