Thursday, September 3, 2020

కరోనా కష్టాలు క్లుప్తంగా...

అరోగ్యం ఆసుపత్రిపాలు,
మనశ్శాంతి మహమ్మారిపాలు, 
అభివృద్ధి లాక్ డౌన్లపాలు,
వేల జీవితాలు వీధిపాలు,
ఈ ఏడాదిక ఇంతే కాబోలు...

ఇది కొన్నాళ్ళే అన్నమాట అబద్ధం, 
మనలో భాగమనడమే హేతుబద్ధం,
చేసే ప్రతీ ప్రయాణం ఒక యుద్ధం, 
మన జీవనమే సహజానికి విరుద్ధం... 

అయినోళ్ళూ ఆరడుగుల దూరానే, 
అందరికీ లోలోపల భయాలే, 
విశ్వమంతా భాషలేని వేదనలే, 
వైధ్యులంతా బాధ్యతైన సైనికులే...

అగ్రరాజ్యాలూ అమ్మో అనాల్సిందే, 
ఆపలేక అంకెల్లో కలవాల్సిందే...
ఆశగా అన్ని దేశాల్నీ చూడాల్సిందే, 
అరోగ్యాన్నీ రాజకీయం చెయ్యాల్సిందే...

మన జనాలకు ధైర్యమెక్కువ, 
ఈ జాడ్యానికి దూకుడెక్కువ..
మనిషి మంచి మాటలు వినడు,
మహమ్మారి మందుల మాట వినదు...

మనది మూర్ఖత్వం, 
వ్యాధిది కౄరత్వం,
అసలు నాయకుల అలసత్వం,
ఇక అంటువ్యాధిదే నాయకత్వం...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home