నాట్యం
అంతరంగమున ప్రభవించిన అభినయం,
స్పందించిన సర్వాంగముల సమన్వయం,
తనువుతోన మనువాడిన కళాహృదయం,
నేత్రాలకు అమితమైన నృత్యోదయం...
సంగీత సాహిత్య సమ్మేళనం,
అది నాట్యంతొ జతకలిసి సమ్మోహనం...
నయనాలు బానిసై మెరిసే గుణం,
అది నాట్యంతొ నిలువెత్తు నిదర్శనం...
మనసంత వైభవం,
తనువంత తాండవం,
కదలికలు వేలైనా, లోనేమొ స్తిమితమే...
విన్యాస వీక్షణం,
అభ్యాస లక్షణం,
కనువిందు చేస్తున్నా, అది ఓవిధమైన ధ్యానమే...
నాట్యం శివుడితోన సంభాషణ,
నాట్యం నటరాజుకు ఆరాధన,
నాట్యం కళాశిఖర అధిరోహణ,
నాట్యం సంస్కృతికే ఒక ముద్రణ...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home