కార్పోరేట్ ఆసుపత్రులు
మన అనారోగ్యమే వాళ్ళ అవకాశం,
మన ఆవేదన వారి ఆశల అవశేషం...
మన అప్పులు వాళ్ళకి ఆదాయాలు,
మన ఏడుపులు అందులోని అంకెలు...
వాళ్ల రేట్లు మన స్థోమతకి ఎన్నో రెట్లు,
మన బతుకులే వాళ్ళ బాలెన్స్ షీట్లు...
వైద్యం మనకు కనీస అవసరం,
వాళ్ళకేమో అది కొండంత వ్యాపారం...
వాళ్ళు మాత్రమే చెయ్యగలిగే సర్జరీలు,
మన మధ్యతరగతులు కోరని లగ్జరీలు...
వాళ్ళకి ఖర్చుపై ఉన్నంత క్లారిటీ,
మనవాళ్ళ కండిషన్ పై ఉండదు...
వాళ్ళ ఇస్త్రీ వైట్ కోట్లలో ఉన్న సింప్లిసిటీ,
మన చెమట నోట్ల ముడతలకి అర్థమూ కాదు...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home